land value
-
సర్కారు వారి పాట
సాక్షి, హైదరాబాద్: సర్కారు భూముల అమ్మకానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం సుమారు 4500 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా చోట్ల వందల ఎకరాల్లో అన్యాక్రాంతం కాగా కొన్ని చోట్ల కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి వివాదాలు లేకుండా అందుబాటులో ఉన్న భూమిని అంచనా వేసి లేఅవుట్లు చేసి వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇలాంటి భూమి సుమారు 2000 ఎకరాలకుపైగానే ఉన్నట్లు అంచనా. అందులో ప్రస్తుతంవెయ్యి ఎకరాలను అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేఅవుట్లు వేసి వేలం ద్వారా విక్రయించిన హెచ్ఎండీఏ తాజాగా తన అధీనంలోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. కోకాపేట్లో ఇటీవల ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు కేసులు లేకుండా అన్ని రకాల అనుమతులతో కూడిన భూములను మొదట విక్రయించనున్నారు. రెండుచోట్ల వెంచర్లు.. ప్రభుత్వ భూముల విక్రయంలో భాగంగా తొలుత మోకిల, కుత్బుల్లాపూర్‌లలో ఉన్న సుమారు 190 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేయనున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర అన్ని మౌలిక సదుపాయాలతో రెండు మూడు నెలల్లో ఈ రెండు చోట్ల ప్లాట్లను వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్ల లేఅవుట్లు వేయనున్నారు. ప్రభుత్వ భూములతో పాటు అవసరమైన చోట్ల రైతుల నుంచి కూడా భూములను సేకరించే అవకాశం ఉంది, భారీ లే అవుట్లకు తగినంత భూమి అందుబాటులో లేని చోట్ల రైతుల నుంచి సేకరించనున్నారు. కుత్బుల్లాపూర్‌లో మండలం పరిధిలోని హెచ్ఎంటీ కంపెనీని ఆనుకొని ఉన్న వంద ఎకరాల హెచ్ఎండీఏ భూమిలో సుమారు 10 ఎకరాల వరకు అన్యాక్రాంతం కాగా, మిగతా 90 ఎకరాల భూమి కొద్ది రోజల క్రితమే హెచ్ఎండీఏ చేతికి వచ్చింది. మోకిలలో హెచ్ఎండీఏకు 60 ఎకరాల భూమి ఉండగా, రైతుల నుంచి సేకరించిన మరో 40 ఎకరాలతో కలిపి ఇక్కడ లేఅవుట్ వేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఉప్పల్ భగాయత్, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములపై నిర్వహించిన ఆన్లైన్ వేలానికి రియల్టర్లు, బిల్డర్లు, సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ స్పందనతో మరోసారి హెచ్ఎండీఏ పెద్ద ఎత్తున భూముల బేరానికి దిగింది. ఉప్పల్ భగాయత్‌లో మరో 40 ఎకరాలలో లే అవుట్‌ను సిద్ధం చేస్తున్నారు. త్వరలో ప్లాట్లు చేసి విక్రయించనున్నారు. కరువైన రక్షణ.. హెచ్ఎండీఏ భూములకు పలు చోట్ల రక్షణ కరువైంది. వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జవహర్‌నగర్‌లో సుమారు 2300 ఎకరాల హెచ్ఎండీఏ భూములు ఉన్నాయి. ఇక్కడ చాలా చోట్ల భూములు కబ్జాకు గురయ్యాయి. కొన్ని చోట్ల పేదలు గుడిసెలు వేసుకున్నారు. మియాపూర్‌లోనూ వెయ్యి ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. కబ్జాకోరులు పెద్ద ఎత్తునే స్వాహా చేశారు. జవహర్‌నగర్, మియాపూర్‌లలో రెండు చోట్ల పేదల పేరుతో ఆక్రమించుకొని కొందరు భూబకాసురులు రూ.కోట్లు గడించారు. మరోవైపు పుప్పాలగూడలో 100 ఎకరాలు, ఐడీఏ బొల్లారంలో 120 ఎకరాల చొప్పున హెచ్ఎండీఏ భూములు ఉన్నట్లు అంచనా. ఇవి కాకుండా బుద్వేల్‌లో 60 ఎకరాలు, కోకాపేట్లో 60, కొత్వాల్‌గూడలో 50 ఎకరాలు, తెల్లాపూర్‌లో 300 ఎకరాల వరకు హెచ్ఎండీఏకు చెందిన భూములు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. ఇంకా లెక్కతేలాల్సినవి వేల ఎకరాల్లోనే ఉన్నాయి. -
ఈ హైవేలో ఎకరం ధర రూ.1.5కోట్లు..!
సాక్షి, హైదరాబాద్: ఇండిపెండెంట్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ అనరాక్ గ్రూప్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని భల్లబ్ఘడ్-సోహ్నా హైవేలో 41 ఎకరాల డీల్‌ను క్లోజ్ చేసింది. ఈ స్థలంలో పార్ధోస్ లాజిస్టిక్స్ 10 లక్షల చదరపు అడుగులు (చ.అ.) విస్తీర్ణంలో గ్రేడ్-ఏ వేర్హౌస్ను అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం ఈ హైవేలో ఎకరం ధర రూ.1.4 నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉంది. ఈ సందర్భంగా అనరాక్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ ఉదయ్ మాట్లాడుతూ.. ఢిల్లీకి చెందిన పెట్టుబడిదారుల బృందం నుంచి సేకరించిన రూ.200 కోట్ల పెట్టుబడులతో 18 నెలల్లో వేర్హౌస్ను డెవలప్ చేయనున్నారని తెలిపారు. భల్లబ్ఘడ్-సోహ్నా హైవే గత రెండేళ్లలో గిడ్డంగుల మార్కెట్‌గా అభివృద్ధి చెందిందన్నారు. చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా -
సర్కారుపై రైతన్న కన్నెర్ర
-
ప్లాట్ల వ్యాపారం ఫ్లాప్!
ఆకివీడు: రాష్ట్ర విభజనతో భూములు విలువ భారీగా పెరుగుతుందని భావించారంతా. దీంతో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, మదుపరులు ఇలా డబ్బున్న ఆసాములంతా భూములపై పెట్టబడులు పెట్టారు. పంట భూములు, ఖాళీ స్థలాలు, ఇతరత్రా భూముల్లో లే అవుట్లు వేశారు. జిల్లాలో 4 వేల ఎకరాలకు పైగా భూములు లేఅవుట్లుగా మారాయి. మున్సిపాల్టీ, కార్పొరేషన్ ప్రాంతాల్లో 200 నుంచి 500 ఎకరాల భూములు, మండల కేంద్రాల్లో 50 నుంచి 200 ఎకరాలు, గ్రామ స్థాయిలో 5 నుంచి 20 ఎకరాల భూముల్ని లేఅవుట్లుగా మార్చేశారు. భూముల విలువకు రెక్కలొస్తున్నాయని బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రూ.5 లక్షలున్న ఎకరం భూమి విలువను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ పెంచి, ప్లాట్లుగా విభజించి బేరం పెట్టారు. దీంతో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఈ భూములు కొనుగోలుపై ఆసక్తి చూపించారు. గతేడాది చివరి నాటికి భూముల కొనుగోళ్లు ఒక్కసారిగా పడి పోయాయి. అమరావతి శంకుస్థాపన, ఆ ప్రాంతంలో భూముల కొనుగోళ్ల వ్యవహారం తదితర అంశాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఆర్థిక మాంద్యమూ కారణమే! ఏడాది నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులు సరిగా సాగక వ్యాపారులు, చిన్న పరిశ్రమల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రైతుల దుస్థితి చెప్పనక్కరలేదు. ఇవన్నీ పరోక్షంగా భూముల కొనుగోళ్లు స్తంభించటానికి కారణమయ్యాయి. మున్సిపాల్టీల సరిహద్దు గ్రామాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో భూముల విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటి ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశాలూ కన్పించడంలేదు. వ్యాపారం పడిపోయింది ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ప్రజల వద్ద డబ్బులేకపోవడం ఒక కారణమైతే, ప్రభుత్వం కొత్త పరిశ్రమల స్థాపన, విద్యా సంస్థల స్థాపన, ఇతరత్రా అభివృద్ధి ఏమీ జరగకపోవడం ఈ పరిస్థితికి కారణం. భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. కొనేవారు లేకపోయినా లేఅవుట్లు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. - అంబటి రమేష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి తగ్గిన రిజిస్ట్రేషన్లు, పెరిగిన దస్తావేజులు భూముల అమ్మకాల శాతం తగ్గినా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గలేదు. భీమవరం జిల్లా రిజిస్టార్ పరిధిలో క్రియ దస్తావేజులు రిజిస్ట్రేషన్లు 1.52 శాతం పడిపోయింది. కొనుగోలు శాతం తగ్గడంతో క్రియ దస్తావేజులు చేయించుకునేవారి శాతం తగ్గింది. గతేడాది 27,541 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా, ఈ ఏడాది 27,197 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇతర దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగింది. భీమవరం పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. - మహ్మద్ సిరాజుల్లా, జిల్లా రిజిస్ట్రార్, భీమవరం