అనుష్క సెల్ఫీలు చూస్తే.. | tollywood anushka posted selfies with family on face book | Sakshi
Sakshi News home page

అనుష్క సెల్ఫీలు చూస్తే..

Published Wed, May 18 2016 10:55 AM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM

అనుష్క సెల్ఫీలు చూస్తే.. - Sakshi

అనుష్క సెల్ఫీలు చూస్తే..

మూతి  మూడు వంకర్లు తిప్పి,  రకరకాల  హావభావాల సెల్ఫీ ఫోజులతో సెల్పీలకే కొత్త అర్థాన్నిస్తున్న విభిన్నమైన ఫోటోలను మనం  సోషల్ మీడియాలో తరచూ  చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో కుర్రకారు,   బ్యూటీలు,  సెలబ్రిటీలు,   హీరోహీరోయిన్లనే తారతమ్యం లేదు. ఎవ్వరూ తక్కువ తినడంలేదు. మేము సైతం అంటూ సెల్ఫీలతో పిచ్చెక్కించడం  మామూలే. ఇపుడు ఈ కోవలోకి తాజాగా టాలీవుడ్  సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా చేరిపోయింది. అవును... సాధారణంగా సోషల్ మీడియా హల్ చల్  కి దూరంగా ఉండే ఈ బొమ్మాళి సెల్పీలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.   వినయం, అభినయం కలగలుపుతో అరవిచ్చిన అందం అనుష్క రీసెంట్‌గా తన ఫేస్ బుక్ పేజ్‌లో అమ్మ, నాన్న ,అన్నయ్య, కజిన్‌లతో కలిసి విచిత్ర హావభావాలతో సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేఈ గాడ్జియస్ బ్యూటీ ఫోటోలు వైరల్ అయ్యాయి.
 
వరుస అవకాశాలతో బిజీగా ఉండే  అనుష్క కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలను ఫ్యామిలీ టైమ్, ఫన్ టైం..అంటూ షేర్ చేసింది. మాంచి రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నప్పటి  తన చిలిపి, చిలిపి  సెల్ఫీలను పోస్ట్ చేసింది. కాగా  అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో తన టాలెంట్ ను నిరూపించకున్న ఈ సైజ్ జీరో   హీరోయిన్  ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్‌ షూటింగ్ లో బిజీగా ఉంది.  మరోవైపు చిరంజివి ప్రతిష్టాత్మక 150వ సినిమాలో  మెగాస్టార్ తో జతకట్టేందుకు అనుష్క  దాదాపు  సైన్ చేసిందనేది  టాలీవుడ్  టాక్.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement