ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు అప్పుడప్పుడు బల్లల మీదే తలవాల్చి కునుకుతీసే సందర్భాలు మామూలే! ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. మధ్యాహ్నంపూట కాస్త కునుకు తీస్తే, మెదడు చురుకుదేరి పనితీరు మెరుగుపడుతుందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతున్నారు. అయినా, పనివేళల్లో ఉద్యోగులు కునుకుతీయడానికి తగిన ఏర్పాట్లు ఏ ఆఫీసులోనూ కనిపించవు.
జపాన్‌లోని కొన్ని సంస్థలు పనివేళల్లో కునుకుతీయడానికి ఉద్యోగులకు అవకాశం కల్పించడానికి నడుం బిగించాయి. ఇందుకోసం ఇలా ‘నిద్రాపేటికలు’ (స్లీప్‌బాక్సెస్) తయారు చేశాయి. పని మధ్యలో ఎవరికైనా నిద్రవస్తే, నిరభ్యంతరంగా వీటిలోకి దూరిపోయి, నిలబడే కునుకు తీసుకోవచ్చు. వీటిలో కునుకుతీసేటప్పుడు తల, మోకాళ్లు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment