Indian employees
-
భారత్‌లో బాధపడుతున్న ఉద్యోగులు ఎందరంటే..
భారత్‌లో వందలో 86 మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారని ‘గల్లుప్ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్‌ప్లేస్’ నివేదిక వెల్లడించింది. మిగతా 14 శాతం మంది వృత్తిపరంగా నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో ఉన్న 34 శాతం ఉద్యోగులతో పోలిస్తే తక్కువ.గల్లుప్ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్‌ప్లేస్ నివేదిక రూపొందించేందుకు ఉద్యోగులను మూడు కేటగిరీలు(అభివృద్ధి చెందుతున్న, కష్టపడుతున్న, బాధపడుతున్న ఉద్యోగులు)గా విభజించినట్లు తెలిపారు. ప్రస్తుత వృత్తిజీవితంతోపాటు భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నవారిని అభివృద్ధి చెందుతున్నవారిగా పరిగణించారు. దీనికి విరుద్ధంగా వృత్తిలో ప్రతికూల వాతావరణాన్ని అనుభవిస్తున్నవారు, రోజువారీ ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలను ఎదుర్కొంటున్నవారిని ‘కష్టపడుతున్న, బాధపడుతున్న’ కేటగిరీలోకి చేర్చారు.నివేదికలోని వివరాల ప్రకారం..భారత్‌లో 86 శాతం మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారు. 14 శాతం మంది వృత్తిపరంగా తాము నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో 34 శాతం ఉద్యోగులున్నారు. దక్షిణాసియాలో ఇలా అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో 15 శాతం ఉద్యోగులున్నారు. నేపాల్ ఇది 22 శాతంగా ఉంది. శ్రీలంకలో అత్యధికంగా 62 శాతం, ఆఫ్ఘనిస్తాన్‌లో 58 శాతం ఉద్యోగులు రోజువారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఇది 32 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?ఇదిలాఉండగా, పనిఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉద్యోగులు మంచి వ్యాపకాలను అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ యాజమాన్యాలు టార్గెట్లు పూర్తి చేయాలనే ధోరణిలో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులపై ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఇతర మంచి మార్గాలను ఎంచుకోవాలని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, వృత్తిపరంగా కొత్త కోర్సులు నేర్చుకోవడం..వంటివి పాటించాలని సూచిస్తున్నారు. -
గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు
దేశీయ కంపెనీల ఉద్యోగులు ఈ సంవత్సరం సగటున 10 శాతం ఇంక్రిమెంట్లు పొందారు. ఆర్థిక అనిశ్చిత భయాలతో లేఆఫ్‌లు, ఒడిదుడుకులతో 2023 సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంక్రిమెంట్లు డబుల్ డిజిట్ శాతం వైపు పయనాన్ని ప్రారంభించాయని నౌకరీ డాట్‌కామ్ (Naukri.com)నిర్వహించిన సర్వే పేర్కొంది. నౌకరీ డాట్‌కామ్ సర్వే ప్రకారం.. ఈ ఏడాది ప్రతి 10 మంది ఉద్యోగులలో కనీసం ఆరుగురు 10 శాతం కంటే ఎక్కువగా ఇంక్రిమెంట్లు పొందారు. కనిష్టంగా కాస్త తక్కువే ఉన్నప్పటికీ అసాధారణ పనితీరు ఉన్న ఉద్యోగులు 20 నుంచి 25 శాతం ఇంక్రిమెంట్ పొందారు. ఈ సర్వేలో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. తమ కంపెనీలు ఏప్రిల్ మార్చి మదింపు చక్రాన్ని అనుసరిస్తున్నాయని 56 శాతం మంది చెప్పారు. బ్యాంకింగ్, తయారీ రంగాల్లో అధికంగా.. జాబ్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం వేతన పెంపు వేవ్ ఆశాజనకంగా ఉందని నౌకరీ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు. ఏప్రిల్-మార్చి వేతన పెంపులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల ఉద్యోగులదే అత్యధిక వాటా. వీరిలో చాలా మంది 10 నుంచి 20 శాతం ఇంక్రిమెంట్లు అందుకున్నారు. ఇంక్రిమెంట్ల శాతంలో హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ రంగాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు గతేడాది కంటే మెరుగైన వేరియబుల్స్, బోనస్‌ల చెల్లింపులు ఈ ఏడాది పొందారు. ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు -
పొదుపు సూత్రం మర్చిపోతున్న భారతీయ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విప్లవం, పాశ్చాత్య ధోరణి ప్రభావంతో వ్యక్తుల ఆదాయానికి, ఖర్చుకు మధ్య పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. పేరుకే ఉద్యోగం.. చివరికి మిగిలేది అప్పే అన్నట్లుగా ఉద్యోగుల పరిస్థితి దిగజారింది. సంపాదనకు తగిన విధంగా పొదుపు చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిధుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. అకస్మాత్తుగా లే–ఆఫ్‌లు వస్తే కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని దుస్థితిలో భారతీయ ఉద్యోగులు ఉండటం శోచనీయం. ఉద్యోగం కోల్పోతే నెల కూడా ఉండలేరు.. 75 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఎటువంటి పొదుపు మొత్తాన్ని దాచుకోవట్లేదని దేశీయ ఆర్థిక, పెట్టుబడి, స్టాక్ మార్కెట్ కోర్సులు, రీసెర్చ్ టూల్స్ సంస్థ ఫినాలజీ తాజా సర్వేలో వెల్లడించింది. మూడు లక్షల మంది భారతీయ ఉద్యోగుల నుంచి ‘ఇండియాస్ మనీ హ్యాబిట్స్’ పేరిట డేటాను సేకరించింది. దీని ప్రకారం.. ఉన్నపళంగా ఉద్యోగం కోల్పోతే ప్రతి నలుగురిలో ఒకరు ఒక నెలపాటు కూడా పరిస్థితులను తట్టుకోలేరని వెల్లడించింది. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆరోగ్య బీమా లేదని.. ఆనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు ఎదురైతే పరిస్థితి అగమ్యగోచరమేనని తెలిపింది. భద్రత పాలసీలకు దూరంగా.. ఇక దేశంలో కొంతమేర పెరిగిన అవగాహన, కంపెనీల్లో తప్పనిసరి కావడంవల్ల 30–40 ఏళ్ల వయస్సు ఉద్యోగులు బీమా పాలసీలను తీసుకుంటే.. 20–30 ఏళ్ల వయస్సు వారి బీమా పాలసీ స్కోరు చాలా దారుణంగా ఉందని నివేదిక పేర్కొంది. అధిక ఆర్జన కారణంగా విలాసవంతమైన జీవనశైలిపై ఎక్కువ ఖర్చుచేయడం వారి ప్రధాన అంశంగా మారిపోయిందని.. ఫలితంగా పొదుపు సూత్రాన్ని పాటించడమే లేదని సర్వే కుండబద్దలు కొట్టింది. ప్రతీ ఆరుగురు భారతీయ ఉద్యోగుల్లో కనీసం ఒకరికి కూడా ఎటువంటి పాలసీ కవరేజీ లేకపోవడం భవిష్యత్తు ఆలోచనకు దూరంగా ఉండటమేనని చెప్పింది. క్రిటికల్ ఇల్‌నెస్‌లో 69 శాతం మందికి, ప్రమాదవశాత్తూ మరణిస్తే 65 శాతం మందికి సరైన భరోసా దక్కట్లేదని గుర్తించింది. ఈ క్రమంలోనే కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే 68 శాతం మంది స్టాక్‌మార్కెట్లు నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. 15 రోజులకే జీతం ఖాళీ.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఉద్యోగుల జీతం 15 రోజులకే ఖాళీ అయిపోతున్నట్టు తెలిపింది. అలాగే.. ♦ ఇక్కడ నలుగురిలో ఒకరు రోజుకు వచ్చే జీతం కంటే ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. ♦ ఆరుగురిలో ఒకరు తమ వద్ద ఉన్నదాని కంటే రెండు రెట్లు బాకీ ఉన్నారు. ♦ ఈఎంఐలు కట్టడానికి డబ్బులు అందుబాటులో లేకుంటే మెజారిటీ ఉద్యోగులు స్టాక్స్ వెనక్కి తీసుకుంటుంటే.. 24శాతం మంది ఈఎంఐలు కట్టడానికే తిరిగి రుణాలు తీసుకుంటున్నారు. ♦ ఐదు శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. ♦ 15 శాతం మంది ఈఎంఐలు కట్టలేక ఎగ్గొడుతున్నట్లు సర్వే వెల్లడించింది. అప్పుల ఊబిలో.. మరోవైపు.. ప్రతీ ఐదుగురు భారతీయ ఉద్యోగుల్లో ఇద్దరు ఎప్పటికీ అప్పుల ఊబి నుంచి తప్పించుకోలేరని నివేదిక హెచ్చరించింది. 27 శాతం మంది ప్రస్తుతం అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతుండగా 68 శాతం మంది పదవీ విరమణ ప్రణాళిక లేకుండా గడిపేస్తున్నారని ప్రస్తావించింది. ఇక 53 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు చూసుకుంటున్నారని.. 36 శాతం మంది పెన్షన్ ఫండ్స్, 7 శాతం మంది అద్దె వస్తుందని, నాలుగు శాతం మంది తమ పిల్లలు చూసుకుంటారనే ధీమాలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. -
జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్.. బట్ నో టెన్షన్.. కోవిడ్ తెచ్చిన మార్పు
సాక్షి, అమరావతి: మానసిక ప్రశాంతత లేని కొలువుల్లో పనిచేసేది లేదని భారతీయ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. ఇందుకోసం అధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. కోవిడ్–19 తర్వాత ఉద్యోగులు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించారు. అమెరికా ఆధారిత వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ సంస్థ యూకేజీ నిర్వహించిన సర్వేలో.. భారతదేశంలో 88 శాతం మంది ఉద్యోగులు మానసిక క్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు నివేదించింది. ఒత్తిడి లేని ఉద్యోగాల్లో తక్కువ జీతానికైనా పని చేసేందుకు వెనుకాడటం లేదని వెల్లడించింది. ఇదే అమెరికాలో 70 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయంతో పోలిస్తే భారత్‌లోనే ఈ అభిప్రాయం గల ఉద్యోగులు అధికంగా ఉండటం విశేషం. భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోని ఉద్యోగాల్లో వర్క్‌ఫోర్స్, ప్రోత్సాహకాలు, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. కుటుంబానికే తొలి ప్రాధాన్యం భారతీయ ఉద్యోగుల్లో ఇటీవల కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రాధాన్యతలో తీవ్ర మార్పు వచ్చింది. 46 శాతం మంది ఉద్యోగం కంటే కుటుంబమే తొలి ప్రాధాన్యం అని అభిప్రాయపడుతున్నట్టు సర్వేలో తేలింది. రెండో స్థానంలో 37 శాతం మంది పని (ఉద్యోగం).. ఆ తర్వాతే ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, వ్యాయామం, స్నేహితులతో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే, ఇక్కడ చాలామంది ఉద్యోగులు తమ ఆందోళనలను మేనేజర్లతో పంచుకునేందుకు వెనుకాడుతున్నట్టు చెప్పింది. భారత్‌లో 51 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ప్రతి వారం తమ మేనేజర్‌తో పనిభారంపై చర్చిస్తుండగా.. 30 శాతం మంది నెలకు ఒకసారి కూడా మాట్లాడలేకపోతున్నారని నివేదించింది. ఒత్తిడి ఇంత పని చేస్తోందా! 33% భారతీయ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ గంటలు గడపటం పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. దీనివల్ల 34 శాతం మందిలో గతంతో పోలిస్తే పని గంటలు పెరగడంతో ఏకాగ్రత కోల్పోతున్నట్టు గుర్తించింది. 31 శాతం మందిలో సహాద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించలేని పరిస్థితి కనిపించింది. మిగిలిన వారిలో పని ఉత్పాదకత, సామర్థ్యం కొరవడుతున్నట్టు తేల్చింది. ఉద్యోగానికి ఉండే డిమాండ్, హార్డ్ వర్క్ చేయాలనే తపన కూడా ఒత్తిడికి కారణంగా పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ‘ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఉండాలి. అప్పుడు వారు మెరుగ్గా పని చేయగలుగుతారు. సాంకేతిక వనరులపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఉద్యోగులపై కొంతమేర ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇది ఆ సంస్థ స్థిరత్వానికి ఎంతో దోహదం చేస్తుంది’ అని యూకేజీ ఇండియా కంట్రీ మేనేజర్ సుమిత్ దోషి చెప్పారు. -
ఇల్లు.. ఆఫీసు.. రెండూ కావాలి!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి పీడ వదలి కొన్ని నెలలవుతోంది. ఇంతకాలం ఇంట్లోంచే పనిచేసుకునే సౌకర్యం అనుభవించిన వారు మళ్లీ ఆఫీసుల బాట పడుతున్నారు. బాగానే ఉంది కానీ.. ఇంతకీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలని అనుకుంటున్నారా? లేక రెండేళ్లుగా ఉన్నట్లే వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగితే బాగుండు అనుకుంటున్నారా? అంటే.. రెండూ కొంత ఉంటే మేలని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు కంప్యూటర్ తయారీ సంస్థ హెచ్‌పీ చెబుతోంది! ఉద్యోగుల మనసు తెలుసుకునేందుకు హెచ్‌పీ ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం భారతీయ ఉద్యోగులు కనీసం 92 శాతం మంది ఉద్యోగులు హైబ్రిడ్ మోడల్ అంటే వారంలో కొన్ని రోజులు ఆఫీసు, మిగిలిన రోజులు ఇంట్లో అన్న పద్ధతికి జై కొట్టారు. దీనివల్ల కుటుంబం, ఉద్యోగాల మధ్య సమతౌల్యత సాధించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. ఈ హైబ్రిడ్ పద్ధతి వల్ల ఉత్పాదకత కూడా పెరుగుతుందని చెప్పారు. కాకపోతే హైబ్రిడ్ పద్ధతికి ఉపయోగపడేలా మరికొన్ని టెక్నాలజీలు ఉద్యోగులకు అందుబాటులోకి రావాలని అభిప్రాయపడ్డారు. సర్వేలో భాగంగా హెచ్‌పీ 10 వేల మందిని ప్రశ్నించగా ఇందులో వెయ్యిమంది భారత్‌కు చెందిన వారు ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారి వయసు 18 ఏళ్ల నుంచి 50్జట పైబడి ఉండగా అందరూ వేర్వేరు రంగాలకు చెందినవారే. ఉద్యోగం చేసే వారితోపాటు పార్ట్ టైమ్ ఉద్యోగులు, సొంత వ్యాపారాలు ఉన్నవారూ ఉన్నారు. హైబ్రిడ్ పద్ధతి ఉంటే అదే కంపెనీలో...!! ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. హైబ్రిడ్ పద్ధతిలో పనిచేసుకునే అవకాశం ఉంటే.. తాము ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలోనే కొనసాగుతామని సర్వే చేసిన వారిలో 88 శాతం మంది చెప్పడం! సర్వేలో పాల్గొన్న వారు తాము వారంలో రెండు మూడు రోజులపాటు ఆఫీసులకు వెళ్లేందుకు అభ్యంతరమేమీ లేదని చెప్పడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే భవిష్యత్తులో ఈ హైబ్రిడ్ పద్ధతి కొనసాగే అవకాశం ఉందని సంస్థలు అంచనా వేస్తున్నాయి, ఈ కొత్త పద్ధతికి అలవాటుకు తగ్గట్టుగా తమని తాము మార్చుకోవాల్సి వస్తుందని హెచ్‌పీ ఇండియా మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ కేతన్ పటేల్ తెలిపారు. హైబ్రిడ్ మోడల్ ఉద్యోగుల వృత్తి, వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకునే అవకాశం కల్పిస్తుందని, సౌకర్యవంతంగానూ ఉంటుందని ఆయన చెప్పారు. అంతా బాగుందనే ఫీలింగ్ ఉద్యోగుల్లో కల్పిస్తుందని, అన్నింటి కంటే ముఖ్యంగా కంపెనీలు ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అన్నది తెలుసుకునేందుకు తద్వారా ఉత్పాదకత పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తుందని ఆయన వివరించారు. ఉద్యోగులు తమ ప్రాథమ్యాలేమిటో గుర్తిస్తున్నట్లు సర్వే ద్వారా స్పష్టమవుతోందని, సంస్థలు కూడా ఉద్యోగుల అంచనాలకు తగ్గట్టుగా తమ విధానాలను మార్చుకోవడం, కొత్త టూల్స్‌ను సిద్ధం చేస్తూండటం గమనార్హమని తెలిపారు. -
ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!
500 Indian Employees Just Turned Crorepatis: భారత సంతతికి చెందిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ సంస్థ నాస్డాక్లో లిస్టింగ్ చేసిన ఒక్కరోజులోనే కంపెనీల షేర్లు 32 శాతం మేర పెరిగాయి. నాస్డాక్ ట్రేడింగ్‌లో బుధవారం రోజున ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ షేర్లు 47.55 డాలర్ల వద్ద ముగిశాయి. కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 13 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా ఫ్రెష్‌వర్క్స్ కంపెనీలోని సుమారు 500 మంది భారతీయ ఉద్యోగులు ఒక్కరోజులోనే కోటీశ్వరులైనారని కంపెనీ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృబూతం వెల్లడించారు. అందులో సుమారు 70 మంది ఉద్యోగులు 30 ఏళ్ల లోపు వారే. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా సుమారు 4300 ఉద్యోగులున్నారు. సుమారు 76 శాతం మంది ఉద్యోగులు ఫ్రెష్‌వర్క్స్ షేర్లను కలిగి ఉన్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...! నాస్డాక్ స్టాక్ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేసిన భారతీయ సాఫ్ట్వేర్ సంస్థగా ఫ్రెష్‌వర్క్ నిలిచింది. ఫ్రెష్ వర్క్స్ సంస్థను 2010లో భారత్‌లో గిరీష్ మాతృబూతం, షాన్ కృష్ణసామి స్థాపించారు. కస్టమర్లకు మరింత దగ్గరవ్వడం కోసం కొద్ది రోజుల క్రితమే భారత్ నుంచి అమెరికాకు ఫ్రెష్‌వర్క్స్‌ను యాజమాన్యం తరలించింది. ఇప్పుడు కాలిఫోర్నియాలోని శాన్ మేటియోలో, చెన్నైలో గణనీయమైన ఉద్యోగులను ఫ్రెష్‌వర్క్స్ కలిగి ఉంది. ఆక్సెల్ , సీక్వోయా క్యాపిటల్ వంటి పెట్టుబడిదారుల నుండి నిధులను ఫ్రెష్‌వర్క్స్ సేకరించింది. ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి డజనుకు పైగా నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన భారతీయ కంపెనీలలో ఫ్రెష్‌వర్క్స్ ఒకటిగా నిలవనుంది,. 1999లో నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన మొదటి భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ తన పేరిట ఆ రికార్డు కలిగి ఉంది. చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ కంపెనీ -
ఐటీ ప్రొఫెషనల్స్‌కు ట్రంప్ షాక్
న్యూయార్క్ : ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానం సత్ఫలితాలు ఇస్తోందని అమెరికా స్పష్టం చేసింది. అమెరికాలో పనిచేసేందుకు నైపుణ్యాలతో కూడిన భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపకరించే హెచ్1బీ వీసాల ఆమోదం 2018లో పది శాతం తగ్గిందని అమెరికన్ అధికారులు వెల్లడించారు. 2018 ఆర్ధిక సంవత్సరంలో నూతన, రెన్యూవల్ కలుపుకుని 3.35 లక్షల హెచ్-1బీ వీసాలకు అమెరికన్ పౌరసత్వ, వలస సేవల (యూఎస్సీఐఎస్) విభాగం ఆమోదం తెలపగా 2017లో ఈ సంఖ్య 3.73 లక్షలు కావడం గమనార్హం. 2017లో హెచ్1బీ వీసాలకు ఆమోదం రేటు 93 శాతం నుంచి 2018లో 85 శాతానికి తగ్గిందని గణాంకాలు వెల్లడించాయి. హెచ్1బీ వీసాలపై ట్రంప్ యంత్రాంగం చేపట్టిన నియంత్రణల ప్రభావం ఈ గణాంకాలపై అధికంగా ఉందని వలస విధాన సంస్థ విశ్లేషకులు సారా పీర్స్ వ్యాఖ్యానించారు. నైపుణ్యాలతో కూడిన ప్రొఫెషనల్స్‌ను హెచ్1బీ వీసా ద్వారా అమెరికన్ కంపెనీలు హైర్ చేస్తున్నాయి. -
హెచ్–1బీ భాగస్వాములకు ఊరట
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ యంత్రాగం వెల్లడించింది. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడ పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబాలకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయ్యింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ప్రకటించింది. ‘హెచ్–4 వీసాల మీద వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే అంశంపై జూన్ వరకు ఏ నిర్ణయం తీసుకోం. ఈ నిర్ణయం దేశంపై ఆర్థికంగా ఎటువంటి ప్రభావం చూపుతుందనే దాన్ని పరిశీలించాల్సి ఉంది. అప్పటి వరకు హెచ్–1బీ భాగస్వాముల ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు’ అని డీహెచ్ఎస్ వెల్లడించింది. 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి భార్యలు/భర్తలు అమెరికాలోని వివిధ కంపెనీల్లో హెచ్–4 డిపెండెంట్ వీసాల కింద పనిచేసేందుకు అవకాశం కల్పించింది. దాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి తొలగిస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పుడు హెచ్–4 వీసాదారుల తొలగింపుపై నిర్ణయం తీసుకోలేదని అందుకు కొద్దిగా సమయం పడుతుందని తాజాగా ట్రంప్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విధానంలో గణనీయమైన మార్పులు చేయాలని.. వాటిని ఆర్థికపరంగా కూడా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని డీహెచ్ఎస్ పేర్కొంది. ఇందుకు మరికొన్ని వారాలు పడుతుందని తెలిపింది. -
కాంగ్రెస్‌కు ‘గ్రీన్‌కార్డు’ ప్రతిపాదనలు
వాషింగ్టన్: గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు వరంలా భావిస్తున్న ప్రతిభ ఆధారిత వలస విధానం ప్రతిపాదనల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ కాంగ్రెస్‌కు పంపారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులు గ్రీన్‌కార్డులు త్వరగా పొందేందుకు తాజా వలస విధానం ఉపయోగకరమని అంచనావేస్తున్నారు. అయితే భారతీయ ఐటీ నిపుణులు ఎంతో ముఖ్యంగా భావించే హెచ్–1బీ వీసాల ప్రస్తావన ప్రతిపాదనల్లో లేకపోవడం గమనార్హం. అలాగే వలసదారుల జీవిత భాగస్వామి, పిల్లలకు మాత్రమే గ్రీన్‌కార్డు అవకాశం కల్పిస్తూ తల్లిదండ్రులు, సోదరులు, సోదరిలకు అమెరికాలో నివసించే అవకాశాన్ని నిరాకరించారు. అమెరికాకు తమ కుటుంబసభ్యుల్ని తీసుకురావాలని ఆశపడుతున్న వేలాది మంది భారతీయ– అమెరికన్లకు మాత్రం ఈ నిర్ణయం శరాఘాతమని భావిస్తున్నారు. 70 సూత్రాల ప్రతిభ ఆధారిత వలస విధాన ప్రతిపాదనను ట్రంప్ ఆదివారం అమెరికన్ కాంగ్రెస్‌కు పంపుతూ పలు సూచనలు చేశారు. తాజా వలస విధానం అమెరికా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత వలస విధానం దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేదు. నైపుణ్యం ఆధారంగా కాకుండా వలసదారుల కుటుంబసభ్యులు అమెరికాకు వచ్చేందుకు అనుకూలంగా ఉంది. దశాబ్దాలుగా తక్కువ నైపుణ్యమున్న వలసదారులకు అవకాశం ఇవ్వడం వల్ల అమెరికాలో వేతనాలు తగ్గాయి. నిరుద్యోగం పెరిగింది. అలాగే అమెరికా వనరులకు నష్టం జరిగింది’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాయింట్లు ఆధారంగా గ్రీన్‌కార్డులు మంజూరు చేయాలని, ప్రస్తుతమున్న లాటరీ పద్ధతిని రద్దు చేయాలని ఆయన కోరారు. ప్రతిభ ఆధారిత వలస విధానం అమెరికా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు రక్షణ కల్పిస్తుందని, గొలుసుకట్టు వలస విధానానికి ముగింపు పలకడంతో పాటు, కొత్తవారికి అవకాశం కల్పించవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనల్లో కేవలం శాశ్వత వలసదారులు, అక్రమ వలసదారుల గురించే ట్రంప్ ప్రస్తావించారు. వృత్తి నిపుణులకు, అమెరికా విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే వారికి ఇచ్చే తాత్కాలిక హెచ్1–బీ వీసాల అంశాన్ని ప్రస్తావించలేదు. వారితో అమెరికన్లకు నష్టం: ట్రంప్ అలాగే అమెరికాలో నివసిస్తున్న 8 లక్షల మంది డ్రీమర్ల అంశంపై కూడా కాంగ్రెస్‌కు సూచనలు చేశారు. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌వుడ్ అరైవల్స్ (డీఏసీఏ) అంశం పరిష్కారానికి రూపొందించే ఏ చట్టంలోనైనా సంస్కరణల్ని తప్పకుండా చేర్చాలని ట్రంప్ కోరారు. సంస్కరణలు అమలు చేయకపోతే అక్రమ వలసలతో అమెరికన్ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు నష్టం చేకూరుతుందన్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పడు తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్)ను అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ.. గత నెల్లో వారి వర్క్ పర్మిట్లను ట్రంప్ రద్దుచేశారు. గ్రీన్‌కార్డు వస్తే చాలు.. అమెరికాకు హెచ్–1బీ వీసా లేదా మరో ఉద్యోగ వీసాపై వెళ్లినవారు... ఆ దేశంలో స్థిరపడాలనుకుంటే మొదట శాశ్వత నివాసితుడి హోదా (గ్రీన్‌కార్డు) పొందాలి. గ్రీన్‌కార్డు వస్తే.. ఇక వీసాతో పని ఉండదు. గ్రీన్‌కార్డు వచ్చిన ఐదేళ్లకు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు/పౌర సత్వం ఉన్నవాళ్లు తమ కుటుంబసభ్యులకు గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా 4,80,000 మందికి డిపెండెంట్ విభాగంలో గ్రీన్‌కార్డులిస్తారు. అలాగే శాశ్వత ఉద్యోగుల కోటాలో ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తారు. కాగా, ట్రంప్ జాబితాలో అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధుల అంశం కూడా ఉంది. 30 పాయింట్లు సాధిస్తేనే.. గ్రీన్‌కార్డు కేటాయింపునకు చదువు, వయ సు, ఆంగ్ల ప్రావీణ్యం, జీతాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ప్రతిపాదించారు. వీటి ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 పాయింట్లను అర్హతగా నిర్ణయించారు. పాయింట్లు అధికంగా ఉన్నవారికే గ్రీన్‌కార్డులిస్తారు. ట్రంప్ ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. గ్రీన్‌కార్డుల్ని సీనియారిటీ ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఇస్తారు. గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ ప్రతిపాదనలు వరం కానున్నాయి. అమెరికాలో భారత టెకీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ప్రస్తుతం గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారు 12 ఏళ్లకుపైగా వేచి ఉండాల్సి వస్తోంది. ఏడాదికి ఒక దేశానికి (ఆ దేశ పౌరులకు) జారీచేసే గ్రీన్‌కార్డులపై పరిమితి ఉన్నందున భారతీయుల దరఖాస్తులు భారీగా పోగు పడుతున్నాయి. కొత్త విధానంతో భారతీయులకు వీలైనంత త్వరగా గ్రీన్‌కార్డులు వస్తాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఆమోదం పొందాక తదుపరి ఆర్థిక సంవ త్సరం నుంచి అమల్లోకి వస్తుంది. -
సొంత వ్యాపారానికే యువతరం సై...
న్యూఢిల్లీ: ఆరంకెల వేతనం అందుకుంటూ హాయిగా బతికేస్తే పోలా... అనుకునే ఆలోచనను యువతరం వదిలించుకుంటున్నది. తమతో పాటు మరికొందరికి ఉపాధి చూపుతూ పైపైకి ఎదగాలని యువత ఉవ్విళ్లూరుతున్నట్టు ఓ సర్వే తేల్చింది. భారత ఉద్యోగుల్లో వాణిజ్యవేత్త కావాలనే తాపత్రయం ఎక్కువగా ఉన్నట్టు రాండ్‌స్టాడ్ వర్క్ మానిటర్ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకోనే అభిలాష సగటున 53 శాతంగా ఉండగా, భారత ఉద్యోగుల్లో 83 శాతం మంది ఈ ఆలోచనతో ఉన్నారు. సొంత బిజినెస్ ప్రారంభించేందుకే ఉద్యోగాలను విడిచిపెడుతున్నామని 56 శాతం మంది చెప్పారు. వ్యాపారానికి సానుకూల వాతావరణం నెలకొనడం, ఎఫ్‌డీఐ పరిమితులు పెంచడం, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో యువత వ్యాపారాలను ఎంచుకుంటున్నారని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ, సీఈఓ పౌల్ డుపిస్ తెలిపారు. యువతతో పోలిస్తే 45-54 మధ్య వయసు కలిగిన ఉద్యోగులు సొంత వ్యాపారం చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. వీరిలో కేవలం 37 శాతం మంది మాత్రమే వ్యాపారాలకు ఓటేశారు. 35 నుంచి 44 సంవత్సరాల లోపు ఉద్యోగులు 61 శాతం మేర సొంత వ్యాపారాలే మేలని చెప్పారు. ఇక 25 నుంచి 34 ఏళ్ల యువ ఉద్యోగుల్లో ఏకంగా 72 శాతం మంది సొంత వ్యాపారాలు చేపట్టడానికి ఆసక్తి కనబరిచారని సర్వే తేల్చింది. భారత్‌లో స్టార్టప్‌ను ప్రారంభించేందుకు ప్రస్తుత వాతావరణం ప్రోత్సాహకరంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 86 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. -
భారతీయ ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్
చెన్నై : అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యుషన్స్ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. ఈబీ2, ఈబీ3 మార్గాల్లో గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తులను నింపడం లేదని కాగ్నిజెంట్ స్పష్టంచేసింది. తర్వాత నోటీసు వచ్చేంతవరకు ఈ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఈ రెండు కేటగిరీల్లో ప్రస్తుత దరఖాస్తుదారులకు మాత్రమే మద్దతు ఇస్తామని, కొత్త వాటిని సస్పెండ్ చేస్తామని పేర్కొంది. స్థానిక ఉద్యోగులను పెంచే ఉద్దేశ్యంతోనే కాగ్నిజెంట్ ఈ ప్రక్రియను నిలిపివేస్తుందని టెక్ విశ్లేషకులంటున్నారు. దీంతో భారతీయ ఉద్యోగులు గ్రీన్ కార్డులు పొందడం కష్టతరమేనని పేర్కొంటున్నారు. తమ వ్యూహాత్మక వ్యాపార లక్ష్యాల్లో భాగంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో భాగమయ్యే అంతర్గత వ్యవహారాలను, ప్రయోజనాలను ఎప్పడికప్పుడూ అంచనావేస్తూ ఉంటున్నామని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్ లో కాగ్నిజెంట్ స్పష్టంచేసింది. దీనిలో భాగంగానే తదుపరి నోటీసు వచ్చేంతవరకు గ్రీన్ కార్డు ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ను నింపడం లేదని పేర్కొంది. అసోసియేట్లకు శాశ్వత నివాసం కల్పించేందుకు ఓ ముఖ్యమైన స్పాన్సర్ గా కాగ్నిజెంట్ ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందని మరోవైపు నుంచి కంపెనీ చెబుతోంది. అయితే కాగ్నిజెంట్ ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ప్రక్రియను నిలిపివేయడం శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు భారీ షాకేనని తెలుస్తోంది. అసాధారణమైన ప్రతిభ కనబర్చే సీనియర్ మేనేజ్ మెంట్ లేదా ప్రొఫిషినల్స్ కు గ్రీన్ కార్డు కోసం ఈబీ1 రూట్ వాడతారు. ఈబీ2, 3 వీసాలను ప్రతిభావంతులైన వర్కర్లు, ప్రొఫిషనల్స్ కు, మధ్య, దిగువ స్థాయి ఉద్యోగులకు వాడతారని డేవిస్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ మార్క్ డేవిస్ తెలిపారు. ఇటీవల వెలువరించిన ఫలితాల్లోనే కాగ్నిజెంట్ హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించనున్నట్టు పేర్కొంది. గతేడాది కంటే సగానికి తక్కువగా ఈ ఏడాది వీసాలను అప్లయ్ చేసింది. అమెరికా డెలివరీ సెంటర్లలో ఈ ఐటీ సంస్థ స్థానిక నియామకాలను పెంచింది. -
వీసా చట్టం.. భారత్ పై ప్రతికూల ప్రభావం!
సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఏమిటీ చట్టం? ‘అధిక నైపుణ్య సరళత, నిష్పాక్షికత చట్టం’ను అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇది వలస ఉద్యోగుల కోసం హెచ్-1బి వీసాలను స్పాన్సర్ చేసే సంస్థలు.. ఆ ఉద్యోగులకు 1.30 లక్షల డాలర్ల కనీస వార్షిక వేతనం చెల్లించటం తప్పనిసరి చేసే చట్టం. ప్రస్తుతం 60 వేల డాలర్లుగా ఉన్న ఈ కనీస వేతనాన్ని ఏకంగా 200 శాతం పెంచాలని ఇందులో ప్రతిపాదించారు. ప్రభావం ఎవరిపై? అమెరికా ఉద్యోగాల మార్కెట్లోకి విదేశీ ఉద్యోగుల వరదను అరికట్టడం ద్వారా.. అమెరికన్ల ప్రయోజనాలను పరిరక్షించడం ఈ సంస్కరణల లక్ష్యం. అమెరికా ప్రతి ఏటా 85,000 హెచ్-1బి వీసాలు జారీ చేస్తుంది. అందులో 60 శాతం దరఖాస్తులు భారతీయులవే. ఉన్నత డిగ్రీల కోసం అమెరికా వలస వెళ్లే భారత విద్యార్థులు, విదేశీ ప్రాజెక్టుల కోసం ఉద్యోగులను పంపించే భారత టెక్ కంపెనీలపై ఈ చట్టం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. భారత్‌పై ప్రభావం ఎలా? ఈ చట్టం ఇంకా ఆమోదం పొందకముందే.. భారత మార్కెట్లపై ప్రభావం చూపింది. ప్రధాన టెక్ కంపెనీల షేర్ల విలువల పడిపోయాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ సంస్థలకు గట్టి దెబ్బతగిలింది. అంతేకాదు.. ఈ చట్టం ఫలితంగా అమెరికా యూనివర్సిటీలపై భారత విద్యార్థుల ఆసక్తి కూడా సన్నగిల్లి.. మేధో వలస తగ్గే అవకాశం ఉంటుంది. అమెరికా వీసాను తిరస్కరిస్తారా? నిజంగా విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులకు సంబంధించినంత వరకూ తిరస్కరించరు. అలాగే.. ఎఫ్-1 విద్యార్థి వీసా హోదా నుంచి చట్టబద్ధ శాశ్వత నివాసానికి ఒక వారధిని కూడా నెలకొల్పాలని ఈ చట్టంలో ప్రతిపాదించారు. కాబట్టి.. దరఖాస్తుదారుకు అమెరికా వలసరావాలన్న ఉద్దేశం ఉందన్న ఏకైక కారణం ప్రాతిపదికగా వీసాలను తిరస్కరించడం జరగదు. ఓ-1 (అసాధారణ సామర్థ్యం), పీ (క్రీడాకారులు, కళాకారులు, వ్యాపారవేత్తలు), స్వేచ్ఛా వాణిజ్య వీసాదారులకు కూడా ఇది వర్తిస్తుంది. బిల్లు ఆమోదం పొందుతుందా? అమెరికా కాంగ్రెస్ ఉభయసభలు – సెనేట్, ప్రతినిధుల సభ – రెండిట్లోనూ రిపబ్లికన్ల ఆధిక్యం ఉండటంతో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. అదీగాక.. ఈ బిల్లును ప్రవేశపెట్టింది కాలిఫోర్నియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు కావడం గమనార్హం. ఈ బిల్లు ఆమోదం పొందితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. అమెరికన్లకు ఎలా ప్రయోజనం? హెచ్-1బి వీసా పొందడానికి కనీస వేతనం భారీగా పెంచడం వల్ల.. విదేశీ ఉద్యోగులను అమెరికాలో నియమించే భారతీయ సంస్థలపై భారం పెరుగుతుంది. తద్వారా అవి అమెరికాలో స్థానికంగానే ఎక్కువ నియామకాలు చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. భారత పరిశ్రమ ప్రాధాన్యత ఎంత? నాస్కామ్ అంచనాల ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారత హెచ్-1బి, ఎల్-1 వీసాదారుల వాటా ఏటా 100 కోట్ల డాలర్లు ఉంటుంది. భారత ఐటీ రంగం అమెరికాలో 4 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. తద్వారా అమెరికాకు ఏటా 500 కోట్ల డాలర్ల మేర పన్నులు అందిస్తున్నాయి. -
ఐటీపై ట్రంప్ పిడుగు
అన్నంత పనిచేసిన అమెరికా అధ్యక్షుడు హెచ్–1బీ వీసాలపై ఉక్కుపాదం అమెరికా ప్రతినిధుల సభలో హెచ్–1బీ వేతన సవరణ బిల్లు వీసాదారుల కనీస వేతనం 60 వేల నుంచి 1.30 లక్షల డాలర్లకు పెంపు అలా చెల్లించకుంటే అమెరికన్లనే నియమించాలంటూ నిబంధన 50 కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు వీసాలు బంద్ హెచ్–1బీ వీసాల్లో 20 శాతం స్టార్టప్ కంపెనీలకు.. బిల్లు ఆమోదం పొందితే భారత ఐటీకి శరాఘాతమే వాషింగ్టన్: అంతా భయపడ్డట్టే జరిగింది! భారత ఐటీపై ట్రంప్ పిడుగు పడింది!! వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచానికి వరుస షాక్‌లు ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వీసా బాంబు పేల్చారు. భారత ఐటీ ఉద్యోగులు, కంపెనీల్ని టార్గెట్ చేస్తూ హెచ్–1బీ వీసాలపై పలు కఠిన నిబంధనలు విధించారు. ఈ మేరకు రూపొందించిన బిల్లును మంగళవారం అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం... హెచ్–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల వేతనాన్ని రెండింతలు పెంచాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో తక్కువ వేతనాలకు పనిచేస్తున్నవారి స్థానంలో తప్పనిసరిగా అమెరికన్లనే నియమించాలి. ఈ బిల్లును అమెరికన్ కాంగ్రెస్‌లోని ఉభయ సభలు ఆమోదిస్తే భారత ఐటీ రంగానికి శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు. ఏమిటా బిల్లు.. అందులో ఏముంది? ‘ద హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్‌నెస్ యాక్ట్ 2017’పేరుతో ఈ బిల్లును రూపొందిం చారు. దీన్ని కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యురాలు జోయ్ లోఫ్గ్రెన్ మంగళవారం అమెరికాలో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రకారం.. హెచ్–1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న వారికి ఏడాదికి కనీసం లక్షా 30 వేల డాలర్లు (దాదాపు రూ.88 లక్షలు) చెల్లించాలి. ప్రస్తుతం హెచ్–1 బీ వీసాదారులకు కనీస వేతనం 60 వేల డాలర్లు(రూ.40.80 లక్షలు)గా ఉంది. 1989 నుంచి ఈ మొత్తంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు ఏకంగా 200 శాతం వేతనం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలకే మార్కెట్ ఆధారంగా వీసాలు కేటాయించాలని బిల్లులో పొందుపరిచారు. తక్కువ వేతనం చెల్లింపు నిబంధనను తొలగించాలని ప్రతిపాదించారు. బిల్లు ఆమోదం పొందితే...? ఒకవేళ ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే వార్షిక వేతనం లక్షా 30 వేల డాలర్ల కంటే తక్కువ పొందే విదేశీ ఐటీ ఉద్యోగులకు ఇక్కట్లు తప్పవు. వారిని తొలగించి వారి స్థానాల్లో అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని బిల్లులో పేర్కొన్నారు. ఇక 50 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు పనిచేసే చిన్న కంపెనీలకు 20 శాతం వీసా కోటాను కూడా తొలగిస్తారు. కంపెనీల్లో ఏవైనా ఖాళీలుంటే హెచ్–1బీ, ఎల్–1 వీసాదారుల కంటే ముందుగా నిపుణులైన అమెరికన్లనే పరిగణలోకి తీసుకోవాలి. చట్టం అమలులో మోసం, దుర్వినియోగం జరిగితే కార్మిక విభాగం, హోం ల్యాండ్ భద్రతా విభాగాలు విచారణకు రంగంలోకి దిగుతాయి. ఈ మేరకు వాటికి అదనపు అధికారాలు కట్టబెట్టారు. అలాగే బిల్లులో పేర్కొన్న నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానాలు కూడా పెంచుతారు. ఆ వీసాలు అమెరికన్ల ఉద్యోగాల భర్తీకి కాదు.. బిల్లుపై కాంగ్రెస్ సభ్యుడు లోఫ్గ్రెన్ మాట్లాడుతూ... ‘‘హెచ్–1బీ పథకం ఏర్పాటు అసలు లక్ష్యంపై దృష్టి పెట్టేందుకు నేను ప్రవేశపెట్టిన బిల్లు దోహదం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులు, నిపుణుల్ని ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. అమెరికా మానవ వనరులకు లబ్ధి చేకూర్చడంతో పాటు కొత్త ఉద్యోగాల కల్పనలో అధిక వేతనం పొందే నైపుణ్యవంతులు ఉపయుక్తంగా ఉంటారు. హెచ్–1బీ వీసాలు అమెరికన్ల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాదు’’అని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా... ఎక్కువ జీతం చెల్లించేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా మార్కెట్ ఆధారిత పరిష్కారం సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. అలాగే అమెరికన్ కంపెనీలు వారికి అవసరమైన ప్రతిభావంతుల్ని ఎంపిక చేసుకోవచ్చన్నారు. అమెరికన్ల ఉద్యోగుల జీతాల్లో కోతపెట్టే, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ప్రోత్సహించే కంపెనీలకు ప్రోత్సహకాలు తొలగించాలని కూడా బిల్లులో సూచించారు. దేశాలకు వీసా పరిమితులు తొలగిపోతాయి వర్క్ వీసాల సంఖ్యపై దేశాలకు విధించిన పరిమితి ఈ బిల్లుతో తొలగిపోనుంది. ఈ మేరకు లోఫ్గ్రెన్ వెల్లడించారు. ‘‘వర్క్ వీసాలపై పరిమితి తొలగిపోతుంది. అందువల్ల ఉద్యోగుల ఎంపికలో మరింత నిష్పాక్షికంగా ఉండొచ్చు. జాతీయత ఆధారంగా కాకుండా ప్రతిభను బట్టి ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు’’అని ఆమె వివరించారు. హెచ్–1బీ వీసాల్లో 20 శాతం స్టార్టప్‌లకు కేటాయించాలని బిల్లులో రూపొందించారు. ఈ నిర్ణయం చిన్న కంపెనీలు ప్రతిభావంతుల కోసం పోటీపడేందుకు అవకాశం కల్పిస్తుందని లోఫ్గ్రెన్ చెప్పారు. విద్యార్థులు, ఇతర తాత్కాలిక వీసాదారులకు వీసా పొందేందుకు ఉన్న ఇబ్బందులు తొలగించేలా, కంపెనీలు ఉద్యోగుల వేతనాలు తగ్గించకుండా కట్టుదిట్టమైన నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. సెనెట్‌లోను ప్రవేశపెడతాం హెచ్–1బీ, ఎల్–1 వీసాల సంస్కరణల బిల్లును సెనెట్‌లోనూ ప్రవేశపెడతామని చట్టసభ సభ్యుడు షెరాడ్ బ్రౌన్ తెలిపారు. ఈ వీసాల పథకంలో లోపాల్ని తొలగించడంతోపాటు, అమెరికన్ ఉద్యోగులు, వీసాదారులకు ఈ బిల్లు భద్రత కల్పిస్తుందన్నారు. ‘‘అమెరికన్లకు సరైన వేతనాలు చెల్లించకుండా, విదేశీ ఉద్యోగుల్ని దోచుకుంటున్న కంపెనీలపై కొరడా ఝలిపించాల్సిన అవసరం ఉంది’’అని బ్రౌన్ పేర్కొన్నారు. హెచ్–1బీ, ఎల్–1 వీసా పథకంలో అక్రమాలపై విచారణ జరిపిస్తామని, సంస్కరణలు తెస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇచ్చిన హామీ ఈ చట్టంతోనే ప్రారంభమవుతుందన్నారు. ఎవరేమన్నారు..? అమెరికా అధికారులతో మాట్లాడాం: భారత్ బిల్లుపై ఐటీ కంపెనీలు, ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో భారత్ స్పందించింది. భారత్ ప్రయోజనాలు, ఆందోళనను అమెరికా ప్రభుత్వం, అక్కడి కాంగ్రెస్‌కు తెలియచేశామని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. 60 నుంచి 70 శాతం జీతాలు పెంచాలి: ఏంజెల్ బ్రోకింగ్ హెచ్–1బీ వీసాలపై తెచ్చిన నిర్ణయంతో భారతీయ కంపెనీలు దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకూ జీతాలు పెంచాల్సి వస్తుందని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ పేర్కొంది. ఇది కంపెనీల నికరలాభంపై ప్రభావం చూపుతుందని వివరించింది. కంపెనీలపై వ్యతిరేక ప్రభావం: గార్టెన్ రీసెర్చ్ డైరక్టర్ నిపుణుల కోసం ఖర్చు పెరగడంతో పాటు, స్థానికుల్ని మరింత మందిని నియమించుకోవాలని గార్టెన్ రీసెర్చ్ డైరెక్టర్ డీడీ మిశ్రా పేర్కొన్నారు. ‘‘సేవల కొనసాగింపులో గందరగోళం నెలకొనవచ్చు. ఇవన్నీ కంపెనీల లాభంపై వ్యతిరేక ప్రభావం చూపుతాయని’’ఆయన అన్నారు. కంపెనీలపై 10 శాతం ప్రభావం: గ్రేహౌండ్ రీసెర్చ్ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న హెచ్–1బీ వీసాదారుల సంఖ్య ఆధారంగా ఐటీ కంపెనీలపై 5–10 శాతం వరకూ ప్రభావం పడవచ్చని గ్రేహౌండ్ రీసెర్చ్ తెలిపింది. తమ ఆదాయంలో సగం అమెరికా నుంచే పొందుతున్న టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు మాత్రం ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించాయి. -
భవిష్యత్‌కు భరోసా ఎంత!
రిటైర్మెంట్ జీవితంపై 56 శాతం ఉద్యోగుల ఆందోళన: తేల్చిన సర్వే న్యూఢిల్లీ: క్షణం తీరిక లేని బిజీ జీవన గమనంలో కొట్టుకుపోతున్న సగటు ఉద్యోగికి భవిష్యత్‌పై భరోసా ఎంత? దేశంలోని సగానికి పైగా ఉద్యోగుల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. తమ తల్లిదండ్రులతో పోలిస్తే... పదవీ విరమణ తరువాత జీవితంపై 56 శాతం మంది ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థ ‘విల్స్ టవర్స్ వాట్సన్’ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మొత్తం రెండు వేల మంది ఉద్యోగులపై సంస్థ అధ్యయనం చేసింది. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ప్రతి ముగ్గురులో ఒకరు ఆర్థిక సమస్యలు తమ జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నతమైన పదవీ విరమణ లేదంటే హెల్త్ బెనిఫిట్స్, బోనస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగుల దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి సంస్థలు తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విల్స్ టవర్స్ వాట్సన్ ఇండియా డెరైక్టర్ కులిన్ పటేల్ చెప్పారు. ఉద్యోగులను పొదుపు వైపు మళ్లించేలా సహకారం అందించాలన్నారు. -
ఉద్యోగం పోతే ఎలా?
ఉన్నట్టుండి చేస్తున్న ఉద్యోగం పోతే ఎలా? నెల నెలా కట్టాల్సిన ఈఎంఐలు ఎలా కట్టాలి.. పిల్లల చదువుల మాటేంటి.. అసలు నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లే దారేంటి? ఇలాంటి ప్రశ్నలు భారతీయుల్లో చాలామందిని వేధిస్తున్నాయట. దాదాపు 17 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఇదే తరహా ఆలోచనలతో ఆందోళన చెందుతున్నారని ఓ సర్వేలో తేలింది. రాండ్‌స్టాడ్ అనే కన్సల్టింగ్ సంస్థ ఈ సర్వే చేసింది. అయితే.. సెప్టెంబర్ నాటికంటే ఇప్పుడు మాత్రం ఈ భయం కొంత తగ్గింది. అప్పట్లో 23 శాతం మంది ఉద్యోగాలు పోతాయని భయపడితే డిసెంబర్లో వాళ్ల సంఖ్య 17 శాతానికి తగ్గింది. 2016 సంవత్సరంలో దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా బాగుపడుతుందని ఎక్కువ మంది ఆశిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన వాణిజ్య సంస్కరణలు, పెరుగుతున్న పెట్టుబడులు, ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు లాంటి నిర్ణయాలతో వాణిజ్యం బాగా పెరుగుతోందని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ, సీఈఓ మూర్తి కె ఉప్పులూరి అంటున్నారు. మొత్తమ్మీద చూసుకున్న మార్కెట్ పరిస్థితి బాగుందని, అంటే కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని.. 2016 ప్రారంభంలోనే దీని సంకేతాలు కనిపించి భారతీయ జాబ్ మార్కెట్ బాగా మారిందని ఆయన చెప్పారు. ఇక ఇటీవలి కాలంలో భారతీయులు ఉద్యోగాలు మారడం కూడా బాగా కనిపిస్తోంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో చేసిన సర్వేలో.. దాదాపు 45 శాతం మంది తాము గత ఆరు నెలల్లో ఉద్యోగం మారినట్లు చెప్పారు. అలా మారితేనే సరైన జీతభత్యాలు, ప్రమోషన్లు వస్తున్నాయని, ఒకేచోట ఉంటే ఇంక్రిమెంట్లు కూడా సరిగా ఇవ్వట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
అమెరికాలో ఉద్యోగులకూ తిప్పలు
హెచ్1బీ వీసాపై వెళ్లినవారినీ వెనక్కి పంపుతున్న సీబీపీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో భారత విద్యార్థులకే కాదు.. హెచ్1బీ వీసాతో ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారికీ ఇబ్బందులు తప్పడం లేదు. హెచ్1బీ వీసాను స్టాంపింగ్ చేయించుకోవడానికో, సెలవుల్లో గడిపేందుకో స్వదేశానికి వస్తున్నవారిని.. తిరిగి వెళ్లినప్పుడు విమానాశ్రయాల నుంచే కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) వెనక్కి తిప్పిపంపుతోంది. గత రెండు నెలల్లో దాదాపు 500 మందిని ఈ రకంగా వెనక్కి పంపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అమెరికాలో ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని.. భారతీయ ఉద్యోగులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అమెరికా కన్సల్టెన్సీ సంస్థలు సూచిస్తున్నాయి. దీంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో అమెరికా నుంచి భారత్‌కు వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్న దాదాపు 6 వేల మంది తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవడమో, రద్దు చేసుకోవడమో జరిగిందని ప్రముఖ ట్రావెల్ వెబ్సైట్ ‘మేక్ మై ట్రిప్’ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణాలు వాయిదా వేసుకుంటు న్న వారు 50 శాతానికిపైగా పెరిగారన్నారు. కారణాలూ చెప్పలేదు.. ‘నేవార్క్‌లోని మిడ్‌సైజ్ దేశీ కన్సల్టింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. హెచ్1బీ వీసా స్టాంపిం గ్ చేయించుకోవడానికి 15 రోజుల క్రితం ఇండియా వచ్చి సెలవుల అనంతరం అమెరికా వెళ్లా. అక్కడి నేవార్క్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఆఫీసర్ నన్ను నిలువరించారు. నన్ను వెనక్కి పంపుతున్నామంటూ నా చేతిలో ఫారమ్-275 పెట్టారు. కారణాలేమిటనేది వివరించలేదు. ఆ సమయంలో సీబీపీ అధికారి వ్యవహరించిన తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. నలుగురైదుగురు అధికారులు అవహేళనగా మాట్లాడారు..’’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. తన హెచ్1బీ వీసాను రద్దు చేయడమే కాకుండా ఐదేళ్ల పాటు అమెరికా వెళ్లేందుకు వీల్లేకుండా నిషేధం విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా లో తాను పనిచేస్తున్న కంపెనీ దీనిని సీరియస్‌గా తీసుకుందని, అక్కడి న్యాయస్థానంలో వారు పిటిషన్ దాఖలు చేస్తున్నారని తెలిపారు. గతంలో తమ కంపెనీకి చెందిన ఇద్దరు భారత ఉద్యోగులకు న్యాయస్థానం ద్వారా ఊరట లభించిందన్నారు. నకిలీ సర్టిఫికెట్ పెట్టకపోయినా ఇలా వ్యవహరించారని పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో మొదటికే మోసం అమెరికా వెళ్లి ఎంఎస్ చేస్తున్న వారిలో 90 శాతం అక్కడ ఉద్యోగాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యా ప్రమాణాలు బాగున్నాయనో, అక్కడ పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించాలనో వెళుతున్నవారు 10 శాతమే ఉంటున్నారు. జీఆర్ఈ, టోఫెల్లో మంచి స్కోర్ సాధించి టాప్-100 విశ్వవిద్యాలయాల్లో చేరినవారు మినహా మిగతావారంతా ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీల మీద ఆధారపడుతున్నారు. ఉద్యోగం ఇప్పించేం దుకు కన్సల్టెన్సీలు ముందే ఉద్యోగ అనుభవం ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్లు పెడుతున్నాయి. ఎంఎస్ పూర్తయిందే అప్పుడైతే.. మూడు నాలుగేళ్లు అనుభవమున్నట్లు వాటిల్లో చూపుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ పరిశ్రమ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారిలో చాలా మంది ఇలా ఉద్యోగాల్లో చేరినవారే. కానీ అలా హెచ్1బీ వీసాతో ఉద్యోగాలు చేస్తు న్న కొందరు.. తాజాగా సీబీపీ అధికారుల తనిఖీల్లో దొరికిపోతున్నారు. గత మూడు, 4 నెలల్లో ఇలాంటి చాలా మంది ఉద్యోగులను వెనక్కి పంపినట్లు సమాచారం. కానీ కచ్చితమైన వివరాలు తెలియవు. ‘‘ఏడాది క్రితం ఎంఎస్ పూర్తి చేశా. ఓ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరాను. గతేడాది నవంబర్‌లో హెచ్1బీ వీసా వచ్చాక ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో ఫుల్‌టైమ్ ఉద్యోగం వచ్చింది. సెలవులతో పాటు హెచ్1బీ వీసా స్టాంపింగ్ కోసం ఇటీవలే చెన్నై వచ్చాను. తిరిగి వెళ్లినప్పుడు డల్లాస్‌లో సీబీపీ అధికారులు ఆపారు. కన్సల్టెంట్ ద్వారా ఉద్యోగంలో చేరినప్పుడు నకిలీ అనుభవం సర్టిఫికెట్ పెట్టావంటూ హెచ్1బీ వీసా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. చేసేది లేక వెనక్కి వచ్చేశాను..’’ అని తమిళనాడుకు చెందిన ముత్తురామన్ ఓ వెబ్సైట్లో పేర్కొన్నాడు. అన్ని డాక్యుమెంట్లు దగ్గరే ఉంచుకోవాలి.. ‘‘హెచ్1బీ వీసా ఉన్న ఉద్యోగులు భారత్‌కు వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు అన్ని డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలి. సీబీపీ అధికారులు అనుమానం వచ్చి డాక్యుమెంట్లు అడిగితే చూపాలి. ప్రశ్నలు సంధిస్తే తడుముకోకుండా సమాధానమివ్వాలి. అమెరికా ఎందుకు వచ్చావని అడిగితే తాను ఫలానా అసైన్మెంట్ మీద వచ్చానని దానికి సంబంధించి పత్రాలు చూపాలి. కంపెనీలో హోదా ఏమిటి, ఎవరికి రిపోర్టు చేస్తారనే వివరాలను చెప్పాలి. అకస్మాత్తుగా కంపెనీలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అడిగితే తెలియదనో లేదా సెలైంట్‌గా ఉండటమో చేయవద్దు. మామూలుగా సీబీపీ అధికారులకు అనుమానం వస్తే తరచుగా అడిగే ప్రశ్న ఇది. నువ్వు నేరుగా ఉద్యోగం చేస్తున్నావా లేదా క్లయింట్ దగ్గర చేస్తున్నావా అనే ప్రశ్నకు చాలా మంది పొరబడి తప్పుడు సమాధానం చెప్పి ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ సూచనలు పాటిస్తే ఇబ్బందులు ఉండవు..’’ - జ్యోతిరెడ్డి, కీ సొల్యుషన్స్ సీఈవో, అరిజోనా, అమెరికా -
అనిశ్చితిలో గల్ఫ్ భారతీయులు
(సెంట్రల్ డెస్క్): గల్ఫ్ దేశాల్లో అలజడి మొదలైంది. ఆయిల్ నిల్వలతో ప్రపంచాన్ని శాసించిన యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్ దేశాలు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటమే ఇందుకు కారణం. 2014లో బ్యారెల్ 114 డాలర్లున్న ధర.. తాజాగా 41 డాలర్ల దగ్గర ఆగింది. ఇది తిరిగి పుంజుకుని 75 డాలర్లకు చేరని పక్షంలో.. గల్ఫ్ దేశాల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుందని, సౌదీ అరేబియా కోలుకోవాలంటే.. బ్యారెల్ ధర కనీసం 100 డాలర్లకు చేరాల్సిందేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. దీంతో గల్ఫ్ దేశాలు బడ్జెట్ కుదింపు, సబ్సిడీల తగ్గింపు, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవటంపైనే దృష్టిపెట్టాయి. ఈ దేశాల్లోని కంపెనీలు జీతాలు, ఇంక్రిమెంట్లలో కోత విధించాయి. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది. గల్ఫ్ దేశాల్లోని వివిధ కంపెనీల్లో దాదాపు 70 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అందులోనూ కేరళనుంచే ఎక్కువమంది ఉన్నారు. వేతనాలు కూడా భారీగానే ఉండటంతో.. సంపాదనలో కొంత భాగాన్ని స్వదేశానికి పంపించేవారు. ఒక్క కేరళైట్లు వాళ్ల బంధువులకు పంపించే డబ్బు.. ఆ రాష్ట్రానికి కేంద్రం చేసే సహాయానికి 5.5 రెట్లు ఉంటుందని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. తాజా పరిస్థితులతో.. కంపెనీలు జీతాల్లో కోత విధించటం వీరి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు ఉద్యోగస్తుల తొలగింపును మొదలుపెట్టాయి. ఇదే తీవ్రతరమైతే.. పెద్ద సంఖ్యలో భారతీయులు రోడ్డున పడాల్సిందే. దీనికి తోడు గల్ఫ్ దేశాల్లోని అమానుషమైన కార్మిక చట్టాలు.. ఉద్యోగులు కంపనీలు మారేందుకు సహకరించవు. అయితే అక్కడే పనిచేయాలి.. లేదంటే భారత్‌కు తిరిగొచ్చి ఉద్యోగమో, వ్యాపారమో చేసుకోవాలి. ఇప్పటికే నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్న భారత్‌కు గల్ఫ్ దేశాల్లో పరిస్థితి కుదురుకోక.. వారంతా ఇక్కడికి వచ్చేస్తే.. మరిన్ని సమస్యలు తప్పవని ఇందుకు.. ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
భారత్ లో కన్నా అమెరికాలోనే పదిలం!
వాషింగ్టన్ : అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు స్వదేశంతో పోల్చితే తమకు అక్కడే సౌకర్యంగా ఉందంటున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 500 మందిపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అవకాశాల భూమి అమెరికా అని భారత్‌కు చెందిన ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే, తమ జాబ్ రిటైర్మైంట్ మాత్రం స్వదేశంలోనే చేయాలనుకోవడం గమనార్హం. తాము చేస్తున్న ఉద్యోగానికి అర్హత కంటే ఎక్కువ నైపుణ్యం తమలో ఉందని సర్వేలో పాల్గొన్న 83 శాతం ఉద్యోగులు చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్‌తో పోల్చితే అమెరికాలో జాబ్ టెన్షన్ చాలా తక్కువగా ఉందని 63 శాతం మంది పేర్కొన్నారు. ఊహించిన జీతం తాము అందుకుంటున్నామని 65 శాతం మంది, అనుకున్న వేతనాన్ని పొందడానికి అదనపు సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందని 61 శాతం ఉద్యోగులు చెప్పారు. ఏది ఏమైతేనేం, స్వదేశంతో పోల్చి చూస్తే తమకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు, డెవలప్మెంట్, తక్కువ ఒత్తిడి వంటివి కలిసొచ్చే అంశాలని అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు భావిస్తున్నారని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. -
భారతీయ ఉద్యోగులు ఉత్తములు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు అనేక రంగాల్లో కీలకంగా ఉంటూ మంచి పనితీరు కనబరుస్తున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. వివిధ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో 51 శాతం మంది ఉత్తమ ఫలితాలు సాధించటంతోపాటు అంతర్జాతీయంగా పేరు గడించారని ఉద్యోగుల ఎంపిక విధానాల రూపకల్పన చేసే సంస్థ బీఐ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనం తేల్చి చెప్పింది. భారతీయుల తర్వాతి స్థానాల్లో చైనా (49 శాతం), అమెరికా (38 శాతం) జాతీయులు నిలిచారు. అంతేకాకుండా ప్రతి 10 మంది భారతీయుల్లో ఆరుగురు పూర్తి సామర్ధ్యంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించటం లేదని, యువ ఉద్యోగుల్లో తరచూ ఉద్యోగం మార్చే ధోరణి కనిపిస్తోందని తెలిపింది. యాబై నుంచి తొంబై శాతం సామర్ధ్యంతోనే పనిచేస్తున్నట్లు సగానికి పైగా ఉద్యోగులు అంగీకరించారంది.క్రమశిక్షణ, ప్రతిభ, అంకితభావం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న బీఐ సంస్థ.. పలు దేశాల్లోని 7264 మంది అభిప్రాయాలు సేకరించి ఈ విషయాలను నిగ్గు తేల్చింది.