దేశంలో స్థిరాస్థి మార్కెట్ పరుగులు తీస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు మధ్యలో కోవిడ్-19 ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ పుంజుకుంది. వైరస్ తగ్గుముఖం పట్టి భవిష్యత్తుపై భరోసా కనిపిస్తుండటంతో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్లు హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో స్థిరాస్థులైన ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌ల మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడులే సురక్షితమైనవని, సమీప భవిష్యత్‌లో అవి పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అందుకే స్థిరాస్థి రేట్లు పెరుగుతున్నా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఒక వేళ మీరూ ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఆ ప్రాపర్టీస్ మీద పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ రిటర్న్ పొందాలని అనుకుంటున్నారా? అయితే పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకోండి. తద్వారా భవిష్యత్‌లో ఊహించని దానికంటే ఎక్కువ రిటర్న్ పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లొకేషన్
మీరు ఏ ప్రాంతంలో పెట్టుబుడులు పెడుతున్నారో.. ఆ పెట్టుబడుల నుంచి ఎంత రిటర్న్స్ రావాలో నిర్ణయించేది లొకేషన్ మాత్రమే. అందుకే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఉండి, ఆదాయం పొందాలనుకుంటే అభివృద్ధి అవుతున్న ప్రాంతాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఈ పెట్టుబడి ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడికంటే తక్కువగా ఉంటుంది.
సౌకర్యం
కొనుగోలు దారులు షాపింగ్ క్లాంప్లెక్స్, పార్క్స్,స్కూల్స్, హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాకు చెందిన ప్రాపర్టీల మీద పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. అందుకే మీరు ప్రాపర్టీస్‌మీద పెట్టుబడులు పెట్టే ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు ఉన్నాయా? లేవా అని చూసుకోండి. ఇప్పటికే ఈ సౌకర్యాలు ఉంటే ఇన్వెస్ట్ చేయండి. లేదంటే భవిష్యత్‌లో పైన పేర్కొన్న సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిసినా పెట్టుబడి పెట్టొచ్చు.
ట్రాన్స్ పోర్ట్
ప్రాపర్టీని కొనుగోలు చేసే బయ్యర్స్ పరిగణలోకి తీసుకునే అంశం ట్రాన్స్‌పోర్ట్. ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఉందా? కనెక్టివిటీ ఆప్షన్ ఉందా? అని చూసుకుంటారు. అదే ఆస్తిపై కొనుగోలుదారుడి ఆసక్తి, దాని విలువ పెరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లైతే రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు, బస్టాండ్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయండి.
కమర్షియల్ ఏరియాలు
మీ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ప్రాపర్టీస్ కమర్షియల్ ఏరియాల్లో ఉంటే మంచిది. ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీస్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడులతో అధిక ఆదాయం పొందవచ్చు. ప్రాపర్టీస్‌ను లీజ్‌గా ఇవ్వొచ్చు. ఇళ్లైతే రెంట్‌కు ఇవ్వొచ్చు. ఇలా ప్రాపర్టీస్ మీద ఎక్కువ ఆదాయం గడించవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment