గర్జించే పులి
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన తాజా మలయాళ చిత్రం ‘పులి మురుగన్’. వైశాఖ దర్శకత్వం వహించారు. జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు రాబట్టి, సరికొత్త రికార్డు సృష్టించింది. శ్రీ సరస్వతి ఫిల్మ్స్ అధినేత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని ‘మన్యం పులి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ - ‘‘కేరళ, వియత్నాం పరిసరాల్లో రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్. ఇప్పటికే డబ్బింగ్, పాటల రికార్డింగ్ పూర్తయింది. ఈ నెల 25న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘మన్యం పులి’తో మరింతగా అలరిస్తారు’’ అన్నారు.