
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకుంటోందని సీరియస్ కామెంట్స్ చేశారు. కావాలనే బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని విమర్శలు చేశారు.
కాగా, వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారు. పిట్టల దొరలా టోపీ పెట్టుకుని విమానాల్లో తిరగడం కాదు. దమ్ముంటే నాతో కేసీఆర్ పాదయాత్రకు రావాలి. అకారణంగా ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకుంది. కావాలనే బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. విద్యార్థుల కోసం కేసీఆర్ ఏం చేశారు?’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment