భారత్‌లో బాధపడుతున్న ఉద్యోగులు ఎందరంటే.. | Gallup 2024 report reveals 14% of Indian employees are thriving, 86% are struggling | Sakshi
Sakshi News home page

భారత్‌లో బాధపడుతున్న ఉద్యోగులు ఎందరంటే..

Published Wed, Jun 12 2024 3:02 PM | Last Updated on Wed, Jun 12 2024 3:18 PM

Gallup 2024 report reveals 14% of Indian employees are thriving, 86% are struggling

భారత్‌లో వందలో 86 మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారని ‘గల్లుప్‌ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్‌ప్లేస్’ నివేదిక వెల్లడించింది. మిగతా 14 శాతం మంది వృత్తిపరంగా నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో ఉన్న 34 శాతం ఉద్యోగులతో పోలిస్తే తక్కువ.

గల్లుప్‌ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్‌ప్లేస్ నివేదిక రూపొందించేందుకు ఉద్యోగులను మూడు కేటగిరీలు(అభివృద్ధి చెందుతున్న, కష్టపడుతున్న, బాధపడుతున్న ఉద్యోగులు)గా విభజించినట్లు తెలిపారు. ప్రస్తుత వృత్తిజీవితంతోపాటు భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నవారిని అభివృద్ధి చెందుతున్నవారిగా పరిగణించారు. దీనికి విరుద్ధంగా వృత్తిలో ప్రతికూల వాతావరణాన్ని అనుభవిస్తున్నవారు, రోజువారీ ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలను ఎదుర్కొంటున్నవారిని ‘కష్టపడుతున్న, బాధపడుతున్న’ కేటగిరీలోకి చేర్చారు.

నివేదికలోని వివరాల ప్రకారం..భారత్‌లో 86 శాతం మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారు. 14 శాతం మంది వృత్తిపరంగా తాము నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో 34 శాతం ఉద్యోగులున్నారు. దక్షిణాసియాలో ఇలా అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో 15 శాతం ఉద్యోగులున్నారు. నేపాల్‌ ఇది 22 శాతంగా ఉంది. శ్రీలంకలో అత్యధికంగా 62 శాతం, ఆఫ్ఘనిస్తాన్‌లో 58 శాతం ఉద్యోగులు రోజువారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఇది 32 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?

ఇదిలాఉండగా, పనిఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉద్యోగులు మంచి వ్యాపకాలను అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ యాజమాన్యాలు టార్గెట్లు పూర్తి చేయాలనే ధోరణిలో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులపై ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఇతర మంచి మార్గాలను ఎంచుకోవాలని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం, మ్యూజిక్‌ వినడం, వృత్తిపరంగా కొత్త కోర్సులు నేర్చుకోవడం..వంటివి పాటించాలని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement