చాయ్ కోసం చంపేశారు | unidetified men murderd tea stall owner | Sakshi
Sakshi News home page

చాయ్ కోసం చంపేశారు

Published Fri, Mar 20 2015 6:50 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

చాయ్ కోసం చంపేశారు - Sakshi

చాయ్ కోసం చంపేశారు

చాయ్ అందించే విషయంలో తలెత్తిన స్వల్ప వివాదం టీస్టాల్ ఓనర్ హత్యకు దారితీసిన ఘటన శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. బేగంపేటలోని ఎంజీ కేఫ్లో చాయ్ తాగేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఆలస్యంగా సర్వ్ చేస్తున్నవంటూ టీ స్టాల్ యజమాని జహంగీర్తో తగువులాడి వెళ్లిపోయారు. మళ్లీ అర్ధగంట తర్వాత స్నేహితుల్ని వెంటబెట్టుకొని వచ్చి.. జహంగీర్ పై కత్తులతో విచక్షణా రహితంగా దాడిచేశారు.

అక్కడే చాయ్ తాగుతున్న వ్యక్తులు మొదట హతాశులైనప్పటికీ తేరుకొని కత్తిపోట్లను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు పరారయ్యారు. తీవ్రరక్తస్రావం కావడంతో జహంగీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, నిందితుల కోసం గాలింపు చర్యను ప్రారంభించారు. అయితే జహంగీర్ పై వ్యక్తిగత కక్ష పెంచుకున్నవారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement