స్లిమ్‌గా మారిన నటి విద్యాబాలన్‌..ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..! | Vidya Balan's Weight Loss Transformation Inspiring For Many | Sakshi
Sakshi News home page

స్లిమ్‌గా మారిన నటి విద్యాబాలన్‌..ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!

Published Sun, Jun 16 2024 4:21 PM | Last Updated on Sun, Jun 16 2024 4:29 PM

Vidya Balan's Weight Loss Transformation Inspiring For Many

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. కొన్నాళ్లు కాస్తా బొద్దుగా తయారయ్యి..సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలారోజుల తర్వాత బాలీవుడ్‌ నటుడు కార్తీక్‌ ఆర్యన్‌ నటించిన చందు ఛాంపియన్‌ మూవీ ప్రదర్శనకు హాజరైన విద్యాబాలన్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా ఆమె లుక్‌ అంతా మారిపోవడంతో..ఇంతలా స్లిమ్‌గానా అంటూ.. అందరి చూపులు ఆమెపైనే. 

చెప్పాలంటే ఈ కార్యక్రమంలో విద్యాబాలన్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడంతా విద్య నాజుగ్గా మారడమే హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో విద్య సోదరి కుమారుడు కూడా వచ్చాడు. ఆమె బ్లాక్‌ డ్రస్‌లో ఓ రేంజ్‌ స్టన్నింగ్‌ లుక్‌తో కనిపించింది. గోల్డెన్‌ కలర్‌ చెవుపోగులు, లైట్‌ మేకప్‌తో గ్లామరస్‌గా ఉంది. అంతేగాదు ఫిట్‌గా ఉండాలని కోరుకునేవారికి స్ఫూర్తిగా ఉంది విద్య. మల్లెతీగలా కనిసిప్తున్న ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటని ఆరాతీస్తున్నారు. అయితే విద్య అంతలా స్లిమ్‌ అవ్వడానికి ఎలాంటి వర్కౌట్‌లు చేసిందంటే..

  • ప్రతి రోజు వ్యాయమం చేసే అవకాశం లేకపోయిన కనీసం రన్నింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్, వాకింగ్‌ వంటివి చేయడం

  • కూల్‌డ్రింగ్స్‌,  అధిక చక్కెర గల పళ్ల రసాలతో సహా టీ, కాఫీలకు దూరంగా ఉండటం

  • రోజంతా హైడ్రేషన్‌గా ఉండేలా నీళ్లు బాగా తాగేదని, ఇది ఆకలిని కంట్రోల్‌ చేసేందుకు ఉపకరించిందని వ్యక్తిగత ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. 

  • అలాగే రోజుకి ఏడు నుంచి తొమ్మిది గంటలు మంచిగా నిద్రపోవడం. నాణ్యమైన నిద్ర ఉంటే ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.

  • ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినడం వంటివి చేయాలి. దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది. 

  • టీవీ, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లుకు దూరంగా ఉండటం వంటివి చేస్తే..ఎవ్వరైనా..ఇట్టే బరువు తగ్గిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చెయ్యండి.

(చదవండి:  చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement