పులితో పోరాటం | Pulimurugan set to release in Telugu as Manyam Puli | Sakshi
Sakshi News home page

పులితో పోరాటం

Published Thu, Oct 27 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

పులితో పోరాటం

పులితో పోరాటం

‘‘అటవీ సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తాడు అతను. వెదురు బొంగులు విక్రయిస్తుంటాడు. వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లినప్పుడు పలు జంతువులతో ముఖ్యంగా పులులతో పోరాడాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఆసక్తికరం’’ అని నిర్మాత ‘సింధూరపువ్వు కృష్ణారెడ్డి’ అన్నారు. మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా జగపతిబాబు కీలక పాత్రలో వైశాఖ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పులి మురుగన్’.

మలయాళంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘మన్యం పులి’ పేరుతో కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సౌత్ ఇండియాలో ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్‌లో హిట్ అయిన చిత్రం ‘పులి మురుగన్’. డబ్బింగ్, పాటల రికార్డింగ్ పూర్తయింది. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement