
సాక్షి, హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఎనిమిది నెలలుగా లంగర్ హౌజ్, గాంధీనగర్, మలక్ పేట్, నార్సింగి, ఉప్పల్, మేడిపల్లి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వరుస స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో నిఘా పెట్టిన పోలీసులు చైన్ స్నాచర్ అయా అలీఖాన్‌ను గురువారం అరెస్టు చేశారు.
నిందితుడు వద్ద నుంచి రూ. 12 లక్షల రూపాయల విలువైన 311 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు లక్షా ఇరవైదు వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా... వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అలీఖాన్ అరెస్టుతో 11 కేసులు పరిష్కారమయ్యామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment