సాక్షి, హైదరాబాద్: ఇండిపెండెంట్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ అనరాక్ గ్రూప్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లోని భల్లబ్‌ఘడ్-సోహ్నా హైవేలో 41 ఎకరాల డీల్‌ను క్లోజ్ చేసింది.
ఈ స్థలంలో పార్ధోస్ లాజిస్టిక్స్ 10 లక్షల చదరపు అడుగులు (చ.అ.) విస్తీర్ణంలో గ్రేడ్-ఏ వేర్‌హౌస్‌ను అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం ఈ హైవేలో ఎకరం ధర రూ.1.4 నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉంది.
ఈ సందర్భంగా అనరాక్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ ఉదయ్ మాట్లాడుతూ.. ఢిల్లీకి చెందిన పెట్టుబడిదారుల బృందం నుంచి సేకరించిన రూ.200 కోట్ల పెట్టుబడులతో 18 నెలల్లో వేర్‌హౌస్‌ను డెవలప్ చేయనున్నారని తెలిపారు. భల్లబ్‌ఘడ్-సోహ్నా హైవే గత రెండేళ్లలో గిడ్డంగుల మార్కెట్‌గా అభివృద్ధి చెందిందన్నారు.
చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
Comments
Please login to add a commentAdd a comment