ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా దేశాలు వాటి ఆదాయాలు పెంచుకుంటున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నాయి. స్థానికంగా తయారీ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఫలితంగా ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. దాంతో జీడీపీ పెంచుకుంటున్నాయి. 2010 నుంచి 2023 వరకు వివిధ దేశాల సంపద ఎలా వృద్ధి చెందిందో తెలియజేస్తూ ‘యూబీఎస్ గ్లోబల్ వెల్త్ నివేదిక 2024’ను విడుదల చేశారు.
గడిచిన పదమూడేళ్ల కాలంలో కజకిస్థాన్ 190 శాతం, చైనా 185 శాతం, ఖతార్ 157 శాతం, ఇజ్రాయెల్ 140 శాతం, ఇండియా 133 శాతం సంపద వృద్ధి నమోదు చేసిందని నివేదిక తెలిపింది. జపాన్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ దేశాల సంపద వృద్ధి రుణాత్మకంగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని మొత్తం ఆర్థిక ఆస్తులు(స్టాక్స్, బాండ్లు, ఇతర పెట్టుబడులు)+వాస్తవిక ఆస్తుల(ఇళ్లు, స్థలాలు, బంగారం..) నుంచి మొత్తం రుణాలను తొలగించి సంపదను లెక్కించినట్లు నివేదిక పేర్కొంది.
ఇదీ చదవండి: కేంద్ర సంస్థల మార్గదర్శకాలపై ప్రభుత్వం సమీక్ష
2010-23 కాలానికిగాను సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలు(శాతాల్లో)
కజకిస్థాన్-190
చైనా-185
ఖతార్-157
ఇజ్రాయెల్-140
ఇండియా-133
హాంగ్‌కాంగ్-127
ఇండోనేషియా-125
అమెరికా-121
హంగరీ-109
తైవాన్-108
సింగపూర్-106
Comments
Please login to add a commentAdd a comment