మళ్లీ తెరపై... కమలిని
‘ఆనంద్’తర్వాత తెలుగు తెరపై దూసుకెళ్లిన కమలినీ ముఖర్జీ జోరు ఈ మధ్య తగ్గింది. ఇప్పటివరకూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి కమలిని దాదాపు పాతిక సినిమాల పైనే చేశారు.
అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు రాకపోవడం వల్లే కమలిని ఎక్కువగా సినిమాలు చేయడం లేదని ఊహించవచ్చు. ఈ నేపథ్యంలో ఆరేడేళ్ల విరామం తర్వాత తమిళంలో ఓ సినిమా అంగీకరించారామె.
‘పిజ్జా’తో మోస్ట్ వాంటెడ్ డెరైక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రూపొందనుంది. ఇందులో ఎస్.జె. సూర్య సరసన కమలిని జతకట్టనున్నారు. విజయ్ సేతుపతి, అంజలి తదితరులు నటించనున్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, కమలినివి కీలక పాత్రలట! దీనికి ‘ఇరవై’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.