సన్నబడ్డ స్వీటీ! | Anushka Brother with selfie | Sakshi
Sakshi News home page

సన్నబడ్డ స్వీటీ!

Published Mon, May 16 2016 10:58 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

అన్నయ్యతో ఓ సెల్ఫీ - Sakshi

అన్నయ్యతో ఓ సెల్ఫీ

చక్కనమ్మ ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. బొద్దుగా ఉన్నా, ముద్దుగానే అనిపిస్తుంటుంది. స్లిమ్‌గా ఉన్నా స్వీట్‌గా అనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా అనుష్కను చెప్పొచ్చు. ‘సైజ్ జీరో’కి ముందు స్లిమ్‌గా ఉన్న అనుష్క అందర్నీ ఆకట్టుకుంటే, ఆ చిత్రంలో బొద్దుగా కనిపించి కూడా ఆకట్టుకున్నారు. ఆ సినిమా తర్వాత బరువు తగ్గే పనిలో పడ్డారామె. నాన్‌స్టాప్‌గా కసరత్తులు చేసిన స్వీటీ (అనుష్క ముద్దు పేరు) ఎట్టకేలకు సన్నబడ్డారు. ‘నేను సన్నబడ్డానోచ్’ అని అనుష్క చెప్పకపోయినా.. ఫేస్‌బుక్‌లో ఆమె పెట్టిన ఓ ఫొటో ఆ విషయాన్ని తెలియజేసింది.

షూటింగ్‌కి కాస్త గ్యాప్ దొరకడంతో అనుష్క తన సొంతూరు బెంగళూరు వెళ్లారు. అక్కడ తన అన్నయ్యతో కలిసి దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టారు అనుష్క. ఆ ఫొటో చూస్తే ముద్దుగుమ్మ మునుపటిలా ఉన్నట్లు తెలుస్తోంది కదూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement