పెరిగిన వడ్డీ రేట్ల ప్రభావం గృహ రుణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అత్యధిక వడ్డీ రేట్ల కారణంగా వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదికను విడుదల చేసింది. అయినప్పటికీ దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్‌లో ఇళ్లను కొనుగోలు చేసే సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో పూణే, కోల్‌కతాలు ఉన్నాయి.
ఇంటి ధరను, ఏడాదికి ఓ కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వారి ఆదాయంతో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఎక్కడ ఇళ్లను కొనుగోలు చేసే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుందో వివరిస్తుంది. వాటిలో 23 శాతం నిష్పత్తితో పుణె, కోల్‌కతా 26 శాతం చొప్పున ఉన్నాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది.
ఈ సందర్భంగా ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్న 8 నగరాల జాబితాను విడుదల చేసింది. వాటిల్లో ముంబై, ఢిల్లీ - ఎన్‌సీఆర్, బెంగళూరు,చెన్నై, కోల్‌కతా, పూణే, అహ‍్మదాబాద్, హైదరాబాద్‌లు మోస్ట్ అఫార్డబుల్ ఇండెక్స్ జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నాయి.
నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఒక నగరంలో ఇల్లు కొనుగోలు స్థాయి 40 శాతం అంటే, ఆ నగరంలోని కుటుంబాలు ఆ యూనిట్ కోసం హౌసింగ్ లోన్ ఈఎంఐకి చెల్లించేందుకు వారి ఆదాయంలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందని సూచిస్తుంది. 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐ ఆదాయ నిష్పత్తి భరించలేనిదిగా పరిగణిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment