కనస్ట్రక్షన్‌కి టెక్నాలజీ కూడా తోడవ్వడంతో విభిన్న ఆకృతిలో భవనాలను నిర్మిస్తున్నారు అధికారులు. అవి నగరానకి స్పెషల్ ఐకాన్‌గా నిలిస్తున్నాయి. అబ్బా ఎలా నిర్మించారు దీన్ని అని ఆశ్చరయపోయేలా వాటిని నిర్మిస్తున్నారు. అలానే చేప ఆకృతిలో భవనాన్ని నిర్మించి వాటే ఏ బిల్డింగ్ ఇది అను ముక్కునవేలేసుకునేలా చేశారు నిర్మాణకారులు. ఎక్కడుందంటే ఈ భవనం..?
ఈ ఫిష్ బిల్డింగ్ హైదరబాద్ ఉంది. దీన్ని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయంగా చేప ఆకృతిలో నిర్మించారు. స్థానికంగా దీన్ని ఫిష్ బిల్డింగ్ అనిపిలుస్తారు. ఈ బిల్డింగ్‌కి స్ఫూర్తి..1992లో పూర్తి అయిన బార్సిలోనా ఫ్రాంక్ గెహ్రీ స్మారక ఫిష్ శిల్పం. దాన్ని చూసి ఇలా చేప ఆకారంలో బిల్డింగ్‌ని నిర్మించడం జరిగింది. ఈ భవనం మిమెటిక్ ఆర్కిటెక్చర్‌కు ఒక ఉదాహరణ.
చేప రూపంలో మొత్తం బిల్డింగ్ కార్యచరణ అంశాలను కలుపుతుంది. దీని ప్రవేశ ద్వారం రెండు మెట్లపై ఉన్న గుడారంలా ఉంటుంది. రెండు వృత్తాకరా అద్దాలు చేప కళ్లులా కనిపిస్తాయి. మొత్తం భవనం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో కప్పబడి, మధ్యలో నీలిరంగు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. అంతేగాదు ఆ బిల్డింగ్‌కి ఉన్న బ్లూ-పర్పుల్ స్పాట్‌లైట్‌లు రాత్రిపూట భవనాన్ని ప్రకాశించేలా చేస్తాయి. చూడటానికి ఈ ఫిష్ బిల్డింగ్ ఓ'జెయింట్ ఫిష్' హైదరాబాద్‌లో ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది.
(చదవండి: రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్‌గా..రీజన్ వింటే షాకవ్వుతారు!)
Comments
Please login to add a commentAdd a comment