సాధారణంగా విలన్ అంటే చులకనభావంతో చూస్తారు. కానీ, నా కోసమే ‘నాన్నకు ప్రేమతో’లో పాత్రను గౌరవంగా చూపించానని సుకుమార్ ఓసారి చెప్పారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో నన్ను హీరో కంటే బాగా చూస్తున్నారు’’ అన్నారు జగపతిబాబు. మోహన్‌లాల్ హీరోగా, ఆయన విలన్‌గా నటించిన ‘మన్యం పులి’ గత శుక్రవారం విడుదలైంది. జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘మలయాళ ప్రేక్షకులు నన్ను నా పేరుతో కాకుండా ఈ చిత్రంలో చేసిన ‘డాడీ గిరిజ’ పాత్ర పేరుతో పిలుస్తున్నారు. అంత మంచి పేరొచ్చింది.