Hyderabad, Bengaluru, NCR Housing Market Top Pick For NRIs - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్న ఎన్‌ఆర్‌ఐలు..ఎందుకంటే?

Published Fri, Nov 4 2022 9:21 PM | Last Updated on Fri, Nov 4 2022 9:44 PM

Hyderabad, Bengaluru, Ncr Housing Market Top Pick For Nris - Sakshi

కరోనా కాటుతో స్తబ్ధుగా ఉన్న రియాల్టీ రంగం భారత్‌లో ఊపందుకుందా? పెట్టుబడులు, కొనుగోళ్లు, అమ్మకాలతో హైదరాబాద్‌ రియాల్టీకి జోష్‌ వచ్చిందా?  హోమ్‌ లోన్‌ లపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నా.. ఇళ్లు, ప్లాట్ల, ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నా విదేశాల్లో స్థిర పడ్డ భారతీయులు హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారా? ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఎన్‌ఆర్‌ఐలు తిరిగి భారత్‌లో స్థిరపడాలని అనుకుంటున్నారా? అంటే అవుననే అంటోంది తాజాగా విడుదలైన ఓ సర్వే. 

సీఐఐ - అనరాక్‌  కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్‌1 -2022 ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఇక్కడ స్థిరాస్తుల్ని సులభంగా కొనుగోలు చేసేలా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో పాటు, అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు ఎన్‌ఆర్‌ఐలకు, ఓసీఐలకు కలిసి వస్తున్నట్లు తెలుస్తోంది. 
 
దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్‌ పొల్యూషన్‌, కర్ణాటక రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోయినా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎన్‌ఆర్‌ఐల మొగ్గు చూపుతున్నారు. 

ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎన్‌ఆర్‌ఐలు ఇళ్లను కొనుగోలు చేసే ప్రాంతాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు  అగ్రస్థానంలో ఉన్నాయని సీఐఐ - అనరాక్‌ సర్వే తెలిపింది. 

సర్వేలో పాల్గొన్న కనీసం 60 శాతం మంది ఎన్‌ఆర్‌ఐలు హైదరాబాద్, ఢిల్లీ , బెంగళూరులో ఇళ్లను కొనుగోలు చేస్తామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అదే జాబితాలో ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ నాల్గవ స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది ఎన్‌ఆర్ఐలు ఇళ్లను కొనుగోలు చేసే అత్యంత ఇష్టమైన ప్రాంతంగా హైదరాబాద్ దక్కించుకుంది.  22 శాతం మంది ఎన్‌ఆర్‌ఐలు హైదరాబాద్‌తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో ఇళ్ల కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీలో 20 శాతం మంది, బెంగళూరులో  18 శాతం మంది మాత్రమే ఇళ్ల కొనుగోలుకు  ప్రాధాన్యత ఇచ్చారు.

2021లో ఇదే కాలంతో పోలిస్తే 2022 మొదటి తొమ్మిది నెలల్లో గృహ నిర్మాణం ఎన్‌ఆర్‌ఐలలో డిమాండ్‌లో 15-20 శాతం పెరిగింది.

అనరాక్‌ రీసెర్చ్ ప్రకారం, 2022 జనవరి-సెప్టెంబర్ కాలంలో మొదటి ఏడు నగరాల్లో సుమారు 2.73 లక్షల గృహాలు అమ్ముడయ్యాయి. సగటున, ఏ త్రైమాసికంలోనైనా విక్రయించిన ఇళ్లలో 10-15 శాతం ఎన్‌ఆర్‌ఐల వాటా ఉంది" అని ఠాకూర్‌ చెప్పారు.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అనేక దేశాల్లో నెలకొన్న మాంద్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, చాలా మంది ఎన్నారైలు ఇప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లాలని చూస్తున్నారని సర్వే పేర్కొంది. వారు రూ. 90 లక్షల నుండి రూ. 1.5 కోట్ల మధ్య ప్రీమియం ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు తేలింది. 

ఇక ఎన్‌ఆర్‌ఐలలో 2బీహెచ్‌కే కంటే 3బీహెచ్‌కే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. సర్వే ప్రకారం, 44 శాతం మంది ఎన్‌ఆర్‌ఐలు 3బీహెచ్‌కేలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వారిలో 38 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది.

ఈ సందర్భంగా అనరాక్‌ గ్రూప్‌ సీనియర్ డైరెక్టర్ & రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ మాట్లాడుతూ ‘ గృహ రుణ వడ్డీ రేట్లు, ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇల్లు కొనుగోలు చేయాలనే సెంటిమెంట్‌ బలంగా ఉందని అన్నారు.యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారని అన్నారు.

చదవండి👉 ఈ హైవేలో ఎకరం ధర రూ.1.5కోట్లు..!

చదవండి👉  : ఛాఛా!! ఆ పిచ్చిప‌ని చేయ‌క‌పోతే మ‌రో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement