సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం పొలిటికల్ హీట్‌ను పెంచింది. పేపర్ లీక్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు ఏకంగా కావాలని పిలుపునిచ్చారు.
అయితే, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్దం చేద్దామని షర్మిల తెలిపారు. ఈ క్రమంలోనే ప్రగతి భవన్ మార్చ్ పిలుపునిద్దామని సూచించారు. సీఎం కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని అన్నారు. కలిసి పోరాడకుంటే ప్రతిపక్షాలను కేసీఆర్ బ్రతకనివ్వరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు.
- ఇక, ఈ సందర్బంగా ఉమ్మడి పోరాటం చేసేందుకు బండి సంజయ్.. షర్మిలకు మద్దతు తెలిపారు. తర్వలో సమావేశం అవుదామని షర్మిలకు చెప్పారు.
- మరోవైపు, రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుందామని రేవంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment