తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్‌చార్జీలపై సీపీఐ నిరసన తెలిపింది.
యాదిగిరిగుట్ట(నల్లగొండ): తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్‌చార్జీలపై సీపీఐ నిరసన తెలిపింది. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట బస్టాండ్ వద్ద సీపీఐ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అసలే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై చార్జీల పెంపు మరింత భారంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, శ్రీధర్ పాల్గొన్నారు.