బెబో బరువు అలా తగ్గిందా?! | Kareena Kapoor Khan to Sue Medical Brand for False Advertising | Sakshi
Sakshi News home page

బెబో బరువు అలా తగ్గిందా?!

Published Wed, May 13 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

బెబో బరువు అలా తగ్గిందా?!

బెబో బరువు అలా తగ్గిందా?!

గాసిప్
జీరో సైజు అందాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ ప్రేక్షకులకు రుచి చూపించిన ఘనత కరీనాది. మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది కానీ... ఆ తర్వాత తగ్గి తగ్గి తీగలా తయారయ్యింది. నాటి నుంచి నేటి వరకూ ఆ ఫిగర్‌ని అలా మెయింటెయిన్ చేస్తూనే వచ్చింది. ఆమె నాజూకు అందాల వెనుక రహస్యం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అదిగో... ఆ ఆసక్తినే క్యాష్ చేసుకోవాలని చూసింది ఓ మందుల కంపెనీ. ఇటీవల ఓ వెబ్‌సైట్‌లో ఒక యాడ్ ప్రత్యక్షమయ్యింది.

కరీనా స్లిమ్‌నెస్‌కి కారణం తామేనంటూ ఓ మందుల కంపెనీ గొప్పలు పోయింది. తాము ఒక పిల్ తయారు చేశామని, అది వేసుకునే కరీనా పదమూడు కిలోలు తగ్గిందని  ఆ యాడ్ సారాంశం. అది చూసి అవాక్కయిన కరీనా... తన అందానికి కారణం మందులు కాదని, తన అలవాట్లు, వర్కవుట్లేనని తేల్చి చెప్పింది. తన అనుమతి లేకుండా తన పేరు వాడుకున్నందకు ఆ కంపెనీ మీద కేసు వేయడానికి సిద్ధపడుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement