అనుష్క రికార్డ్ కోటి! | New Record of Anushka Facebook in Flowers hike! | Sakshi
Sakshi News home page

అనుష్క రికార్డ్ కోటి!

Published Tue, Dec 8 2015 12:34 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

అనుష్క రికార్డ్ కోటి! - Sakshi

అనుష్క రికార్డ్ కోటి!

ఇక్కడ చెప్పుకున్న ఉత్తరాది తారల్లా అనుష్క ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో లేరు. సామాజిక మాధ్యమం పట్ల ఆమెకు ఆసక్తి లేదు. అయితే, ఓ అభిమాని ఫేస్‌బుక్‌లో అనుష్క పేరుతో ఓ పేజి ప్రారంభిస్తానంటే, అతని అభ్యర్థనను కాదనలేక ఆమె అంగీకరించారు. అయితే, ఆ ఫేస్‌బుక్‌లో పొందుపరిచే విషయాలన్నీ పాజిటివ్‌గానే ఉండాలని నిబంధన విధించారు. అందాల తార కోరిన మీదట ఆ పేజీని పాజిటివ్ వేలోనే తీసుకువెళుతున్నారు.

ఈ ఫేస్‌బుక్‌లో వచ్చే అప్‌డేట్స్ అన్నీ అనుష్క చేయకపోయినా ఆమె మీదున్న అభిమానంతో అభిమానులందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పటికి ఈ పేజీనీ ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య కోటికి పైగా ఉండటం విశేషం. అనుష్క మీద ఉన్న అభిమానానికి ఇది నిదర్శనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement