రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ | Tollywood Heroine Laya met with an accident in America | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్

Published Tue, Sep 22 2015 3:54 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Tollywood Heroine Laya met with an accident  in America


లాస్ఏంజిల్స్: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ల‌య‌ రోడ్డు ప్రమాదానికి గుర యినట్టు సమాచారం.  అమెరికాలో ఆమె ప్రయాణిస్తున్న కారు   ప్రమాదానికి  గురైనట్టు తెలుస్తోంది.  లాజ్ ఏంజెల్స్‌ కు వెళుతుండ‌గా  ఆమె కారు పల్టీలు కొట్టిందని, అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని  సమాచారం.  దీంతో ఆమెను కుటుంబ స‌భ్యులు వెంట‌నే స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  ప్రస్తుతం ఆమె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 

అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు  వెల్లడించినట్టు సమాచారం.  స్వల్ప గాయలయ్యాయని  ఆమెకు  చిన్నపాటి శ‌స్త్రచికిత్స అవసరమవుతుందని వారు తెలిపినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి స‌మాచారం రావాల్సి ఉంది.

తెలుగు సినీపరిశ్రమలో ఒక వెలుగు వెలుగిన లయ 2006లో ఓ డాక్టర్ను  పెళ్లి చేసుకుని కాలీఫోర్నియా లో సెటిలయ్యింది.  స్వయంవ‌రం సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన  లయ మంచి పాపుల‌ర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. త‌ర్వాత టాలీవుడ్‌లో ప‌లువురు అగ్ర హీరోల‌తో కలిసి నటించింది. పెళ్లి తరువాత సినిమాల‌కు గుడ్ బై చెప్పిన లయకు ఒక కూతురు కూడా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement