bus charges hike
-
ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడే బాదుడు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన తొలి సంక్రాంతికి ‘ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రైవేట్ సర్వీసులు కూడా ఆర్టీసీతో సమానంగా టికెట్ రేట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం..’ ఇది సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పదే పదే మీడియాలో చెబుతున్న మాట.. కానీ, వాస్తవం ఏమిటంటే.. ప్రైవేట్ బస్సుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఆన్లైన్లో ధరలను మూడు, నాలుగింతలు పెంచేసి నిలువు దోపిడీ చేసేస్తున్నారు. పైగా.. టికెట్లను బ్లాక్‌చేసి కృత్రిమ కొరత సృష్టించి రూ.వందల కోట్ల భారీ దోపిడీకి స్కెచ్ వేశారు.ఎందుకంటే పండుగ రద్దీకి తగ్గట్లుగా ఆర్డీసీ బస్సు సర్వీసుల్లేవు. దీంతో మధ్యతరగతి, పేద వర్గాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే దిక్కయ్యాయి. ఇదే అదనుగా రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ ప్రజల ఉత్సాహాన్ని నీరుగార్చేస్తోంది. చార్జీలను ఏకంగా మూడు నాలుగు రెట్లు పెంచేసి ఎడాపెడా దోచేస్తోంది. అయినా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఎందుకంటే రవాణా శాఖలో ఓ కీలక నేతకు ఈ సిండికేట్ ముందుగానే రూ.50 కోట్లకు పైగా ముడుపులు అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా.. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకం తక్కువ. ఒకవేళ ఉన్నా వారు డబ్బులు తీసుకుని టికెట్ బుక్చేసినట్లు మెసేజ్ ఇస్తున్నారు. అందులో వ్యూహాత్మకంగా టికెట్ ధర పేర్కొనడంలేదు. కానీ, ఆన్లైన్లో మాత్రం పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నారు. మూడు, నాలుగురెట్లు అధికంగా చార్జీలు..ఏటా సంక్రాంతికి దాదాపు 75 లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారని అంచనా. వీరిలో సొంత వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 35 లక్షల మంది ప్రయాణిస్తారు. మిగిలిన దాదాపు 40 లక్షల మందికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే దిక్కు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ది ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. తమ సర్వీసుల్లో జనవరి 11 నుంచి 18 వరకు రానూపోనూ టికెట్లను జనవరి 1 నాటికే బ్లాక్ చేసేశాయి. ఆ తర్వాత చార్జీలను ఏకంగా మూడు నాలుగు రెట్లు పెంచేశాయి. ఉదా.. ⇒ సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి విశాఖపట్నానికి నాన్ ఏసీ బస్సు రూ.750, ఏసీ బస్సు రూ.1,200, స్లీపర్ బస్సు రూ.1,500 టికెట్ వసూలుచేసేవారు. కానీ, ఈ పండుగ సీజన్లో నాన్ ఏసీ బస్సు రూ.2 వేలు, ఏసీ బస్సు రూ.3 వేలు, ఏసీ స్లీపర్ బస్సు రూ.5 వేలు వరకు అమాంతంగా పెంచేశారు. ఇక విజయనగరం, శ్రీకాకుళం వెళ్లేందుకైతే మరో రూ.500 వరకు అదనంగా చెల్లించాలి. ⇒ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో ఏసీ బస్సులో రూ.వెయ్యి వసూలుచేసేవారు. ఇప్పుడు దానిని రూ.2,500కు పెంచేశారు. ⇒ విజయవాడ నుంచి రాయలసీమలోని కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సు రూ.1,200 చార్జీ ఉండగా, ప్రస్తుతం రూ.3,500 నుంచి రూ.4వేల వరకు పెంచేయడం గమనార్హం. ⇒ కాకినాడ, రాజమహేంద్రవరం తదితర జిల్లా కేంద్రాలకు కూడా చార్జీలను ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ భారీగా పెంచేసింది. ⇒ ఇక సాధారణ రోజుల్లో హైదరాబాదు నుంచి నెల్లూరుకు ఏసీ స్లీపర్ 1,500 ఉంటే ఇప్పుడు రూ.3వేల వరకు ఉంది. నాన్–ఏసీ స్లీపర్ ధర రూ.1,000 నుంచి రూ.2,500కు పెరిగింది. అదే నాన్–ఏసీ బస్సు అయితే రూ.850 ఉన్న దానిని రూ.2 వేల వరకు పెంచారు. ⇒ బెంగుళూరు నుంచి నెల్లూరుకు ఏసీ స్లీపర్ సాధారణ రోజుల్లో రూ.1,000 ఉంటే ప్రస్తుతం రూ.2,500 వరకు ఉంది. అదే నాన్–ఏసీ స్లీపర్‌కు రూ.900 నుంచి రూ.2వేలు, నాన్–ఏసీకి రూ.800 నుంచి రూ.1,700 వరకు పెంచారు.⇒ గుంటూరు నుంచి హైదరాబాద్‌కు మామూలు రోజుల్లో నాన్ ఏసీ బస్సుకు రూ.450, ఏసీ బస్సుకు రూ.500, స్లీపర్ ఏసీ బస్సుకు రూ.650–750, హైదరాబాద్ నుంచి గుంటూరుకు నాన్ఏసీ రూ.500, ఏసీ రూ.550, స్లీపర్ ఏసీ రూ.600–రూ.700 రూపాయలు.. కానీ, పండుగ సీజన్‌తో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు రేటును పెంచేశారు. ⇒ అదే బెంగళూరుకు ఆర్టీసీలో రూ.900 నుంచి రూ.18 వందల వరకూ ధర ఉండగా, ప్రైవేట్ ట్రావెల్స్ రూ.2 వేల నుంచి రూ.2 వేల వరకూ వసూలుచేస్తున్నారు. ఈ రేట్లను అధికారికంగా వెబ్సైట్లలో పెట్టి మరీ అమ్ముతున్నారు. రూ.1,200 కోట్ల దోపిడీ..దాదాపు 40 లక్షల మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారానే ప్రయాణించనుండటం సిండికేట్ దోపిడీకి మార్గం సుగమమైంది. సగటున ఒక్కో టికెట్‌పై సరాసరిన రూ.1,500 వరకు అదనపు బాదుడుకు పాల్పడుతోంది. ఇలా 40 లక్షల మంది రానూపోనూ ప్రయాణం అంటే 80 లక్షల మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ప్రయాణించాలి. ఆ ప్రకారం రూ.1,200 కోట్లు దోపిడీకి ప్రైవేట్ బస్సుల ముఠా పాల్పడుతోంది.⇒ ఈమె పేరు బొత్స పద్మప్రియ. శ్రీకాకుళానికి చెందిన విద్యార్థిని. హైదరాబాద్‌లో ఓ పరీక్ష రాసేందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇటువైపు నుంచి రైలు టికెట్ దొరికింది. కానీ, తిరుగు ప్రయాణానికి దొరకలేదు. దీంతో.. 20 రోజుల ముందే ప్రైవేట్ ట్రావెల్స్‌లో టికెట్ బుక్ చేసుకుంది. అయినా ఆ ట్రావెల్స్ ఆపరేటర్ సంక్రాంతి సీజన్ పేరుతో రూ.4,220.95 చార్జీ అని, జీఎస్టీ పేరుతో మరో రూ.780 వసూలుచేశారు. విచిత్రమేమిటంటే టికెట్లో జీఎస్టీ కోసం మినహాయించిన మొత్తాన్ని చూపించలేదు. ముందు బుక్ చేయకపోతే నా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో అని పద్మప్రియ వాపోయింది.కీలక నేతకు ముడుపుల మేత?ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ అమాంతంగా చార్జీలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నా రవాణా శాఖ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడంలేదన్నది అందరి అనుమానం. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు రాయలసీమకు చెందిన రవాణా శాఖ కీలక నేతే పచ్చజెండా ఊపారు. ఎందుకంటే.. ట్రావెల్స్ సిండికేట్ ముందుగానే ఆయనతో డీల్ కుదుర్చుకుంది. విజయవాడలోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి, ఆ కీలక నేత పేషీలోని ఓ ముఖ్య ఉద్యోగే ఈ డీల్‌లో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అందుకే.. వీటివైపు కన్నెత్తి చూడడంలేదు.చార్జీలను అమాంతంగా పెంచేశారు..సంక్రాంతి పేరుతో ప్రైవేట్ బస్సుల్లో చార్జీలను అమాంతంగా పెంచేశారు. కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి సొంతూరు వచ్చి వెళ్లాలంటే చార్జీలకు రూ.25 వేలు అవుతోంది. సరిపడా బస్సులను ప్రభుత్వం ఏర్పాటుచేయకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెంచిన చార్జీలను వెబ్సైట్లో పెడుతున్నా, ప్రభుత్వం స్పందించడంలేదు. – కార్తీక్ రామిరెడ్డి, నెల్లూరువిమాన టికెట్ ధరలకూ రెక్కలు..గన్నవరం: సంక్రాంతి సందర్భంగా విమాన టికెట్ల ధరలకూ రెక్కాలొచ్చాయి. సాధారణ రోజులతో పోల్చితే ఈనెల 11, 12, 13 తేదీల్లో ఈ ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చే విమానాల్లో ధరల దరువు ఎక్కువగా ఉంది. రైళ్లు, బస్సులు టికెట్లు దొరక్కపోవడంతో పండక్కి స్వగ్రామాలకు వచ్చే ప్రజలు ప్రత్యామ్నాయంగా విమాన ప్రయాణంపై మొగ్గు చూపుతున్నారు. దీంతో విమాన టికెట్ ధరలు కొండెక్కాయి.ముఖ్యంగా.. బెంగళూరు నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.3,500 నుంచి రూ.3,750 ఉండే విమాన టికెట్ ధరలు ఈ మూడు రోజులు రూ.13,350 నుంచి రూ.16,058 వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే విమానాల టికెట్ ధరలు సాధారణ రోజుల్లో రూ.3 వేల లోపు ఉండగా ప్రస్తుతం రూ.11,615 నుంచి రూ.16,716 వరకు పెరిగాయి. ఇక న్యూఢిల్లీ–విజయవాడ మధ్య టికెట్ ధర రూ.6,500 నుంచి రూ. 20,986కు చేరుకోవడం గమనర్హం. అలాగే, చెన్నై నుంచి విజయవాడకు టికెట్ ధర నాలుగు రేట్లు పెరిగి రూ. 13,407కు, ముంబై నుంచి విజయవాడకు రూ.4 వేలులోపు ఉండే టికెట్ ధర రూ. 11,975కు చేరింది. పండుగ తర్వాత కూడా ఈ ధరలు దాదాపు ఇలాగే ఉండే అవకాశముందని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆర్టీసీ కంటే నాలుగు రెట్లు అధిక ధర
-
పిల్లల చదువులకు పాసులభారం.. ఐదు కిలో మీటర్లకు రూ.35 వడ్డన
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీలో బస్‌పాస్‌ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యాసంస్థలు ప్రారంభమై పక్షం రోజులు కావడంతో ఆ సంస్థ అధికారులు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం పెరిగిన చార్జీలతోనే విద్యార్థులకు కూడా రాయితీ బస్ పాస్‌లను జారీ చేయనున్నట్లు ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. దీంతో గత ఏడాదితో పొలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులపై అదనంగా భారం పడుతోంది. ఐదు కిలో మీటర్ల ప్రయాణిస్తే పెరిగిన చార్జీల కారణంగా భారం రూ.35 పడుతుండగా ఆపై కిలో మీటర్లు ప్రయాణించే విద్యార్థులకు అదనంగా చెల్లించాల్సిందేనని ఆ సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు బస్‌పాస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత పాఠశాల, కళాశాల యాజమాన్యానికి ఇచ్చిన లాగెన్‌లోకి వెళ్తుంది. ఆ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను ధ్రువీకరించి తిరిగి ఆర్టీసీ అధికారులకు పంపిస్తే ఆయా బస్టాండ్‌లోని కేంద్రాల్లో బస్‌పాస్‌లను పొందవచ్చని పేర్కొంటున్నారు. చదవండి👉🏻ఖైరతాబాద్ భారీ గణనాథుని రూపం ఆవిష్కరణ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు లేవు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అభ్యసించే విద్యార్థులకు ఈ సదుపాయం వర్తించదని ఆ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. బస్‌పాస్ పొందాలనుకునే విద్యార్థులు తొలుత అకౌంట్ ఆఫీసర్, టీఎస్ఆర్టీసీ నల్లగొండ పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది. యాజమాన్యం ఆ డీడీని తీసుకువచ్చి సంబంధిత బస్టాండ్ బస్సుపాస్ కౌంటర్లలో నమోదు చేయించాలి. అనంతరం ఇనిస్టిట్యూట్ వివరాలు బస్సుపాస్ కౌంటర్లలో పొందుపరుస్తారు. వెంటనే నమోదు చేసిన మొబైల్‌కు యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. 15ఏళ్ల లోపు బాలికలు, 12ఏళ్ల లోపు బాలురకు ఉచితంగా.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా, బాలికలను విద్యలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్టీసీ 15ఏళ్లలోపు బాలికలు, 12ఏళ్లలోపు బాలురకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తోంది. అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ చార్జీలపై ఆర్టీసీ రాయితీని అందిస్తోంది. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. చదవండి👉🏻ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు బస్‌పాస్ పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించాం. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వారికి కేటాయించిన విధంగా ప్రెష్, రెన్యువల్ ఆడ్మినిస్ట్రేషన్ చార్జీలను తక్షణమే చెల్లించాలి. – బొల్లెద్దు పాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, మిర్యాలగూడ -
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాక్
-
తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులపై మరో పిడుగు
-
Telangana: సెస్సుల సెగలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సంక్షోభం కోలుకోలేని దెబ్బతీసింది. తాజాగా పెరుగుతున్న డీజిల్ ధరలతో పాటే పెరిగిపోతున్న నష్టాలు ఆర్టీసీని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బస్సు చార్జీలు పెంచితే తప్ప, ప్రగతిరథం ముందుకు సాగని పరిస్థితిలో ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతి పాదన పంపినా ఇంతవరకు ఆమోదం లభించక పోవడంతో రోజు గడవడమే గగనంగా మారింది. దీంతో నేరుగా చార్జీలు కాకుండా, ఇతరత్రా రుసుములు, ఫీజులను పెంచటం ద్వారా ఎక్కడెక్కడ చార్జీలను సవరించేందుకు అవకాశం ఉందో వెతికి మరీ ఆదాయార్జనకు ప్రయత్నిస్తోంది. చిన్నచిన్న రుసుములే అయినా అన్నీ కలిపేసరికి ప్రయాణికుల జేబుకు బాగానే కత్తెర పడుతోంది. ఇతర పట్టణాల నుంచి నగరానికి వచ్చే బస్సుల్లో చార్జీ కేటగిరీల వారీగా కొన్ని రోజుల వ్యవధిలోనే రూ.10–20 వరకు పెరిగిపోయింది. ఇవేవీ అధికారికంగా వెల్లడించకుండా, అంతర్గత నిర్ణయాలతో ఆర్టీసీ పని కానిచ్చేస్తోంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాటికి అనుగుణంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సగటు జీవిపై, చార్జీల్లో ‘అనధికార పెంపు’ మరింత భారం మోపుతోంది. సేఫ్టీ సెస్‌తో మొదలు.. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా సేఫ్టీ సెస్‌ను విధించాలని నాటి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. కానీ అది వెంటనే అమలు కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీకి అది గుర్తొచ్చింది. బస్సు ప్రమాదాల్లో చనిపోయేవారికి చెల్లించే పరిహారం సాలీనా సగటున రూ.30 కోట్ల వరకు ఉంటోంది. దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండనందున.. ఇప్పుడు ఆ మొత్తాన్ని జనం నుంచే రాబట్టాలని నిర్ణయించి సేఫ్టీ సెస్ పెంపు ప్రతిపాదన ఫైలుకు ఇటీవల దుమ్ముదులిపింది. ప్రతి టికెట్‌పై రూపాయి చొప్పున చార్జీ విధించింది. వింటే అది చిన్న మొత్తమే.. కానీ, ఆ రూపాయి విధింపుతో మారిన టికెట్ చార్జీలు కండక్టర్లకు–ప్రయాణికుల మధ్య చిల్లర తగాదాలకు కారణమవుతుందని చెప్పి చార్జీని రౌండ్ ఆఫ్ చేసింది. అంటే రూ.15, రూ.20, రూ.25, రూ.30... ఇలా అన్నమాట. దీంతో నిర్ధారిత స్టేజీల తర్వాత రూపాయి చార్జీ కాస్తా రూ.5కు పెరిగిపోయింది. ఎమినిటీస్ (వసతుల) సెస్.. సేఫ్టీ సెస్ విధించి ఐదారురోజులు గడవకముండే ఆర్టీసీకి మరో సెస్ గుర్తొచ్చింది. బస్టాండ్లలో ప్రయాణికులకు వసతులు మెరుగుపరిచే ఉద్దేశంతో 2013లో ప్రారంభించిన ప్యాసింజర్ ఎమినిటీస్ సెస్‌ను సవరించేసింది. పల్లె వెలుగు మినహా ఇతర కేటగిరీ బస్సుల్లో టికెట్‌పై రూపాయిగా ఉన్న సెస్‌ను ఒకేసారి రూ.5కు పెంచేసింది. అంటే కొత్తగా రూ.4 పెరిగిందన్నమాట. ఇప్పుడు బేస్ టికెట్ ఫేర్‌లో దీన్ని కూడా చేర్చి టికెట్ ధరలను రౌండాఫ్ చేసింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో తదుపరి రూ.5కు (ధర రూ.21 ఉంటే రూ.25కు), సూపర్ లగ్జరీ నుంచి ఆ పై కేటగిరీ సర్వీసుల్లో రూ.10కి రౌండాఫ్ (టికెట్ ధర రూ.21 ఉంటే రూ.30కి) చేసింది. ఈ కొత్త చార్జీలు ఆదివారం ఉదయం నుంచి అమల్లోకి తెచ్చింది. రౌండాఫ్తో పెరిగిన భారం ♦రెండు సెస్‌లు కలిపి రూ.5 మేర మాత్రమే విధిస్తున్నట్టు కనిపిస్తున్నా.. రౌండాఫ్ వల్ల టికెట్ ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పు చోటుచేసుకుంది. ♦నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు రూ.195గా ఉన్న ఎక్స్‌ప్రెస్ చార్జీ ఇప్పుడు రూ.205కు, రూ.270గా ఉన్న సూపర్ లగ్జరీ చార్జీ రూ.280కి, రూ.330గా ఉన్న రాజధాని చార్జీ రూ.350కి చేరింది. ♦కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రూ.175గా ఉన్న ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.190కి, రూ.220గా ఉన్న సూపర్‌లగ్జరీ చార్జీ రూ.235కు, రూ.305 గా ఉన్న రాజధాని చార్జీ రూ.320కి చేరింది. ♦వరంగల్ నుంచి హైదరాబాద్‌కు... రూ.190గా ఉన్న డీలక్స్ చార్జీ రూ.200కు, రూ.215గా ఉన్న సూపర్‌లగ్జరీ చార్జీ రూ.230కి, రూ.295గా ఉన్న రాజధాని చార్జీ రూ.310కి పెరిగింది. త్వరలో సమాచార సెస్! ఇప్పటికే విధించిన సెస్సులకు తోడుగా ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ (ప్రయాణికుల సమాచార) సెస్ పేరుతో మరో పెంపును త్వరలో అమలు చేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. నాలుగు రోజుల క్రితం బస్సు పాస్ ధరలను కూడా సంస్థ పెంచేసిన సంగతి తెలిసిందే. గతంలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మరీ చార్జీలు సవరించారు. ఇక ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి రిజర్వేషన్ చార్జీలను కూడా రూ.20 నుంచి రూ.30కి పెంచేసింది. -
ఆర్టీసీని అనుచరులకు కట్టబెట్టేందుకే డ్రామాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని కేసీఆర్ తన అను చరులకు అప్పగించేందుకే ఈ డ్రామాలు అడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. అందుకే చార్జీలు పెంచేందుకు సిద్ధమయ్యారన్నారు. గురువారం ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకుపోయిన అని దొరగారు చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు. సీఎం పదవిలోకి వచ్చిన తర్వాత అదే ఆర్టీసీని నష్టాలబారి నుంచి గట్టెక్కించడం చేతకావడం లేదని మం డిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు పక్కన పెట్టి టీఆర్ఎస్, బీజేపీ బూతు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఆ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొడితేనే రైతులకు న్యాయం జరుగుతుందని షర్మిల అన్నారు. -
తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీల పెంపు.. కిలోమీటర్‌కు ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలో మారోసారి ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఎప్పటి నుంచో టీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సాగుతున్న చర్చ తాజాగా ఇది కొలక్కి వచ్చింది. ఓ వైపు కరోనా.. మరోమైపు డీజిల్ ధరలు పెరగడంతో బస్సు చార్జీలు పెంచక తప్పదనే నిర్ణయానికి టీఎస్ఆర్టీసీ వచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ చార్జీల పెంపునకు సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ ముందుకు చేరింది. చార్జీల పెంపును ఆమోదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ అతి త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఆర్డినరీ బస్సులో కిలోమీటర్‌కు 20 పైసల పెంపు, పల్లె వెలుగు బస్సుల్లో 25 పైసల పెంపు, అన్నీ ఇతర బస్సుల్లో 30 పైసల చొప్పున చార్జీలు పెంచాలని సజ్జనార్ ప్రతిపాదించారు. ఆ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. అప్పుల్లో కూరుకుపోయిన ప్రజారవాణా సంస్థ టీఎస్ఆర్టీసీపై డీజిల్ రూపంలో మరో పెనుభారం పడిందన్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ రోజూ కోట్లలో నష్టం చవిచూస్తోందని తెలిపారు. దీంతో చార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. చదవండి: ఆర్టీసీ బస్సులో సజ్జనార్ కుటుంబం.. వీడియో వైరల్ 9750 ఆర్టీసీ బస్సులను 3080 రూట్లలో నడిపిస్తున్నట్లు వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. రోజూ 33 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతూ 32 లక్షల మంది ప్రయాణికులను ప్రతి రోజు తరలిస్తున్నామని తెలిపారు. గతంలో అన్ని బస్సులకు 20 పైసలు పెంచడం జరిగిందని, ఆ డబ్బులు ఆర్టీసీకి చేరలేదన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ తీవ్ర నష్టాలు ఎదుర్కొంటుందన్నారు.కరోనా సమయంలో బస్సులు నడపడం వల్ల 251 మంది మరణించారన్నారు. రెండు సంవత్సరాలుగా డీజిల్ ధరలు భారీగా పెరిగుతున్నాయని, రూ. 63.8 డీజిల్ ఇప్పుడు 87.రూపాయలు ఉందన్నారు. స్పెర్ పార్ట్స్ కూడా భారీగా పెరిగాయని తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1440 కోట్ల నష్టం వచ్చిందని, అందుకే చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశామని సజ్జనార్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మంత్రి పువ్వాడ ద్వారా కోరుతున్నామన్నారు. ఛార్జీలు పెరగం వల్ల ఆర్టీసీ మళ్లీ సాధారణ స్థితికి వస్తుందన్నారు. అన్ని ధరలు పెరిగాయని, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఛార్జీల పెంపుతో సుమారు రూ. 800 కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని, చార్జీలు పెంచక తప్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. -
కేరళలో బస్ చార్జ్‌ల పెంపు
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా లాక్‌డౌన్‌వేళ ఆర్టిసీ సేవలు నిషేధించబడ్డాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన నష్టాల్లో ఉన్న కేఎస్ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రయాణికుల టికెట్ ధరను 25శాతం పెంచినట్లు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు. ప్రజారవాణా వ్యవస్థను ఆదుకోవాలనే ఉద్దేశంతో తాత్కాలిక ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడానికి నియమించిన జ్యుడీషియల్ కమిషన్ బస్సు చార్జ్‌ల పెంపును సిఫారసు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. (రాజ్‌నాథ్ సింగ్ లద్దాఖ్ పర్యటన) గతంలో 5 కిలోమీటర్ల ప్రయాణానికి సాధారణ టికెట్ ధర రూ.8గా ఉండేది. కానీ ప్రస్తుతం పెంచిన ధరలు అమల్లోకి వస్తే కేవలం మొదటి 2.5 కిలో మీటర్ల దూరానికి ప్రయాణికులపై రూ.8 చార్జ్ చేయాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏకే ససీంద్రన్ తెలిపారు. ఇక టికెట్ చార్జ్‌ల పెరుగుదల తాత్కాలికమేనని తెలిపారు. అదే విధంగా విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్ చార్జ్‌లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ప్రయాణ చార్జ్‌లు పెంచాలని డిమాండ్ చేసిన విషయం తెలిసింది. -
పెరిగిన బస్సు చార్జీలు రేపటి నుంచే
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) బస్సు చార్జీల పెంపు రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు సవరించిన చార్జీలతో ఏపీఎస్ ఆర్టీసీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. పెంచిన చార్జీలు రేపు ఉదయం నుంచి అమల్లోకి వస్తాయని అందులో పేర్కొంది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతున్నట్టు ప్రకటనలో తెలిపింది. (చదవండి : ఆర్టీసీకి ఆక్సిజన్ అందించేందుకే.. ) వీటితోపాటు ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు చార్జీ పెంపు ఉంటుందని సంస్థ వెల్లడించింది. వెన్నెల స్లీపర్ బస్సుల్లో చార్జీల పెంపు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. అలాగే, సిటీఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు చార్జీల పెంపుదల లేదని ఆర్టీసీ తెలిపింది. పల్లెవెలుగులో మొదటి 2 స్టేజీలు.. అనగా 10 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపు లేదని పేర్కొంది. తదుపరి 75 కిలోమీటర్ల వరకు రూ.5 ఛార్జీ పెంపు ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది. (చదవండి : అందుకే ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు: పేర్ని నాని) ఇంధన ధరల పెంపువల్లే.. డీజిల్ ధరలు గత నాలుగేళ్లలో రూ.49 నుంచి రూ.70కి పెరిగాయని ఆర్టీసీ తన ప్రకటనలో వెల్లడించింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల సంస్థపై ఏటా రూ.630 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపింది. విడిభాగాలు, సిబ్బంది జీతభత్యాల వల్ల ఏటా మరో రూ.650 కోట్ల భారం సంస్థపై పడుతోందని పేర్కొంది. నష్టాన్ని భర్తీ చేసేందుకే బస్సు చార్జీలు పెంచామని ఆర్టీసీ తెలిపింది. -
టీఎస్ఆర్టీసీ వచ్చాక రెండోసారి ఛార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆవిర్భవించాక ఇప్పటి వరకు కేవలం ఒక్కసారే బస్సు ఛార్జీలు పెరిగాయి. 2016 జూన్‌లో 8.77% మేర ఛార్జీలు పెంచారు. కొన్ని రకాల కేటగిరీ బస్సులపై మాత్రం 10% పెరిగింది. ఫలితంగా అప్పట్లో సాలీనా రూ.286 కోట్ల మేర భారం పడింది. ఆ తర్వాత ప్రభుత్వం ఛార్జీల పెంపు జోలికి పోలేదు. మూడ్నాలుగు దఫాలు ఆర్టీసీ అధికారులు ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలిచ్చినా ప్రభుత్వం అంగీ కరించలేదు. తీవ్ర నష్టాలతో జీతాలు చెల్లించేందుకు ఇబ్బంది ఉండటంతో ఛార్జీల పెంపు తప్ప గత్యంతరం లేదని అధికారులు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితి అత్యంత అధ్వానంగా మారటంతో పెంపు తప్పదని సీఎం నిర్ణయించారు.ఇప్పుడు కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచటంతో.. సాలీనా రూ.752 కోట్ల మేర ప్రజలపై భారం పడనుంది. అంటే 18.80% మేర ఛార్జీలు పెంచి నట్టు అవుతోంది. అన్ని కేటగిరీలకు ఇది వర్తిస్తుంది. అంటే వంద కి.మీ. దూరానికి ప్రస్తుత ఛార్జీపై రూ.20 చొప్పున పెరుగుతుందన్నమాట. కొత్త టికెట్ ధరలను శుక్రవారం ఖరారు చేయనున్నారు. బస్సులు బాగుపడేందుకు నెల సమయం ప్రస్తుతం రాష్ట్రంలోని ఒకటి రెండు మినహా అన్ని డిపోల్లో బస్సులు పూర్తిగా కండీషన్ తప్పాయి. రెగ్యులర్‌గా డిపోల్లో వాటికి నిర్వహించే షెడ్యూల్ 1 నుంచి షెడ్యూల్ 5 వరకు మెయింటెనెన్స్ పనులు దాదాపు పడకేశాయి. నెలన్నరగా కేవలం ఒకటో షెడ్యూల్‌ను కొంతమేర నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అన్ని బస్సులు షెడ్యూల్ 5 మెయింటెనెన్స్ నిర్వహించాలి. అంటే ఇంజిన్ పూర్తిగా విప్పదీసి సరిచేయాలి. ఇలా అన్ని బస్సులకు పూర్తి చేసేందుకు నెల సమయం పడుతుంది. లేబర్ కోర్టు తేల్చాల్సిందే: జీతాల్లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో, విధుల్లోకి చేరితే చాలు అన్న పరిస్థితి వారి ముందు ఉంది. ఏ డిమాండ్ల కోసం సమ్మెకు దిగారో, వాటిని పట్టించుకునే పరిస్థితే లేదు. లేబర్‌కోర్టులో నే తేల్చుకోవాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో..ఆ డిమాండ్ల భవితవ్యం కార్మిక న్యాయస్థానమే తేల్చాల్సి ఉంది. శుక్రవారం ఉదయం కార్మికులు విధుల్లోకి వస్తున్నందున తాత్కాలిక సిబ్బందికి సెలవు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. బస్సు చార్జీలను ప్రభుత్వం 10 శాతం మేర పెంచింది. పెరిగిన బస్సు చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలవుతాయి. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటరుకు 3 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసులలో అయితే కిలోమీటరుకు 8 పైసల వంతున పెంచారు. అదే సూపర్ లగ్జరీ, గరుడ, వెన్నెల సర్వీసులలో అయితే కిలోమీటరుకు 9 పైసల వంతున చార్జీలను పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరిగిన చార్జీల ప్రకారం హైదరాబాద్- విజయవాడ మార్గంలో టికెట్ల ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్- విజయవాడ ఎక్స్‌ప్రెస్ చార్జీ గతంలో రూ. 213.. కొత్త చార్జీ రూ. 235 హైదరాబాద్- విజయవాడ డీలక్స్ చార్జీ గతంలో రూ. 240.. కొత్త చార్జీ రూ. 264 హైదరాబాద్- విజయవాడ సూపర్ లగ్జరీ చార్జీ గతంలో రూ. 283.. కొత్త చార్జీ రూ. 303 -
ఆర్టీసీ చార్జీల మోత!
* బస్సు చార్జీల పెంపునకు సర్కారు నిర్ణయం * సంస్థపై వేతన సవరణ భారాన్ని తగ్గించేందుకే... సాక్షి, హైదరాబాద్: బస్సు ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల మోత మోగించేందుకు సర్కారు సిద్ధమైంది. ఇటీవల ఆర్టీసీ కార్మికుల వేతనాలను భారీగా పెంచిన నేపథ్యంలో సంస్థపైపడ్డ భారాన్ని కొంతమేర తగ్గించేందుకు చార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో చార్జీలు తక్కువగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులపై పెద్దగా భారం పడకుండా చార్జీలను సవరించనున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా రూపొందించిన చిహ్నాన్ని మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. అలాగే పల్లెవెలుగు బస్సులకు కొత్త రంగులు వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త రంగులతో తీర్చిదిద్దిన పల్లె వెలుగు బస్సును కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న బస్సుల పర్మిట్ కాలపరిమితి పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు ప్రవేశ పన్ను విధించాలని నిర్ణయించామన్నారు. ఇతర వాణిజ్య వాహనాలకు అమలు చేస్తున్నట్లుగానే ఆర్టీసీ బస్సులను కూడా పన్ను పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. 28 నుంచి విడివిడిగా ఆర్టీసీ కార్యకలాపాలు... ఆర్టీసీ విభజన అంశాన్ని ప్రస్తుతం కేంద్రం ఏర్పాటు చేసిన షీలాభిడే కమిటీ పర్యవేక్షిస్తోందని...అయితే పని విభజన కోసం రెండు ఆర్టీసీల మధ్య సిబ్బంది కేటాయింపును పూర్తి చేశామని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి పూర్తిగా రెండు ఆర్టీసీలు విడివిడిగా పనిచేస్తాయని చెప్పారు. దీనికి సంబంధించి ఈనెల 25న నిర్వహించే ఆర్టీసీ బోర్డు సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు వివరించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోబోతోందని, దీనికి సంబంధించి అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఏసీ బస్సులు నడిపే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఎండీ రమణరావు, ఈడీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో కొత్త బస్సులు అన్ని పట్టణాల నుంచి రాజధానిని అనుసంధానిస్తూ రూ. 20 కోట్లతో కొత్తగా 60 ‘రాజధాని’ పేరిట ఏసీ (ఇంద్ర తరహాలో) బస్సులు ప్రారంభించాలని నిర్ణయించారు. రూ. 10 కోట్లతో కొత్తగా 10 గరుడ ప్లస్ మల్టీయాక్సిల్ బస్సులు సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి ఈ నెలాఖరుకు రోడ్డెక్కనున్నాయి. తెలంగాణ ఆర్టీసీ చిహ్నం ఇలా... లోగో వెలుపలి బంగారు వృత్తం బంగారు తెలంగాణకు, ఆకుపచ్చని వృత్తం హరితహారానికి, మధ్యలోని కాకతీయ ద్వారం తెలంగాణను ప్రతిబింబిస్తుందని, మధ్యభాగంలో పచ్చిక పల్లెలకు, చార్మినార్ చిత్రం నగరాలు, పట్టణాలకు సూచిక అని అధికారులు అభివర్ణిస్తున్నారు. దీన్ని నలంద అడ్వర్టయిజింగ్ అసోసియేట్స్ ప్రతినిధి జ్ఞానేశ్వర్ రూపొందించారు. మెట్రోరైల్, ఉమ్మడి రాష్ట్ర స్వర్ణోత్సవ లోగోలను కూడా ఆయనే రూపొందించారు. పల్లెవెలుగుకు రంగులు.. ఇప్పటి వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు ముదురు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉండేవి. ఇకపై పల్లెవెలుగు బస్సులు లేత ఆకుపచ్చ రంగు, పైన వెడల్పాటి గులాబీ రంగు గీతతో కనిపించనున్నాయి. -
త్వరలో బస్సు చార్జీల మోత
* పెంపు ప్రతిపాదనను * ఆమోదించిన టీఎంటీ కమిటీ * కనీస చార్జీ రూ.5 నుంచి రూ. 7కు సాక్షి, ముంబై: ఠాణే, నవీముంబై ప్రజలపై త్వరలో ఠాణే మున్సిపల్ ట్రాన్స్‌పోర్టు (టీఎంటీ) బస్సు చార్జీల భారం మోపనుంది. నగర మేయర్ సంజయ్ మోరే, స్థాయి సమితి అధ్యక్షుడు సుధాకర్ చవాన్, సభాగృహం నాయకుడు నరేష్ మస్కే, ప్రతిపక్ష నాయకుడు హనుమంత జగ్దాలే, టీఎంటీ మేనేజర్ దేవిదాస్ టొకాలే తదితరులు పాల్గొన్న సమావేశంలో చార్జీల పంపు ప్రతిపాదనను టీఎంటీ కమిటీ ఆమోదించింది. చార్జీలను రూ. 2నుంచి రూ. 6కు పెంచాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కనీస చార్జీ రూ.5 ఉండగా పెంపుతో రూ.7 వసూలు చేయనున్నారు. రూ. 150 కోట్ల పెండింగ్ బకాయిలు, పెరిగిన ఇంధన ధరలు, రోజుకు రూ. 6.50ల క్షల నష్టం వస్తుండటంతో సంస్థ ఆర్థికంగా దెబ్బతింటోంది. దీనికి తోడు టీఎంటీ ఉద్యోగులకు చెల్లించే భత్యాలు, ప్రయాణ పన్ను, సీఎన్జీ, పెన్షన్, బీమా, కాంట్రాక్టర్ల బిల్లులు తదితరాలు దాదాపు రూ.53.51 కోట్లుకు పైగా ఉన్నాయి. డీఏ, ఓటీ, మెడికల్ అలవెన్స్‌లు రూ.76.56 కోట్లు ఉన్నాయి. రోజూ టీఎంటీ ఖజానాకు రూ. 27 లక్షలు జమా అవుతుండగా...ఖర్చు మాత్రం రూ.33 లక్షలకు పైగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ పేర్కొంది. ఈ నెల 20న జరిగే సర్వ సాధారణ సభలో ప్రతిపాదన అమోదం పొందిన వెంటనే కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి. టీఎంటీ గతంలో 2013 మార్చి 21న చార్జీలు పెంచింది. అప్పుడు లీటరు డీజిల్ ధర రూ.54.32 ఉండగా ఇప్పుడు రూ.67.39కు చేరుకుంది. -
బస్సు చార్జీల పెంపుపై నిరసన వెల్లువ
-
బస్సు చార్జీల పెంపుపై నిరసన వెల్లువ
ఖమ్మం, న్యూస్‌లైన్: బస్సుచార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయని ఇలాంటి పరిస్థితులలోబస్సుచార్జీలు పెంచి ప్రభుత్వం సామాన్యునిపై మరింత భారాన్ని మోపిందని పలు రాజకీయ పార్టీలు, సంఘాలు మండిపడుతున్నాయి. బస్సుచార్జీల పెంపును నిరసిస్తూ మంగళవారం ఖమ్మం, పాలేరు, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో సీపీఎం, సీపీఐ, సీసీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లవద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బస్సుచార్జీల పెంపును నిరసిస్తూ.... సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ఖమ్మం మయూరిసెంటర్, బైపాస్‌రోడ్డులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెంచిన చార్జీలు తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం సబ్ డివిజన్ కార్యదర్శి రామయ్య, నగర కార్యదర్శి శ్రీనివాల్, సీసీఐ నాయకులు మహ్మద్ సలాం, సాంబశివారెడ్డి, చింతా సూరిబాబు, మేకల శ్రీనివాస్, సీపీఎం నాయకులు యర్రా శ్రీకాంత్, శ్రీనివాస్, విక్ర మ్, కోదాడ గిరి, విష్ణువర్థన్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఆర్టీసి బస్టాండ్ ఎదుట సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ధర్నా చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అదేవిధంగా సీపీఎం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బస్సు ఛార్జీలను పెంచటాన్ని టీఆర్ఎస్ పట్టణ కమిటీ సమావేశంలో ఖండించింది. ఇల్లెందులోని జగదాంబ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ బస్సు చార్జీలు పెంచమని ఆధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం పలుమార్లు పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. సామాన్యులపై భారం మోపే చర్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు దేవులపల్లి యాకయ్య, నబీ, పిట్టల రవి, గోపాల్, భారతీ, రమణ, కిరణ్,నర్సింహ్మరావు,సురేష్ తదితరులు పాల్గొన్నారు. సత్తుపల్లిలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సబ్‌డివిజన్ కార్యదర్శి ఎ.రాము మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుల బతుకు దుర్భరంగా మారితే మరోవైపు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచటం దారుణమన్నారు. పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని ప్రజాసమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి దొంతు రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో బస్సురోకో నిర్వహించారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి వెంకటాద్రి, సుంకర సుధాకర్, బోడేపూడి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. పెంచిన చార్జీలు తగ్గించాని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పాలేరు డివిజన్ కార్యదర్శి మర్రి మన్మధరావు మాట్లాడుతూ.. బస్సుచార్జీల పెంపుతో బస్‌పాసులు కూడా పెరగటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడతాయని, వెంటనే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చార్జీల పెంపును ప్రభుత్వం ఉపసంహరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులను ప్రభుత్వం విస్మరిస్తోందని, వారి సమస్యలు పట్టించుకోవటం లేదని ఆరోపించారు.