మళ్లీ మన్యం పులి | Manyam puli cinema once again release | Sakshi
Sakshi News home page

మళ్లీ మన్యం పులి

Published Sat, May 6 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

మళ్లీ మన్యం పులి

మళ్లీ మన్యం పులి

మలయాళం సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ వైశాఖ్‌ దర్శకత్వంలో నటించిన ‘పులి మురుగన్‌’ తెలుగులో  ‘మన్యం పులి’గా విడుదలైన విషయం తెలిసిందే. శ్రీ సరస్వతి ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ఈ సినిమాను ఈ రోజు మళ్లీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో జగపతిబాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు ‘మన్యం పులి’ విడుదల అయినప్పుడు నోట్ల రద్దు ప్రభావం వల్ల చాలామంది ప్రేక్షకులు సినిమాను చూడలేకపోయారు.

వాళ్ల కోసమే ఈ సినిమాను రీ–రిలీజ్‌ చేస్తున్నాం. ఎగ్జిబ్యూటర్స్‌ కూడా రీ–రిలీజ్‌ కోసం అడగటం, వేసవి సెలవులు రావడం వంటి కారణాలతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను. నేషనల్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకున్న మోహన్‌లాల్‌కు, బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు సాధించిన పీటర్‌ హెయిన్స్‌కు శుభాకాంక్షలు’’ అని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement