కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం | Workplace Shooting kills 2 in Southern California | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 30 2017 8:35 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Workplace Shooting kills 2 in Southern California - Sakshi

కాలిఫోర్నియా : అగ్రరాజ్యం మరోసారి కాల్పులతో ఉలిక్కి పడింది. కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సౌత్‌ కాలిఫోర్నియా, నార్త్‌ లాంగ్‌ బీచ్‌లోని న్యాయ సిబ్బంది కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది.

లాంగ్‌ బీచ్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండస్థుల ఆ భవనంలో న్యాయవాదుల కార్యాలయాలు ఉన్నాయి. మధ్యాహ్నాం సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో లోపలికి వెళ్లి కాల్పులు జరపటంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది కూడా. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్వాట్‌ బృందం అక్కడికి చేరుకుంది. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఇద్దరిని కాల్చాక తనని తాను కాల్పుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

తొలుత కాల్పుల ఘటనపై ప్రకటించిన పోలీసులు.. తర్వాత సవరించుకుని హత్యగా ప్రకటించారు. నిందితుడు అక్కడే పని చేసే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. పాత గొడవలతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు, బాధితుడి పేర్లు తెలియరాలేదు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement