పుష్ప సాంగ్‌కు డ్యాన్స్‌ చేసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్! | Shah Rukh Khan And Vicky Kaushal Steps At The IIFA Awards 2024 For Oo Antava Song, Tweet Inside | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: పుష్ప సాంగ్‌కు షారూఖ్ స్టెప్పులు.. వీడియో వైరల్!

Published Sun, Sep 29 2024 3:02 PM | Last Updated on Sun, Sep 29 2024 5:27 PM

Shah Rukh Khan and Vicky Kaushal Steps at the IIFA Awards 2024

ఐఫా-2024 అవార్డుల వేడుక అబుదాబిలో అ‍ట్టహాసంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో సినీతారలంతా సందడి చేస్తున్నారు. సౌత్‌తో పాటు బాలీవుడ్‌ అగ్ర సినీతారలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే ఈవెంట్‌లో హోస్ట్‌లుగా వ్యవహరించిన బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ సందడి చేశారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించారు.

అయితే వేదికపై వీరిద్దరూ కలిసి ‍అల్లు అర్జున్‌ పుష్ప సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. ‍అనే ఐటమ్‌ సాంగ్‌కు స్టెప్పులతో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఇది కాస్తా వైరల్‌ కావడంతో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇది చదవండి: నేను మాట్లాడింది ప్రభాస్ గురించి కాదు.. జోకర్ కామెంట్స్‌పై క్లారిటీ!)

కాగా.. ఈ అవార్డ్స్ వేడుకల్లో షారూఖ్ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జవాన్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ దక్కించుకున్నారు. సినీ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సెప్టెంబర్ 27న అబుదాబిలో ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సమంతా రూత్ ప్రభు, ఐశ్వర్యరాయ్ బచ్చన్ సందడి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement