కాజోల్
ఎవరికైనా కాలేజీని ఎంచుకునే చాన్స్ ఉంటుంది కానీ క్లాస్‌మేట్స్‌ని ఎంచుకునే చాన్స్ రాదు. ఒకవేళ ఈ చాన్స్ వస్తే మీరు ఎవర్ని కోరుకుంటారు అని కాజోల్‌ని అడిగితే.. ‘‘నా భర్త అజయ్ దేవగన్, షారుక్ ఖాన్‌ను నా క్లాస్‌మేట్స్‌గా కోరుకుంటా. వాళ్లు నాలాగే క్లాస్‌లో బ్యాక్ బెంచ్‌లో కూర్చొని అల్లరి చేసే టైప్. బట్ ఆమిర్‌ఖాన్ నా క్లాస్‌మేట్‌గా వద్దనిపిస్తోంది. ఎందుకంటే అతను టీచర్‌కి క్లోజ్‌గా ఉండే టైప్. మా బ్యాచ్‌లో ఆమిర్ ఉంటే మాపై టీచర్‌కు కంప్లైట్ చేస్తాడు. అందుకే అతను వద్దు (నవ్వుతూ)’’ అన్నారు. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో కాజోల్ ముఖ్య పాత్రలో నటించిన ‘హెలికాప్టర్ ఈల’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా కాజోల్ ఈ విషయాలను చెప్పారు. కొడుకు చదువుకునే కాలేజీలో చేరి ఆమె కూడా డిగ్రీ పూర్తి చేసే ఓ మదర్ క్యారెక్టర్‌లో కాజోల్ నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment