అదిరిపోయే కాంబినేషన్ కుదిరింది. తమిళ స్టార్ హీరో సూర్య నటించనున్న సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. కేవీ ఆనంద్ ఈ సినిమాకు డైరెక్టర్. కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ‘అసోసియేషన్ ఆఫ్ మళయాలం మూవీ ఆర్టిస్ట్స్’ 25వ వార్షికోత్సవంలో ఒకే స్టేజ్‌పై కనిపించిన సూర్య, మోహన్‌లాల్ ఇప్పుడు ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.
‘‘నా నెక్ట్స్ చిత్రంలో లవ్లీ హీరో మోహన్‌లాల్, చార్మింగ్ స్టార్ సూర్య కలిసి నటించబోతున్నారు’’ అన్నారు దర్శకుడు కేవీ ఆనంద్. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా జూన్ ఆఖరులో సెట్స్‌పైకి వెళ్లనుందని కోలీవుడ్ టాక్. ఢిల్లీ, హైదరాబాద్, లండన్ ప్రాంతాల్లో షూటింగ్ జరపాలనుకుంటున్నారు. ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎన్‌జీకే’ చిత్రంలో నటిస్తున్నారు సూర్య. ఇందులో సాయిపల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలు.
Comments
Please login to add a commentAdd a comment