RTC bus charges
-
వృద్ధులకు రాయితీ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పండి
సాక్షి, అమరావతి: రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో వృద్ధులకు ఇచ్చిన రాయితీని కోవిడ్ తగ్గిన తరువాత ఎందుకు పునరుద్ధరించడం లేదో తెలపాలని రైల్వే బోర్డు, ఏపీఎస్ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను మార్చి 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆర్టీసీకి ఆక్సిజన్ అందించేందుకే..
సాక్షి, అమరావతి బ్యూరో : ఏటా రూ.1200 కోట్ల నష్టాలు చవిచూస్తూ వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్ అందించేందుకే స్వల్పంగా చార్జీలు పెంచుతూ నిర్ణయం తీçసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఆర్టీసీకి ఏ ఏటికి ఆ యేడు నష్టాలు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోవడంతో చార్జీల పెంపు అనివార్యమైందని పేర్కొంది. ప్రభుత్వం స్వల్పంగా చార్జీలు పెంచినా, ఆర్టీసీ ఇంకా రూ.300 కోట్ల నష్టాల్లో ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పల్లె వెలుగు, సిటీ సర్వీస్ బస్సులకు ప్రతి కిలోమీటర్‌కు రూ.10 పైసలు, ఇతర సర్వీసులకు కిలోమీటర్‌కు రూ.20 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పట్లేదన్నారు. చార్జీల పెంపుపై ఆర్టీసీ బోర్డు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని, పెంచిన చార్జీలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఆయన వివరించారు. ఇప్పటికే ఉద్యోగుల విలీనం ఆర్టీసీ విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని మంత్రి నాని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఆస్తులను పంచుకోవాల్సి ఉందని, వాటి పంపకం పూర్తయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, అసెంబ్లీలో దీనిపై చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వివరించారు. సంస్థలో కాలం చెల్లిన (12 లక్షల కిలోమీటర్లు తిరిగి కండిషన్లో లేనివి) బస్సుల స్థానంలో ఏప్రిల్ నాటికి వెయ్యి కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు, ఆపరేషన్స్ ఈడీ కేవీఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు. చార్జీల పెంపుతోనే ఆర్టీసీకి జీవం ఆర్టీసీని ఆదుకునేందుకు చార్జీల పెంపు అనివార్యమైంది. ఏ ఏటికాయేడు భారం పెరిగి పోతుండటంతో ఇప్పటికే నష్టాలు రూ.6,735 కోట్లకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిలో ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించి, కార్మికులకు చేయూతనందించేందుకు ప్రయాణికులు స్వల్పంగా చార్జీల పెంపును భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 1 నుంచి తెలంగాణలో ఆర్టీసీ చార్జీలను అన్ని సర్వీసులకు కిలోమీటరుకు 20 పైసల వంతున, స్టూడెంట్ పాస్‌ల రేట్లను 30 శాతంకు పైగా పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ రోజుకు 700 సర్వీసులకు పైగా నడుపుతోంది. ఒక్క హైదరాబాద్‌కే ప్రతి రోజూ 565 సర్వీసులు తిరుగుతున్నాయి. మిగిలిన సర్వీసులు భద్రాచలం, మిర్యాలగూడ, కరీంనగర్, ఖమ్మం, నల్గొండకు వెళుతున్నాయి. ప్రస్తుతం, పెరిగాక చార్జీలు ఇలా.. ఏపీకి, తెలంగాణకు అంతర్రాష్ట్ర ఒప్పందాలున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసుల్లో చార్జీల మధ్య మరీ ఎక్కువ వ్యత్యాసం ఉండకూడదనే నిబంధన ఉంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ కూడా చార్జీలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, మిగిలిన అన్ని సర్వీసుల్లో 20 పైసల వంతున పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు శనివారం రవాణా శాఖ మంత్రి పేర్నినాని వివరించారు. కాగా, డీజిల్ ధర పెరిగిన కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీపై రూ.360 కోట్ల భారం పడింది. అన్ని రకాలుగా భారం భరిస్తున్న ఆర్టీసీని ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేనివిధంగా బడ్జెట్లో రూ.1,572 కోట్లు కేటాయించింది. నెలకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనికితోడు స్వల్పంగా చార్జీలు పెంచడం వల్ల అప్పులు, నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి మరి కొంత ఊరట కలుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. -
చార్జీలపెంపుపై సీపీఐ ఆందోళన
యాదిగిరిగుట్ట(నల్లగొండ): తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్‌చార్జీలపై సీపీఐ నిరసన తెలిపింది. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట బస్టాండ్ వద్ద సీపీఐ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అసలే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై చార్జీల పెంపు మరింత భారంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, శ్రీధర్ పాల్గొన్నారు. -
తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు త్వరలో చార్జీల మోత మోగనుంది. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చార్జీల బాదుడుకు షురూ అయింది. అధికారులు బుధవారం ముఖ్యమంత్రితో సమావేశమై విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వివరించారు. ఈ సందర్భంగా సామాన్య, గృహ వినియోగదారులపై అదనపు భారం పడకుండా విద్యుత్ చార్జీల పెంపుకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. 100 యూనిట్ల లోపు ఎలాంటి పెంపుదల ఉండదని.. 100 యూనిట్ల పైబడి స్వల్ప పెరుగుదల ఉంటుందని సమాచారం. విద్యుత్ చార్జీల పెంపుకు అధికారులు ప్రతిపాదనలు ఇవ్వగా, ఏ మేరకు విద్యుత్ చార్జీల పెంచాలన్నదానిపై గురువారం తుది నిర్ణయం వెలువడనుంది. మరోవైపు ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంచనున్నారు. 30 కిలోమీటర్ల లోపు పల్లెవెలుగు బస్సుల్లో రూపాయి, 30 కిలోమీటర్ల పైన 2 రెండు రూపాయలు, పల్లె వెలుగు మినహా మిగతా బస్సుల్లో 10 శాతానికి మించకుండా ఛార్జీలు పెంచాలని నిర్ణయించారు. -
బస్సుల ‘సంక్రాంతి’ దోపిడీ
♦ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లు ♦ ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీల మోత సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సంబరం అయినవారందరితో జరుపుకోవాలని పిల్లాపాపలతో సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు దోపిడీకి తెరలేపాయి. ప్రత్యేక బస్సుల పేరిట యాభై నుంచి వంద శాతానికి పైగా అదనపు చార్జీలతో ప్రయాణికులను నిలువునా దోచుకొంటున్నాయి. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో హద్దూ అదుపూ లేకుండా టికెట్ల రేట్లు పెంచేసి సగటు జీవి పండుగ సంబరాన్ని ఆవిరి చేస్తున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లయితే ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో పది లక్షల మంది... సంక్రాంతి పండుగ కోసం గత మూడు రోజుల్లో దాదాపు 10 లక్షల మంది నగరవాసులు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో దక్షిణమధ్య రైల్వే నడుపుతున్న అరకొర రైళ్లు కిటకిటలాడుతున్నాయి. వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉంటోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ఏర్పాటు చేసిన 2,470 ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేస్తోంది. రెగ్యులర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.304 వరకు చార్జీ ఉంటే ప్రస్తుతం అది రూ.450 దాటింది. అన్ని ప్రధాన రూట్లలోనూ ఇదే పరిస్థితి. ఇక ప్రైవేట్ బస్సుల్లో విశాఖపట్టణానికి ఏసీ బస్సుకు సాధారణ రోజుల్లో రూ.750 వరకు చార్జీ ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1600 వరకు వసూలు చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులతో సొంతూరికి పయనమవుతున్న మధ్యతరగతి వ్యక్తి విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు చార్జీల రూపంలోనే రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫలితంగా పండుగ ఆనందం ఆవిరైపోతోంది. ఇది అన్యాయం... ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలతో చుక్కలు చూపిస్తున్నాయి. సంక్రాం తికి సొంత ఊరుకు వెళ్లడం కంటే ఇక్కడే ఉండిపోతే బాగుండేదనిపిస్తుంది. పండుగ పేరిట ఇలా సామాన్య ప్రజలపై భారం మోపడం అన్యాయం. - ఫల్గుణ, మూసాపేట్ సర్వీసులు పెంచాల్సింది పండుగకు శ్రీకాకుళానికి బయలుదేరాం. కానీ ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి ఉన్నాయి. ప్రైవేట్ బస్సుల్లో చార్జీల మోతమోగుతోంది. రైళ్లు కూడా చాలినన్ని లేవు. ఇంటిల్లిపాదీ కలిసి వెళ్లాలంటే భయమేస్తుంది. ఆర్టీసీ సర్వీసుల్ని పెంచాల్సింది. - గిరిడ చిన్నారావు, కూకట్పల్లి విజయవాడకు రూ.1000! ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు దారుణంగా పెంచారు. సాధారణ రోజుల్లో విజయవాడకు రూ.350 తీసుకుంటారు. ఇప్పుడేమో రూ.1000కి పైనే డిమాండ్ చేస్తున్నారు. రైళ్లూ అరకొరానే. ఊరికి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. - శివ, కేపీహెచ్‌బీ -
ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. బస్సు చార్జీలను ప్రభుత్వం 10 శాతం మేర పెంచింది. పెరిగిన బస్సు చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలవుతాయి. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటరుకు 3 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసులలో అయితే కిలోమీటరుకు 8 పైసల వంతున పెంచారు. అదే సూపర్ లగ్జరీ, గరుడ, వెన్నెల సర్వీసులలో అయితే కిలోమీటరుకు 9 పైసల వంతున చార్జీలను పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరిగిన చార్జీల ప్రకారం హైదరాబాద్- విజయవాడ మార్గంలో టికెట్ల ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్- విజయవాడ ఎక్స్‌ప్రెస్ చార్జీ గతంలో రూ. 213.. కొత్త చార్జీ రూ. 235 హైదరాబాద్- విజయవాడ డీలక్స్ చార్జీ గతంలో రూ. 240.. కొత్త చార్జీ రూ. 264 హైదరాబాద్- విజయవాడ సూపర్ లగ్జరీ చార్జీ గతంలో రూ. 283.. కొత్త చార్జీ రూ. 303 -
ఆర్టీసీ బస్సు చార్జీల మోత
-
ఇక ఆర్టీసీ మోత!
* 15 శాతం వరకు చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు * రూ. 450 కోట్ల వరకు భారం పడే అవకాశం * సిబ్బంది వేతన సవరణ కోసం టికెట్ ధరల పెంపు యోచన * వ్యాట్, ఎంవీ ట్యాక్స్ రీయింబర్స్ చేయాలని సర్కారును కోరనున్న ఆర్టీసీ * త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ప్రతిపాదించనున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీల మోత మోగనుంది.. దాదాపు 15 శాతం వరకు చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉద్యోగులకు వేతన సవరణను అమలు చేయడానికి, నష్టాలను తగ్గించుకోవడానికి చార్జీలు పెంచడమే శరణ్యమని ఆ సంస్థ భావిస్తోంది. వేతన సవరణ రూపంలో ఎదురయ్యే భారాన్ని భరిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరనుంది. ఇందుకు సర్కారు ముందుకు రాని పక్షంలో చార్జీలు పెంచుకొనేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. సోమవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ బహిరంగసభ జరుగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ మేరకు ప్రతిపాదనను ఆయన దృష్టికి తీసుకురానుంది. దీనికి సీఎం ఆమోదిస్తే.. త్వరలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు పెరగనున్నాయి. వేతనాల పెంపు కోసం.. ఆర్టీసీలో వేతన సవరణ గడువు 2013 మార్చితో ముగిసింది. అప్పటి నుంచి పీఆర్సీ పెండింగ్‌లో ఉంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో... వారితో సమంగా తమ వేతనాలనూ సవరించాలని ఆర్టీసీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీనికి అంగీకరిస్తే తెలంగాణ ఆర్టీసీపై రూ.700 కోట్ల వరకు భారం పడనుంది. అయితే అంత భారం మోయలేమని కార్మిక సంఘం నేతలకు ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో కార్మిక నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ సాంబశివరావు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు భారీగా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఇప్పటికే నిధుల సమీకరణ కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల మొత్తాన్ని భరించాలంటే సర్కారుకు ఇబ్బందే. దీంతో ఆర్టీసీ చార్జీల పెంపు మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. సిబ్బందికి 33% వరకూ ఫిట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకూ 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నా.. 33 శాతంలోపే స్థిరీకరించే దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకోసారి వేతన సవరణ జరుగుతుంది. కానీ ఆర్టీసీలో అది నాలుగేళ్లకోసారే జరుగుతుంది. ఈ లెక్కన 33 శాతం ఫిట్మెంట్ సరిపోతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఇలా అయినా కూడా రూ.450 కోట్ల వరకు భారం పడుతుంది. ఆదుకోవాలని విజ్ఞప్తి.. ప్రస్తుతం ఆర్టీసీ డీజిల్‌పై 22.5 శాతం చొప్పున వ్యాట్ చెల్లిస్తోంది. దీనిని ప్రభుత్వం రీయింబర్స్ చేయాలని ఆర్టీసీ కోరుతోంది. సర్కారు అంగీకరిస్తే రూ.250 కోట్లు మిగులుతాయి. ఇక అయితే ఇటీవల ఆటోలు, వ్యవ సాయ ట్రాక్టర్లకు ఇచ్చినట్లుగానే ఆర్టీసీ బస్సులకు ఈ పన్ను మినహాయింపు ఇవ్వాలని యాజమాన్యం కోరనుంది. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే రూ.275 కోట్ల వరకు భారం తగ్గుతుంది. అలాగే వరుసగా మూడేళ్ల పాటు ఏటా వెయ్యి బస్సుల చొప్పున కొనేందుకు ప్రభుత్వం సాయం చేయాలని.. ఇందుకు ఏటా రూ.250 కోట్లు చొప్పున గ్రాంట్ ఇవ్వాలని కోరనుంది. కనీసం 15 శాతం.. 15 శాతం వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించాలని సీఎంను కోరాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా 25 శాతం చార్జీల పెంపును ప్రతిపాదించాలని అధికారులు భావించారు. కానీ అంత భారీ పెంపునకు అనుమతి లభించదనే ఉద్దేశంతో 15 శాతానికి తగ్గకుండా పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్టు తెలిసింది. 15% పెంచితే సాలీనా ప్రజలపై దాదాపు రూ.450 కోట్ల వరకు భారం పడనుంది. చార్జీల పెంపునకు ప్రభుత్వం ఓకే చెబితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆర్టీసీ చార్జీలు పెంచినట్లు అవుతుంది. 2004 నుంచి 2009 వరకు వైఎస్ సీఎంగా ఉండగా చార్జీలు పెంచలేదు. ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు చార్జీలు పెంచారు. విభజన జరిగిన 2014లో మాత్రం చార్జీలు పెంచలేదు. -
ప్రయాణికులపై ఆటో పిడుగు
సాక్షి, సిటీబ్యూరో: లక్షల మంది ప్రయాణికులపై భారాన్ని మోపుతూ ప్రభుత్వం శుక్రవారం ఆటో చార్జీలను పెంచింది. ఈ మేరకు రవాణాశాఖ జీవో నం.20 విడుదల చేసింది. దాంతో గ్రేటర్‌లోని లక్షా 20 వేల ఆటోరిక్షాలను వినియోగించుకొనే సుమారు 15 లక్షల మంది ప్రయణికులపై చార్జీల భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన ఆర్టీసీ చార్జీలు, ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు, వంటగ్యాస్ భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యుడిపై తాజాగా ఆటో పిడుగు పడింది. పెరిగిన చార్జీలు శనివారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి రానున్నాయి. మొదటి 1.6 కిలోమీటర్ల దూరానికే ప్రయాణికుడిపై ఏకంగా రూ.4 పెంచారు. ఆ తర్వాత చేసే ప్రతి కిలోమీటర్ దూరానికి రెండురూపాయల చొప్పున అదనపు భారం పడనుంది. దాంతో సగటున ఒక్కో ప్రయాణికుడిపై రూ.10 అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రతి రోజు ఆటో ప్రయాణికులపై పెరిగిన చార్జీల కారణంగా రూ.కోటీ 50 లక్షల అదనపు భారం పడనుంది. పెరిగిన చార్జీలు.... ప్రస్తుతం 1.6 కిలోమీటర్ల దూరానికి తీసుకుంటున్న కనీస చార్జీ రూ.16. నేటి నుంచి ఇది రూ.20 ఆ పైన ప్రతి కిలోమీటర్‌కు రూ.9 లను రూ.11 లకు పెంచారు. ప్రస్తుతం ప్రతి 2 నిమిషాలకు 50 పైసల చొప్పున వెయిటింగ్ చార్జీ తీసుకుంటుండగా ఇక నుంచి దానిని 15 నిమిషాలకు రూ.5 చొప్పున తీసుకుంటారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు మీటర్ చార్జీలపైన ఆఫ్ రిటర్న్ (50 శాతం అదనంగా) చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో తిరిగే ఆటోలన్నీ విధిగా మీటర్ చార్జీలకు అనుగుణంగానే ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేయాలి. చార్జీలు పెంచిన తర్వాత మూడునెలల్లోపు ఆటోడ్రైవర్లు మీటర్లను సవరించుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ పేర్కొన్నారు. నిర్ణీత రీడింగ్ ప్రకారం చార్జీలు తీసుకోవాలని, మీటర్ రీడింగ్ నమోదు చేయకుండా ఇష్టారాజ్యంగా వసూలు చేసినా, తప్పుడు రీడింగ్ నమోదు చేసిన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతపై... ఇటీవల మహిళలపై చోటుచేసుకుంటున్న దాడుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై అధికారులు దృష్టి సారించారు. ప్రతి ఆటోలో విధిగా ఆటో యజమాని, డ్రైవర్ వివరాలను తెలిపే చార్ట్‌ను ఏర్పాటు చేయాలి. డాక్యుమెంట్లు కూడా ఆటోలో ఉండాలి. ఈ- చలానాలు, ట్రాఫిక్ చలానాల తగ్గింపు, తదితర అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. -
ఆర్టీసీ చార్జీల పెంపుతో జిల్లా ప్రజలపై రూ.54 కోట్ల భారం
కడప అర్బన్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులపై ఏడాదికి రూ.54కోట్లు భారం పడనుంది. పల్లె వెలుగు నుంచి హైటెక్ బస్సుల దాకా కిలో మీటర్‌కు 4పైసల నుంచి 12పైసల వరకు అదనంగా వడ్డించనున్నారు. ఈ వడ్డెన మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. కడప ఆర్టీసీ రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో రోజూ 870 బస్సులు తిరగనున్నాయి. ఈ బస్సులు నడపడం వలన ప్రతిరోజూ రూ. 60 నుంచి 70లక్షలు ఆదాయం వచ్చేది. ఈ చార్జీలు పెంచడం వలన దాదాపు రూ.70 నుంచి 85లక్షల వరకు ఆదాయం పెరగనుంది. దీంతో సరాసరి రోజుకు రూ.15లక్షల భారం ఆర్టీసీ ప్రయాణికులపై పడనుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.54కోట్లు భారం పడనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశన్నంటి సామాన్యుని పరిస్థితి దుర్భరంగా తయారైంది. సగటు ప్రయాణికుడు ఆర్టీసీని ఆశ్రయించి గమ్యానికి చేరుతున్నాడు. ఈ చార్జీలు పెరగడంతో సగటు ప్రయాణికునిపై మరింత భారం పడడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లైంది. పల్లె వెలుగు కిలో మీటర్‌కు 55పైసల నుంచి 50పైసలకు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌కు కిలో మీటర్‌కు 72పైసల నుంచి 79పైసలకు పెంచారు. డీలక్స్ బస్సులకు 80పైసల నుంచి 89పైసలకు పెంచారు. సూపర్ లగ్జరీ బస్సులకు 94 పైసల నుంచి 1.05పైసలకు పెంచారు. ఇంద్ర బస్సులకు 1.20పైసల నుంచి రూ.1.32పైసలకు పెంచారు.