స్లిమ్‌గా..హ్యాండ్సమ్‌గా..
స్లిమ్‌గా..హ్యాండ్సమ్‌గా..
Published Sun, Jul 17 2016 9:23 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
సాగర్‌నగర్ (విశాఖపట్నం): ‘స్మార్ట్‌సిటీలో సిటిజనుల లైఫ్‌సై్టల్స్ మారుతున్నాయి. నడివయస్కులు సైతం ఫిట్‌నెస్ కావాలని కోరుకుంటున్నారు. అందానికి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఉపాధికి ఉన్నత స్థాయి ఎదుగుదలకూ ఫిట్‌నెస్,హ్యాండ్సమ్‌గా ఉండటం కీలకమే. విమానం మోసినా..తాము మోయలేమంటూ ఓవర్ వెయిట్ కారణాన్ని చూపుతూ కొంతకాలం క్రితం ఎయిర్ ఇండియా 125 మంది క్యాబిన్‌క్రూ సిబ్బందిని తొలగించింది. అలాంటి ప్రొఫెషన్స్‌లో ఊబకాయం ఉపాధికే ఎసరు పెడుతోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఫిట్‌లెస్‌గా ఉండటం అనేది జాబ్ కెరీర్‌ను కూడా ఒడిదుడుకులకు గురి చేస్తోంది’.దీంతో విశాఖ కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ కావాలంటే నైతిక విలువలతోపాటు, లైఫ్‌సై్టల్, ఫిట్‌నెస్ కాస్త అవసరమని సూచిస్తున్నాయి.
నగరంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న రేష్మా 13 కేజీల బరువు తగ్గారు. హెల్తీ ఫైమ్ అనే వెయిట్ లాస్ యాప్‌తో నాలుగు నెలల్లో తగ్గించుకున్న బరువుతో తన ఉద్యోగ బాధ్యతలు మరింత చురుగ్గా నిర్వర్తించగలుగుతున్నారు. పైకి ప్రకటించినప్పటికీ పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులు ఫిట్‌గా ఉండడాన్ని ఖచ్చితంగా కోరుకుంటున్నాయి. తద్వారా కంపెనీ ప్రొఫైల్ మెరుగుపడటంతోపాటు ఉద్యోగుల పనితీరు సైతం పదునెక్కుతుందని భావిస్తున్నాయి అని రేష్మా చెప్పారు.
క్రమశిక్షణకు శరీరమే సూచిక
ఫిట్‌నెస్ లేకపోవడం శరీరంపై క్రమశిక్షణ లేకపోవడంగా కంపెనీల అధిపతులు, కార్పొరేట్ సర్కిల్స్ భావిస్తున్నాయి. తనపై తాను శ్రద్ధ చూపలేని వ్యక్తులు కంపెనీ ఎదుగుదలపై కూడా చూపలేరని ఈ వర్గాలు నమ్ముతున్నాయి. ‘ఉద్యోగంలో చేరినప్పుడు చాలా ఫిట్‌గా ఉండి ఆ తర్వాత ఒబెసిటీ బాధితులుగా మారిన వారు కెరీర్‌పరంగా ఎదుగుదలకు నోచుకోకపోవడం నేను గమనించా’ అని ఐటీ సెజ్‌లోని ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగి సౌజన్య చెప్పారు.
నగరంలో పెరుగుతున్న వ్యాయామశాలలు
అందం, ఆరోగ్యం, శరీరాకతికి నేటి యువతరం అత్యంత ప్రాధాన్యత పొందడానికి నగరంలో జిమ్ సెంటర్లు విస్తరిస్తున్నాయి. ఫిట్‌గా తయారవ్వాలనే తలంపుతో సూర్యుడు ఉదయించక ముందే యువతీ,యువకులు జిమ్ సెంటర్ల వద్ద వాలిపోతున్నారు. అత్యాధునిక పరికరాలతో చెమటలు పట్టేంత వరకు కుస్తీలు పడుతున్నారు. వీరి ఆసక్తికి తగ్గట్టుగా జిమ్ సెంటర్లు, అటు పురుషులకు, ఇటు మహిళలకు శిక్షణలు ఇచ్చే సెంటర్లు ఆకట్టుకుంటున్నాయి. విశాలాక్షినగర్, సాగర్‌నగర్, ద్వారకానగర్, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, దొండపర్తి తదితర ప్రాంతాల్లో కార్పొరేట్ జిమ్‌లు దర్శనమిస్తున్నాయి. ఇవి కాకుండా వుడా ఏర్పాటు చేసిన హెల్త్ ఎనారీ, ఆర్కేబీచ్ వంటి ప్రాంతాల్లో ఫిట్‌నెస్ కోసం వ్యాయామం చేస్తున్నారు.
ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది
స్లిమ్‌గా తయారవ్వాలంటే ముఖ్యంగా పొట్టను తగ్గించాలి. సిక్స్‌ప్యాక్ కావాలనుకునే వారు, ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం తపించే వారు ఆహారం విషయంలో కొద్ది జాగ్రత్తలు పాటించాలి.
ఉదయం జిమ్‌కు బయలుదేరే ముందు తేనే, నిమ్మరసం తీసుకోవడం వల్ల కొవ్వు ఏర్పడదు.
వ్యాయామం పూర్తయ్యాక ఉడకబెట్టిన గుడ్డు, గ్లాసు పాలు తీసుకోవాలి. ఆర్థికస్తోమతను బట్టి డ్రైఫ్రూట్స్ తీసుకుంటే మరీ మంచిది.
–మ«ధ్యాహ్నం భోజనంలో కూరగాయలతోపాటు, సాంబార్, పెరుగు ఉండేలా చూసుకోవాలి.
రాత్రి భోజనంగా చపాతి తీసుకోవడం శ్రేయస్కరం. ఆలుగడ్డ, నెయ్యి,పెరుగు,అరటిపండు, తీసుకుంటే బాగుంటుంది.
వారంలో ఒక్కసారైనా చికెన్ లేదా చేపలను ఆహారంగా తీసుకోవాలి.
ఫిట్‌నెస్‌కు యోగా
నగరంలో వయసు, హోదాలతో నిమిత్తం లేకుండా యోగాపై ఆసక్తి చూపుతున్నారు. కార్పొరేట్ ఉద్యోగులు, ఉన్నతస్థాయి నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం యోగాసనాలతో సంతప్తి చెందుతున్నారు. తమ శరీరా ఆకతులను, ఆరోగ్యకరంతో ఫిట్‌నెస్‌గా కన్పించాలని తపన ఎక్కువగా కన్పిస్తుంది. అందుకు వారికి అందుబాటులో ఉన్న యోగా, జిమ్ ఇతర వ్యాయామశాలలకు పరుగులు దీస్తున్నారు. ముఖ్యంగా యోగాతోనే మంచి ఫిట్‌నెస్, ఆరోగ్యం లభిస్తోంది.
–సింధుసాయి, విశాలాక్షినగర్, అంతర్జాతీయ యోగాకారుడు
Advertisement
Advertisement