![YS Sharmila Slams KCR Over TSRTC Bus Fares - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/3/Untitled-6.jpg.webp?itok=GWQrcB5F)
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని కేసీఆర్ తన అను చరులకు అప్పగించేందుకే ఈ డ్రామాలు అడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. అందుకే చార్జీలు పెంచేందుకు సిద్ధమయ్యారన్నారు. గురువారం ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకుపోయిన అని దొరగారు చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు. సీఎం పదవిలోకి వచ్చిన తర్వాత అదే ఆర్టీసీని నష్టాలబారి నుంచి గట్టెక్కించడం చేతకావడం లేదని మం డిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు పక్కన పెట్టి టీఆర్‌ఎస్, బీజేపీ బూతు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఆ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొడితేనే రైతులకు న్యాయం జరుగుతుందని షర్మిల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment