న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు అనేక రంగాల్లో కీలకంగా ఉంటూ మంచి పనితీరు కనబరుస్తున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. వివిధ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో 51 శాతం మంది ఉత్తమ ఫలితాలు సాధించటంతోపాటు అంతర్జాతీయంగా పేరు గడించారని ఉద్యోగుల ఎంపిక విధానాల రూపకల్పన చేసే సంస్థ బీఐ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనం తేల్చి చెప్పింది.
భారతీయుల తర్వాతి స్థానాల్లో చైనా (49 శాతం), అమెరికా (38 శాతం) జాతీయులు నిలిచారు. అంతేకాకుండా ప్రతి 10 మంది భారతీయుల్లో ఆరుగురు పూర్తి సామర్ధ్యంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించటం లేదని, యువ ఉద్యోగుల్లో తరచూ ఉద్యోగం మార్చే ధోరణి కనిపిస్తోందని తెలిపింది.
యాబై నుంచి తొంబై శాతం సామర్ధ్యంతోనే పనిచేస్తున్నట్లు సగానికి పైగా ఉద్యోగులు అంగీకరించారంది.క్రమశిక్షణ, ప్రతిభ, అంకితభావం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న బీఐ సంస్థ.. పలు దేశాల్లోని 7264 మంది అభిప్రాయాలు సేకరించి ఈ విషయాలను నిగ్గు తేల్చింది.
భారతీయ ఉద్యోగులు ఉత్తములు
Published Mon, Dec 1 2014 4:31 AM | Last Updated on Thu, May 24 2018 2:36 PM
Advertisement