వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మీ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ గమ్యస్థానం ఇదే కావచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్య రహిత ప్రాంతం, పచ్చదనంతో పాటు మెరుగైన కనెక్టివిటీతో నగర వాసులకు కోరిక తగ్గట్టు రూపొందిన ప్రాజెక్ట్ ‘జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ’(G Square Epitome Integrated City). రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన అవగాహనతో పాటు అపార అనుభవమున్న జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేపట్టింది.
మకర సంక్రాంతి దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ. సౌతిండియాలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ (G Square Epitome Housing) పండుగ సందర్భంగా, ‘జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ’ కస్టమర్లకు అద్భుతమైన బహుమతులను అందిస్తున్నట్లు ప్రకటించింది. పండగ అంటే అందరం కలిసి చేసుకోవాలనే భావనతో మీ ముందుకు కళ్లు చెదిరే ఆఫర్లను తీసుకువచ్చింది. హైదరాబాద్-విజయవాడ హైవేలోని జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ సైట్‌లో ఈ వేడుకులు జనవరి 11 నుంచి 22, 2023 వరకు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తోంది. వీటితో పాటు సైట్‌ని సందర్శించే వారికోసం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేక ఆహారం, డ్రింక్స్ కూడా ఏర్పాటు చేసింది.
బోలెడు బహుమతులు మీకోసమే
ఆఫర్ కాలంలో ఈ భారీ ఇంటిగ్రేటెడ్ సిటీని సందర్శిస్తే, 5 కార్లు, 20 బైక్‌లను గెలుచుకునే అదృష్టవంతుల్లో మీరు ఒకరు కావచ్చు. రోజూ సైట్‌ని సందర్శించిన 100 మంది కస్టమర్లు గోల్డ్ కాయిన్స్ అందుకోనున్నారు. అంతే కాదండోయ్ ప్లాట్‌ను బుక్ చేసుకన్న కస్టమర్లు(ఇద్దరు) హాంకాంగ్, మలేషియా, సింగపూర్ లేదా దుబాయ్‌కి వెళ్లే లక్కీ ఛాన్స్ కూడా ఉంది. కస్టమర్ వారి ప్రాధాన్యత ప్రకారం విదేశీ పర్యటనకు బదులుగా 40 గ్రాముల బంగారు నాణేన్ని కూడా ఎంచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇంకా బోలెడు ఉన్నాయి... సైట్‌ను సందర్శించేవారికి చీరలు, టీషర్టులు వంటి ప్రత్యేక బహుమతులు కూడా ఉన్నాయి. పతంగుల పండుగ, మెహందీ, కుమ్మరి, బొమ్మల కొలువు మొదలైన అనేక ఆసక్తికరమైన సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్ట్‌ను సందర్శించాలని జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ కోరుతోంది.
ఎక్కడ ఉందంటే
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీకి ఆనుకుని ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి అతి సమీపంలో జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ 1242 ఎకరాల ప్రధాన భూభాగంలో విస్తరించి ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని మొదటి ఇంటిగ్రేటెడ్ సిటీ మాత్రమే కాదు హెచ్‌ఎండీఏ, రెరాచే ఆమోదించబడిన ఏకైక అతిపెద్ద ప్రాజెక్ట్. ఫేజ్ 1లో భాగంగా, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఫీచర్లతో కూడిన 368 ఎకరాల ప్రీమియం విల్లా ప్లాట్ కమ్యూనిటీని కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణగా వివిధ రకాలైన లైఫ్ స్టైల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఫెసిలిటీస్‌తో హైదరాబాద్‌లోని అతిపెద్ద క్లబ్‌హౌస్ (5.65 ఎకరాలు)తో 140+ ప్రపంచ స్థాయి సౌకర్యాల దీని సొంతం. జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ 24/7 CCTV నిఘాతో అత్యంత సురక్షితమైన జోన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రత్యేకతలు చూస్తే వావ్ అనాల్సిందే..
30 ఎకరాల ఐటీ పార్క్, 100 ఎకరాల గోల్ఫ్ కోర్స్, 40 ఎకరాల లగ్జరీ రిసార్ట్, 279 ఎకరాల నేచురల్ లేక్, వెల్నెస్ సెంటర్, స్పోర్ట్స్ అకాడెమీ, మాల్, సూపర్ మార్కెట్, స్కూల్, కాలేజ్ తో పాటు, మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కొండలు, ప్రాంతం సమీపంలో జీస్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ ఉండటంతో పాటుగా హైదరాబాద్‌లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుంది.
శ్రీ ఈశ్వర్ ఎన్, సీఈఓ (జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్), ‘మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్న ఈ అద్భుతమైన పండుగను ప్రతి ఒక్కరితో కలిసి మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉంది. ప్రతి ఒక్కరూ మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీని సందర్శించి, ఈ పండుగ వేడుకల్లో భాగం కావాల’ని కోరుకుంటున్నట్లు తెలిపారు.
జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ గురించి
జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ బృందం రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన అవగాహనతో పాటు అపార అనుభవం కూడా కలిగి ఉంది. భారీ ప్రాజెక్ట్‌లను కస్టమర్ల సంతృప్తితో విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. 6000 కంటే ఎక్కువ కస్టమర్‌ల కస్టమర్ బేస్‌తో 60కి పైగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు ఉండగా, వాటి సంఖ్య జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ నిరంతరం పెంచుకుంటోంది. ఇంతటి చరిత్ర కలిగిన జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ప్రీమియం ప్రాజెక్ట్‌లను అందిస్తోంది. జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ తన కస్టమర్లకు 100 శాతం స్పష్టమైన డాక్యుమెంటేషన్, ఉచిత నిర్వహణను అందించడం ద్వారా అవాంతరాలు లేని అనుభవాన్ని అందించింది. (అడ్వర్టోరియల్)
Comments
Please login to add a commentAdd a comment