స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, ఇతర పండగల సీజన్‌లో ఆయా ఈ - కామర్స్ కంపెనీలు, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొనుగోలు దారుల్ని ఆకట్టుకునేందుకు భారీ ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అందుకు అనుగుణంగా వినియోగదారులు తక్కువ ధరకే తమకు కావాల్సిన వస్తువులు సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. వ్యాపారం కూడా భారీ ఎత్తున జరుగుతుంది.
ఇప్పుడీ ఈ డిస్కౌంట్ ఫార్మలానే రియల్ ఎస్టేట్ కంపెనీలు అప్లయ్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రియాలిటీ సంస్థలు కొనుగోలు దారులకు తక్కువ ధరలకే వారు కోరుకున్న ప్లాట్లు, విల్లాలు, వన్ బీహెచ్‌కే, టూబీహెచ్‌కే ఇళ్లను అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
( ఫైల్ ఫోటో )
👉 ముంబైకి చెందిన డెవలపర్లు ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31వరకు అపార్ట్‌మెంట్‌లను బుక్ చేసుకునే గృహ కొనుగోలుదారులకు జీరో స్టాంప్ డ్యూటీ, ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్ (బై నవ్ పే లేటర్) 12 నెలల ఈఎంఐ మినహాయింపును అందిస్తున్నారు. జీఎస్టీని సైతం రద్దు చేస్తున్నారు.
👉 జేపీ ఇన్‌ఫ్రా జీరో స్టాంప్ డ్యూటీ, ఫ్లెక్సీ-పేమెంట్ ప్లాన్, 12 నెలల ఈఎంఐ మినహాయింపును అందిస్తుంది. ఆఫర్‌లో భాగంగా స్టాంప్ డ్యూటీ, జీఎస్టీని మినహాయించింది.
👉 త్రిధాతు రియాల్టీ అనే సంస్థ 2 బీహెచ్‌కే యూనిట్‌పై రూ. 10 లక్షలు, 3 బీహెచ్‌కే పై 20 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది.
( ఫైల్ ఫోటో )
👉ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూటానీ ఇన్‌ఫ్రా సొంతింటి కలల్ని నిజం చేసుకునేందుకు వీలుగా ఓ స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. పథకంలో కస్టమర్లు కోరుకున్న ధరకే ప్రాపర్టీని అందిస్తున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15 వరకు కొనసాగే ఈ స్కీమ్‌లో రూ.1 కోటి అంతకంటే ఎక్కువ విలువైన 77 యూనిట్ల కేటాయింపును లక్కీ డ్రా ఆధారంగా నిర్ణయిస్తారు.
👉 పథకం కింద, కొనుగోలుదారులు భూటానీ ఇన్‌ఫ్రా ప్రాపర్టీని ఎంచుకుంటే ఎంత ధరకి ఆ స్థిరాస్థి కావాలనుకుంటున్నారో అంతకే కోట్ చేయొచ్చు. ఉదాహరణకు, ఒక యూనిట్ ధర రూ. 2 కోట్లు అయితే కొనుగోలుదారులు తమ బడ్జెట్ ప్రకారం రూ.1.75 కోట్లు లేదా రూ.1.5 కోట్ల ధరను కోట్ చేయవచ్చు. ఈ సందర్భంగా..లక్కీ డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తామని భూటానీ ఇన్‌ఫ్రా సీఈఓ ఆశిష్ భుటానీ తెలిపారు.
( ఫైల్ ఫోటో )
👉 గౌర్స్ గ్రూప్ గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని గౌర్ వరల్డ్ స్మార్ట్‌స్ట్రీట్ ప్రాజెక్ట్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ప్రతి బుకింగ్‌పై కారును ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 13 రెండు రోజులు అందుబాటులో ఉంది. అంతేకాదు మూడు సంవత్సరాల పాటు షాపుల నిర్వహణ అంతా ఉచితం
👉 ఘజియాబాద్‌లోని గౌర్ ఏరోసిటీ మాల్‌లోని షాపుల కోసం కంపెనీ ప్రతి బుకింగ్‌పై ఐఫోన్‌ను అందిస్తోంది.
👉 బెంగళూరులో ప్రావిడెంట్ హౌసింగ్ సంస్థ ప్రస్తుతం ఫ్రీడమ్ ఆన్‌లైన్ హోమ్ ఫెస్ట్ 4.0ని నిర్వహిస్తోంది, ఇందులో కొనుగోలుదారులు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా హౌసింగ్ యూనిట్‌ను బుక్ చేసుకోవచ్చు. గరిష్ట ధర రూ. 12 లక్షలుగా నిర్ణయించింది. ఇలా డిస్కౌంట్ ధరలకే వారికి నచ్చిన ప్లాట్లను అందిస్తూ సేల్స్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నాయి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలు.
Comments
Please login to add a commentAdd a comment