
వెంకట్,‡రవిశంకర్, రవితేజ, శ్రీను వైట్ల, అనూ ఇమ్మాన్యుయేల్, నవీన్, చెర్రీ
మూడు హిట్స్ సాధించిన క్రేజీ కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా రూపొందటానికి పదేళ్ల కాలం పట్టింది. రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఆల్రెడీ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘నీకోసం, వెంకీ, దుబాయ్ శీను’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.
ముహూర్తపు సన్నివేశానికి శ్రీను వైట్ల పెద్ద కుమార్తె ఆనంది వైట్ల క్లాప్ ఇవ్వగా, రెండవ కుమార్తె ఆద్య వైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు. హీరో రవితేజ బౌండెడ్ స్క్రిప్ట్‌ను శ్రీను వైట్లకు అందించారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కథకు గత ఏడాదే బీజం పడింది.
పది నెలలు కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను కంప్లీట్ చేశా. సునీల్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేస్తారు.నిన్నటి తరం కథానాయిక లయ, ఆమె కుమార్తె శ్లోక కూడా నటించనున్నారు. రవితేజ తనయుడు మహాధన్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. ఎంటైర్ షూటింగ్‌ను యూఎస్‌లోనే కంప్లీట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మా బ్యానర్‌లో చాలా స్పెషల్ మూవీ ఇది. రవితేజ–శ్రీను వైట్ల క్రేజీ కాంబినేషన్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. థమన్ స్వరాలు సమకూర్చనున్నారు’’ అని నిర్మాతలు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment