బాక్సాఫీస్ పులి | Pulimurugan Telugu version Manyam Puli releas today | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్ పులి

Published Thu, Dec 1 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

బాక్సాఫీస్ పులి

బాక్సాఫీస్ పులి

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘పులి మురుగన్’. వైశాఖ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో 100 కోట్ల పైగా వసూళ్లు సాధించింది. ఆ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. శ్రీసరస్వతి ఫిల్మ్స్ అధినేత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ‘మన్యం పులి’ పేరుతో నేడు తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఆయన మాట్లాడుతూ- ‘‘కేరళ, వియత్నాం పరిసరాల్లో రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. పీటర్ హెయిన్స్ ఫైట్స్ హైలెట్. మోహన్‌లాల్, పులి కాంబినేషన్‌లో తీసిన ఫైట్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. పిల్లలతో పాటు పెద్దలకూ నచ్చే అంశాలున్నాయి. మలయాళంలోలానే తెలుగు వారు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement