Actress Laya Revealed About Her Job and Salary In USA - Sakshi
Sakshi News home page

Actress Laya: అమెరికాలో లయ శాలరీ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Published Tue, Mar 28 2023 3:54 PM | Last Updated on Tue, Mar 28 2023 4:19 PM

Actress Laya Revealed About Her Job and Salary In USA - Sakshi

హీరోయిన్‌ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మనోహరం, ప్రేమించు చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ చిత్రాలకు గానూ వరుసగా మూడు నంది అవార్డులు అందుకున్న ఏకైన నటిగా లయ గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె కెరీర్‌ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది.

చదవండి: బర్త్‌డే రోజున చరణ్‌ ధరించిన ఈ షర్ట్‌ ధరెంతో తెలుసా?

ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆమె సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రీల్స్‌ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఇండియా వచ్చిన లయ వరుసగా ఇంటర్య్వూలు ఇస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో తను చేసే జాబ్‌, శాలరీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాగా తాను 2006లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన లయ.. 2011 నుంచి ఐటీ సెక్టార్‌లో జాబ్‌ చేసినట్లు చెప్పింది. నాలుగేళ్లు ఫుల్‌ టైం వర్క్‌ చేశానని, ఇండియాలోని ప్రముఖ ఐటీ సంస్థకు చేసినట్లు తెలిపింది.

చదవండి: అలీ రేజాతో రొమాంటిక్‌ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్‌ రియాక్షన్‌

ఆ సమయంలో తన శాలరీ అన్ని ట్యాక్స్‌లు పోనూ 12000 డాలర్స్‌ అని చెప్పింది. అంటే మన ఇండియన్‌ కరెన్సీ ప్రకారం దాదాపు నెలకు రూ. 960, 000. నాలుగేళ్లు ఐటీ సెక్టార్‌ చేసిన తాను 2017లో జాబ్‌ వదిలేసినంది. ఆ తర్వాత డాన్స్‌ స్కూల్‌ పెట్టానని, కోవిడ్‌ కారణంగా అది మానేసి సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేయడం స్టార్ట్‌ చేశానంటూ చెప్పుకొచ్చింది. ఇక చాలా ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన లయ హైదరాబాద్‌ చాలా మారిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. న్యూయార్క్‌ సిటీ కంటే హైదరాబాదే చాలా బాగుందని వ్యాఖ్యానించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement