నేను మాట్లాడింది ప్రభాస్ గురించి కాదు.. జోకర్ కామెంట్స్‌పై క్లారిటీ! | Bollywood Actor Arshad Warsi Breaks Silence On Prabhas Character Kalki 2898 AD, Check Out The Details | Sakshi
Sakshi News home page

Arshad Warsi: నా వ్యాఖ్యలను తప్పుగా ‍అర్థం చేసుకున్నారు: అర్షద్ వార్సీ

Published Sun, Sep 29 2024 1:29 PM | Last Updated on Sun, Sep 29 2024 2:38 PM

Bollywood actor Arshad Warsi breaks silence on Prabhas character Kalki 2898 AD

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్‌ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. కల్కి చిత్రంలో ప్రభాస్ నటనను ఉద్దేశించి జోకర్‌లా ఉన్నాడంటూ మాట్లాడారు. దీంతో అర్షద్ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తాను చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారాయన. ఐఫా-2024 అవార్డ్స్‌ వేడుకల్లో పాల్గొన్న అర్షద్ వార్సీ తాను చేసిన కామెంట్స్‌ గురించి మాట్లాడారు. 

(ఇది చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?)

అర్షద్ వార్సీ మాట్లాడుతూ.'ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. నేను కేవలం పాత్ర గురించి మాత్రమే మాట్లాడాను. ఇక్కడ వ్యక్తి గురించి నేను చెప్పలేదు. ప్రభాస్ అద్భుతమైన నటుడు. ఈ విషయాన్ని  తాను పదే పదే నిరూపించుకున్నాడు. అతని గురించి మనకు తెలుసు. కానీ మంచి నటుడికి చెడ్డ పాత్ర ఇచ్చినప్పుడు అది ప్రేక్షకులకు చాలా బాధగా ఉంటుంది' అని అన్నారు. ప్రభాస్ గురించిన నేను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అర్షద్ వార్సీ తెలిపారు. అయితే ప్రభాస్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేయడంతో అర్షద్ పెద్దఎత్తున ట్రోలింగ్‌కు గురయ్యాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement