ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాలు ఉన్నా.. వాటిల్లో కొన్నింటికి డిమాండ్ చాలా ఎక్కువ. స్థానిక పరిస్థితులతోనో, వ్యాపార, వాణిజ్య అవకాశాల తోనో అక్కడ ఇళ్ల ధరలు కూడా చాలా ఎక్కువ.
ఈ క్రమంలో నైట్ ఫ్రాంక్ సంస్థ.. ఇళ్ల ధరల ఆధారంగా ప్రపంచంలో ఖరీదైన నగరాల జాబితాను ‘వెల్త్ రిపోర్ట్–2023’లో వెల్లడించింది. ముఖ్యమైన నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో.. రూ.8.2 కోట్లు ఖర్చుపెడితే ఎన్ని చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ఇల్లు వస్తుందనే అంచనాలనూ పేర్కొంది.
నగరాలు ఇవే..
- మొనాకో.. 17 చ.మీటర్లలో ఇంటి పరిమాణం
- న్యూయార్క్.. 21
- సింగపూర్.. 33
- లండన్.. 34
- జెనీవా.. 37
- లాస్ ఏంజిలెస్.. 39
- ప్యారిస్.. 43
- షాంఘై.. 44
- సిడ్నీ.. 44
- బీజింగ్.. 58
- టోక్యో.. 60
- మియామీ.. 64
- బెర్లిన్.. 70
- మెల్‌బోర్న్.. 87
- దుబాయ్.. 105
- మాడ్రిడ్.. 106
- ముంబై.. 113
- కేప్‌టౌన్.. 218
- సావోపాలో.. 231
Comments
Please login to add a commentAdd a comment