దేశంలోనే అత్యంత సంపన్నులు! తెలుగులో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌లు ఎవరంటే! | DLF chairman Rajiv Singh richest realtor in the country | Sakshi
Sakshi News home page

దేశంలోనే అత్యంత సంపన్నులు! తెలుగులో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌లు ఎవరంటే!

Published Thu, Apr 7 2022 7:53 AM | Last Updated on Thu, Apr 7 2022 8:17 AM

DLF chairman Rajiv Singh richest realtor in the country - Sakshi

న్యూఢిల్లీ: డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రూ.61,220 కోట్ల సంపద ఆయనకు ఉన్నట్టు ‘గ్రోహ్‌ హరూన్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ రిచ్‌ లిస్ట్‌’ ఐదో ఎడిషన్‌ తెలిపింది. మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (లోధా) ప్రమోటర్‌ ఎంపీ లోధా రూ.52,970 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. రియల్టీలోని టాప్‌ 100 సంపన్నుల వివరాలతో ఈ నివేదిక రూపొందించింది. రియల్టీ వ్యాపారాల్లో  వాటాల ఆధారంగా 2021 డిసెంబర్‌ 31 నాటికి ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకుంది. 

టాప్‌ –10లో వీరు..

డీఎల్‌ఎఫ్‌ రాజీవ్‌ సింగ్‌ సంపద 2021లో 68% పెరిగింది.  

ఎంపీ లోధా, ఆయన కుటుంబ సభ్యుల సంపద 20 శాతం పెరిగింది.  

కే రహేజా కార్ప్‌నకు చెందిన చంద్రు రహేజా, ఆయన కుటుంబ సభ్యుల సంపద రూ.26,290 కోట్లుగా ఉంది. వీరు 3వ స్థానంలో ఉన్నారు. 

ఎంబసీ గ్రూపు ప్రమోటర్‌ జితేంద్ర విర్వాణి రూ.23,620 కోట్లతో 4వ స్థానంలో నిలిచారు. 

ఒబెరాయ్‌ రియల్టీ అధినేత వికాస్‌ ఒబెరాయ్‌ రూ.22,780 కోట్లు, నిరంజన్‌ హిరనందాని (హిరనందన్‌ కమ్యూనిటీస్‌) రూ.22,250 కోట్లు, బసంత్‌ బన్సాల్‌ అండ్‌ ఫ్యామిలీ (ఎం3ఎం ఇండియా) రూ.17,250 కోట్లతో వరుసగా తర్వాతి స్థానాలో ఉన్నారు. 

రాజా బగ్‌మానే (బగ్‌మానే డెవలపర్స్‌) రూ.16,730 కోట్లు, జి.అమరేందర్‌ రెడ్డి, ఆయన కుటుంబం రూ.15,000 కోట్లు, రున్వా ల్‌ డెవలపర్స్‌కు చెందిన సుభాష్‌ రున్వాల్‌ అండ్‌ ఫ్యామిలీ రూ.11,400 కోట్లతో ఈ జాబితాలో టాప్‌–10లో చోటు సంపాదించుకున్నారు.

14 పట్టణాల నుంచి 71 కంపెనీలకు చెందిన 100 మంది ఈ జాబితాలో ఉన్నారు.  

జాబితాలోని 81 శాతం మంది సంపద 2021లో పెరిగింది. 13% మంది సంపద తగ్గింది. కొత్తగా 13 మంది జాబితాలోకి వచ్చారు.    

తెలుగులో రియల్టీ కుబేరులు ఎవరంటే

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement