
జెన్–జడ్ అనగానే ‘డైనమిక్ నేచర్’ అంటారు. అంతమాత్రాన అంతా సవ్యంగా ఉన్నట్లు కాదు. జెన్–జడ్ ఉద్యోగులు సరిచేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జెన్–జడ్‌లో ప్రొఫెషనలిజం లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు నిపుణులు...
క్వాయిట్ క్విట్టింగ్
యువ ఉద్యోగులకు సంబంధించి నిశ్శబ్ద నిష్క్రమణ (క్వాయిట్ క్విట్టింగ్) భారతీయ పరిశ్రమలలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది పరిశ్రమ నిర్వాహకులలో ఆందోళనను పెంచుతుంది. ‘ఉద్యోగం అంటే కాలేజికి ఎక్స్‌టెన్షన్ కాదు. ప్రొఫెషనలిజం అవసరమని చాలామందికి అర్థం కావడం లేదు.
వివిధ రంగాల డైనమిక్స్‌పై కూడా అవగాహన కొరవడింది. ప్రతి రంగానికి ఒకే రకమైన పని అవసరాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. జెన్–జడ్ ఉద్యోగుల ప్రవర్తనను కూడా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు టీమ్‌లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీతి శర్మ.
జెన్ జడ్ అలా కాదు...
పాత తరం ఉద్యోగులు, జెన్–జడ్ ఉద్యోగులకు మధ్య ఉన్న తేడా ఏమిటి? ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ‘మౌనమే మంచిది’ అన్నట్లుగా ఉండేవాళ్లు. జెన్–జడ్ అలా కాదు...తమ అసమ్మతిని బహిరంగంగా చెప్పడానికి వెనకాడడం లేదు. పని ప్రమాణాలు, అవసరాల విషయంలో యువతరానికి, పాతతరానికి ఎంతో తేడా ఉంది. ‘పని మాత్రమే జీవితం అని యువతరం అనుకోవడం లేదు. పనికి మించిన జీవితం ఉందనే విషయం వారికి తెలుసు.
అయితే దీన్ని పాతతరం అంగీకరించం కష్టం’ అంటుంది దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్ దివిజా బాసిన్. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన దివిజకు 2.6 లక్షలకు పైగా ఫాలోవర్‌లు ఉన్నారు. ‘హార్డ్ వర్క్’ను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది అంటారు ఆమె. అయితే ఇది చిత్రానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు యువతలోని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి.
స్కిల్ గ్యాప్
ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ ట్రేడ్ బాడీ నాస్కామ్ నివేదిక ప్రకారం టెక్ రంగంలో ఆరు లక్షల మంది నిపుణుల కొరత ఉంది. ప్రస్తుతం ఉన్న ‘స్కిల్ గ్యాప్’ సమస్యకు సులువైన పరిష్కార మార్గాలు లేకపోయినప్పటికీ యువత కార్పొరేట్ వాతావరణానికి అలవాటు పడటానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్క్స్‌పై పరిశ్రమలు మరింత దృష్టి పెట్టే అవసరం ఉంది. రిక్రూట్‌మెంట్‌కు వచ్చే కంపెనీలు విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయని దిల్లీకి చెందిన ఒక టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ హెడ్ చెప్పారు.
కష్టమే సుమీ!
అమెరికాకు చెందిన రెజ్యూమ్‌బిల్డర్.కామ్ నిర్వహించిన సర్వేలో 74 శాతం మంది మేనేజర్‌లు, బిజినెస్ లీడర్లు జెన్ జడ్‌తో పనిచేయడం కష్టమని చెప్పారు. స్కిల్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం భారతీయ గ్రాడ్యుయేట్లలో 51 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు.
నేషనల్ ఎంప్లాయిబిలిటీ రిపోర్ట్ ఫర్ ఇంజనీరింగ్ ప్రకారం 80 శాతం మంది భారతీయ ఇంజనీర్‌లకు అవసరమైన నైపుణ్యాలు లేవు. అందుబాటులో ఉన్న ప్రతిభావంతులను నియమించుకోవడం తప్ప కంపెనీలకు మరో మార్గం కనిపించడం లేదు.
(చదవండి: