ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంపు | apsrtc hikes charges by 10 per cent in all services | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంపు

Published Fri, Oct 23 2015 10:46 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంపు - Sakshi

ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. బస్సు చార్జీలను ప్రభుత్వం 10 శాతం మేర పెంచింది. పెరిగిన బస్సు చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలవుతాయి.

పల్లె వెలుగు బస్సులకు కిలోమీటరుకు 3 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసులలో అయితే కిలోమీటరుకు 8 పైసల వంతున పెంచారు. అదే సూపర్ లగ్జరీ, గరుడ, వెన్నెల సర్వీసులలో అయితే కిలోమీటరుకు 9 పైసల వంతున చార్జీలను పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరిగిన చార్జీల ప్రకారం హైదరాబాద్- విజయవాడ మార్గంలో టికెట్ల ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్- విజయవాడ ఎక్స్‌ప్రెస్ చార్జీ గతంలో రూ. 213.. కొత్త చార్జీ రూ. 235
హైదరాబాద్- విజయవాడ డీలక్స్‌ చార్జీ గతంలో రూ. 240.. కొత్త చార్జీ రూ. 264
హైదరాబాద్- విజయవాడ సూపర్ లగ్జరీ చార్జీ గతంలో రూ. 283.. కొత్త చార్జీ రూ. 303

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement