
మోహన్ లాల్ రేర్ ఫీట్..!
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ అరుదైన రికార్డ్ సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయి టాలీవుడ్లో కూడా మంచి టాక్ సొంతం చేసుకున్న మన్యంపులి సినిమాను తెలుగు రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో ఘనవిజయం సాధించిన సినిమాలను రెండు మూడేళ్ల తరువాత రీ రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
ఓ సినిమా 20 రోజులకు మించి థియేటర్లలో కనిపించడమే కష్టంగా మారిపోయింది. అలాంటి సమయంలో ఓ డబ్బింగ్ సినిమాను రీ రిలీజ్ చేయడమంటే సాహసం అనే చెప్పాలి. ఇటీవల బాహుబలి 2కు ముందు బాహుబలి తొలి భాగాన్ని రిలీజ్ చేసినా పెద్దగా కలెక్షన్లు రాలేదు. మరి ఈ నెల 6న రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా మన్యంపులి రీ రిలీజ్లో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.