Manyam puli
-
పాటకు ఆస్కారం?
ఆస్కార్ ఆశలు ఇంకా చెదిరిపోలేదు. ‘న్యూటన్’ అవుట్ అయిందని బాధపడక్కర్లేదు. ఆస్కార్ అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఈసారి బాలీవుడ్ కాదు మాలీవుడ్ సినిమా రేసులో ఉంది. బెస్ట్ ఫారిన్ చిత్రం క్యాటగిరీలో ‘న్యూటన్’ అవుట్ అయ్యాక బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఓ ఇండియన్ సినిమాకి అవకాశం దక్కింది. ఆస్కార్ అవార్డ్స్ అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ ఈ సంవత్సరం ఆస్కార్ ఆవార్డ్స్ గెలిచే అవకాశం ఉన్న 70 పాటల లిస్ట్‌ను ప్రకటించింది. ఆ లిస్ట్‌లో మలయాళ సంగీతదర్శకుడు గోపీసుందర్ స్వరపరచిన ‘పులిమురుగన్’లోని రెండు పాటలు (‘కాదనయుమ్ కల్చిలంబే, మానతే మారికురంబే’) స్థానం సంపాదించుకోగలిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకున్న 70 పాటల్లో పాప్ సంగీత సంచలనాలు టేలర్ స్విఫ్ట్, నిక్ జోన్స్‌తో పాటు గోపీసుందర్ సమకూర్చిన రెండు పాటలు ఉండటం విశేషం. ఈ విషయమై గోపీసుందర్ స్పందిస్తూ – ‘‘ఈ లిస్ట్‌ను మొదటిసారి చూసి నమ్మలేదు. కానీ, అకాడమీ సంస్థ నుంచి అఫీషియల్ మెయిల్ వచ్చేసరికి నమ్మక తప్పలేదు. నాకు ఇప్పటి వరకు స్టేట్ అవార్డ్ రాలేదు కానీ, నేషనల్ అవార్డ్ లభించింది. ప్రేక్షకులకు నచ్చటమే అంతిమ విజయంగా భావిస్తా’’ అన్నారు. మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘పులిమురుగన్’ తెలుగులో ‘మన్యం పులి’గా విడుదలై, ఇక్కడా విజయం సాధించింది. 100 కోట్ల క్లబ్ చేరుకున్న తొలి మాలీవుడ్ మూవీగా పేరు సంపాదించింది. -
మళ్లీ మన్యం పులి
మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వైశాఖ్ దర్శకత్వంలో నటించిన ‘పులి మురుగన్’ తెలుగులో ‘మన్యం పులి’గా విడుదలైన విషయం తెలిసిందే. శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ఈ సినిమాను ఈ రోజు మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో జగపతిబాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు ‘మన్యం పులి’ విడుదల అయినప్పుడు నోట్ల రద్దు ప్రభావం వల్ల చాలామంది ప్రేక్షకులు సినిమాను చూడలేకపోయారు. వాళ్ల కోసమే ఈ సినిమాను రీ–రిలీజ్ చేస్తున్నాం. ఎగ్జిబ్యూటర్స్ కూడా రీ–రిలీజ్ కోసం అడగటం, వేసవి సెలవులు రావడం వంటి కారణాలతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను. నేషనల్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న మోహన్‌లాల్‌కు, బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు సాధించిన పీటర్ హెయిన్స్‌కు శుభాకాంక్షలు’’ అని అన్నారు. -
మోహన్ లాల్ రేర్ ఫీట్..!
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ అరుదైన రికార్డ్ సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయి టాలీవుడ్లో కూడా మంచి టాక్ సొంతం చేసుకున్న మన్యంపులి సినిమాను తెలుగు రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో ఘనవిజయం సాధించిన సినిమాలను రెండు మూడేళ్ల తరువాత రీ రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఓ సినిమా 20 రోజులకు మించి థియేటర్లలో కనిపించడమే కష్టంగా మారిపోయింది. అలాంటి సమయంలో ఓ డబ్బింగ్ సినిమాను రీ రిలీజ్ చేయడమంటే సాహసం అనే చెప్పాలి. ఇటీవల బాహుబలి 2కు ముందు బాహుబలి తొలి భాగాన్ని రిలీజ్ చేసినా పెద్దగా కలెక్షన్లు రాలేదు. మరి ఈ నెల 6న రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా మన్యంపులి రీ రిలీజ్లో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
మేకింగ్ ఆఫ్ మూవీ - మన్యం పులి
-
హీరో కంటే బాగా చూస్తున్నారు
-
హీరో కంటే బాగా చూస్తున్నారు
‘‘సాధారణంగా విలన్ అంటే చులకనభావంతో చూస్తారు. కానీ, నా కోసమే ‘నాన్నకు ప్రేమతో’లో పాత్రను గౌరవంగా చూపించానని సుకుమార్ ఓసారి చెప్పారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో నన్ను హీరో కంటే బాగా చూస్తున్నారు’’ అన్నారు జగపతిబాబు. మోహన్‌లాల్ హీరోగా, ఆయన విలన్‌గా నటించిన ‘మన్యం పులి’ గత శుక్రవారం విడుదలైంది. జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘మలయాళ ప్రేక్షకులు నన్ను నా పేరుతో కాకుండా ఈ చిత్రంలో చేసిన ‘డాడీ గిరిజ’ పాత్ర పేరుతో పిలుస్తున్నారు. అంత మంచి పేరొచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా హిట్ కావడం హ్యాపీగా ఉంది. మలయాళంలో మోహన్‌లాల్‌తో మరో సినిమా చేయబోతున్నా. గోపీచంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్‌లతో సినిమాలు చేస్తున్నాను. నేను హీరోగా చేయబోయే ‘పటేల్‌సార్’ త్వరలో ప్రారంభమవుతుంది. 60 ఏళ్ల వృద్ధుడికీ, అంధురాలైన చిన్నారికీ మధ్య జరిగే కథే ఆ చిత్రం’’ అన్నారు. -
బాక్సాఫీస్ పులి
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘పులి మురుగన్’. వైశాఖ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో 100 కోట్ల పైగా వసూళ్లు సాధించింది. ఆ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. శ్రీసరస్వతి ఫిల్మ్స్ అధినేత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ‘మన్యం పులి’ పేరుతో నేడు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ- ‘‘కేరళ, వియత్నాం పరిసరాల్లో రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. పీటర్ హెయిన్స్ ఫైట్స్ హైలెట్. మోహన్‌లాల్, పులి కాంబినేషన్లో తీసిన ఫైట్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. పిల్లలతో పాటు పెద్దలకూ నచ్చే అంశాలున్నాయి. మలయాళంలోలానే తెలుగు వారు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
మరోసారి సొంత గొంతుతో..!
ప్రస్తుతం దక్షిణాది నటులందరూ తమ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు తమ సినిమాలను ఒకే సమయంలో రెండు భాషల్లో రిలీజ్ చేస్తుంటే సీనియర్ హీరోలు కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేయకపోయినా.. తమ మాతృభాషలో సక్సెస్ అయిన సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ హీరోలు ఇప్పటికే ఈ ఫార్ములాతో విజయాలు సాధిస్తుండగా, మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడిప్పుడే తెలుగు మార్కెట్ మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే మనమంతా, జనతా గ్యారేజ్ లాంటి తెలుగు సినిమాల్లో నటించిన మోహన్ లాల్, ఇప్పుడు తన డబ్బింగ్ సినిమాలతో కూడా అలరించాలని భావిస్తున్నాడు. ఈ శుక్రవారం మన్యంపులితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే సమయంలో తన మరో హిట్ సినిమా ఒప్పంను తెలుగు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో మనమంతా సినిమాకు సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న మోహన్ లాల్, ఒప్పం డబ్బింగ్ వర్షన్లో మరోసారి తెలుగు ప్రేక్షకులకు సొంత గొంతు వినిపించాలని నిర్ణయించుకున్నాడు. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు భారీ ఆఫర్లు వచ్చాయి. సౌత్‌లో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని భావిస్తున్న మోహన్ లాల్.. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ఎవ్వరికీ ఇవ్వకుండా కేవలం డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. హిందీలో అక్షయ్ కుమార్, కన్నడలో శివరాజ్ కుమార్‌లు ఈ సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. -
గర్జించే పులి
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన తాజా మలయాళ చిత్రం ‘పులి మురుగన్’. వైశాఖ దర్శకత్వం వహించారు. జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు రాబట్టి, సరికొత్త రికార్డు సృష్టించింది. శ్రీ సరస్వతి ఫిల్మ్స్ అధినేత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని ‘మన్యం పులి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘కేరళ, వియత్నాం పరిసరాల్లో రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్. ఇప్పటికే డబ్బింగ్, పాటల రికార్డింగ్ పూర్తయింది. ఈ నెల 25న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘మన్యం పులి’తో మరింతగా అలరిస్తారు’’ అన్నారు. -
పులితో పోరాటం
‘‘అటవీ సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తాడు అతను. వెదురు బొంగులు విక్రయిస్తుంటాడు. వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లినప్పుడు పలు జంతువులతో ముఖ్యంగా పులులతో పోరాడాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఆసక్తికరం’’ అని నిర్మాత ‘సింధూరపువ్వు కృష్ణారెడ్డి’ అన్నారు. మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా జగపతిబాబు కీలక పాత్రలో వైశాఖ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పులి మురుగన్’. మలయాళంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘మన్యం పులి’ పేరుతో కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సౌత్ ఇండియాలో ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్లో హిట్ అయిన చిత్రం ‘పులి మురుగన్’. డబ్బింగ్, పాటల రికార్డింగ్ పూర్తయింది. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.