ఆ డైరెక్టర్‌ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్‌పోర్టుకు.. Actress Laya Reveals Bad Incident About Director Attack | Sakshi
Sakshi News home page

Laya: రోడ్డునపడ్డా.. అడుక్కుతింటున్నా అని ప్రచారం చేశారు.. బాధేసింది!

Published Fri, May 17 2024 1:04 PM | Last Updated on Fri, May 17 2024 1:46 PM

Actress Laya Shares Bad Incident about Director Attack

హీరోయిన్‌ లయ.. అప్పట్లో యూత్‌కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఫేవరెట్‌ హీరోయిన్‌. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే ఈ అందాల రాశి సినిమాలకు దూరమై దాదాపు పద్దెనిమిదేళ్లవుతోంది. మధ్యలో 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' అనే సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది. తర్వాత సినిమాలవైపు కన్నెత్తి చూడలేదు. అమెరికాలో సెటిలైన ఈమె అక్కడ నాలుగేళ్లపాటు ఐటీ ఉద్యోగం చేసింది. తర్వాత అది వదిలేసి డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టింది. కోవిడ్‌ తర్వాత దాన్ని కూడా మానేసి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండటం మొదలుపెట్టింది.

అందుకే ఇండియాకు వచ్చేశా
తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. 'నేను అమెరికా వెళ్లిపోయాక నా గురించి లేనిపోనివి ప్రచారం చేశారు. రోడ్డున పడ్డానని, అడుక్కుతింటున్నానని, ఇంకా ఎన్నో వదంతులు సృష్టించారు. అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకు రావడానికి ప్రధాన కారణం.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. నితిన్‌ 'తమ్ముడు' సినిమాలో నటిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.

నన్ను ఫాలో అవుతూ..
అలాగే తన చేదు అనుభవాన్ని వెల్లడిస్తూ.. 'ఒక పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న డైరెక్టర్‌ నన్ను ఫాలో అయ్యాడు. బేగంపేటలో కారు పార్కింగ్‌ చేసే దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని బెదిరించాడు. నేను ఎలాగోలా తప్పించుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాను. కానీ ఆయన నన్ను ఫాలో అవుతూ అక్కడికీ వచ్చాడు. మీరు చంపుతానన్నా నేనేం చేయలేను.. ఇక్కడ ఎవరూ లేరు, మీ ఇష్టం చంపేయండన్నాను' అంటూ లయ ఆనాటి ఇబ్బందికర పరిస్థితిని గుర్తు చేసుకుంది. అయితే ఆ డైరెక్టర్‌ ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.

చదవండి: చేతికట్టు తొలగించి కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement