Wealth Report
-
రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు) మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈమేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో వివరాలు వెల్లడయ్యాయి. జుకర్‌బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్ డాలర్ల(రూ.16.8 లక్షల కోట్లు)కు చేరుకుంది.ఇప్పటివరకు టెస్లా సీఈఓ ఇలోన్ మస్క్ 272 బిలియన్ డాలర్ల(రూ.22.7 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉన్నారు. జుకర్‌బర్గ్ ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న ఓరాకిల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్‌ను వెనక్కినెట్టారు.ఇదీ చదవండి: వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు..ఇలోన్ మస్క్జెఫ్ బెజోస్బెర్నార్డ్ ఆర్నాల్ట్మార్క్ జూకర్బర్గ్లారీ ఎల్లిసన్బిల్గేట్స్లారీపేజ్స్టీవ్ బామర్వారెన్బఫెట్సెర్జీబ్రిన్ -
సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా దేశాలు వాటి ఆదాయాలు పెంచుకుంటున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నాయి. స్థానికంగా తయారీ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఫలితంగా ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. దాంతో జీడీపీ పెంచుకుంటున్నాయి. 2010 నుంచి 2023 వరకు వివిధ దేశాల సంపద ఎలా వృద్ధి చెందిందో తెలియజేస్తూ ‘యూబీఎస్ గ్లోబల్ వెల్త్ నివేదిక 2024’ను విడుదల చేశారు.గడిచిన పదమూడేళ్ల కాలంలో కజకిస్థాన్ 190 శాతం, చైనా 185 శాతం, ఖతార్ 157 శాతం, ఇజ్రాయెల్ 140 శాతం, ఇండియా 133 శాతం సంపద వృద్ధి నమోదు చేసిందని నివేదిక తెలిపింది. జపాన్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ దేశాల సంపద వృద్ధి రుణాత్మకంగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని మొత్తం ఆర్థిక ఆస్తులు(స్టాక్స్, బాండ్లు, ఇతర పెట్టుబడులు)+వాస్తవిక ఆస్తుల(ఇళ్లు, స్థలాలు, బంగారం..) నుంచి మొత్తం రుణాలను తొలగించి సంపదను లెక్కించినట్లు నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: కేంద్ర సంస్థల మార్గదర్శకాలపై ప్రభుత్వం సమీక్ష2010-23 కాలానికిగాను సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలు(శాతాల్లో)కజకిస్థాన్-190చైనా-185ఖతార్-157ఇజ్రాయెల్-140ఇండియా-133హాంగ్‌కాంగ్-127ఇండోనేషియా-125అమెరికా-121హంగరీ-109తైవాన్-108సింగపూర్-106 -
Wealth Report 2024: సంపన్నుల సంఖ్య పైపైకి..
న్యూఢిల్లీ: దేశంలో సంపన్నులు మరింతగా విస్తరిస్తున్నారు. గతేడాది (2023) అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ/) సంఖ్య 6 శాతం పెరిగి 13,263కు చేరుకుంది. అంతేకాదు, 2028 నాటికి వీరి సంఖ్య 20,000కు పెరుగుతుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. 30 మిలియన్ డాలర్లు (రూ.250 కోట్లు), అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తులను యూహెచ్ఎన్డబ్ల్యూఐ కింద నైట్‌ఫ్రాంక్ పరిగణనలోకి తీసుకుంది. ‘ద వెల్త్ రిపోర్ట్ 2024’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2022 చివరికి దేశంలో సంపన్నుల సంఖ్య 12,495గా ఉన్నట్టు తెలిపింది. 2028 నాటికి 19,908కి వీరి సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై భా రత్ సంపద సృష్టి, అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. సంపన్నుల జనాభా గణనీయంగా పెరగడం, వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య మరో 50 శాతం వృద్ధి చెందడం దీనికి సూచిక’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. 2024 సానుకూలం.. తమ సంపద 2024లో వృద్ధి చెందుతుందని 90 శాతం మంది సంపన్నులు అంచనా వేస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. మొత్తం మీద 63 శాతం మంది అయితే, తమ సంపద 10 శాతానికి పైగా పెరుగుతుందని భావిస్తున్నారు. -
భారత్‌లో బిలియనీర్లు ఎంత మందో తెలుసా?
న్యూఢిల్లీ: భారతదేశంలో 30 మిలియన్ డాలర్ల (రూ.246 కోట్లు) పైన నెట్‌వర్త్ ఉన్న అల్ట్రా–హై–నెట్–వర్త్ వ్యక్తుల సంఖ్య గత ఏడాది 7.5 శాతం తగ్గి 12,069కి చేరినట్లు నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక పేర్కొంది. అయితే రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 19,119 పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ తెలిపారు. ఇదే జరిగితే పెరుగుదల పరిమాణం 58.4 శాతమన్నమాట. ‘‘ది వెల్త్ రిపోర్ట్ 2023’’ శీర్షికన ఆయా అంశాలకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ తాజా నివేదిక తెలిపిన ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే... ♦ భారత్ బిలియనీర్లు 2021లో 145 ఉంటే, 2022నాటికి 161కి పెరిగింది. 2027 నాటికి 195 మందికి ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా. ♦ దేశంలో మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి విలువ కలిగిన సంపన్నుల జనాభా 2021లో 7,63,674 ఉంటే, 2022లో 7,97,714కి పెరిగింది. 2027 నాటికి ఈ జనాభా 16,57,272కు చేరుతుందని అంచనా... ♦ భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా 2022లో అల్ట్రా–హై–నెట్–వర్త్ వ్యక్తుల సంఖ్య 3.8 శాతం తగ్గింది. 2021లో మాత్రం 9.3 శాతం పెరిగింది. ♦ ఆర్థిక మందగమనాలు, తరచుగా రుణ రేట్ల పెంపుదల, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అత్యంత సంపన్నుల సంపద, పెట్టుబడి పోర్ట్‌ఫోలియో ప్రభావితమవుతోంది. ♦ భారత్ విషయానికి వస్తే, వడ్డీరేట్ల పెరుగుదల, రూపాయిపై డాలర్ బలోపేతం వంటి అంశాలు వ్యక్తుల నెట్‌వర్త్ పెరుగుదలపై ప్రభావితం చూపిస్తోంది. వృద్ధి బాట... పారిశ్రామిక, పారిశ్రామికేతర రంగాలలో భారత్ ఇటీవల చక్కటి అభివృద్ధిని నమోదుచేసుకుంటోంది. ఆయా కార్యకలాపాలు ఇటీవలి కాలంలో దేశంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో దోహదపడ్డాయి. కొత్త సంపదను సృష్టించే గ్లోబల్ స్టార్టప్ హబ్‌గా భారతదేశం కీలక స్థానంలో ఉంది. దేశంలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, టెక్నాలజీ స్టార్టప్‌లు మొదలైన రంగాల నుండి వెలువడుతున్న కొత్త అవకాశాలు ఆర్థిక ఊపును ప్రోత్సహిస్తున్నాయి. సంపద సృష్టికి దోహదపడతాయి, ఇవన్నీ భారత్‌లో అత్యంత సంపన్నుల సంఖ్య పెరగడానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి – శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ -
ఇళ్ల ధరల్లో ఈ సిటీలు చాలా కాస్ట్లీ గురూ.. ముంబై ప్లేస్?
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాలు ఉన్నా.. వాటిల్లో కొన్నింటికి డిమాండ్ చాలా ఎక్కువ. స్థానిక పరిస్థితులతోనో, వ్యాపార, వాణిజ్య అవకాశాల తోనో అక్కడ ఇళ్ల ధరలు కూడా చాలా ఎక్కువ. ఈ క్రమంలో నైట్ ఫ్రాంక్ సంస్థ.. ఇళ్ల ధరల ఆధారంగా ప్రపంచంలో ఖరీదైన నగరాల జాబితాను ‘వెల్త్ రిపోర్ట్–2023’లో వెల్లడించింది. ముఖ్యమైన నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో.. రూ.8.2 కోట్లు ఖర్చుపెడితే ఎన్ని చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ఇల్లు వస్తుందనే అంచనాలనూ పేర్కొంది. నగరాలు ఇవే.. - మొనాకో.. 17 చ.మీటర్లలో ఇంటి పరిమాణం - న్యూయార్క్.. 21 - సింగపూర్.. 33 - లండన్.. 34 - జెనీవా.. 37 - లాస్ ఏంజిలెస్.. 39 - ప్యారిస్.. 43 - షాంఘై.. 44 - సిడ్నీ.. 44 - బీజింగ్.. 58 - టోక్యో.. 60 - మియామీ.. 64 - బెర్లిన్.. 70 - మెల్బోర్న్.. 87 - దుబాయ్.. 105 - మాడ్రిడ్.. 106 - ముంబై.. 113 - కేప్‌టౌన్.. 218 - సావోపాలో.. 231 -
విలాస నివాసాల్లో ముంబై టాప్
న్యూఢిల్లీ: విలాసవంత ఇళ్ల ధరల వృద్ధిలో ముంబై స్థానం అంతర్జాతీయంగా మరింత మెరుగుపడింది. ప్రపంచవ్యాప్త జాబితాలో 92వ స్థానం నుంచి (2021లో) ఏకంగా 37కు చేరుకుంది. 2022 సంవత్సరంలో ముంబైలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 6.4 శాతం పెరిగాయి. ఫలితంగా ముంబై 37వ ర్యాంక్‌కు చేరుకున్నట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అంతేకాదు ముంబై ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇళ్ల మార్కెట్‌గా 18వ స్థానంలో నిలిచింది. ‘ద వెల్త్ రిపోర్ట్ 2023’ని నైట్ ఫ్రాంక్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధిని ట్రాక్ చేసే ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పిరి100) 2022లో 5.2 శాతమే పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఈ సూచీ కంటే ముంబైలో విలాసవంతమైన ఇళ్ల ధరలు ఎక్కువ పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 100 పట్టణాల్లోని విలాసవంతమైన ఇళ్ల ధరలను ఈ నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది ముంబైలో ప్రధాన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు 3 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. బెంగళూరులో విలాసవంతమైన ఇళ్ల ధరలు గతేడాది 3 శాతం పెరగడంతో, 2022లో ప్రపంచవ్యాప్తంగా 63వ ర్యాంక్ దక్కించుకుంది. ఢిల్లీలో ఖరీదైన ఇళ్ల ధరలు 1.2 శాతం పెరిగాయి. ఈ జాబితాలో ఢిల్లీ 77వ స్థానంలో ఉంది. 2021లో 93వ ర్యాంకులో ఉండడం గమనించాలి. దుబాయి చిరునామా.. దుబాయిలో అత్యధికంగా ఖరీదైన ఇళ్ల ధరలు 20 22లో 44.2% పెరిగాయి. నైట్ ఫ్రాంక్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల కేంద్రంగా దుబాయి నిలిచింది. ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధి పరంగా రియాద్, టోక్యో, మియా మి, ప్రాగ్యూ, అల్గర్వే, బహమాస్, అథెన్స్, పోర్టో 2వ స్థానం నుంచి వరుసగా జాబితాలో ఉన్నాయి. -
సరిలేరు మీకెవ్వరూ!! ధనవంతులకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్!
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్‌లో హైదరాబాద్ సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. రూ.225 కోట్ల కంటే ఎక్కువ ఆస్తుల ఉన్న వ్యక్తుల ఆధారంగా దేశంలో ఎంత మంది ధనికులు ఉన్నారనే అంశంపై నైట్ ఫ్రాంక్ ఓ నివేదికను తయారు చేసింది. ఆల్ట్రా హై నెట్ వర్త్ ఇండివ్యూజివల్స్-2021 పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో ధనికుల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్‌లో హైదరాబాద్ లో 467 మంది వ్యక్తులు రూ.225 కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. 2026 సంవత్సరానికి ఆ వ్యక్తుల జాబితా 56శాతం వృద్దితో 728కి చేరనున్నట్లు హైలెట్ చేసింది. ఇక ముంబై 1596 మంది ధనికులతో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, పూణేలు ఉన్నాయి. ఈ సందర్భంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా మాట్లాడుతూ..హైదరాబాద్ టెక్నాలజీ తో పాటు, డిజిటల్ ఎకానమీ తోడ్పాటు కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2016 నుంచిలో 28.4 నుంచి అనూహ్యంగా 39శాతం వృద్దితో ధనవంతుల జాబితా పెరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా 2021లో ఐటీ,ఫార్మాసిట్యూకల్స్, బయోటెక్నాలజీ వంటి వ్యాపార రంగాల్లో హైదరాబాద్ కీ రోల్ ప్లే చేస్తుందని, కాబట్టి అనేక మంది ఆర్ధికంగా ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులతో పోటీ పడుతున్నారని రజనీ సిన్హా అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: భారత్‌కు బైబై!! సర్వేలో ఆసక్తికర విషయాలు! -
ఆ 63 మంది సంపద మన బడ్జెట్ కంటే అధికం
దావోస్ : భారత్‌లో 63 మంది బిలియనీర్ల సంపద 2018-19 కేంద్ర బడ్జెట్ (రూ 24.42 లక్షల కోట్లు) కంటే అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. దేశంలో కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల సంపద 70 శాతం జనాభా 95.3 కోట్ల మంది వద్ద ఉన్న సంపద కంటే నాలుగు రెట్లు అధికమని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కు చెందిన హక్కుల సంస్థ ఆక్స్‌ఫాం నివేదిక వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోందని ఆర్థిక అసమానతలు ఎంతలా విస్తరించాయో ఆక్స్‌ఫాం కళ్లకు కట్టింది. డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సమావేశానికి ముందు టైమ్ టూ కేర్ పేరుతో ఆక్స్‌ఫాం ఈ నివేదికను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2,153 మంది బిలియనీర్ల సంపద విశ్వవ్యాప్తంగా 60 శాతంగా ఉన్న 460 కోట్ల మంది వద్ద పోగుపడిన సంపద కంటే అధికమని తెలిపింది. దశాబ్ధంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరగడం ఆందోళనకరమని నివేదిక పేర్కొంది. ధనిక, పేదల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు సరైన విధానపరమైన చర్యలు అవసరమైని, కేవలం కొన్ని ప్రభుత్వాలే దీనికి కట్టుబడిఉన్నాయని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. సాధారణ ప్రజలు ముఖ్యంగా పేద మహిళలు, చిన్నారుల శ్రమకు సరైన ప్రతిఫలం దక్కడం లేదని, వారి ప్రయోజనాలను పణంగా పెట్టి సంపన్నులు పైమెట్టుకు చేరుతున్నారని నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. టెక్నాలజీ కంపెనీ సీఈవో తీసుకునే వార్షిక వేతనాన్ని ఇంటి పనులు చేసే మహిళా కార్మికురాలు అందుకోవాలంటే ఏకంగా 22,227 సంవత్సరాలు పడుతుందని నివేదిక అంచనా వేసింది. మహిళలు, చిన్నారులు చేస్తున్న పనులకు సరైన వేతనం దక్కడం లేదని పేర్కొంది. పేదరికం, అసమానతలను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులను సమీకరించడంలో ప్రభుత్వాలు సంపన్న వ్యక్తులపై భారీగా పన్నులను వడ్డించడంలో విఫలమవుతున్నాయని తెలిపింది. -
బంగారం, స్థిరాస్తులే విలువైన ఆస్తులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం, స్థిరాస్తులంటే భారతీయులకు ఇప్పటికీ మోజే. అందుకే కాబోలు భౌతిక ఆస్తుల సంపదలో వీటి వాటా ఏకంగా 91 శాతం పైమాటేనట!! ఈ మాట చెప్పింది వేరెవరో కాదు. ఫైనాన్షియల్ సేవల దిగ్గజం కార్వీ. ఈ సంస్థ ‘ఇండియా వెల్త్ రిపోర్ట్’ పేరిట 8వ నివేదికను విడుదల చేసింది. దీన్లో... భారతీయుల భౌతిక ఆస్తుల్లో వ్యక్తిగత సంపద రూ.140 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడయింది. దీన్లో బంగారం రూపంలో ఉన్నది ఏకంగా రూ.68.45 లక్షల కోట్లు. ఇది మొత్తం భౌతిక ఆస్తుల్లో దాదాపు సగం. ఇక రియల్టీ రంగంలో వ్యక్తిగత ఆస్తుల సంపద రూ.60.25 లక్షల కోట్లుగా ఉంది. అంటే... ఒకరకంగా చెప్పాలంటే రియల్టీకన్నా బంగారంలోనే వ్యక్తిగత సంపద ఎక్కువగా ఉందన్న మాట. వచ్చే ఐదేళ్ల కాలంలో భౌతిక ఆస్తుల సంపదలో రియల్టీ రూ.121 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో కార్వీ ఇండియా సీఈఓ అభిజిత్ భావే తెలియజేశారు. ప్రస్తుతం 43 శాతంగా ఉన్న రియల్టీ రంగం వృద్ధి 2022 నాటికి 51.57 శాతానికి చేరుతుందని ఆయన అంచనా వేశారు. పెద్ద నోట్ల రద్దు, స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల దేశీయ రియల్టీ రంగంలో నెలకొన్న పారదర్శకతే వృద్ధి చోదకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. -
పదేళ్లలో బిలియనీర్లు డబుల్
న్యూయార్క్: భారత్‌లో రానున్న పదేళ్లలో కుప్పలు తెప్పలుగా సంపద పోగుపడుతుందని, కుబేరుల సంఖ్య పెరుగుతుందని అంతర్జాతీయ ప్రోపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ నైట్ ఫ్రాంక్ 2014 వెల్త్ రిపోర్ట్ పేర్కొంది. 2023 కల్లా బిలియనీర్ల సంఖ్య విషయమై నాలుగో అతి పెద్ద దేశంగా భారత్ అవతరిస్తుందంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..., గత ఏడాది 60గా ఉన్న భారత్ బిలియనీర్ల సం ఖ్య 2023కల్లా 98% వృద్ధితో 119కు చేరుతుంది. 2023 కల్లా అమెరికా, చైనా, రష్యాల తర్వాత అధిక బిలియనీర్లు ఉన్న దేశంగా భారత్ నాలుగో స్థానంలో నిలుస్తుంది. ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌ల్లో కన్నా భారత్‌లోనే బిలియనీర్ల సంఖ్య అధికంగా ఉంటుంది. {పపంచంలో మూడో పెద్ద వేగవంత ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో సంపద సృష్టి మరింత వేగంగా వృద్ధి చెందుతుంది. పదేళ్లలో ఆల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(యూహెచ్‌ఎన్‌ఐ) సంఖ్య రెట్టింపవుతుంది. 2013లో 1,576గా ఉన్న వీరి సంఖ్య 3,130కు పెరుగుతుంది. గత ఏడాది 383గా ఉన్న 10 కోట్ల డాలర్లకు పైగా ఆస్తులున్న కుబేరుల సంఖ్య 2023 నాటికి 99 శాతం వృద్ధితో 761కు పెరుగుతుంది. పదేళ్లలో యూరప్ కన్నా ఆసియాలోనే కుబేరుల సంఖ్య అధికంగా ఉంటుంది. కుబేరుల సంఖ్య వృద్ధి విషయంలో అత్యధిక వృద్ధి ఉండే నాలుగో నగరంగా ముంబై నిలిచింది. ఈ సంఖ్య 577 నుంచి 126% వృద్ధితో 1,302కు పెరుగుతుంది. ముంబై తర్వాత 118% వృద్ధితో ఢిల్లీ నిలిచింది. 2024 నాటికల్లా టాప్ 10 గ్లోబల్ సిటీల్లో ముంబై చోటు సాధిస్తుంది.