house constructions
-
హరిత భవనాలే రక్ష!
జనాభాతో పాటుగా ఇంటి నిర్మాణాలు పెరిగి పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూల జీవన శైలిని కొనసాగించడానికి హరిత భవనాలు ఎంతో ఉపయోగపడతాయి. పర్యావరణ అనుకూల మెటీరియల్, డిజైన్‌తో భవనాన్ని నిర్మించి, పర్యావరణ అనుకూలంగా ఏ భవనాలనైతే నిర్వహిస్తారో వాటిని ‘హరిత భవనాలు’ అంటారు.ఈ భవన నిర్మాణంలో స్థలం ఎంపికకూ ప్రాధాన్యం ఉంది. అంటే పర్యావరణ సున్నితమైన ప్రదేశాలలో హరిత భవనాలను నిర్మించరాదు. ఉదాహరణకు అధిక మొత్తంలో వ్యవసాయ దిగుబడిని ఇచ్చే సారవంతమైన వ్యవసాయ భూములను హరిత భవనాల నిర్మాణాల కోసం వాడరాదు. దీని వలన మనం ప్రకృతి సిద్ధంగా లభించిన విలువైన వ్యవసాయ భూమిని కోల్పోతాము. ఇది ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా వీటి నిర్మాణాన్ని చేపడతారు. వెలుతురు బాగా ఉండే గదులలో చదివే విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం, వెలుతురు సరిగ్గా లేని గదిలో చదివే విద్యార్థుల కన్నా 20 నుండి 26 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. హానికర రసాయన పదార్థాలు కలిగిన లెడ్ పెయింట్లు భవనాల లోపల గాలి నాణ్యతను హానికరంగా మారుస్తాయి కావున వాటి స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడతారు. ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా ఈ భవనాలలో ఉంటుంది. దీనివలన భవనాల లోపల గాలి నాణ్యత పెరుగుతుంది.తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఎల్ఈడీ బల్బ్‌లను, ఇతరత్రా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం వలన ఈ భవనాలలో తక్కువగా విద్యుత్ ఖర్చవుతుంది. అదేవిధంగా సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ను వాడటం వలన గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో హరిత భవనాలు కీలక పాత్ర వహిస్తాయి. హరిత భవన పైకప్పులో కాంతిని రిఫ్లెక్ట్ చేసే పదార్థాలను వాడటం వల్ల ఇంటి పైకప్పు వేడి తగ్గుతుంది. పైకప్పు భాగంలో చిన్న, చిన్న మొక్కలను పెంచడం వలన వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను ఇవి గ్రహిస్తాయి. అదేవిధంగా ఇంటి పై కప్పు భాగంలో జీవ వైవిధ్యం పెరిగి సీతాకోకచిలుకలు, పక్షులు వంటి వాటిని ఆకర్షించడం వలన భవనం ఆకర్షణీయంగా మారుతుంది.ఈ భవనాలలో సేంద్రియ వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌గా మార్చడం లేదా సేంద్రియ ఎరువుగా మార్చి ఉపయోగించే ఏర్పాట్లు ఉంటాయి. వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి గార్డెనింగ్, ఇతరత్రా పనులకు వినియోగించడం వలన నీరు వృథా కాదు. ఈ నిర్మాణాలలో వర్షపు నీరును పట్టి భూమిలోకి ఇంకిపోయేలా చేసే ఏర్పాట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హరిత భవనాలు వాతావరణ మార్పుల నుండి మానవాళిని రక్షించగలుగుతాయి అనడం అతిశయోక్తి కాదు. – డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హైదరాబాద్ -
టార్గెట్ 5 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మ సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఉన్న సీఎం జగన్ సర్కార్.. వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ అడుగులు వేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30.75 లక్షల మంది పేద మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాక.. ఇందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చారు. మొదటి దశ కింద మొన్న ఆగస్టు నెలాఖరు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. గత నెల 12 నాటికి రెండో దశలోని కొన్ని ఇళ్లతో కలిపి 7.43 లక్షల (5.86 లక్షల సాధారణ + 1.57 లక్షల టిడ్కో) ఇళ్లను లబ్దిదారులకు అందజేశారు. శరవేగంగా రెండో దశ ఇళ్ల నిర్మాణం.. ఇక రెండో దశలో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే 98,308 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన నాలుగు లక్షలకు పైగా ఇళ్లను నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసి పేదలకు అందించేందుకు గృహ నిర్మాణ శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ముగింపు దశలో 12,479, రూఫ్ లెవెల్లో 1.03 లక్షలు, పునాది పైదశల్లో 3.94 లక్షల చొప్పున ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటినీ వేగంగా పూర్తిచేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. ఉచితంగా స్థలం.. ఆపై అమిత సాయం మరోవైపు.. ఇళ్ల లబ్దిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగకుండా ఇంటి నిర్మాణం నిమిత్తం యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేస్తోంది. ♦ స్వయం సహాయక బృందాల ద్వారా లబ్దిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణసాయం చేస్తోంది. ♦ ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు.. స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా> చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్దిచేకూరుస్తోంది. ♦ అలాగే, జగనన్న కాలనీల్లో ఉచితంగా నీటి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రెయిన్లు, రోడ్లు లాంటి సకల వసతులను సమకూరుస్తోంది. ♦ ఇలా స్థలం, ఇంటితో కలిపి పేదింటి మహిళల పేరిట రూ.10 లక్షలు, ఆపైన విలువైన స్థిరాస్తిని జగన్ సర్కార్ సమకూరుస్తోంది. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తిచేయాల్సిన లక్ష్యాన్ని అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీపావళి, క్రిస్మస్, జనవరి ఫస్ట్ ఇలా వరుస పండుగలు, ప్రత్యేక రోజులు ఉన్నందున.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించి పనులు చకచకా పూర్తిచేయడానికి శ్రమిస్తాం. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ -
లక్ష్యానికి చేరువలో..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెలలో 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా.. ఇప్పటివరకూ 4.82 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తి కానుంది.రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 31 లక్షలకు పైగా పేదింటి అక్కచెల్లెమ్మలకు పట్టాలు అందించారు. రెండు దశల్లో 21.25 లక్షలకు పైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 18.63 లక్షలు సాధారణ ఇళ్లు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ఈ నెలలో పూర్తిచేయాల్సి ఉంది. రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు చేస్తూనే, మౌలిక సదుపాయాలు కూడా చకచకా కల్పిస్తున్నారు. పూర్తయిన ఇళ్లకు కరెంటు, మంచి నీటి కనెక్షన్లు ఇస్తున్నారు. అన్ని విధాలా అండగా.. నిజానికి.. మనిషి కనీస అవసరాల్లో ఒకటైన పక్కా ఇంటిని పేదలకు సమకూర్చడానికి సీఎం జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా వారికి అండగా నిలిచింది. ప్రాంతాన్ని బట్టి రూ.15 లక్షల వరకు విలువైన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం లబి్ధదారులకు ఉచితంగా పంపిణీ చేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు పావలా వడ్డీకి రూ.35 వేల బ్యాంకు రుణం సమకూరుస్తోంది. అంతేకాక.. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తోంది. మిగిలిన ఐరన్, సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరలకన్నా తక్కువకు సరఫరా చేయడం ద్వారా ఒక్కో లబి్ధదారుడికి రూ.54,518 మేర అదనపు సాయం చేస్తోంది. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో మార్కెట్లో తక్కువ ధరకు నిర్మాణ సామగ్రిని సరఫరా చేసే కంపెనీలను ఎంపిక చేసి ప్రభుత్వం పేదలకు ఈ వస్తువులు సమకూరుస్తోంది. సొంతింటి కల నెరవేరింది నా భర్త ఆటో డ్రైవర్. ఆయన సంపాదన ఇంటి అద్దె, ఇతర కుటుంబ అవసరాలకు సరిపోయేది. దీంతో సొంతిల్లు కలగానే మిగిలిపోయింది. ఇల్లు కట్టుకుందామంటే అంత స్థోమత మాకులేదు. ప్రభుత్వం ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని దరఖాస్తు చేశాం. స్థలం, ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం కూడా పూర్తయింది. ప్రస్తుతం సొంతింటిలో సంతోషంగా ఉంటున్నాం. సీఎం జగన్ దశాబ్దాల మా కలను నెరవేర్చారు. – షేక్ మహబూబ్ బీ, వినుకొండ, పల్నాడు జిల్లా మరింత వేగంగా నిర్మాణాలు ఇళ్ల నిర్మాణాల్లో మరింత వేగం పెంచుతున్నాం. ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని ఈ నెలలో ఛేదిస్తాం. వచ్చే డిసెంబర్ నెలాఖరు లోగా మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులతో పాటు, నిర్మాణ సామగ్రిని సమకూరుస్తున్నాం. – లక్ష్మీషా, ఎండీ, గృహ నిర్మాణ సంస్థ -
‘ఇంటి’పైనా అక్కసేనా రామోజీ!?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతూ నిరుపేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రూ.56,103 కోట్లు ఖర్చుచేసి 71,811 ఎకరాల్లో 30 లక్షలకు పైగా పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17,005 కొత్త ఊళ్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో లబ్ధిదారునికి పక్కా ఇంటి రూపంలో రూ.10 లక్షల మేర స్థిరాస్తి సమకూరుతోంది. దీంతో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఏదో రకంగా బాబుకు మేలు చేయాలని నిశ్చయించుకున్న ఈనాడు రామోజీరావు పేదలకు ప్రభుత్వం చేస్తున్న మంచిపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా.. పేదలందరికీ ఇళ్ల పథకంపై పనిగట్టుకుని నిత్యం విష ప్రచారం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం ‘ఇవేం కాలనీలు జగనన్నా?’ అంటూ ఈనాడులో ఓ కథనం ప్రచురించారు. చిరుజల్లులు కురిసినా కాలనీలు జలమయం అవుతున్నాయంటూ అడ్డగోలుగా రాసుకొచ్చారు. ఈ క్రమంలో రామోజీ విష ప్రచారం వెనుక వాస్తవాలివీ.. ఈనాడు : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రు జగనన్న కాలనీ జలమయం అయింది. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. వాస్తవం : గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో ఈనెల మూడో తేదీన రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం కురిసిన ప్రాంతాల్లో కంకిపాడు మండలం కూడా ఒకటి. లోతట్టు ప్రాంతాల్లో నీరు ఆగడం సర్వసాధారణం. అలాంటిది కంకిపాడు మండలంలోని లేఅవుట్లో నీరు ఆగిందంటూ ఈనాడు గుండెలు బాదుకుంది. అయితే, ఈ లేఅవుట్లో ఇప్పటికే 50 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 254 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. నాడు కళ్లకు గంతలు పేదలకు పెద్దఎత్తున మేలు జరుగుతుంటే దానిపైనా నేడు రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి వర్షానికే సంద్రాన్ని తలపించే లోతట్టు ప్రాంతంలోనే చంద్రబాబు రాజధాని తలపెట్టారు. అదే విధంగా రూ. వందల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో ధారగా వర్షం కారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, సీఎం తమవాడన్న కారణంతో రామోజీకి అప్పట్లో అవేమీ కనపడలేదు. కళ్లుండి కబోది అయ్యారు. కానీ, నేడు అవన్నీ మర్చిపోయి గోరంతను కొండంతగా చూపి విషం కక్కుతున్నారు. నిజానికి.. తేలికపాటి వర్షాలకే ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం పడిన రోజుల్లో లేఅవుట్లలో నీరు నిలిచిందని రామోజీ రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గృహ యజ్ఞంపై దుష్ప్రచారం ఇక పేదలందరికీ ఇళ్ల పథకంపై తరచూ విషపు రాతలు రాయడం రామోజీ దుష్ప్రచారంలో భాగమే. ఈ పథకం కింద ఇళ్ల పట్టాల పంపిణీకి రూ.56,102.91 కోట్లు, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం మరో రూ.36,026 కోట్లు.. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లు చొప్పున ప్రభుత్వం ఖర్చుచేస్తూ సీఎం జగన్ గృహ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఈనాడు : కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామంలోని లేఅవుట్లో చిన్నపాటి వర్షానికి నీళ్లు నిలిచాయి. చెరువును తలపిస్తోంది. వాస్తవం : శుక్రవారం ఉదయం ఈ లేఅవుట్లో సాధారణ పరిస్థితి నెలకొంది. చెరువును తలపించేలా వర్షపునీరు లేదు. ఈ లేఅవుట్లో ఇప్పటికే 47 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 115 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తంగా 234 ఇళ్లు ఈ లేఅవుట్లో నిర్మిస్తున్నారు. ఈనాడు : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చినవలసల లేఅవుట్‌లోనూ వర్షానికి నీళ్లు ఆగాయి. వాస్తవం : గడిచిన నాలుగు రోజులుగా ఈ మండలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల రెండో తేదీన తాళ్లరేవు మండలంలో 91 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ మధ్య ఈ మండలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ లేఅవుట్లో కూడా 30 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 36 ఇళ్లు నిర్మాణ దశల్లో ఉండగా, 103 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. -
షీర్ వాల్ టెక్నాలజీతో పేదల ఇళ్లు.. పైలెట్‌గా మోడల్ ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణంలో షీర్ వాల్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30 లక్షలకు పైగా గృహాల నిర్మాణాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులివ్వగా ఇప్పటికే 17.22 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. ఆప్షన్–3(ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఇళ్లు) గృహాల నిర్మాణానికి షీర్ వాల్ పరిజ్ఞానాన్ని వినియోగించటాన్ని గృహ నిర్మాణ శాఖ పరిశీలిస్తోంది. అమలాపురం మున్సిపాలిటీలో.. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రూ.1.80 లక్షలు, అదనపు సాయం కింద బ్యాంక్ రుణం రూపంలో అందచేసే రూ.35 వేలతోనే షీర్ వాల్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణానికి కొందరు నిర్మాణదారులు ముందుకొచ్చారు. వేగంగా ఇళ్ల నిర్మాణంతో పాటు భూకంపాలు, తుపాన్లను సైతం తట్టుకునేలా ఇంటి నిర్మాణం పూర్తవుతుండటంతో ఈ పరిజ్ఞానం వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించిన బోడసకుర్రు వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో కొఫియ గ్రూప్‌నకు చెందిన అజయ్హోమ్స్ అనే సంస్థ పైలట్‌గా షీర్ వాల్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. నాణ్యతను పరీక్షించిన అనంతరం ఈ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన లేఅవుట్లకు విస్తరించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్ణయించారు. షీర్ వాల్ పద్ధతిలో ఇటుకలు అవసరం లేకుండా సిమెంట్, కాంక్రీట్, ఇనుముతో కాంక్రీట్ గోడలు నిర్మిస్తారు. ఉగాదికి ఐదు లక్షల ఇళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రెండు దశల్లో 17.22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా ఇప్పటికే 3,00,986 గృహాల నిర్మాణం పూర్తయ్యింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 25,573, చిత్తూరులో 25,072, పశ్చిమ గోదావరిలో 19,205 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గడువులోగా లక్ష్యాన్ని చేరుకునేలా నిర్మాణ పనులను వేగవంతం చేశారు. నాణ్యత పరీక్షల అనంతరం.. షీర్ వాల్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణానికి నిర్మాణదారులు ముందుకొస్తున్నారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో పైలెట్‌గా ఈ పద్ధతిలో ఒకటి రెండు ఇళ్లను నిర్మిస్తాం. వీటి నాణ్యతను పరీక్షించిన అనంతరం ఈ పద్ధతిని కొనసాగిస్తాం. – లక్ష్మి షా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ. -
ఇళ్ల ధరల్లో ఈ సిటీలు చాలా కాస్ట్లీ గురూ.. ముంబై ప్లేస్?
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాలు ఉన్నా.. వాటిల్లో కొన్నింటికి డిమాండ్ చాలా ఎక్కువ. స్థానిక పరిస్థితులతోనో, వ్యాపార, వాణిజ్య అవకాశాల తోనో అక్కడ ఇళ్ల ధరలు కూడా చాలా ఎక్కువ. ఈ క్రమంలో నైట్ ఫ్రాంక్ సంస్థ.. ఇళ్ల ధరల ఆధారంగా ప్రపంచంలో ఖరీదైన నగరాల జాబితాను ‘వెల్త్ రిపోర్ట్–2023’లో వెల్లడించింది. ముఖ్యమైన నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో.. రూ.8.2 కోట్లు ఖర్చుపెడితే ఎన్ని చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ఇల్లు వస్తుందనే అంచనాలనూ పేర్కొంది. నగరాలు ఇవే.. - మొనాకో.. 17 చ.మీటర్లలో ఇంటి పరిమాణం - న్యూయార్క్.. 21 - సింగపూర్.. 33 - లండన్.. 34 - జెనీవా.. 37 - లాస్ ఏంజిలెస్.. 39 - ప్యారిస్.. 43 - షాంఘై.. 44 - సిడ్నీ.. 44 - బీజింగ్.. 58 - టోక్యో.. 60 - మియామీ.. 64 - బెర్లిన్.. 70 - మెల్బోర్న్.. 87 - దుబాయ్.. 105 - మాడ్రిడ్.. 106 - ముంబై.. 113 - కేప్‌టౌన్.. 218 - సావోపాలో.. 231 -
హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఎప్పటినుంచో వెస్ట్జోన్కే ఎంతో డిమాండ్ ఉంది. పలు ఐటీ సంస్థలతోపాటు అక్కడి సదుపాయాల వల్ల ప్రజలు అటువైపే స్థిరనివాసాలకు మొగ్గుచూపేవారు. అయితే గత రెండేళ్లుగా మధ్యతరగతి ప్రజలు ఈస్ట్‌జోన్‌లో ఇళ్లు కట్టుకొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ జోన్‌కు దగ్గర్లో పలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నందున పిల్లల చదువుల కోసం నగరానికి వచ్చేవారు, దాదాపు రెండు గంటల ప్రయాణ సమయం పట్టే ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఈస్ట్‌జోన్‌లోని సంస్థల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుంటున్నారు. ఏడాదికాలంలో జీహెచ్ఎంసీ జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులు సైతం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. వెస్ట్‌జోన్‌తో పోలిస్తే భూముల ధరలు తక్కువ ఉండటమే ప్రధాన కారణం. అలాగే ఇటీవల పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి రావడంతోపాటు యాదాద్రి, వరంగల్, నల్లగొండ, విజయవాడలకు వెళ్లే హైవేలు, మెట్రో సదుపాయం ఉండటంతో నివాస గృహాలకు ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ లుక్ ఈస్ట్.. నినాదం కూడా పలువురిని ఆకట్టుకుంటోంది. ఏడాది కాలంలో జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో 11 వేల భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా ఈస్ట్‌జోన్‌లోని హయత్‌నగర్ సర్కిల్లోనే అత్యధికంగా 1,722 ఉన్నాయి. ఈ జోన్‌లోని ఉప్పల్, కాప్రా సర్కిళ్లలో అత్యధిక భవనాలకు అనుమతులిచ్చారు. ఐదంతస్తుల వరకు నివాస భవనాల్లోనూ దాదాపు 2 వేల భవనాలకు అనుమతులివ్వగా ఈస్ట్ జోన్లోనే అత్యధికంగా 600 వరకు ఉన్నాయి. అందుబాటులో ధరలు.. ఈస్ట్‌జోన్‌లో భూముల ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్నాయి. హైక్లాస్ భవనాలైనా ఎస్ఎఫ్టీకి రూ. 5వేల లోపే లభిస్తున్నాయి. – శ్రీనివాస్‌రెడ్డి, బిల్డర్, ఉప్పల్ సదుపాయాలు బాగున్నాయి ఇళ్లు నివాసయోగ్యంగా ఉండటంతోపాటు ఇక్కడి నుంచి ఏ ప్రాంతంవైపు వెళ్లాలన్నా సౌకర్యాలు బాగుండటంతో ఇటీవలే ఇల్లు కట్టుకున్నాం. – బాలచందర్, ఉప్పల్ రవాణా సౌకర్యాలున్నాయి ఎల్బీనగర్ ప్రాంతం తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు ఏపీవాసులకు ముఖద్వారంగా ఉంది. మెట్రో అనుసంధానంతోపాటు ఫ్లైఓవర్ల వల్ల ట్రాఫిక్ సమస్యల్లేవు. రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ మరో గచ్చిబౌలిలా మారొచ్చు. – స్వప్నారెడ్డి, గృహిణి, సహారా ఎస్టేట్స్ కాలనీ, మన్సూరాబాద్ చదవండి: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం -
రోజుకు 2,000 ఇళ్లు పూర్తి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ మధ్య 27,895 ఇళ్లు నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. అదే విధంగా 1,19,493 స్టేజ్ కన్వర్షన్లు (ఇంటి నిర్మాణం ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడం) నమోదయ్యాయి. ఈ లెక్కన రోజుకు సగటున 1,860 ఇళ్ల నిర్మాణం పూర్తవుతుండగా, 7,966 స్టేజ్ కన్వర్షన్లు అవుతున్నాయి. ఈ నిర్మాణాలను మరింత వేగంగా చేపట్టడంపై గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. దీంతో ప్రస్తుతం రోజుకు రెండు వేల ఇళ్ల వరకూ నిర్మాణం పూర్తవుతున్నాయి. వీటిని మరింత వేగవంతం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 11 మంది సీనియర్ అధికారులను జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించింది. వీరు వారంలో రెండు రోజులపాటు ఆయా జిల్లాల్లోని లేఅవుట్లలో పర్యటించి నిర్మాణ పనులను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ యజ్ఞాన్ని రాష్ట్రంలో చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులివ్వగా 17.22 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు. ఇవి ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. డిసెంబర్ నుంచి పుంజుకున్న నిర్మాణాలు గత ఏడాది రాష్ట్రంలో భారీగా వర్షాలు, గోదావరి వరదలు ఇళ్ల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపాయి. పలు జిల్లాల్లో లేఅవుట్లలో నిర్మాణ మెటీరియల్ తరలించడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డిసెంబర్ నుంచి నిర్మాణాలు పుంజుకున్నాయి. డిసెంబర్ 1 నుంచి 15 మధ్య 83,166 స్టేజ్ కన్వర్షన్లు, 12,296 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేవి. ఇలా క్రమంగా పెరుగుతూ ఫిబ్రవరి 1–15 తేదీల నాటికి 1.19 లక్షల స్టేజ్ కన్వర్షన్లు, 27వేలకు పైగా నిర్మాణాలు పూర్తయ్యే స్థాయికి పనుల వేగం పెరిగింది. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యం నిర్దేశించుకుంది. ఇప్పటికే 2,74,210 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది రూ.7,630 కోట్ల ఖర్చు పేదల ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7,630 కోట్లు ఖర్చుచేసింది. ఇందులో రూ.5,325 కోట్లు లబ్ధిదారులకు చెల్లింపులు కాగా.. సబ్సిడీపై 7.45 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు రూ.373 కోట్లు, 94,242 టన్నుల స్టీల్ సరఫరాకు రూ.673 కోట్లు.. ఇసుక, ఇతర నిర్మాణ సామాగ్రి అందించడానికి రూ.620 కోట్ల మేర ఖర్చయింది. ఇక ఈ పథకం కింద ఇళ్లులేని పేదలకు ఉచితంగా రూ.లక్షలు ఖరీదుచేసే స్థలాన్ని ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. అదనపు సాయం కింద పావలా వడ్డీకి రూ.35వేల చొప్పున బ్యాంకు రుణ సాయం అందిస్తున్నారు. దీంతో పాటు ఉచితంగా ఇసుక, సబ్సీడీపై స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రి సరఫరా చేస్తున్నారు. మొత్తంగా పథకం ద్వారా పేదలకు ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్ల మేర మేలు చేస్తోంది. 631 లేఅవుట్ల సందర్శన ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే శనివారాన్ని హౌసింగ్ డేగా నిర్వహిస్తున్నాం. గడిచిన నాలుగు శనివారాల్లో 631 లేఅవుట్లను జిల్లా, మండల, గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి అధికారులు, సిబ్బంది సందర్శించి అక్కడి సమస్యలను మా దృష్టికి తెస్తున్నారు. వాటిని జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించడానికి ప్రత్యేక నిధిని కేటాయించాం. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ -
విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేకొద్దీ కరెంట్, నీటి సరఫరా, డ్రైనేజీ లాంటి కనీస సదుపాయాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్త ఇళ్లలోకి ప్రవేశించే ముందు ఎవరైనా తొలుత వీటినే కోరుకుంటారని, అందువల్ల ఈ మూడింటిని తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. నిర్ణీత దశకు రాగానే కరెంట్ కనెక్షన్ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టిడ్కో ఇళ్లు కాకుండా రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పటికే ఇళ్ల నిర్మాణాల కోసం ఖర్చు పెట్టాం. గృహ నిర్మాణాలు పూర్తవుతున్నకొద్దీ కనీస సదుపాయాలను కల్పించాలి. ఇళ్ల లబ్ధిదారులతో క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. నిర్మాణం నిర్ణీత దశకు చేరుకోగానే ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి. ఇందుకు తగ్గట్టుగా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ప్రత్యామ్నాయ స్థలాలు.. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏర్పాటైన కాలనీల్లో లక్షల ఇళ్లను నిర్మించడం ద్వారా నిరుపేదలకు గృహ యోగం కల్పిస్తున్నాం. కొన్ని చోట్ల న్యాయ వివాదాల కారణంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వాటిపై దృష్టి సారించాలి. కోర్టు వివాదాలతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయిన చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషించి ఆ స్థలాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలి. గృహనిర్మాణశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఔట్ల సందర్శన.. 4 రకాల పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. టిడ్కో ఇళ్లు కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణాల కోసం ఇప్పటివరకు రూ. 6,435 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. క్రమం తప్పకుండా లేఔట్లను సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నామని, డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దఫాలు లేఔట్లను పరిశీలించినట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని లేఔట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన ల్యాబ్‌లను కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక కార్యదర్శులు అజయ్‌జైన్, సాయిప్రసాద్, విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ షా, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: లక్షణంగా ఇళ్ల నిర్మాణం.. కానీ, దుష్ట చతుష్టయం మాత్రం!
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గత మూడున్నరేళ్లలో పట్టణాల్లో 15.6 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.79 లక్షలకుపైగా గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో 15 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపనలు చేయగా సుమారు 1.80 లక్షలకు పైగా గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇలా లక్షల సంఖ్యలో ఇళ్లతో ఏకంగా కొత్త ఊళ్లనే ప్రభుత్వం నిర్మిస్తుంటే దుష్ట చతుష్టయం మాత్రం యథాప్రకారం బురద చల్లుతోంది. దున్న ఈనిందంటే.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా 2019–20 నుంచి 2021–22 మధ్య ప్రధాని ఆవాస్ యోజన –గ్రామీణ్(పీఎంఏవై–జీ) కింద ఎన్ని ఇళ్లు నిర్మించారని లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ స్పందించి రాష్ట్రాల వారీగా నివేదికను అందించింది. ఏపీలో 2019–20 నుంచి 2021–22 మధ్య ఐదు ఇళ్లు నిర్మించారని అందులో పేర్కొంది. దీంతో దున్నపోతు ఈనిందంటే గాటికి కట్టెయ్ అన్న చందంగా మూడున్నరేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం కేవలం ఐదు ఇళ్లనే నిర్మించిందంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం, దుష్ట చతుష్టయం దుష్ఫ్రచారానికి దిగాయి. ఆ ఐదు ఇళ్లు 2016–18 నాటివే 2019–20 నుంచి 2021–22 మధ్య రాష్ట్రంలో పీఎంఏవై–జీ కింద నిర్మించిన ఐదు ఇళ్లు 2016–17, 2017–18లో మంజూరైనవే కావడం గమనార్హం. నాడు 1.23 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించగా టీడీపీ ప్రభుత్వం 68 వేల ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభించింది. అయితే ఇందులో 46 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అప్పట్లో మంజూరై నిర్మాణం ఆలస్యం అయిన ఐదు ఇళ్లు 2019 – 2022 మధ్య పూర్తయ్యాయి. ఇదే అంశాన్ని కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించింది. ఇదీ అసలు సంగతి.. 2019–20, 2020–21 మధ్య కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై–జీ కింద రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులివ్వలేదు. 2021–22లో మాత్రం 1,79,060 ఇళ్లను రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ క్రమంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31న జీవో ఎంఎస్ నెంబర్–2 విడుదల చేసింది. ఇళ్ల పథకం రెండో దశను ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన సీఎం జగన్ ప్రారంభించారు. 2024 మార్చి నాటికి 1.79 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఏడు నెలల్లో 67 వేల ఇళ్లకు శంకుస్థాపనలు పూర్తై వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. -
డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీల్లో డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. కర్నూలు కలెక్టరేట్లో గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 21 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. మూడో ఆప్షన్ కింద ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తే లబ్ధిదారులతో ఎంవోయూ చేయిస్తామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.15 లక్షలు ఖర్చుచేస్తుండగా.. ఇందులో రూ.1.80 లక్షలు సబ్సిడీ పోగా, మిగిలిన రూ.35 వేలను లబ్ధిదారుడికి పావలా వడ్డీ కింద ఇప్పిస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ప్రజా ప్రతినిధులు 15 వేల సచివాలయాల పరిధిలో తిరిగి వివిధ పనుల కోసం ప్రతిపాదనలు పంపారని, వాటిలో 3,344 పనులకు ఆమోదం తెలిపామని, ఇందులో 2,317 పనులు ప్రారంభమయ్యాయని కూడా చెప్పారు. -
ఆశతో ఆడుకుంటున్న బిల్డర్ల.. బలవుతున్న సామాన్యులు, ఇన్వెస్టర్లు!
సాక్షి, హైదరాబాద్: ఓ పక్క గృహ నిర్మాణాలలో ప్రీలాంచ్ విక్రయాలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న బిల్డర్లు.. పెట్టుబడిదారులనూ వదలడం లేదు. స్థలం కొనుగోలు చేయకుండానే, నిర్మాణ అనుమతులు రాకముందే కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని గ్రాఫిక్స్ డిజైన్లు, అందమైన బ్రోచర్లతో ఆకర్షిస్తున్నారు. మా దగ్గర పెట్టుబడులు పెడితే బ్యాంక్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువే లాభం, వంద శాతం సొమ్ము ముందే చెల్లిస్తే సగం ధరకే వాణిజ్య స్థలం, ప్రాజెక్ట్ పూర్తయ్యాక రెట్టింపు అద్దె అంటూ అన్ని రకాల మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ చివరకు నట్టేట ముంచేస్తున్నారు. బాధితులు వేల సంఖ్యలో.. సాహితీ, ఫీనిక్స్, సీఎన్ఎన్ వెంచర్స్, సెన్సేషన్, గరోండా బిల్డర్స్, సంధ్యా కన్వెన్షన్ వంటి నిర్మాణ సంస్థలెన్నో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నామని జనాలను నమ్మించి సొమ్ము వసూలు చేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి హైస్ట్రీట్ ఏరియాలలో ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. బిల్డర్ల చేతిలో ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, రిటైర్డ్ పోలీసులు, ప్రవాసులూ చిక్కి విలవిల్లాడుతున్నారు. కట్టిన సొమ్ము వాపసు ఇవ్వాలని డెవలపర్ల ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కానీ బిల్డర్లు బౌన్సర్లను నియమించుకుని కొనుగోలుదారులను కనీసం ఆఫీసు లోపలికి కూడా రానివ్వటం లేదని సత్యా టెక్నో పార్క్ బాధితుడు వాపోయారు. 10 ఏళ్ల పాటు ప్రతి నెలా అద్దె! సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్ నానక్‌రాంగూడలో జీ+47 అంతస్తులలో హైదరాబాద్ వన్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తోంది. రూ.60 లక్షలకు 397 చ.అ., రూ.82 లక్షలకు 546 చ.అ. స్పేస్‌ను ప్రీలాంచ్లో భాగంగా విక్రయిస్తోంది. రూ.60 లక్షల పెట్టుబడిదారులకు రూ.14,500, రూ.82 లక్షల వాళ్లకు రూ.62 వేలు అద్దె ప్రతి నెలా కంపెనీయే చెల్లిస్తుందని మాయమాటలు చెబుతోంది. వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, 10 ఏళ్ల పాటు ఈ అద్దె అగ్రిమెంట్ ఉంటుందని నమ్మబలుకుతోంది. ఆ తర్వాత పునరుద్ధరించుకోవచ్చని లేదా కస్టమర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామంటూ వల వేస్తోంది. ఇంతా చేస్తే ప్రాజెక్ట్‌ను నిర్మించే స్థలం సెన్సేషన్ కంపెనీ పేరు మీదే లేకపోవటం గమనార్హం. అంతా గోల్మాల్.. బోయిన్‌పల్లిలో 4 ఎకరాలలో ధనా మాల్ నిర్మిస్తామని సీఎన్ఎన్ వెంచర్స్ ప్రచారం చేసింది. 120 చ.అ. స్థలం రూ.10 లక్షల చొప్పున వందలాది మందికి విక్రయించింది. కానీ సంస్థకు నేటికీ నిర్మాణ అనుమతులు రాలేదు. ప్రాజెక్ట్ నిలిచిపోవడంతో కట్టిన డబ్బులు వాపసు ఇవ్వాలని కొనుగోలుదారులు రోజూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సంస్థ మాత్రం కిక్కురుమనడం లేదు. తాజాగా ఇదే సంస్థ బెంగళూరులోని చిక్కజల ప్రాంతంలో 7 ఎకరాలలో ధనా మాల్ పేరిట ప్రీలాంచ్ కింద కమర్షియల్ రిటైల్ షాపింగ్ స్పేస్‌ను విక్రయిస్తుండటం గమనార్హం. కమర్షియల్స్‌ను ప్రీలాంచ్లో విక్రయించకూడదు కమర్షియల్ ప్రాజెక్ట్‌లను కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా)లో నమోదు చేయాలి. రిజిస్టర్ చేయకుండా విక్రయాలు చేయకూదు. నిబంధనలు అతిక్రమించిన డెవలపర్లకు ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం. – కె.విద్యాధర్, టీఎస్ రెరా సెక్రటరీ -
హైదరాబాద్‌లో నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇళ్లెన్నో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి అనుకోని విపత్తులు స్థిరాస్తి రంగానికి పాఠాలు నేర్పించాయి. గతంలో ఒకరిని మించి మరొకరు పోటీపడి కొత్త ప్రాజెక్ట్‌లను ఆరంభించే నగర డెవలపర్లు... కరోనా తర్వాతి నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆడంబరంగా లాంచింగ్స్ చేసి విక్రయాల్లేక బొక్కాబోర్లా పడే బదులు.. చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి నష్టాలు రాకుండా బయటపడితే చాలనే అభిప్రాయానికి వచ్చేశారు. దీంతో కరోనా తర్వాతి నుంచి ఇన్నాళ్లు ఆగిపోయిన, ఆలస్యంగా సాగుతున్న గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఫలితంగా గత ఐదు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 36,830 గృహనిర్మాణ పనులు పూర్తయ్యాయని అనరాక్ నివేదిక వెల్లడించింది. 5.17 లక్షల యూనిట్లు గతేడాది డిసెంబర్ చివరి నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.4.84 లక్షల కోట్ల విలువ చేసే 5.17 లక్షల యూనిట్లు వివిధ దశలో నిర్మాణ పనులు నిలిచిపోయి ఉండగా.. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి 4.79 లక్షలకు క్షీణించాయి. వీటి విలువ రూ.4,48 లక్షల కోట్లు. - రెండో స్థానంలో నిలిచిన ముంబైలో గత ఐదు నెలల్లో 5,300 యూనిట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ.1,91807 కోట్ల విలువ చేసే 1,34,170 యూనిట్లు ఆగిపోయి ఉన్నాయి. - బెంగళూరులో 3,960 యూనిట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ.28,072 కోట్ల విలువైన 26,030 గృహా నిర్మాణ పనులు నిలిచిపోయి ఉన్నాయి. - చెన్నైలో 5,190 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. ప్రస్తుతం రూ.3,731 కోట్ల విలువైన 8,870 యూనిట్లు ఆగిపోయి ఉన్నాయి. - పుణేలో 3,850 నిర్మాణాలు పూర్తి కాగా.. ప్రస్తుతం రూ.27,533 కోట్ల విలువ చేసే 44,250 యూనిట్లు నిలిచి ఉన్నాయి. - ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకు హైదరాబాద్‌లో 1,710 గృహ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నగరంలో 11,400 నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయి. వీటి విలువ రూ. 11,310 కోట్లుగా ఉంది. గతేడాది డిసెంబరు చివరినాటికి నగరంలోరూ.12,995 కోట్ల విలువ చేసే 13,160 నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయి. - ఈ ఏడాది నుంచి జనవరి నుంచి మే వరకు కోల్‌కతాలో 1,580 గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. ప్రస్తుతం రూ.11,847 కోట్ల విలువ చేసే 23,540 గృహాలు ఆగిపోయి ఉన్నాయి. వేగం ఎందుకంటే? గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోళ్లకే కొనుగోలుదారులు ఆసక్తి చూపించడం కూడా నిర్మాణ పనుల వేగవంతానికి ప్రధాన కారణమని అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. అలాగే గత కొంత కాలంగా సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం కూడా పనులు వేగవంతానికి మరొక కారణమని చెప్పారాయన. దీంతో పాటు ఆగిపోయి ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు స్పెషల్ విండో ఫర్ అఫర్డబుల్ అండ్ మిడ్ ఇన్‌కం హౌసింగ్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్), నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) ప్రత్యేక నిధులను కేటాయించడం కూడా పనులు వేగవంతానికి కారణాలుగా వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే? -
తన ఇంటి ఖర్చు మీద ఈనాడు రోతరాత.. పద్మావతి ఆగ్రహం
-
పేదల ఇళ్లపై పచ్చమీడియా కుట్ర బట్టబయలు
-
కొత్త ఊళ్లకు ఊపిరి...విపక్షం ఉక్కిరిబిక్కిరి
సొంతింటి కల సాకారమవుతోంది. పేదల్లో సంతోషం పరవళ్లు తొక్కుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలకు వేల ఇళ్లతో ఏకంగా ఊళ్లే ఊపిరి పోసుకుంటున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమం ద్వారా నిర్మాణరంగం కళకళలాడుతోంది. వేలాది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. స్టీల్, సిమెంట్, ఇటుకలు తదితర నిర్మాణ సామాగ్రి వ్యాపారాలు సైతం జోరుగా సాగుతూ మార్కెట్ టర్నోవర్ ను పెంచుతున్నాయి. జగనన్న కాలనీల పథకంతో ఇన్ని రకాలుగా మేలు జరుగుతున్నా.. విపక్షం కళ్లు లేని కబోదిలా వ్యవరిస్తోంది. ఇళ్ల నిర్మాణంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందని కుళ్లుకుంటోంది. పచ్చ మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. తన పాలనలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని టీడీపీ శరవేగంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై తప్పుడు ప్రచారానికి తెగబడుతూ పైశాచిక ఆనందం పొందుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో జగనన్న కాలనీల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గృహ ప్రవేశాలు కూడా మొదలైపోయాయి. కానీ వీటిని చూసి టీడీపీ ఓర్చుకోలేకపోతోంది. పచ్చ పత్రికలతో గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయస్థానాల్లో పలు పిటీషన్లు వేసి అడ్డు తగిలినా చివరికి ధర్మమే గెలిచింది. జిల్లాలో 1156 లేఅవుట్లు జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణ చేసింది. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల కోసం 1795.80 ఎకరాలు అవసరం కాగా 1227.17ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించింది. మిగతా 568. 63 ఎకరాల మేరకు ప్రైవేటు భూమి కొనుగోలు చేశారు. ఒక్క భూమి కొనుగోలు కోసమే రూ.178.31కోట్లు వెచ్చించారు. అర్హులైన వారందరి కోసం జిల్లాలో 1156 లేఅవుట్లు వేశారు. లేఅవుట్ కోసం భూముల చదును చేయడం, జంగిల్ క్లియరెన్స్, అంతర్గత రోడ్లు, హద్దుల రాళ్లు, డ్రైనేజీ తదితర వాటి కోసం రూ. 30కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇవి కాకుండా లేఅవుట్లకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ.74కోట్లు ఖర్చు చేసింది. అలాగే లేఅవుట్లలో విద్యుత్ సౌకర్యం కోసమని రూ.10 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది. వేసిన లేఅవుట్లలో పచ్చదనం కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతోంది. తొలి విడతలో 695 లేఅవుట్లు జిల్లా వ్యాప్తంగా 1156 లేఅవుట్లు వేసినప్పటికీ తొలి విడతగా 695 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 40,630 స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో లబ్ధిదారులు ఉత్సాహంగా ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. రెండేళ్ల కరోనాతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో కొంత జాప్యం జరుగుతున్నా... సొంతిళ్లు సాకారం చేసుకునేందుకు ప్రభుత్వమిచ్చిన ఆర్థిక సాయంతో నిర్మాణాలు వేగవంతం చేశారు. అధికారులు కూడా పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అవసరమైన సాయం అందిస్తున్నారు. మంజూరైన వాటిలో 38,174 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కొత్త కాలనీలు.. ప్రస్తుతం నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో కొత్తగా నిర్మిస్తున్న కాలనీలు కొత్త ఊళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఆ కాలనీల్లో నిర్మాణ సందడి కనిపిస్తోంది. అద్దెల భారం నుంచి బయటపడాలని లబ్ధిదారులు సైతం వ్యక్తిగత శ్రద్ధతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ పూర్తయితే జిల్లాలో కొత్తగా 695 కాలనీలు అవతరించనున్నాయి. సంపూర్ణ గృహ హక్కుతో.. 1983 నుంచి 2011 వరకు ప్రభుత్వ గ్రాంట్‌తో, గృహ నిర్మాణ సంస్థ రుణంతో నిర్మించుకున్న ఇళ్లకు చాలా మంది పేరుకే యజమానులు తప్ప ఎలాంటి హక్కులు లేని పరిస్థితి ఉంది. మన పేరున హౌసింగ్ రుణం ఉండటంతో ఆ ఇళ్లను అమ్ముకోవడానికి, బదిలీకి, కనీసం లీజుకివ్వడానికి గానీ, అవసరం మేరకు బ్యాంకు రుణం తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎన్నాళ్లైనా ఆ ఇంటిలో ఉండటమే తప్ప అవసరాలకు దాన్ని వినియోగించుకోలేని దుస్థితి ఉండేది. సరికదా ఇళ్ల నిర్మాణం కోసమని తీసుకున్న రుణాన్ని వాయిదాల పద్ధతిలో వడ్డీతో కలిపి చెల్లించాల్సిన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ విధంగా తరాలు మారుతున్నా ప్రభుత్వ ఇళ్లకు సర్వహక్కులు పొందలేకపోయారు. ఇలాంటి వారి బాధలను దృష్టిలో పెట్టుకుని నామమాత్రం రుసుంతో ఇంటిపై సర్వహక్కులను కల్పించే సదుద్దేశంతో సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో జిల్లాలో లక్షా 93వేల 881మందికి ఉపశమనం కలిగింది. ఇప్పటికే 43వేల మంది రిజిస్ట్రేషన్లతో పక్కా పత్రాలు పొందారు. ఇంటివారమయ్యాం.. నాకు వివాహమై 15 ఏళ్లవుతోంది. ఇన్నాళ్లకు మేం ఓ ఇంటి వారమయ్యాం. నా భర్త కూలి పని చేస్తుంటారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేక ఇన్నాళ్లు అద్దె ఇంటిలోనే ఉన్నాం. జగనన్న వచ్చి విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి డబ్బు మంజూరు చేశారు. చాలా ఆనందంగా ఉంది. తొందరగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేద్దామనుకుంటున్నాం. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది. – నక్క ఆరుద్ర, గడ్డెయ్యపేట, జమ్ము, నరసన్నపేట కల సాకరమైంది.. కుప్పిలికి చెందిన కుప్పిలి నారాయణమ్మది పేద కుంటుంబం. సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నవరత్నాలు–వైఎస్సార్ ఇళ్లులో ఈమెకు సెంటున్నర స్థలం ఇంటి పట్టా ఇచ్చారు. రూ. 1.80 లక్షలు యూనిట్ మంజూరు చేశారు. ఇసుక కూపన్లు, నిబంధనల మేరకు ఐరన్, సిమ్మెంట్, పునాదులు తవ్వకానికి 90 రోజులు ఉపాధి హామీ పథకం మస్టర్ వేసి వేతనం ఇచ్చారు. ఇలా ఈమె సొంతింటి కల సాకారమైంది. 20 ఏళ్ల కల టెక్కలికి చెందిన కరుకోల షణ్ముఖరావు, విజయలక్ష్మి దంపతుల 20 ఏళ్ల నిరీక్షణ వైఎస్సార్ జగనన్న కాలనీతో నెరవేరింది. షణ్ముఖరావు స్థానికంగా ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా పట్టణంలో అద్దె ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా టెక్కలి జగతిమెట్ట వద్ద ఆయనకు ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసింది. దీంతో వారు ఎంతో సుందరంగా ఇంటిని కట్టుకున్నారు. 20 ఏళ్లుగా కలగానే ఉండిపోయిన సమస్యను వైఎస్ జగన్ తీర్చారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఏ ఊళ్లోనూ 50% పైగా ఎస్సీలు లేరట!) -
హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.4.8 లక్షల ఇళ్ల యూనిట్లు నిర్మాణం పూర్తి కాకుండా నిలిపోయాయి. వీటి విలువ రూ.4.48 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఇందులో హైదరాబాద్ మార్కెట్‌కు సంబంధించి నిర్మాణం కాకుండా నిలిచిపోయిన యూనిట్లు 11,450 యూనిట్లు కూడా ఉన్నాయి. వీటి విలువ రూ.11,310 కోట్లుగా ఉందని అనరాక్ నివేదిక వెల్లడించింది. పూర్తయినవి 2014, అంతకు ముందు సంవత్సరాల్లో ఆరంభమై, పూర్తికాని ప్రాజెక్టులను అనరాక్ ఈ నివేదికలోకి తీసుకుంది. వీటిల్లో ఈ ఏడాది జనవరి–మే మధ్య కాలంలో 36,830 యూనిట్లను బిల్డర్లు పూర్తి చేసినట్టు అనరాక్ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె పట్టణాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి. ‘‘ఇలా నిలిచిన ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశ్యంతో డెవలపర్లు ఉన్నారు. ప్రస్తుతం రెడీ టు మూవ్ ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను వారు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు’’అని అనరాక్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. నివేదికలోని అంశాలు.. - 2021 చివరికి నిర్మాణం కాకుండా నిలిచిన ఇలాంటి ఇళ్లు 5.17లక్షల యూనిట్లుగా ఉన్నాయి. - భారీ సంఖ్యలో ఇళ్ల ప్రాజెక్టులు నిలిచిపోయినందున.. పెద్ద డెవలపర్లు, ప్రభుత్వరంగ ఎన్బీసీసీ వాటిని తమ నిర్వహణలోకి తీసుకుని పూర్తి చేస్తున్నట్టు అనరాక్ తెలిపింది. - దీంతో 2022 జనవరి నుంచి మే వరకు 36,830 యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. - అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల యూనిట్లలో 77 శాతం ఢిల్లీ ఎన్సీఆర్, ఎంఎంఆర్లోనే ఉన్నాయి. ఈ రెండు పెద్ద మార్కెట్లు కావడం గమనార్హం. - పుణెలో 9 శాతం, కోల్‌కతాలో 5 శాతం చొప్పున ఇళ్ల యూనిట్లు నిర్మాణం కాకుండా ఉన్నాయి. - దక్షిణాది నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో నిర్మాణం కాని యూనిట్లు మొత్తం యూనిట్లలో 9 శాతంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్.. 2014, అంతకుముందు నిర్మాణం ప్రారంభమై ఇప్పటికీ పూర్తి కాని ఇళ్లు హైదరాబాద్‌లో 11,450 యూనిట్లు కాగా, వీటి విలువ రూ.11,310 కోట్లు. 2021 డిసెంబర్ నాటికి ఇలాంటి యూనిట్లు 13,160 ఉండగా, వీటి విలువ రూ.12,995 కోట్లుగా ఉంటుందని అనరాక్ నివేదిక తెలిపింది. వీటిల్లో 2022 జనవరి నుంచి మే మధ్య 1,710 యూనిట్ల నిర్మాణాన్ని డెవలపర్లు పూర్తి చేశారు. చదవండి: హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే? -
పట్టణాల్లో పీఎంఏవై ఇళ్ల పూర్తికి మరో రెండేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ గడువును మార్చి 2024 వరకు పొడిగించింది. 2015లో పథకం ఆరంభ సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలను మార్చి 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. అయితే పక్కా ఇళ్ల కోసం రాష్ట్రాల నుంచి పెరిగిన డిమాండ్‌తో వాటికి అనుమతులివ్వడం, నిర్మాణాలు జరపడం సకాలంలో పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో గడువును మార్చి 2024 వరకు పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి పథకం కింద మొత్తంగా 1.21 కోట్ల ఇళ్ల నిర్మాణానికి రూ.2.01 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా, ఇందులో 99 లక్షల ఇళ్ల పనులు మొదలవ్వగా, 59 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే..తెలంగాణలో 2.47లక్షల ఇళ్లకు గానూ 2.18లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమో లేక లబ్ధిదారులకు అందించడమో చేసినట్లు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 20.71 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, ఇందులో 17.88 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలవ్వగా, ఇందులోనూ 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.12,559 కోట్లను విడుదల చేసింది. -
ఇళ్ల నిర్మాణాలతో ప్రగతి పరుగులు
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.13 వేల కోట్లకుపైగా వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. భారీగా గృహ నిర్మాణాలతో జిల్లాల ఆర్థిక ప్రగతి, రాష్ట్ర జీఎస్డీపీ పెరగడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. ఉత్పత్తి రంగం సామర్థ్యం పెరిగి ప్రతి జిల్లా జీడీపీ మరోస్థాయికి చేరుకుంటుందన్నారు. ఆప్షన్ 3 లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నామని, అదే రోజు విశాఖలో 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కూడా ఇస్తామని చెప్పారు. అదేరోజు 1.79 లక్షల పీఎంఏవై – వైఎస్సార్ గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు మొదటి దశ పేదల ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షల గృహాలు, 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కలిపి మొత్తం 21.24 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. స్పందనలో భాగంగా పేదల ఇళ్ల నిర్మాణం, పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం జగన్ ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు. 1,000 ఇళ్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టి సారించి ప్రతి వెయ్యి ఇళ్లకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను నియమించాలి. ఇళ్ల నిర్మాణంపై రోజూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. లే అవుట్లలో నీరు, విద్యుత్తు లాంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలి. మురుగునీరు బయటకు వెళ్లే సదుపాయాలను కూడా కల్పించాలి. పెద్ద లే అవుట్లలో ఇటుకల తయారీ యూనిట్లు నెలకొల్పాలి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తాం. మండలానికో సర్పంచి, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు అందచేస్తాం. మే 31లోగా గృహ హక్కు పెండింగ్ రిజిస్ట్రేషన్లు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద పెండింగ్‌లో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్లు మే 31 లోగా పూర్తి చేయాలి. 21 ఏ డిలీషన్ ప్రక్రియను జూన్ చివరినాటికి పూర్తి చేయాలి. ఈ పథకాన్ని వినియోగించుకున్న వారికి రూ.3 లక్షలు చొప్పున రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. పథకం వల్ల చేకూరే లబ్ధిని తెలియచేస్తూ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి. పేదలకు 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. అవసరమైన భూమిని సేకరించి వెంటనే పట్టాలు అందించేలా చర్యలు చేపట్టాలి. 14 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో సమగ్ర సర్వే జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం కింద 14 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో మూడు విడతల్లో సమగ్ర సర్వే పూర్తవుతుంది. రికార్డుల స్వచ్ఛీకరణ కూడా వెంటనే జరుగుతుంది. నవంబర్ 30లోగా మొదటి విడతలో సర్వే చేస్తున్న 5,200 గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐ డేటా వస్తుంది. డిసెంబర్ 31లోగా రెండో విడత సర్వే చేస్తున్న 5,700 గ్రామాల ఓఆర్ఐ డేటా సిద్ధమవుతుంది. 2023 జనవరి నెలాఖరున మూడో విడతలో భాగంగా సర్వే చేస్తున్న 6,460 గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐ డేటా వస్తుంది. డేటా వచ్చాక ఐదు నెలల్లో మొత్తం సర్వే ప్రక్రియ పూర్తి కావాలి. అనంతరం గ్రామ సచివాలయాల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు కావాలి. ఎంత ఖర్చైనా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పేదలకు తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో పడింది. ఈ కేసుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలి. అర్హులకు ఇళ్లు రాకుండా కత్తిరించడం సరైనది కాదు. అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందే. దీనికి ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. -
చేతగానితనానికి కేరాఫ్ అడ్రస్ నారా లోకేష్: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు: సిటీ నియోజకవర్గంలో 7 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. నారా లోకేష్ విమర్శలు హాస్యాస్పదమని విమర్శించారు. లోకేష్‌ను చూసి ఎవరూ భయపడరని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. లక్షా 30 వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని ప్రశంసించారు. చిల్లర రాజకీయాలు లోకేష్ ఇకనైనా మానాలని మంత్రి అనిల్ కుమార్ హితవు పలికారు. చేతగానితనానికి కేరాఫ్ అడ్రస్ నారా లోకేష్ అని ఎద్దేవా చేశారు. తండ్రి, తాతలను అడ్డం పెట్టుకుని లోకేష్‌లా తాము రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో ఆగిన నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గడువులోగా గృహ నిర్మాణాలు పూర్తి కావట్లేదు. 2014, అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తికాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో ఇప్పటివరకు రూ.11,810 కోట్ల విలువ చేసే 17,960 గృహా నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి. వీటిలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైనవి 4,150 గృహాలున్నాయి. వీటి విలువ రూ.2,727 కోట్లని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. నిధుల కొరత, న్యాయపరమైన సమస్యలు, కరోనా వ్యాప్తి వంటివి నిర్మాణ ఆటంకాలకు ప్రధాన కారణాలని పేర్కొంది. హైదరాబాద్‌లో నిలిచిపోయిన గృహాలలో 36 శాతం ప్రీమియం విభాగంలోనివి కాగా.. 20 శాతం లగ్జరీ సెగ్మెంట్, 22 శాతం అందుబాటు గృహాలు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.5.05 లక్షల కోట్ల విలువ చేసే 6.29 లక్షల గృహా నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటిలో 2014, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు 1.74 లక్షల యూనిట్లున్నాయి. వీటి విలువ రూ.1.40 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఆగిపోయిన గృహాలలో 39 శాతం అంటే 2,47,930 యూనిట్లు రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మిడ్‌రేంజ్ విభాగంలోనివి. 32 శాతం (2,01,350 యూనిట్లు) రూ.40 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలు, 18 శాతం (1,11,050 యూనిట్లు) రూ.80–1.5 కోట్ల ధర ఉండే ప్రీమియం విభాగంలోనివి, 68,300 యూనిట్లు రూ.1.5 కోట్లకు పైగా ధర ఉండే లగ్జరీ విభాగంలోనివి. అత్యధికంగా ఎన్సీఆర్లో 1,13,860 గృహా నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటి విలువ రూ.86,463 కోట్లు. -
కోర్టు కేసులతో 3,70,201 మందికి అందని ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: పేదవాడికి ఇంటి పట్టాలు రాకూడదని టీడీపీ లాంటి ప్రతిపక్షాలు అన్యాయంగా కేసులు వేసి అడ్డుకున్నాయని సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల కారణంగా 3,70,201 మంది పేదలకు ఇళ్ల స్థలాలు రాలేదని అన్నారు. ఇప్పుడు హైకోర్టు సెలవులు కూడా ముగిసినందున, ఈ కేసులపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి రోజూ రివ్యూ చేసి ఈ కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా 3.7 లక్షలకుపైగా కుటుంబాలకు ఎనలేని మేలు జరుగుతుందని తెలిపారు. స్పందనలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేదల గృహ నిర్మాణం, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, ఇళ్ల పట్టాలు, జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారికి 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ‘ఇప్పటి దాకా వచ్చిన దరఖాస్తుల్లో 1.72 లక్షల మందికిపైగా అర్హులని అధికారులు తేల్చారు. ఇందులో 38 వేల మందికి ఇప్పుడున్న లే అవుట్లలోనే పట్టాలు ఇస్తున్నారు. మరో 9,794 మందికి కొత్త లే అవుట్లలో ఇస్తున్నారు. వీరికి వచ్చే స్పందనలోగా పట్టాలు ఇవ్వాలి. మిగతా 1.24 లక్షల మందికి వీలైనంత త్వరగా భూసేకరణ చేసి పట్టాలు ఇవ్వాలి. పెండింగులో ఉన్న 11,741 దరఖాస్తులను వచ్చే స్పందనలోగా పరిష్కరించాలి’ అని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణం ► తొలివిడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. జగనన్న కాలనీలకు సంబంధించి 4,120 చోట్ల తాగునీరు, కరెంటు ఏర్పాటు చేశారు. మిగిలిన కాలనీల్లో జూన్ నెలాఖరు కల్లా తాగునీరు, కరెంటు సౌకర్యాల ఏర్పాటు పూర్తి కావాలి. సొంత స్థలాలు ఉన్న వారికి 3.84 లక్షల ఇళ్లు ఇచ్చాం. వాటిని శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ► ఇళ్ల నిర్మాణం విషయంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. దీనివల్ల క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుస్తాయి. తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ► ఇసుక రీచ్‌లు 40 కిలోమీటర్ల లోపల ఉంటే, లే అవుట్ల వద్దే ఇసుకను ఇవ్వండి. 40 కిలోమీటర్ల కన్నా దూరంగా ఉంటే.. జేపీ వెంచర్స్ లిమిటెడ్ ద్వారా లే అవుట్లకు ఇసుకను చేరవేయాలి. జూన్ 30లోగా కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై డీపీఆర్‌లు తయారు చేయాలి. ఉపాధి హామీ పనుల్లో వేగం పెరగాలి ► ఉపాధి హామీ పనుల ప్రగతి మెరుగు పడాల్సి ఉంది. కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. ప్రతి జిల్లాలో మొక్కల పెంపకంపై దృష్టి పెట్టండి. స్కూళ్లు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటే కార్యక్రమంపై దృష్టి పెట్టండి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్ పనులు చురుగ్గా సాగాలి. ఒక గ్రామంలో ఒకరితోనే కాకుండా పనులను పంపిణీ చేయండి. తద్వారా పనుల్లో ప్రగతి ఉంటుంది. ఉపాధి హామీ పనుల చెల్లింపులను క్రమం తప్పకుండా ఇస్తున్నాం. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్కులు, ఆర్బీకేల నిర్మాణంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. బీఎంసీలు–ఏఎంసీలు ► 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల ఏర్పాటు దశల వారీగా చేపడుతున్నాం. వీటి ద్వారా పాలు పోసే ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా ఒక భరోసా లభిస్తుంది. వారు పోసే పాలు ఏ క్వాలిటీ, ఎన్ని లీటర్లు, ఎంత డబ్బు వస్తుందన్నది అక్కడికక్కడే స్లిప్ ద్వారా తెలుసుకోవచ్చు. ► వారి కళ్ల ముందే, వాళ్ల ఊరులోనే ఈ రకమైన సౌకర్యం పొందవచ్చు. దీనివల్ల ఎలాంటి మోసానికి ఆస్కారం ఉండదు. ఈ కార్యక్రమం పైన కూడా కలెక్టర్లు దృష్టి పెట్టండి. డిజిటల్ లైబ్రరీలు ► ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీ తీసుకువస్తున్నాం. డిసెంబర్ నాటికల్లా సుమారు 2,824 గ్రామ పంచాయతీలకు ఫైబర్ గ్రిడ్ చేరుతుంది. అక్కడ స్థలాలు గుర్తించి, లైబ్రరీలు నిర్మించడంపై దృష్టి పెట్టాలి. ► ఎన్ఆర్జీఎస్ పనులను జేసీ డెవలప్మెంట్కు ఇవ్వాలి. సెకండరీ ఫుడ్‌ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వచ్చే స్పందన నాటికి భూములు గుర్తించాలి. ► జగనన్న శాశ్వత భూహక్కు కార్యక్రమం కోవిడ్ కారణంగా ఆశించినంత వేగంగా కదలడం లేదు. ఇది పూర్తైతే వివాదాలకు పూర్తిగా చెక్ పడుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం ప్రగతిని పర్యవేక్షిస్తాను. ► జూన్ 22న చేయూత పథకాన్ని, జూలైలో విద్యా దీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తాం. జూలై 1న వైఎస్సార్ బీమా ప్రారంభం అవుతుంది. వీటికి కలెక్టర్లు సిద్ధం కావాలి. ► జూన్ 17 నుంచి జూలై 2 వరకు భవన నిర్మాణ పక్షోత్సవాలు నిర్వహించబోతున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు. భవనాల వారీగా విశ్లేషణ, రోజువారీ సమీక్షలు, పనులు శీఘ్రగతిన జరిగేలా బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. -
వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం
-
సీఎం ఎక్కడినుంచైనా పాలన చేయొచ్చు: బొత్స
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రలో అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలన్నదే తమ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులపై అసెంబ్లీలో చట్టం చేశామని చెప్పారు. కొందరు కావాలనే కోర్టులకు వెళ్లి ఆలస్యం చేశారని అన్నారు. అడ్డంకులను అధిగమించి త్వరలోనే అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని చెప్పారు. న్యాయస్థానాల్లో అడ్డంకులను త్వరలోనే అధిగమిస్తామని తెలిపారు. సీఎం ఎక్కడినుంచైనా పాలన చేయొచ్చని పేర్కొన్నారు. రాజ్యాంగం, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తామని బొత్స తెలిపారు. పేదలకు ఈ రోజు ఒక శుభదినమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇల్లుండాలనే సంకల్పంతో ముందుకు వెళ్లుతున్నారని తెలిపారు. 15లక్షల ఇళ్ల నిర్మాణాలకు ఈ రోజు శ్రీకారం చుట్టారని చెప్పారు. అవి లే అవుట్లు కాదని, గ్రామాలు, పట్టణాలుగా మారుతున్నాయని చెప్పారు. వైఎస్సార్ తర్వాత సీఎం జగన్ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. కాలనీలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారని చెప్పారు. కావాల్సిన మెటీరియల్ తక్కువ ధరకు తాము సమకూరుస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని విషయంలో ఎందుకు సందేహాలు వస్తున్నాయని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తమ పార్టీ, సీఎం వైఎస్ జగన్ సంకల్పం అని గుర్తుచేశారు. దాని కోసం చట్టం కూడా చేశామని, కొంత మంది దుష్టశక్తులు అడ్డుకుంటున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, విశాఖ పరిపాలన రాజధానిగా తాము ఏదైతే చెప్పామో అది జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. చదవండి: దేశ చరిత్రలోనే ప్రథమం.. కొత్త చరిత్రకు సీఎం జగన్ శ్రీకారం -
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల ఆస్తి: సీఎం వైఎస్ జగన్
ప్రతి పేదవాడికి మామూలు ఇల్లు కాకుండా మంచి వసతులతో ఇంటిని ఇవ్వడం కోసం అడుగులు ముందుకు వేస్తున్నాం. తద్వారా నిరుపేదలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు.. అగ్ర కులాల్లో ఉన్న పేద అక్క చెల్లెమ్మలందరి సొంతింటి కల నెరవేరుస్తున్నాం. ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాల కోసం రూ.1.5 లక్షలు, ఇంటి నిర్మాణ వ్యయం రూ.1.80 లక్షలు, స్థలం రేటు ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షలు మొదలు దాదాపు రూ.7 లక్షల వరకు ఉంది. ఆ విధంగా ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తిని ఇంటి రూపంలో ఇస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఒక్క నిరుపేద కూడా ఉండకూడదు.. ఒక కోటి 24 లక్షల మంది పేదలు నివసించేందుకు వీలుగా ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. తద్వారా ఒక్కో అక్క చెల్లెమ్మ చేతిలో ఐదు లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల విలువగల ఆస్తి పెడుతున్నాం. ఇదివరకెన్నడూ లేని విధంగా రెండు దశల్లో రూ.50,944 కోట్లతో 28 లక్షలకు పైగా ఇళ్లు కట్టిస్తున్నాం. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో తొలి దశలో ఒకే సారి రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాలకు గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సొంతింటి అన్న పేదవాడి కలను నిజం చేస్తున్నామని, 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఇవాళ పునాదులు వేస్తున్నామని చెప్పారు. అన్ని కాలనీల్లో రూ.32,909 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పిస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రారంభ మహోత్సవం ఒక పండగ వాతావరణంలో ఈ నెల 10వ తేదీ వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఆప్షన్–1 : ఇంటి నిర్మాణ సామగ్రి, లేబర్ చార్జీలు ప్రభుత్వం ఇస్తుంది. లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకుంటారు. ఆప్షన్–2 : ఇంటి నిర్మాణ సామగ్రి అక్క చెల్లెమ్మలు సొంతంగా తెచ్చుకుంటే దశల వారీగా పనుల పురోగతిని బట్టి ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఆ విధంగా స్వయంగా ఇళ్లు నిర్మించుకోవచ్చు. ఆప్షన్–3 : అక్క చెల్లెమ్మలు ఇల్లు కట్టుకోలేమంటే, ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకుని ఇల్లు కట్టిస్తుంది. – గతంలో ఇల్లు కేవలం 200 అడుగులు మాత్రమే ఉంటే ఇవాళ 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. వరండా, బెడ్రూమ్, హాలు, కిచెన్, బాత్రూమ్, రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు, 4 ఎల్ఈడీ బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ఇస్తున్నాం. – ప్రతి ఇంటికి అవసరమైన 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తున్నాం. లక్షలాది మందికి పని.. ఎకానమీ బూస్ట్ – తొలి దశలో కడుతున్న 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది. కోవిడ్ వల్ల చాలా రాష్ట్రాల ఆర్థిక స్థితి పడిపోయింది. జీఎస్డీపీలు తగ్గిపోయాయి. ఉత్పత్తి రంగం పడిపోయింది. కానీ మన దగ్గర ఈ ఇళ్ల నిర్మాణం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ బూస్టప్ అవుతుంది. – ఈ ఇళ్ల నిర్మాణం కోసం 69.70 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 7.44 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్, 310 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, 233 కోట్ల ఇటుకలు, 223 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ వినియోగం ఉంటుంది. – ఇంకా ఈ ఇళ్ల నిర్మాణం వల్ల కార్మికులకు 21.70 కోట్ల పని దినాలు లభిస్తాయి. ప్రస్తుతం కోవిడ్‌తో పెద్దగా పని లేకుండా పోయిన తాపీ మేస్త్రీలు, రాడ్ బెండర్లు, కార్పెంటర్లు కూలీలు, ఇటుకల తయారీదారులు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా దాదాపుగా 30 రకాల పనులు చేసే వారికి సొంత ఊళ్లలోనే ఉపాధి లభిస్తుంది. తక్కువ ధరకే నాణ్యమైన సామగ్రి – మార్కెట్ కంటే నాణ్యమైన ధరకు నిర్మాణ సామగ్రిని అందించేలా చర్యలు తీసుకున్నాం. అందు కోసం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాం. సిమెంట్ ధర తగ్గించి బస్తా కేవలం రూ.225కే అందిస్తున్నాం. స్టీల్ కూడా తక్కువ ధరకు, క్వాలిటీ సామగ్రి ఇచ్చేలా చూశాం. – ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ రోజు ప్రతి జిల్లాలో నాలుగవ జేసీని నియమిస్తున్నాం. వీరు ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకుని, ప్రతిదీ పర్యవేక్షిస్తారు. వారికి కూడా న్యాయం చేస్తాం – రాష్ట్రంలో 3.74 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సంబంధించిన స్థలాలపై కొందరు దుర్బుద్దితో కోర్టుల్లో కేసులు వేశారు. ప్రస్తుతం కోర్టులకు సెలవులు. ఈనెల 13న కోర్టులు తెరుస్తారు. అప్పుడు దీన్ని ప్రాధాన్యతగా తీసుకుని, ఈ అక్క చెల్లెమ్మలందరికీ న్యాయం చేయడానికి మీ తమ్ముడు, మీ అన్న జగన్ ప్రయత్నిస్తాడని తెలియజేస్తున్నాను. – ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గృహ ప్రవేశానికి మీరు రావాలన్నా.. నేను పుంగనూరులో 15 ఏళ్లుగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నా. నా జీవితంలో సొంతింట్లో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. మీ వల్ల నా సొంతింటి కల నెరవేరుతోంది. నా పిల్లలు మా మేనమామ ఇల్లు ఇచ్చాడు అని సంతోషంగా ఉన్నారు. నాకు ఇచ్చిన స్థలం విలువ రూ.4 లక్షలు అవుతుందన్నా.. నిర్మాణం కోసం నాణ్యమైన సామగ్రి ఇస్తున్నారు. నాది ఒక చిన్న కోరిక అన్నా.. మీరు మా గృహ ప్రవేశానికి రావాలని కోరుకుంటున్నా అన్నా. – అమరావతి, పుంగనూరు, చిత్తూరు జిల్లా ఎవరి సిఫారసు లేకుండా మంజూరైంది నేను ఏ నాయకుడి దగ్గరకు వెళ్లలేదు. మా వలంటీర్ దగ్గర దరఖాస్తు చేయగానే ఇల్లు మంజూరు అయింది. ఈ కరోనా కాలంలో కూడా మేం తినగలుగుతున్నామంటే మీ వల్లే అన్నా. మాది పేద కుటుంబం అన్నా. అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడేవాళ్లం. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా, స్థలం ఇవ్వలేదు. మీరు మా పేదల పాలిట దేవుడిలా లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. నేను ఇల్లు స్వయంగా కట్టుకుంటున్నా. – అపరంజని, మార్టేరు గ్రామం, ప.గో.జిల్లా మౌలిక వసతులకు రూ.33 వేల కోట్లు – ప్రణాళిక బద్ధమైన గ్రామాలు, పట్టణాలుగా నిర్మితమవుతున్న ఈ 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో దాదాపు రూ.4,128 కోట్ల వ్యయంతో తాగు నీరు సరఫరా చేయబోతున్నాం. రూ.22,587 కోట్ల వ్యయంతో కాలనీల్లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ.. మరో రూ.4986 కోట్లతో భూగర్భ కేబుళ్లతో విద్యుత్ కనెక్షన్లు.. ఇవన్నీ కాకుండా మరో రూ.627 కోట్ల వ్యయంతో భూగర్భ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించబోతున్నాం. – పార్కులు, స్కూళ్లు, సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌ల వంటి వాటి కోసం మరో రూ.567 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా 30 లక్షల ఇళ్లకు అన్ని మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదవాడి కల నిజం చేస్తున్నాం – తొలి దశ కింద రూ.28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ఇవాళ మొదలు పెడుతున్నాం. ఏడాదిలో అంటే జూన్ 2022 నాటికి పూర్తి చేసే విధంగా కార్యక్రమం రూపొందించాం. రెండో దశలో 12.70 లక్షల ఇళ్లను రూ.22,860 కోట్లతో వచ్చే ఏడాది జూన్‌లో మొదలు పెడతాం. – ఆ విధంగా మొత్తం రూ.50,944 కోట్ల వ్యయంతో 28.30 లక్షల ఇళ్లు జూన్ 2023 నాటికి పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాలు సేకరించడమే కాకుండా, పీఎంఏవైతో వాటిని అనుసంధానం చేసి, ఇళ్ల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తున్నాం. ఇళ్లు కాదు.. ఊళ్లు, పట్టణాలు – మనం కడుతోంది కేవలం ఇళ్లు కాదు.. ఊళ్లు, పట్టణాలు అని చెప్పొచ్చు. ఏకంగా 17 వేల కాలనీలు ఇప్పుడు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. – ఇవి కాక సొంత స్థలాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్న లబ్ధిదారులు మరో 4.33 లక్షల మందిని కలుపుకుని మొదటి దశలో మొత్తం 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి నాంది పలికాం. – 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా దాదాపు 4.95 కోట్లు. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కూడా కట్టిస్తోంది. ఒక్కో ఇంట్లో నలుగురు ఉంటారనుకుంటే, మొత్తం 1.24 కోట్ల మందికి మనం ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. ఈ లెక్కన రాష్ట్రంలో పెద్దవైన 3 లేక 4 జిల్లాల్లో ఉన్నంత జనాభాకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు, ఇళ్లు కట్టిస్తున్నాం. చదవండి: సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల కృతజ్ఞతలు వచ్చే ఖరీఫ్‌కు పోలవరం నీళ్లు -
పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా జేసీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించింది. వీరు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రెండు ఫేజ్‌ల్లో రూ. 50,944 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ జేసీలకు హౌసింగ్, ఎనర్జీ, రూరల్ వాటర్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఏపీ ఫైబర్ నెట్, గ్రామ, వార్డు శాఖల అధికారులు సహకరించాల్సి ఉంటుంది. మొదటి దశ జూన్ 2022, రెండో దశ జూన్ 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. చదవండి: Andhra Pradesh: లక్షల్లో ఇళ్లు.. వేలల్లో ఊళ్లు Andhra Pradesh: రైతుకు ఫుల్ ‘పవర్’ -
Andhra Pradesh: లక్షల్లో ఇళ్లు.. వేలల్లో ఊళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో శరవేగంగా అడుగులు వేస్తోంది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా నేడు మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అన్ని వసతులతో ఇళ్లు మాత్రమే కాకుండా.. తాగునీరు, విద్యుత్, మురుగు నీటి వ్యవస్థ, ఇంటర్నెట్ వంటి అధునాతన మౌలిక సదుపాయాలతో సర్వ హంగులతో అందమైన 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలను (తొలి దశలో 8,905, రెండో దశలో 8,100) నిర్మిస్తోంది. ప్రపంచ చరిత్రలో అతి తక్కువ సమయంలో ఇంత భారీ ఎత్తున కొత్తగా గ్రామాలకు గ్రామాలే నిర్మిస్తున్న దాఖలాలు లేవని సామాజిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరులో గురువారం ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్న లే అవుట్ 2023 జూన్ నాటికి పూర్తి ► ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ’నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ అనే హామీని 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో రెండు దశల్లో పేదల కోసం రూ.50,944 కోట్లతో మొత్తం 28,30,227 పక్కా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించింది. ► ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల గృహాలు, రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశ ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 2022 నాటికి, రెండో దశ ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ► మొదటి దశలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నిర్మించనున్నారు. అలాగే 2,92,984 ఇళ్లను సొంత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు, 1,40,465 ఇళ్లను నివేసిత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు మంజూరు చేశారు. ఇప్పుడు వైఎస్సార్ జగనన్న కాలనీల్లోని ఇళ్లతోపాటూ ఈ గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. 28.30 లక్షల ఇళ్లు కాదు.. 17,005 ఊళ్లు.. ► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధం చేసిన లేఅవుట్లు కొత్తగా 17,005 ఊళ్లను సృష్టిస్తాయన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలు నిజమవుతున్నాయి. అవి ఇళ్లు కాదు.. ఊళ్లు.. అనే దృష్టితో అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ► దాంతో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతోపాటు భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తొలి దశలో 8905 వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మిస్తుండగా.. రెండో దశలో 8,100 కాలనీలను నిర్మించనున్నారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ► రూ.4,128 కోట్లతో తాగునీరు, రూ.22,587 కోట్లతో సిమెంట్ రోడ్లు, కాలనీ సైజును బట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్.. రూ.4,986 కోట్లతో అండర్ గ్రౌండ్ విద్యుత్ సౌకర్యం, రూ.627 కోట్లతో ఇంటర్నెట్, ఇతర సౌకర్యాల కోసం రూ.567 కోట్లు వ్యయం చేస్తోంది. అందమైన కాలనీలు.. అన్ని వసతులు ► వైఎస్సార్ జగనన్న కాలనీలను అన్ని హంగులతో.. అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రతి ఇల్లు అన్ని సదుపాయాలతో ఉండాలన్న సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షకు అనుగుణంగా కాలనీలు రూపు దిద్దుకోబోతున్నాయి. ► ఒకేరకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగులలో ఒక పడక గది, హాలు, వంట గది, స్నానాల గది, వరండాతో నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంకును అందిస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మ్యాపింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది. జియో ట్యాగింగ్ పనులు చివరి దశలో వున్నాయి. ► 8,798 లేఅవుట్లలో గృహ నిర్మాణానికి అవసరమైన నీటి పథకాలను చేపట్టగా, వాటిల్లో 2,284 లేఅవుట్లలో పనులు పూర్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతం ► కోవిడ్–19 రెండో దశ కారణంగా రాష్ట్రంలో అర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో.. పనులు లేక నిస్తేజంతో ఉన్న వివిధ రంగాలకు చెందిన కార్మికులకు, కూలీలకు గృహ నిర్మాణం ఊతం ఇవ్వబోతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణం ద్వారా ఉపాధి కూలీలకు 21.70 కోట్ల పని దినాలు లభించబోతున్నాయి. ► పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్న ఇళ్ల నిర్మాణ పనులతో తాపీ మేస్ట్రీలు, రాడ్ వెండర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీíÙయన్లు, ఇటుకల తయారీదారులు, సిమెంట్ విక్రేతలకు ఉపాధి లభించనుంది. సరసమైన ధరలకే నాణ్యమైన నిర్మాణ సామగ్రి ► ఇళ్ల నిర్మాణానికి వినియోగించే వస్తువుల (మెటిరీయల్) ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. పేదలపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. నాణ్యమైన వస్తువులను మార్కెట్ ధరకన్నా తక్కువకే సరఫరా చేసేందుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. ► లబ్ధిదారుల కోసం సిమెంట్, ఇతర వస్తువులను నిల్వ చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో గోదాములను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను దగ్గరలోని ఇసుక రీచ్‌ల నుంచి ఉచితంగా అందించనుంది. లబ్ధిదారుడికి మూడు ఆప్షన్లు ► గృహ నిర్మాణంలో లబ్ధిదారుడి నిర్ణయానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మంజూరు చేసిన ఇళ్లను నిర్దిష్ట నమూనాలో నిర్మించుకునే విషయంలో లబ్ధిదారుడు సొంతగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు ఉంచింది. ఆప్షన్ 1 : ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్ చార్జీలకు కూడా డబ్బు ఇస్తుంది. లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకోవచ్చు. ఆప్షన్ 2 : ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులు తామే తెచ్చుకోవచ్చు. తమకు నచ్చిన చోట కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవచ్చు. దశల వారీగా పని పురోగతిని బట్టి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో బిల్లుల చెల్లింపులను జమ చేస్తుంది. ఆప్షన్ 3 : తాము కట్టుకోలేమని చెప్పిన వారికి, ఆ బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. నిర్దేశించిన నమూన ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సరఫరా చేయడంతోపాటు పూర్తి సహయ సహకారాలు అందించి ప్రభుత్వమే కట్టిస్తుంది. మొదటి దశ ఇళ్ల నిర్మాణం కోసం 69.70 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 7.44 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్, 310 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, 232.50 కోట్ల సిమెంట్/ఫాల్ జి బ్లాక్స్(ఇటుకలు)ను ప్రభుత్వం సేకరిస్తోంది. తద్వారా కోట్లాది రూపాయల టర్నోవర్ జరిగి ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణ పనుల వల్ల లక్షలాది మంది తాపీ మేస్ట్రీలు, రాడ్ వెండర్లు, కార్పెంటర్లు, ఎల్రక్టీషియన్లు, ప్లంబర్లు, కూలీలకు ప్రత్యక్షంగా చేతినిండా పని దొరుకుతుంది. సామగ్రి రవాణా, హోటళ్లు, ఇతరత్రా పరోక్షంగా మరికొన్ని లక్షల మందికి ఉపాధి కలగనుంది. -
ఆలస్యం, అవినీతికి ఆస్కారం లేకుండా టీఎస్ బిపాస్: కేటీఆర్
-
సీఎం కేసీఆర్ 70కి పైగా సాహసాలు చేశారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న ఉజ్వల భవిష్యత్తు దేశంలో ఏ నగరానికి లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం టీఎస్‌బీపాస్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధరణి, టిఎస్ ఐపాస్ మాదిరిగా టీఎస్ బీపాస్‌ను సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారన్నారు. 75 గజాల వరకు ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపారు. అనుమతి కాగితమే ఆయుధమని, 600 చదరపు గజాలలోపు ఉన్న స్థలాలు ఉన్న వారికి స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి ఇస్తామని తెలిపారు. 600 గజాలపైన ఉన్న వారికి 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చదవండి: సర్వశక్తులూ ఒడ్డాల్సిందే! ఇలాంటి పారదర్శకమైన విధానం దేశంలో ఎక్కడా లేదని, రాబోయే రోజుల్లో కొత్త జీహెచ్ఎంసీ చట్టాలు తీసుకువస్తామన్నారు. ఈ చట్టాలు కొంత కఠినంగా ఉంటాయని తెలిపారు. దశాబ్దాల నుంచి దశల జరిగిన తప్పిదాలతో వర్షాలతో నగర ప్రజలు ఇబ్బంది పడ్డారని, స్వీయ ధ్రువీకరణలో తప్పులు ఉంటే.. ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చే అధికారం అధికారులకు ఉందని స్పష్టం చేశారు. చెరువుల్లో, ఎఫ్టీఎఫ్ స్థలాల్లో ఉన్న భవనాలు కూల్చేందుకు కొత్త జీహెచ్ఎంసీ చట్టం తెస్తామన్నారు. రాబోయే 5 నుంచి 7 ఏడేళ్లలో తెలంగాణలో 51 శాతం ప్రజలు నగరాల్లో జీవించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 40 శాతం జనాభా ఓఆర్ఆర్ లోపల జీవనం సాగిస్తున్నారన్నారు. సగం ఆస్తి పన్ను మాఫీ రియల్ ఎస్టేట్ ధరలు పెంచవద్దని మంత్రి హెచ్చరించారు. ఇక నుంచి ఇంటి నిర్మాణ అనుమతులు పారదర్శకంగా, ఆన్లైన్ విధానంలో లభ్యం కానున్నట్లు తెలిపారు. తెలంగాణలో 140 మండలాలు పెరిగాయని, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్లు త్వరగా ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా వికేంద్రీకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 70కి పైగా సాహసాలు చేశారని పేర్కొన్న కేటీఆర్ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత పారదర్శకంగా, వేగంగా సామాన్యులకు సేవలు అందుతున్నాయన్నారు. తెలంగాణ తెచ్చిన చట్టాలు దేశానికి బెంచ్ మార్క్‌గా నిలుస్తాయని తెలిపారు. రైతు బంధు కేంద్రం కూడా అనుసరిస్తుందని పేర్కొన్నారు. -
ఎంత ఎదిగినా.. ఒదిగే ఉంటారు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామంలో ఓ ఆచారం కొనసాగుతోంది. గతంలో ఉన్న పూరి గుడిసెల స్థానంలో ఊరంతా పక్కా ఇళ్లు వెలిసినా.. ఏ ఒక్కరూ మొదటి అంతస్తు (ఫస్ట్ ఫ్లోర్) నిర్మించరు. దేవుడి పాదాల కంటే తమ ఇళ్లు తక్కువ ఎత్తులో ఉంటే శుభకరమని అక్కడి వారి విశ్వాసం. ఆ గ్రామంలో చారిత్రక శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఏటా నిర్వహించే తిరునాళ్లలో గ్రామస్తులే మోత కాపులుగా ఉంటూ.. స్వామి వారి సేవల్లో పాల్గొంటారు. తమ కుల దైవమైన వరాహ లక్ష్మీనరసింహస్వామిపై భక్తితో ఎన్నో సంవత్సరాలుగా అంతా పాటిస్తున్నారు. గతంలో అన్నీ పూరి గుడిసెలే.. ఈ గ్రామంలో సుమారు 30 సంవత్సరాల క్రితం బ్రాహ్మణ కాలనీలో పక్కా భవనాలు ఉండగా.. మిగిలిన అన్నిచోట్లా పూరి గుడిసెలే ఉండేవి. క్రమంగా గ్రామస్తులంతా ఆర్థికంగా బలపడ్డారు. పూరి గుడిసెలన్నీ పక్కా గృహాలుగా మారాయి. ఎటు చూసినా పక్కా ఇళ్లే. వాస్తవానికి ఇక్కడి వారందరికీ 2, 3 అంతస్తుల భవనాలు నిర్మించుకునే స్తోమత ఉన్నా.. ఒక్కరు కూడా ఆలయంలోని స్వామి పాదాల కన్నా తక్కువ ఎత్తులోనే భవనాలు నిర్మించుకునే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. గ్రామంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మొదటి అంతస్తు గల భవనం పాఠశాల ఒక్కటే.. గ్రామంలో మొదటి అంతస్తు గల భవనం పాఠశాల ఒక్కటే. పాఠశాల భవనంపై మొదటి అంతస్తు నిర్మించగా.. ఆ కాంట్రాక్టర్ ఇంట్లో ఒకరు మరణించారని గ్రామస్తులు చెబుతుంటారు. ఇటీవల సచివాలయ భవనం మంజూరైనప్పటికీ ప్రధాన గ్రామంలో కాకుండా శివారు గ్రామమైన అయ్యప్ప నగర్లో నిర్మాణం చేపట్టారు. రెండు తరాలుగా ఇదే ఆచారం వరాహ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ సమీపంలో ఉన్న ప్రధాన గ్రామంలో రెండు తరాలుగా ఒకే అంతస్తు నిర్మిస్తున్నారు. స్వామి వారి పాదాల కన్నా ఇళ్లు ఎత్తు ఉండకూడదన్నదే ఇందుకు కారణం. – చిమట శ్రీను, పాత సింగరాయకొండ నమ్మకం ప్రకారమే నడుచుకుంటారు ఆలయంలో వంశపారంపర్య అర్చకుడిగా పని చేస్తున్నాను. ఇక్కడి వారంతా స్వామి పాదాల కింద ఉంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. వారి నమ్మకం ప్రకారం అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందారు. – ఉదయగిరి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు అది మా నమ్మకం.. ఆచారం స్వామి పాదాలకు దిగువన ఉంటే మేలు జరుగుతుందన్న నమ్మకంతో ఆ ఆచారాన్నే కొనసాగిస్తున్నాం. మా నమ్మకం వమ్ము కాలేదు. – లక్ష్మీనరసింహం, గ్రామస్తుడు -
ప్రభుత్వం అనుమతిస్తే ఇళ్లు నిర్మిస్తాం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలను ఇవ్వనుందని, తమకు ప్రభుత్వం అనుమతిస్తే ఆ స్థలాల్లో చక్కటి ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తామని ఆశ్రయం ప్రాజెక్ట్స్ సీఈవో, కొండూరు ఆర్కా గ్రూప్ ఆఫ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్భవానీ చెప్పారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. ► ఆశ్రయం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలు పూర్తి చేశాం. ► ప్రభుత్వం పేదలకిచ్చే స్థలాల్లో మా కంపెనీ ఆధ్వర్యంలో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి 400 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతి కోరతాం. ► అందుకు సంబంధించిన డిజైన్‌ను ముఖ్యమంత్రికి, మంత్రులకు చూపించనున్నాం. ► వైఎస్సార్ గృహనిర్మాణ్ పేరుతో ఆకృతి నమూనాను విడుదల చేశాం. ► ప్రభుత్వం కానీ, లబ్ధిదారులు కానీ ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అనువైన స్థలాన్ని తమకు కేటాయిస్తే చాలు. -
అమాంతం ఎత్తేస్తున్నారు..
లాలాపేట: నగరం ఏటేటా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా ఏటా రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో పాతకాలంలో కట్టిన ఇళ్లు కాస్తా ఇప్పుడు రోడ్డుకంటే చాలా వరకు కిందికి వెళ్లాయి. ఫలితంగా రోడ్లపై నుంచి దుమ్ము,ధూళితో పాటు వర్షా కాలంలో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది. ఫలితంగా నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఉన్న ఫలంగా ఇంటిని కూల్చివేసి కొత్తగా నిర్మాణం చేపట్టాలి. ఇందుకు ఏళ్ల తరబడి సమయం పడుతుంది. నిర్మాణ ఖర్చులు సైతం రెండు మూడింతలు పెరిగాయి. ఇలాంటి సమయంలో ఉన్న ఇంటిని తక్కువ ఖర్చుతో అలాగే పైకి ఎత్తే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చింది. 45 ఏళ్ల పాటు మన్నిక.... ప్రస్తుతం బిల్డింగ్ మెటీరియల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భవనాన్ని కూల్చి తిరిగి నిర్మాణం చేపట్టేందుకు దాదాపు రూ. కోటి వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ లిప్టింగ్ ప్రక్రియతో బిల్డింగ్ ఎత్తు పెంచి, ఆధునీకరించేందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుంది. మరో 45 ఏళ్ల పాటు ఇళ్లు పటిష్టంగా ఉంటుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇళ్ల లిప్టింగ్తో పాటు ఇతర చోటకు షిప్టింగ్ సైతం చేస్తామని వారు పేర్కొన్నారు. 5 ఫీట్లు పైకి.... వాహనాల టైర్లు మార్చేందుకు ఉపయోగించే జాకీల సహాయంతో జీ ప్లస్ వన్, పైన పెంటౌజ్ ఉన్న ఓ భవనాన్ని సైతం అమాంతం ఐదు అడుగుల మేర పైకి లేపుతున్నారు. తార్నాక స్ట్రీట్ నెంబర్ 3లో రోడ్డు ఎత్తు పెరగడంతో భవనం పూర్తిగా కిందికి వెళ్లింది. దీంతో సదరు ఇంటి యజమాని ఇంటిని పైకి లేపేందుకుగాను చెన్నైకి చెందిన శివాజీ హౌజ్ లిఫ్టింగ్ ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించాడు. 15 రోజుల క్రితం ఇంటిని పైకి ఎత్తే పనులు ప్రారంభించారు. కొద్ది కొద్దిగా ఇంటిని జాకీలతో పైకి ఎత్తుతూ దాని కింద పటిష్టమైన ఐరన్ ట్రాక్‌తో పాటు గోడ నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు అడుగుల మేరకు ఇంటిని పైకి లేపారు. ఇంకా రెండు అడుగులు పెంచాల్సి ఉంది. 2500 జాకీల వినియోగం ఇంటిని ఎత్తు పెంచేందుకు 2500 జాకీలను ఉపయోగిస్తున్నారు. 45 రోజుల పాటు హర్యాణాకు చెందిన 25 మంది కార్మికులు లిఫ్టింగ్ పనులు చేస్తున్నారు. వారికి లేబర్ చార్జిగా, రూ 10 లక్షలు. బిల్డింగ్ మెటీరియల్‌కు మరో రూ 10 లక్షలు ఖర్చవుతుందన్నారు. -
లంచం లేకుండా ఇళ్ల అనుమతులు
సాక్షి, హైదరాబాద్: పైసా లంచం లేకుండా ఇళ్ల నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు ఏప్రిల్ 2 నుంచి ‘టీఎస్–బీపాస్’పేరుతో కొత్త అనుమతుల విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మార్చిలోగా అన్ని లోటుపాట్లను సరిచేసి టీఎస్–బీపాస్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నేరు గా టీఎస్–బీపాస్ వెబ్సైట్ ద్వారా లేదా మీ–సేవ కేంద్రాల ద్వారా ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం కొత్తగా మొబైల్ యాప్‌ను సైతం తీసుకొస్తున్నామన్నారు. ఈ మూడు మార్గాల్లో లేదా స్థానిక మున్సిపల్ అధికారులను కలవడం ద్వారా అనుమతులు పొందవచ్చన్నారు. మర్రి చెన్నారెడ్డి మాన వ వనరుల శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమావేశమై కొత్త మున్సిపల్ చట్టంతో పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుపై దిశానిర్దేశం చేశారు. కొత్తగా తెస్తున్న టీఎస్–బీపాస్ విధానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా 75 చదరపు గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితం చేసిందన్నారు. కలెక్టర్లపై బాధ్యతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకునే విధంగా పచ్చని, ఆహ్లాదకరమైన పట్టణాల రూపకల్పన కోసం కృషి చేయాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రతీ పౌరుడు కోరుకునేలా రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించాలని, వారి కి సంతృప్తి కలిగించేలా సమాధానాలివ్వాలన్నారు. అక్రమాలకు పాల్పడే, నిర్లక్ష్యం వహించే ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ అధికారాన్ని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు అప్పగించారని గుర్తుచేశారు. సీఎం నిర్ణయంతో వ్యవస్థలో సమూల మార్పులొచ్చాయన్నారు. కార్యక్రమంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, పురపాలక శాఖ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రెండో దశలో 35,000 ఇళ్లకు ‘రివర్స్’
సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రెండో దశ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో) వేగవంతం చేసింది. మొదటి దశలో 14,368 ఇళ్లకు ఇప్పటికే రివర్స్ టెండరింగ్ నిర్వహించగా ప్రభుత్వ ఖజానాకు రూ.105.91 కోట్లు ఆదా కావడం తెలిసిందే. రెండు, మూడో దశలను జనవరి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధమైంది. రెండో దశలో 35,000 ఇళ్లకు ఈ నెల 20 నుంచి 22 తేదీ వరకు రివర్స్ టెండర్లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో కూడా ప్రజాధనం ఆదా అవుతుందని అంచనా వేస్తోంది. ఉగాదికి పనులు ప్రారంభం మూడో దశ కింద మరో 14,000 ఇళ్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు టిడ్కో ప్రణాళిక రూపొందించింది. మొత్తం టెండరింగ్ ప్రక్రియను జనవరి చివరికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు ఇప్పటికే స్పష్టం చేసింది. ఏడాదిన్నరలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించింది. -
పేదల ఇళ్లకు ప్రభుత్వ భూములు కేటాయిస్తాం..
సాక్షి, అమరావతి : ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారని మంత్రి తెలిపారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లో 11 వేల ఎకరాల భూమి అవసరమని గుర్తించామని, అవసరమైతే భూములు కొనుగోలు చేసి పేదలకు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్థలాల కొనుగోలుకు రూ. 12 వేల కోట్లు ఖర్యు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఎక్కడా అవినీతికి తావులేకుంగా పేదలకు ఇచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని, అంతేగాక ఇళ్ల స్థలాన్ని లబ్ధిదారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
‘ఇంటి దోపిడీ’ రూ.4,930 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా పోలవరం నుంచి అన్ని సాగునీటి ప్రాజెక్టుల్లో ఎలా దోపిడీకి పాల్పడ్డారో ‘రివర్స్’ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలంతా ఇప్పటికే చూశారు. అన్నిట్లోనూ అందినకాడికి కాజేసిన టీడీపీ పెద్దలు పేదల ఇళ్లను కూడా వదల్లేదు. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.650కి మించని పట్టణ పేదల ఇళ్లను కమీషన్ల కోసం రూ.2,000కిపైగా పెంచేయడంతో ఖజానాకు రూ.4,930 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. ప్రతి చ.అడుగులో రూ.1,350 చొప్పున కాజేసినట్లు తేటతెల్లమవుతోంది. విశాఖ జిల్లాలో హుద్ హుద్ బాధితుల కోసం 800 ఇళ్ల నిర్మాణానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1,06,687 చొప్పున టెండర్లు పిలవగా టీడీపీ హయాంలో అంతే విస్తీర్ణంలోని ఇవే గృహాలకు ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.6.40 లక్షల నుంచి రూ.8.70 లక్షలుగా నిర్థారించడం గమనార్హం. ఇంత భారీ వ్యత్యాసం ఉండటాన్ని బట్టి పేదల ఇళ్ల నిర్మాణాల్లో గత సర్కారు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఖజానాకు ఆదా...పేదలకు గృహ యోగం పేదల గృహ నిర్మాణం పేరుతో గత సర్కారు చదరపు అడుగు వ్యయం రూ.2,000కిపైగా నిర్ణయించగా ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అంతే విస్తీర్ణానికి కేవలం రూ.650 చొప్పున ధర ఖరారు చేసి టెండర్లు కూడా అహ్వానించడం గమనార్హం. అంటే ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి ధరలో ఉన్న వ్యత్యాసం రూ.1,350కిపైనే. ఖజానాకు డబ్బులు ఆదా కావడంతోపాటు పేదలకు ఉచితంగా ఇళ్లు అందుతాయి. ఇక్కడ గమనించాల్సిన మరో కీలక అంశం.. నిర్మాణ విధానంలో మార్పులేదు, విస్తీర్ణంలో తేడా లేదు. ఉన్న తేడా అంతా ఒక్కటే... ప్రభుత్వం మారడం. ‘ఇంటి దోపిడీ’ రూ.4,930 కోట్లు విశాఖపట్టణంలో ఐదేళ్ల క్రితం హుద్‌హుద్ తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయి. సర్వం కోల్పోయిన బాధితులకు చంద్రబాబు సర్కారు నాలుగున్నరేళ్లలో పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బాధితుల కోసం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. గత సర్కారు షేర్వాల్ టెక్నాలజీ పేరుతో పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేయడమే కాకుండా ఒక్కో పేద కుటుంబంపై రూ. మూడు లక్షలకుపైగా అప్పుల భారాన్ని మోపింది. చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ.2,000కిపైగా పెంచేసింది. తద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు పొందారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో టీడీపీ సర్కారు దోపిడీని గట్టిగా ప్రశ్నించారు. చంద్రబాబు సర్కారు మోపిన అప్పుల భారం నుంచి పేదలను బయటపడేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలు, అవినీతిని నిపుణుల కమిటీ ఇటీవల వెల్లడించింది. పట్టణ పేదల ఇళ్లలో ఏకంగా రూ.4,930 కోట్ల మేర దోపిడీ జరిగినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. పేదలపై రూ.17,730.88 కోట్ల భారం టీడీపీ సర్కారు హయాంలో షేర్వాల్ టెక్నాలజీ పేరుతో పట్టణ ప్రాంత పేదల ఇళ్ల నిర్మాణాన్ని చదరపు అడుగుకు రూ.2,000కిపైగా నిర్ణయించి అంచనాలను భారీగా పెంచేశారు. 300 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ వ్యయం రూ.6.40 లక్షలుగా నిర్ణయించారు. 365 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.7.60 లక్షలుగా పేర్కొన్నారు. 430 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.8.70 లక్షలుగా గత సర్కారు ఖరారు చేసింది. జీ ప్లస్ 3 పేరుతో ఇళ్ల నిర్మాణాలను చేపట్టి పట్టణ పేదల ఇళ్ల లబ్ధిదారులపై రూ.17,730.88 కోట్ల అప్పుల భారాన్ని చంద్రబాబు సర్కారు మోపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదలకు హామీ ఇచ్చిన ప్రకారం వారిని అప్పుల నుంచి బయటపడేసింది. నాడు రూ.8.70 లక్షలు.. నేడు రూ.1,06,687 విశాఖ జిల్లాలో హుదూద్ బాధితుల కోసం కమ్మాడిలో సర్వే నెంబర్ 83లో 608 ఇళ్లను జీ ప్లస్ 3 విధానంలో 354 చదరపు అడుగుల్లో నిర్మించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే జిల్లాలోని పరదేశిపాలెంలో సర్వే నెంబర్ 21లో జీ ప్లస్ 3 విధానంలో 192 ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లను కూడా ఆహ్వానించింది. మొత్తం 800 ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ. 8,53,50,387 గా నిర్ధారించారు. చదరపు అడుగుకు నిర్మాణ వ్యయాన్ని రూ.650 చొప్పున నిర్ణయించారు. ఒక్కోఇంటి నిర్మాణ వ్యయం రూ.1,06,687గా పేర్కొన్నారు. గత సర్కారు ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.6.40 లక్షల నుంచి రూ.8.70 లక్షలుగా నిర్ణయిస్తే ఇప్పుడు అంతే విస్తీర్ణంలో ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1,06,687గా నిర్ధారించడం గమనార్హం. -
హౌస్ ఫర్ ఆల్... అంతా గోల్మాల్...
అందరికీ ఇళ్లు పథకాన్ని కొందరికే పరిమితం చేశారు. నిజమైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నా... వారిని పక్కన పెట్టారు. బయటి మార్కెట్‌కంటే ఎక్కువ మొత్తం చెల్లించి కాంట్రాక్టర్ల జేబులు నింపారు. ఇదీ గత ప్రభుత్వ నిర్వాకం. ఒకే ఒక్క నిర్ణయం ఈ అవకతవకలకు చరమగీతం పాడనుంది. అదే రివర్స్ టెండరింగ్. దీనివల్ల తక్కువ మొత్తం తోనే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశం... పనిలోపనిగా 25 శాతం పనులు పూర్తికానివాటిని రద్దు చేయడం ద్వారా నిజమైన లబ్ధిదారులకు మళ్లీ వాటిని కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే ఇళ్ల నిర్మాణంపై పూర్తి నివేదికలను మునిసిపల్ కమిషనర్లు సిద్ధం చేస్తున్నారు. బొబ్బిలి: పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన హౌస్ ఫర్ ఆల్ పథకం గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురి పించింది. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు టెండర్లు ఖరారు చేసి వారికి లబ్ధి చేకూర్చింది. దీనిని గుర్తించిన నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసింది. ఇప్పుడు వాటిని నిర్ణీత ధరకు రివర్స్ టెండరింగ్‌కు సిద్ధమయిం ది. అంతే కాదు. ఇప్పటి వరకూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని, జోరందుకోనివాటికి సంబం ధిం చి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశించడంతో మున్సిపల్ కమిషనర్లు ఆయా లెక్కలను బేరీజు వేసుకుంటున్నా రు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం 25 శాతం దాటని వాటిని రాష్ట్ర ప్రభుత్వం నెలన్నర రోజుల కిందట నిలిపివేసిన సంగతి తెల్సిందే. ఇప్పుడు వాటి వివరాలు అందజేసిన తరువాత రివర్స్ టెండరింగ్‌కు ప్రభుత్వ చర్యలు తీసుకోనుంది. విజయనగరం మినహా అన్నింటా అరకొరే... జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్క విజ యనగరం మినహా మిగతా అన్ని చోట్లా 25 శా తం లోపునే నిర్మాణాలు జరిగాయి. వీటి నిర్మాణ బాధ్యతను విజయలక్ష్మి కంపెనీకి గత ప్రభుత్వం అప్పగించింది. మున్సిపాలిటీల్లో మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు తమ అనుయాయులకు ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు జాబితా లు సిద్ధం చేశారు. దీంతో చాలా చోట్ల పట్టణపేదలు తమ ఆవేదనను వెలిబుచ్చినా ఫలితం లేకపోయింది. మరో వైపు అధిక ధరలకు సదరు కంపెనీకి కట్టబెట్టడంతో ప్రజా ధనం దుర్విని యోగమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రివర్స్ టెండరింగ్‌కు చర్యలు తీసుకోవడంతో తక్కువ మొత్తానికి పనులు పూర్తి కానున్నాయి. నిర్మాణాలు కాకుండానే లబ్ధిదారుల ఎంపిక.. బొబ్బిలి మున్సిపాలిటీలో ఇళ్ల నిర్మాణానికి మున్సిపాలిటీకి బహుదూరంగా దారి లేకున్నా ఇళ్ల నిర్మాణాలను హుటాహుటిన ప్రారంభించా రు. అంతే కాదు కనీసం 18 శాతం నిర్మాణాలు కూడా పూర్తి కాకుండానే వాటిని అప్పటి మంత్రి ఆర్.వి.సుజయ్ కృష్ణ రంగారావు చేత టీడీపీ నాయకులు తూముల భాస్కరరావు, అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ అచ్యుతవల్లి తదితరులు లాటరీలు తీయించి లబ్ధిదారులకు ఇళ్లను కేటా యించేశారు. అయితే ఆ ఇళ్లు ఎక్కడున్నాయన్న విషయం అటు లబ్దిదారులకు, ఇటు కాంట్రాక్టర్లకు చివరికి నంబర్లు అందజేసిన అప్పటి మం త్రికి కూడా తెలియకపోవడం విశేషం. బొబ్బిలి లో 2481 ఇళ్లకు గాను 2448 ఇళ్లు మాత్రం గ్రౌం డ్ చేశారు. అందులో కేవలం 288 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి శ్లాబు, రూ ఫ్, ఫౌండేషన్, గ్రౌండ్ ఫౌండేషన్ వంటి స్థాయిల్లోనే ఉన్నా యి. ఇక్కడ ఇళ్లు నిర్మించినా ఇంకా రహదారి కూడా సిద్ధం కాలేకపోవడం విశేషం. ఇతర చోట్లా అదే పరిస్థితి.. ఇళ్ల నిర్మాణాలు చాలా నెమ్మదిగా కాంట్రాక్టరు చేపడుతున్నారని అధికారులు గుర్తించారు. పా ర్వతీపురంలో కేవలం పునాదుల స్థాయిలోనే పనులున్నాయి. అలా గే సాలూరులో 18 శాతం మాత్రమే పనులయ్యాయి. నెల్లిమర్లలో 21 శాతం మాత్రమే జరి గాయి. విజయనగరంలో 50 శాతం జరగడంతో దానిని కొనసాగించాలని నిర్ణయించారు. మిగిలిన చోట్ల పనులను నిలిపివేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటి నివేదికలను ఆయా అధికారులను కోరింది. మున్సిపల్ కమిషనర్లు ఇప్పుడు వాటి వివరాలను టిడ్కో అధికారులకు పంపిస్తున్నారు. వివరాలు అడిగారు... పంపించాం.. హౌస్ ఫర్ ఆల్ పథకానికి సంబంధించిన ఇళ్ల వివరాలను ఉన్నతాధికారులు అడిగారు. వాటిని బ్లాకుల వారీగా నివేదిక ఇచ్చాం. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇళ్ల నిర్మాణాలను టిడ్కో అధికారులు ప్రారంభిస్తారు. – జి.బాలరాజు, టీపీఓ ఇన్‌ఛార్జి, బొబ్బిలి మున్సిపాలిటీ -
అవినీతిపై పోరులో వెనకడుగు వద్దు
సాక్షి, అమరావతి: అవినీతిపై పోరాటం చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో టెండర్ల ప్రక్రియ మొదలు తీసుకువచ్చిన అప్పుల వరకు పై స్థాయిలో ఏది చూసినా వందలు.. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అవినీతి లేకుండా ఉండి ఉంటే అవే ఇళ్లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చేవి కావా అని ప్రశ్నించారు. బుధవారం అర్బన్ హౌసింగ్ (టిడ్కో)పై మంత్రివర్గ ఉప సంఘంతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయినా దేనికీ లొంగే ప్రసక్తే లేదన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసిన వారిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతి రహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని కోరారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దీని వల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ధరలు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి పట్టణాల్లో అర్హులైన మిగిలిన 4 లక్షల మంది లబ్ధిదారులకు ఫ్లాట్లు కట్టించడానికి భూమిని గుర్తించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు తక్కువ ధరలో దీర్ఘకాలం నిలిచే విధంగా ఫ్లాట్లు నిర్మించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మేరకు అధికారులు పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఏ పని చేపట్టినా అందులో స్కాం లేకుండా చూసుకోవాలన్నారు. మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి.. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు ఏ విధంగా ఉన్నాయి.. అనే విషయాలపై ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని ఆదేశించారు. రేట్లు ఖరారు చేసే సమయంలో నిర్మాణ రంగానికి చెందిన నిపుణులతో సంప్రదించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా అంచనాలు రూపొందించాలని చెప్పారు. ఇప్పుడున్న ఎస్ఎస్ఆర్లను ప్రామాణికంగా తీసుకుని అంచనాలు తయారు చేయాల్సిన అవసరం లేదని, వాస్తవ రేట్లను పరిగణనలోకి తీసుకుని రివర్స్ టెండర్లు ఖరారు చేయాలన్నారు. ప్రభుత్వం ఇసుక, స్థలం ఉచితంగా, సబ్సిడీపై సిమెంట్ సరఫరా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రేట్లు తగ్గాలన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ.. ఈనెఖారుకు కొత్త రేట్లు ఖరారు చేస్తామని, వచ్చేనెలాఖరులో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని చెప్పారు. 1.02 లక్షల ఇళ్లకు రివర్స్ టెండరింగ్ ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో పునాదుల లోపు 65 వేల ఇళ్లు, బేస్మెంట్ లెవెల్లో 37 వేల ఇళ్లు ఉన్నాయని, వీటిన్నింటికీ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మరో 1.75 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఇవిపోగా మిగిలిన 4 లక్షల ఫ్లాట్ల కోసం భూమిని చూడాలన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్‌కల్లాం, సలహాదారులు శామ్యూల్, సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడి కృష్ణమోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఒక్క ఇళ్లు కూడా లబ్దిదారుడికి అందలేదు
-
నాడు చెప్పిందే.. నిజమైంది
పట్టణ గృహ నిర్మాణం విషయంలో గతంలో భారీ స్కాం చోటుచేసుకుంది. 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితమే. సిమెంట్ సబ్సిడీపై వస్తుంది. అటువంటప్పుడు చదరపు అడుగుకు రూ.1100 మించి కాదు. గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.2,200 ధర పెట్టి అడ్డంగా దోపిడీకి పాల్పడింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు కలిపి రూ.3 లక్షలు ఇస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇది సరిపోతుంది. కానీ గత పాలకులు దీన్ని రూ.ఆరు లక్షలకు పెంచారు. ఇంత ఎందుకవుతుందో నాకు అర్థం కావడం లేదు. దీనిపై రివర్స్ టెండరింగ్‌కు వెళదాం. – కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, మండపేట(తూర్పుగోదావరి) : ‘అందరికీ ఇళ్లు పథకం’లో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్లాటు ధరలను భారీగా పెంచేసి గత ప్రభుత్వం పేదలను దోచుకుంటున్న తీరును రెండేళ్ల క్రితమే ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. ఇటుక కట్టుబడి, అన్ని హంగులు ఉన్న ప్రైవేట్ అపార్ట్మెంట్లలో చదరపు అడుగు రూ.1500 వరకూ ఉంటుంటే.. స్థలం ఉచితం, ఇసుక ఉచితం, సబ్సిడీపై సిమెంట్ ఇన్ని వెసులుబాటుల నేపథ్యంలో ‘అందరికీ ఇళ్లు పథకం’ ప్లాటు రూ.1100 మించకూడదు. అయితే గత ప్రభుత్వం ఏకంగా రూ.2200 ధర పెట్టింది. జిల్లాలోని లబ్ధిదారుల నుంచి దాదాపు రూ. 921.2 కోట్లు దోపిడీకి ఎత్తుగడ వేసింది. టెండర్లు ప్రక్రియ పూర్తయిన అనంతరం రెండుసార్లు ధరల్లో మార్పులు చేయడం అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. ‘అందరికీ ఇళ్లు’ పథకం ద్వారా రెండు విడతల్లోను జిల్లాకు దాదపుగా 25,952 ప్లాట్లు మంజూరయ్యాయి. కాకినాడ కార్పొరేషన్‌కు 4,608 ఫ్లాట్లు, రాజమహేంద్రవరానికి 7876, పెద్దాపురం మున్సిపాల్టీకి 2546, సామర్లకోటకు 1,048, రామచంద్రపురానికి 1,088, మండపేటకు 6276, పిఠాపురానికి 874, అమలాపురానికి 1,636 ఫ్లాట్లు మంజూరయ్యాయి. రెండో విడతలో తునికి 5,049 ఫ్లాట్లు మంజూరయ్యాయి. పేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని వారిని అడ్డగోలుగా దోచుకునే ఎత్తుగడ వేసింది గత ప్రభుత్వం. కేటగిరి–1లో 300 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూం, కేటగిరి–2లో 365 చ.అ. సింగిల్ బెడ్ రూం, కేటగిరి–3లో 430 చ.అ. డబుల్ బెడ్ రూం ఫ్లాట్లుగా విభజించింది. మొదటి కేటగిరి ఫ్లాటు ధర రూ.5.77 లక్షలు, రెండో కేటగిరి ప్లాటు ధర రూ.6.9 లక్షలు, మూడో కేటగిరి ఫ్లాటు ధర రూ.7.93 లక్షలుగా నిర్ణయించింది. ఈ మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాయం రూ.3 లక్షలుపోను, మొదటి కేటగిరి లబ్ధిదారులు వాటా రూ. 500, బ్యాంకు రుణం రూ.2.76 లక్షలు చెల్లించాలి. అలాగే రెండో కేటగిరి లబ్ధిదారులు వాటాగా రూ. 50,000, బ్యాంకు రుణం రూ. 3.4 లక్షలు, మూడో కేటగిరి లబ్ధిదారులు వాటాగా రూ.1,00,000, బ్యాంకు రుణం రూ.3.93 లక్షలు చెల్లించాలి. అడ్డగోలుగా దోపిడీ జిల్లాలోని నగర, పురపాలక సంస్థల్లో రియల్టర్లు భూములు కొనుగోలు చేసి, ఇటుక, ఇసుక, సిమెంట్, కంకర, ఐరెన్లకు పూర్తిగా నగదు చెల్లించి బాల్కనీ, లిఫ్ట్, నాణ్యమైన కలప, టైల్స్ తదితర వసతులతో చేసిన ప్లాటు చదరపు అడుగు ధర రూ. 1300 నుంచి రూ.1500లు వరకు ఉంటున్నాయి. ప్రభుత్వ స్థలంలో ఉచితంగా వచ్చిన ఇసుక, సబ్సిడీపై వచ్చిన సిమెంట్, ఐరెన్‌తో చేసిన అందరికీ ఇళ్లు ఫ్లాట్లలో చదరపు అడుగు రూ.1100లోపే ఉండాలి. అయితే గత ప్రభుత్వం దాదాపు రూ. 2,200లు వరకు ధర నిర్ణయించడం భారీ స్కాం చేసేందుకు స్కెచ్ వేసిన విషయాన్ని స్పష్టం చేస్తోంది. బాల్కనీ 74,010 ఫ్లాట్ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలున్నాయి. తాగునీటి అవసరాలకు, గృహవసరాలకు వేర్వేరుగా పైప్లైన్లు ఉండాల్సి ఉండగా వీటిల్లో అన్ని అవసరాలకు ఒకటే పైప్‌లైన్ పెట్టారన్న విమర్శలున్నాయి. ఎప్పటికప్పుడు అపార్ట్‌మెంట్‌పై ట్యాంకును శుభ్రం చేసుకోకపోతే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పేదలపై రూ. 921.2 కోట్ల అదనపు భారం కేటగిరీ–1లో 9,288 మంది, కేటగిరీ–2లో 1993, కేటిగిరీ–3లో 11,304 ఫ్లాట్లు కోసం వచ్చిన దరఖాస్తుల మేరకు లబ్ధిదారుల నుంచి వాటా సొమ్ములు వసూలు చేయడంతోపాటు బ్యాంకుల నుంచి వారి పేరిట రుణాలు తీసుకునే ప్రక్రియను గత ప్రభుత్వం ప్రారంభించింది. తద్వారా ఇప్పటికే భారీగా ప్రజాధనాన్ని దోపిడీ చేసినట్టు తెలుస్తోంది. ఆయా కేటగిరీల్లోని లబ్ధిదారులపై రూ. 921.2 కోట్లు అదనపు భారం మోపినట్టు అంచనా. టెండర్లు పిలిచిన తర్వాత ధర తగ్గింపు సాధారణంగా టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ధర తగ్గించడం జరగదు. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో బ్యాంకు నుంచి తీసుకునే రుణాలను స్వల్పంగా తగ్గిస్తూ గత ప్రభుత్వం రెండు పర్యాయాలు మార్పులు చేయడం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పేదలను దోచుకోవడమే అందరికీ ఇళ్లు పథకంలో చంద్రబాబు సర్కారు కోట్లాది రూపాయల పేదల కష్టార్జితాన్ని అడ్డగోలుగా దోచుకుంది. కామన్‌సైట్, టేకు కలప వినియోగించి చేసిన తలుపులు, కిటికీలు, అధునాతన టైల్స్, విద్యుత్ సదుపాయాలతో నిర్మించే ప్రైవేటు ఆపార్ట్మెంట్లలోనే ఇంత ధర లేదు. దుస్తులు ఆరబెట్టుకునేందుకు కనీసం బాల్కానీ, లిప్ట్ సదుపాయం కూడా లేకుండా నాసిరకంగా నిర్మించిన అందరికి ఇళ్లు ప్లాట్లులో మాత్రం చ.అ రూ. 2200 ధర నిర్ణయించింది పేదలను మోసం చేసింది. – రెడ్డి రాధాకష్ణ, మున్సిపల్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, మండపేట. -
హుద్‌హుద్ ఇళ్ల రహస్యం
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, పీఎంఎవై–హెచ్ఎఫ్ఎ– ఏహెచ్‌పీ ఆధ్వర్యంలో హుదూద్ ఇళ్ల గృహ సముదాయ నిర్మాణం చేపట్టారు. పలాస నియోజకవర్గ పరిధిలో రెండు చోట్ల నిర్మాణం తలపెట్టారు. వజ్రపుకొత్తూరు మండలం బెండికొండపై 198 ఇళ్లు నిర్మాణం చేపట్టగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సూదికొండ– పారిశ్రామికవాడల మద్యలో నిర్మాణాన్ని తలపెట్టారు. వాస్తవానికి హుద్‌హుద్ తుఫాన్లో చిక్కుకున్న మత్స్యకార కుటుంబాలకు చెందిన బాధితులకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. సముద్రతీర ప్రాంతంలో నివసిస్తున్న వారికి నిర్మించాల్సి ఉండగా అప్పటి పలాస ఎమ్మె ల్యే గౌతుశ్యామసుందర శివాజీ తన సొంత ఆలోచనలతో గ్రామీణ ప్రజలకు ఎకనామం పెట్టి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి లోని సూదికొండ పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ డీపట్టా భూములను గుర్తించి ఆదరాబాదరాగా నిర్మాణాలు చేపట్టారు. స్థానికంగా సమస్యలపై అవగాహన లేమితో ఇంజనీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆమోదంతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నిర్మించిన వాటికి హుద్‌హుద్ పేరిట కాకుండా ఎన్టీఆర్ ప్రత్యేక పట్టణ గహ నిర్మాణ పథకం పేరుతో 192 ఇళ్లు జీప్లస్1 పద్ధతిలో చేపట్టారు. మొత్తం గృహ నిర్మాణాల విలువ రూ.9.216 కోట్లు పైగా ప్రభుత్వ నిధులను వినియోగించినట్లు ప్రకటనలు జారీచేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోను ఇంతే నిధులు వెచ్చించారు. వీటిని కాకినాడకు చెందిన డీ.జీ.బి కనస్ట్రక్షన్ ప్రై వేటు లిమిటెడ్ పేరుతో కంట్రాక్టర్‌కు అప్పగించారు. పూర్తిగా ప్రజల డబ్బుతో కట్టిన ఈ నిర్మాణాలు తుఫాన్ బాధితులకు తప్ప అందరికీ అందాయంటే అతిశయోక్తి కాదు. కేటాయింపులో గందరగోళం అయితే ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయి. కౌన్సిలర్‌కు ఐదు ఇళ్లు చొప్పున మొత్తం 25వార్డులకు చెంది న ఇళ్లు అమ్ముకున్నారనే ప్రచారం జోరుగా సాగింది. మొత్తం 192 ఇళ్లకు అప్పటి ఎమ్మెల్యే శివాజీ లిస్టు ప్రకటించగా పూర్తిగా అందులో పెద్దలకే ఇళ్లు ఉన్నాయని పత్రికలు కోడై కూయడంతో లిస్టు వెనక్కు తెప్పించి అనర్హులను తొలగించారు. అయితే సుమారు 70కుపైగా పేర్లను మాత్రమే కేటాయించా రని మిగిలిన వారిని తొలగించారని అప్పట్లో అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వారు కూడా పదివేల రూపాయలు డీడీ తీయాల్సి ఉన్నప్పటికీ తీయకుండా వారికి ఎలా కేటాయిం చారన్నది అనుమానంగా ఉంది. స్కెచ్ ఫెయిల్ టెక్కలి: టెక్కలిలో సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. సుమారు 192 ఇళ్ల నిర్మాణానికి 2016 సంవత్సరంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కంకరబందలో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వైపు నిర్మాణాలు జరుగుతుండగా మరో వైపు లబ్ధిదారుల ఎంపిక విషయంలో టీడీపీ కార్యకర్తలు వేసిన పక్కా స్కెచ్ ఫెయిలైంది. ఒక వైపు నిర్మాణాలు పూర్తి కాకపోవడం, మరో వైపు ఎన్నికలు సమీపించి ప్రభుత్వం మారడంతో టీడీపీ కార్యకర్తల ఆశలు అడియాసలుగా మారాయి. ప్రస్తుతానికి జీప్లస్ త్రీ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నాణ్యత లోపం సోంపేట: సోంపేట మండలానికి 2015లో 128 హుద్‌హుద్ ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లోనే లబ్ధిదారులను గుర్తించారు. కానీ నిర్మాణాలను మాత్రం నాసిరకంగా చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016 జూలైలో అప్పటి ఎమ్మె ల్యే బెందాళం అశోక్ హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.128 ఇళ్లకు 80 ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు రాగా మిగతా 48 ఇళ్ల నిర్మాణం ప్రారంభంలోనే ఉంది. అయితే లబ్ధి దారుల ఎంపికలో భారీగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్రమాల కేటాయింపులు అక్రమాల కేటాయింపులు సెగెళ్ల చిట్టెమ్మ.. ఈవిడ మూడేళ్ల క్రితం మరణించింది. అయితే ఈమె పేరుమీద ఆమె కుమారుడికి హుద్‌హుద్ కాలనీలో ఇల్లు కేటాయించారు. లబ్బ సూర్యకుమారి మహాలక్ష్మినగర్ కాలనీ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న సిరిపురపు భాస్కరరావుకు బంధువు. ఈమెకు కూడా ఇంటిని కేటాయించారు. సీర చిట్టెమ్మకు సొంతిల్లు ఉంది. అయినా హుద్‌హుద్ ఇంటిని కేటాయించారు. భైరి సంతోష్‌కుమార్‌కు కూడా ఇంటిని ఇచ్చారు. భైరి సంతోష్‌కుమార్, నడిమింటి రాధలు ఒకే కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ వారికి రెండు ఇళ్లను కేటాయించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ సోదరునికి కూడా ఓ ఇంటిని మంజూరు చేసేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అప్పట్లో శ్రీకాకుళంలో ప్రతి వార్డుకు ఓ ఇంటిని కేటాయిస్తూ టీడీపీ నాయకులు చెప్పినవారికే ఇళ్లను కట్టబెట్టారు. కాశీబుగ్గలో హుద్‌హుద్ ఇళ్లు ఇలా 194 ఇళ్లను టీడీపీ కేడర్‌కు ఎన్నికల ముందు పంచిపెట్టేశారు. కాలనీ నిర్మించి మూడేళ్లు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక జాబితాను గోప్యంగా ఉంచారు. ‘సాక్షి’ ఈ జాబితాను వెలుగులోకి తేవడంతో లబ్ధిదా రుల జాబితాను ఉన్నతాధికారులతో ఆమోదింపజేసేందుకు అప్పటి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో ఉన్నతాధికారిని సైతం బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని రప్పించుకొని ఆమోదముద్ర వేయించారు. హుద్‌హుద్ ఇళ్ల కేటాయింపుల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశం జిల్లా పార్టీ సమావేశంలో పలువురు పార్టీ నాయకులే బహిరంగంగా ఆరోపించి ఆధారాలను సైతం నాయకులు అందజేశారు. అయినా ఫలితం లేకపోయింది. పనులు కాకుండానే ఫలహారం! వజ్రపుకొత్తూరు: హుద్ హుద్ ఇళ్లు అక్రమాలకు కేరాఫ్‌గా మారాయి. వజ్రపుకొత్తూరు మండలంలో బెండి కొండ వద్ద రూ.8.70 కోట్లతో 192 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పనులు పూర్తి కాకుండానే అప్పటి ఎమ్మెల్యే శివాజీ ఫిబ్రవరి 9న ప్రారంభించేశారు. లబ్ధిదారుల జాబి తా కలెక్టర్‌కు పంపించగా ఆయన తిరస్కరించా రు కూడా. మంచినీళ్లపేటలో టీడీపీ నేతలకి కేటాయించిన ఐదు ఇళ్లలో ఒక ఇంటిని రూ.1.50లక్షలకు చొప్పున ఏకంగా వేలానికి పెట్టి రూ.7.50 లక్షలు వసూలు చేశారు. ఇక కొత్తపేట పంచాయతీలో మండల టీడీపీ బాధ్యతలు తీసుకున్న వ్యక్తి కుటంబ సభ్యులకు కొన్ని ఇళ్లు, పక్క పంచాయతీలోని మరికొందరికి కొన్ని అమ్ముకోగా, పాతటెక్కలి పంచాయతీలో పక్కా ఇల్లు ఉన్న 10 ఎకరాల ఆసామికి హుద్ హుద్ ఇల్లు కేటాయించారు. ఇలా ఈ 192 నివాసాలను రూ.1.70 కోట్లకు అమ్మేశారు. వారి పాచికను కలెక్టర్ పారనీయకపోవడంతో గమ్మునుండిపోయారు. అయితే ఈ పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. తిత్లీ తుపానులో శిథిలమైన పైప్‌లైన్, ఇతర పనులను నేటికీ పునరుద్ధరించలేదు. కొండకు దిగువన కట్టడంతో వరద ప్రవాహానికి ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. తాగునీటి సదుపాయానికి ఓవర్ హెడ్ ట్యాంకు పనులు ఇంకా ప్రారంభించలేదు. విద్యుత్ సదుపాయం కూడా కల్పించలేదు. -
సొమ్ములు పోయినా సొంతగూడు దక్కలేదు
సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి): టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్నటి వరకు అధికారపార్టీ నాయకుల ఆగడాలకు భయపడి వారంతా ముందుకు రాలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ బాధలను ఏకరువు పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా పేదలకు ఇల్లు కట్టించకపోయినా ఆ పార్టీ నాయకులు ఇళ్ల పేరుతో పేదలను దోచుకున్నారు. దీనిలో భాగంగా భీమవరం మండలం వెంప గ్రామంలో కొత్తకాలనీ ఇళ్ళ నిర్మాణం పేరుతో ఆ ప్రాంత టీడీపీ నాయకులు పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి తమను నట్టేట ముంచారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్ళుగా ఇళ్ళ నిర్మాణం నిలిచిపోవడంతో 56 కుటుంబాలకు నిలువనీడ లేక రోడ్డున పడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో మూడేళ్ళ క్రితం వెంప కొత్తకాలనీ ప్రభుత్వ భూమిని ఇళ్లస్థలాలుగా 56 మంది లబ్ధిదారులకు కేటాయించారు. వీరందరికీ ఎన్టీఆర్ గృహ పథకంలో ఇళ్లను మంజూరు చేసినట్లు నాయకులు ఆర్భాటంగా ప్రకటించారు. ప్రభుత్వం గృహ నిర్మాణానికి రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తుందని ఆ సొమ్ములతో ఇళ్ల నిర్మాణం పూర్తికాదని కొంతమంది టీడీపీ నాయకులు లబ్ధిదారుల ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.లక్ష వసూలు చేశారు. దీంతో తమకు సొంత గూడు ఏర్పడుతుందని లబ్ధిదారులు ఆశపడ్డారు. సొమ్ములు వసూలు చేసి మూడేళ్లు గడిచిపోయినా ప్రస్తుతం ఆ కాలనీలో కొన్ని ఇళ్లు పునాదుల్లో నిలిచిపోతే, మరికొన్ని శ్లాబ్ వేసి ఆగిపోయాయి. ఇళ్లు మంజూరై మూడేళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో నివసించాల్సి వస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తిచేయకపోవడంతో ఆ ప్రాంతం పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా నిర్మాణం నిలిచిపోయిందని డబ్బులు వసూలు చేసిన పెద్దలు చెబుతున్నారని, అయితే గత మూడేళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేవని వారు వాపోతున్నారు. మూడేళ్లుగా సాగని నిర్మాణాలు మూడేళ్ల క్రితం ఇళ్లు మంజూరైనా ఇప్పటికీ నిర్మాణం జరగడంలేదు. ఈ కాలనీలో నా కుమార్తె కట్టా నాగవేణికి ఇల్లు మంజూరైంది. గృహ నిర్మాణానికి ముందుగా రూ.లక్ష ఇవ్వాలని చెప్పడంతో వడ్డీకీ తెచ్చి మరీ ఇచ్చాం. ఇప్పటి వరకు నా కుమార్తెకు పట్టా ఇవ్వలేదు సరికదా, అసలు ఇల్లు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. - కొప్పిశెట్టి నాగ చంద్రరావు శ్లాబ్ వేసి నిలిపేశారు నాకు ఇల్లు మంజూరైందని చెప్పడంతో ఎంతో ఆనందించా. నిర్మాణం ప్రారంభం కాగానే సొంత ఇంటి కల సాకారమవుతుందని ఆశపడ్డా. అయితే ఇంటికి శ్లాబ్ వేసి చాలా కాలమైనా మిగిలిన పనులు ఆగిపోయాయి - శింగారపు నాగమణి పునాదులు కూడా వేయలేదు ఇల్లు కట్టించి ఇస్తామని నా వద్ద రూ.లక్ష తీసుకున్నారు. కనీసం పునాదులు కూడా వేయలేదు. నా బిడ్డ వికలాంగుడు. ఎంతో పేదరికంలో ఉన్నా సొంత గూడు ఏర్పడుతుందని సొమ్ములు ఇచ్చా. ఇప్పడేమో ప్రభుత్వం మారిపోయింది. పాత ఇళ్లకు నిధులు మంజూరుకావని చెబుతున్నారు. - కాలా మాణిక్యం -
‘అందరికీ ఇళ్లు’ అందేదెప్పుడు?
సాక్షి, అమరావతి: టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టిడ్కో) ఇంజినీర్ల దోపిడీ కారణంగా ‘అందరికీ ఇళ్లు’ అందుబాటులోకి రావడం లేదు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థలు సకాలంలో ఇళ్లు నిర్మించకపోయినా ఇంజినీర్లు పట్టించుకోవడం లేదు. సరైన కారణం లేకుండా ఇళ్లను సకాలంలో నిర్మించని నిర్మాణ సంస్థలకు జరిమానా విధించాలి. కానీ, టిడ్కో ఇంజినీర్లు జరిమానా విధించకుండా నిర్మాణ సంస్థల నుంచి పర్సంటేజీలు దండుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణంలో జాప్యం వెనుక నిర్మాణ సంస్థల తప్పు లేదని, భూ సేకరణ పూర్తి కాలేదని, డిజైన్లు ఆమోదం పొందలేదని ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. వీటి ఆధారంగా ఒప్పందం గడువును ప్రభుత్వం పొడిగిస్తోంది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 5.24 లక్షల ఇళ్లు (ఫ్లాట్లు) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ వ్యయం, విస్తీర్ణాన్ని బట్టి ఇంటి విలువను రూ.7.30 లక్షలు, రూ.8 లక్షలు, రూ.9 లక్షలుగా నిర్ణయించారు. లబ్ధిదారుడి వాటా, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని బట్టి నెలకు రూ.2,500, రూ.2,900, రూ.3,500 వాయిదాగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన ప్రదేశంలో జీ+3 విధానంలో నిర్మాణాలు జరిపేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రముఖ నిర్మాణ సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పనులు పొందిన నిర్మాణ సంస్థలు ఒప్పందం ప్రకారం సకాలంలో ఇళ్లను నిర్మించలేకపోయాయి. 80,238 ఇళ్లకు గాను ఈ ఏడాది మార్చి నాటికి కేవలం 1,500 ఇళ్లనే నిర్మించాయి. నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయని సంస్థలకు ఈపీసీ విధానం ప్రకారం జరిమానా విధించాలి. కానీ, ప్రభుత్వం ఎలాంటి జరిమానా విధించకుండా ఒప్పందం గడువును పలుమార్లు పొడిగించింది. టిడ్కో ఇంజినీర్ల అవినీతి కారణంగానే నిర్మాణ సంస్థలు జరిమానా నుంచి తప్పించుకున్నాయన్నది బహిరంగ రహస్యమే. లబ్ధిదారులు నిర్మాణ సంస్థలు, ఇంజినీర్ల అవినీతిపై ప్రభుత్వానికి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదనపు భారం రాష్ట్రంలో దాదాపు 65 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే, వాటిలో నాణ్యత అంతంతమాత్రంగానే ఉండడంతో చాలామంది లబ్ధిదారులు ఇంకా గృహప్రవేశం చేయలేదు. సొంత డబ్బులు వెచ్చించి, మరమ్మతులు చేయించుకుంటున్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు జరగలేదని టిడ్కోకు చెందిన క్వాలిటీ కంట్రోల్ విభాగం నివేదిక పంపినా ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వడ్డీతో సహా రాబట్టుకోవాలట! ఇతర ప్రభుత్వ శాఖల నుంచి టిడ్కోకు డిప్యూటేషన్‌పై వచ్చిన ఇంజినీర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. మూడేళ్ల డిప్యూటేషన్‌పై వచ్చిన ఇంజినీర్లు అందినంత దోచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడకు రావడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టామని, అదంతా వడ్డీతో సహా తిరిగి రాబట్టుకోవాల్సి ఉందని చెబుతున్నారు. -
ఏలికల పాపాలు.. లబ్ధిదారులకు శాపాలు
సాక్షి, సోంపేట/ కవిటి (శ్రీకాకుళం): తుపానులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు, గూడులేని దారిద్య్రరేఖరు దిగువన ఉన్న పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే ఆశయం నెరవేరకుండా పోయింది. 2016లో కవిటి మండలంలో 64 ఇళ్లు హుద్‌హుద్ తుపాను బాధితులకు అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేశారు. రూ.2.55 కోట్లతో 64 ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఒక్కో యూనిట్ ధర రూ.3.98 లక్షలుగా నిర్థారించారు. ఈ ఇళ్ల నిర్మాణం హౌసింగ్ అధికారుల పర్యవేక్షణలో గుత్తేదారు చేపట్టాడు. ఇంటినిర్మాణాలు పూర్తికావచ్చినప్పటికీ నేటికి ఏడాదిన్నర అవుతోంది. కానీ ఇప్పటివరకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ ఇళ్లను బాధితులకు అందించే ప్రక్రియను ప్రారంభించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా లబ్ధిదారుల ఎంపిక అనధికారికంగా చేసేందుకు ఓ రహస్య భేటీ కూడా జరిగినట్టు కవిటిలో గుసగుసలువినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కొందరు ఇళ్లకోసం ఎదురుచూపులు చూస్తున్న తెలుగుతమ్ముళ్ల అనుయాయులైన లబ్ధిదారుల నుంచి రేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారనే వాదన ప్రచారంలో ఉంది. వాస్తవానికి ఏడాది క్రితం జరగాల్సిన లబ్ధిదారుల ఎంపిక నేటికీ పూర్తిచేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కవిటి చింతామణిగుడి పక్కన కొనుగోలు చేసిన కాలనీలో ఈ ఇళ్లను నిర్మించారు. కానీ అప్పట్లోనే కొంతమందికి ఇళ్ల పట్టాలు కూడా కేంద్ర మాజీ మంత్రి కృపారాణి హయాంలో మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా ఒక పట్టా ఇచ్చి కాలనీలో లబ్ధిదారుల ఎం పిక చేసినప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. వాస్తవానికి ఈ ఇళ్లకు సంబంధించి కిటికీలు తదితర సామగ్రి విరిగిపోయి దెబ్బతిన్నాయి. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో దిక్కుతోచని దీనస్థితిలో అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా ఈ ఇళ్లు ఉపయోగపడుతున్నాయి. విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్న పాలకులు తీరు పై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నాసిరకంగా నిర్మాణాలు సోంపేట పట్టణంలో పది సంవత్సరాలుగా 110 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాల పట్టాలు చేత పట్టుకుని స్థలాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. 2003లో సోంపేట పట్టణంలోని 110 మంది పేదలకు అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. వివిధ కారణాల వల్ల లబ్ధిదా రులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. 2014లో హుద్‌హుద్ తుపాను రావడంతో సోంపేట మండలాలనికి హుద్‌హుద్ ఇళ్లు 128 మంజూ రయ్యాయి. వీటిని అప్పట్లో స్థలాలు ఇచ్చినవారిని లబ్ధిదారులుగా గుర్తించి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. మీ ఇంటి కల నెరవేరేందుకు హుద్‌హుద్ ఇళ్ల పేరిట బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి ఇళ్లను అందజేస్తామని ప్రజా ప్రతినిధులు తెలిపారు. పదిహేను సంవత్సరాలుగా తాము కంటున్న కలలు సాకారమవుతున్నందుకు సంతోషపడ్డారు. పేదల గూడు నిర్మించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు, ప్రమాణాలు పాటిం చాల్సిన అవసరం ఉన్నా నాసిరకం నిర్మాణాలు చేపడుతుండడంతో ఇళ్లు ఉంటాయా కూలుతాయా అనే అనుమానాలు లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. 2016లో శంకుస్థాపన స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ హుదూద్ ఇళ్ల నిర్మాణాలకు 2016 సంవత్సరం ఏడో నెలలో సోంపేట పట్టణంలోని నూకలమ్మ కొండపై శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ విలువ రూ.5.09 కోట్లతో 128 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. నాసిరకపు నిర్మాణంతో ఇళ్లు పూర్తికాకముందే కూలిపోతున్నాయి. మరో రెండు సంవత్సరాలు ఆగాతే పూర్తిగా కూలిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవస రం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడడంతో గుత్తేదారుడు తనకు నచ్చినట్టు నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికా రులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నాణ్యమైన నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల ని స్థానికులు, లబ్ధిదారులు కోరుతున్నారు. మొ త్తం 128 మందికి ఇళ్లు మంజూరు చేయాల్సి ఉండంగా 110 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో 85 మందికి మాత్రమే అర్హులుగా ప్రకటించారు. పట్టాలు అందజేసిన మిగతావారికి వివిధ కారణాలను సాకుగా చూపి ఇళ్లు మంజూరు చేయలేదు. దీంతో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభైవేల వరకు వసూలు చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది హుదూద్ ఇళ్ల నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకొని, నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ గుత్తేదారుడు ఇష్టారా జ్యంగా ఇళ్లు నిర్మిస్తున్నా ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్టు వ్యవహరించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్లు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – తడక జోగారావు, వైఎస్సార్ సీపీ మండల కమిటీ అధ్యక్షుడు అనుమానాలకు తావిస్తోంది కవిటిలో హుదూద్ బాధితులకు నిర్మించిన 64 ఇళ్ల ను లబ్ధిదారులకు ఇప్పటి కీ అందించలేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అధికారులుగా నీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లబ్ధిదారుల ఎంపికలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థంకావడం లేదు. ఇప్పటికే ఇళ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికకు సంబం ధించిన బేరసారాలు జోరుగా సాగాయన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. – పీఎం తిలక్, మాజీ ఎంపీపీ, కవిటి మండలం -
పేదింటిపై సిమెంట్ పిడుగు
సాక్షి, ఇల్లంతకుంట (కరీంనగర్): అందమైన సొంతిల్లు ప్రతీ ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకునేందుకు బ్యాంకులోనో, ఇతరు వద్దనో అప్పు చేసి తమ కలలు ఇంటిని నిర్మించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. బడ్జెట్లో ఏ కొంత మొత్తం పెరిగిన ఆ ఇంటి నిర్మాణ వ్యయం తలకిందులవుతుంది. నిర్మాణం మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఇలాగే ఉంది. పెరిగిన సిమెంట్ ధరలతో గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా బస్తాకు రూ.50 నుంచి రూ.80 పెరగడంతో నిర్మాణాలు కొనసాగించాలా వద్దా అని నిర్మాణదారులు ఆలోచనలో పడ్డారు. గతంలో ఒక్కో బస్తా రూ.250 ఉంటే ఇప్పుడు ధర రూ.340కి చేరింది. ఒక్క బస్తా సిమెంట్ బస్తా ధర రూ.50 నుంచి రూ.80 వరకు పెరగడంతో ఇంటి నిర్మాణాలపై పిడుగు పడినట్లయింది. పెద్దోళ్ల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నా సామాన్యుల పేదోళ్ల ఇళ్ల నిర్మాణాలు కొనసాగించడం కష్టమని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సిమెంట్ దుకాణాల్లోనూ గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇంటి నిర్మాణాలు అర్థాంతరంగా నిలచిపోతున్నాయి. ఒక్కో బస్తాకు రూ.50ల చొప్పున లెక్కేసుకున్నా 100 బస్తాలకు రూ.5 వేల అదనపు భారం కావడం, ఇంకా పెరిగితే మరింత భారం తప్పదని సామాన్యులు వాపోతున్నారు. మరోవైపు గ్రామాల్లో పలు కాలనీల్లో చేపడుతున్న మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు సైతం సిమెంట్ ధరల పెరుగుదలతో నిలిచిపోయాయి. సదరు కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే ఆపేసి ముఖం చాటేస్తున్నారు. ఇలా çమండలంలో సిమెంట్ ధరల పెరుగుదల ప్రభావం అటు అభివృద్ధి పనులపై, ఇటు సామాన్యులపై ఇంటి నిర్మాణాలపై పడిందని పలువురు వాపోతున్నారు. సిమెంట్ బస్తా ధర రూ.280, రూ, 290, రూ.300 వరకు ఇలా కంపెనీల వారిగా పలికేవి. ఇప్పుడు వాటిపై ఏకంగా రూ.50 నుంచి రూ.60 వరకు అదనంగా పెరగడంతో భారంగా మారింది. ఈ ధరల పెరుగుదల ఇంతటితో ఆగుతుందో లేక పెరుగుతుందోనని సామాన్యులు వాపోతున్నారు. దీంతో నిర్మాణాలు ఇప్పట్లో చేపట్టడం మంచిది కాదని మద్యలోనే నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇల్లు కట్టడం కష్టమే త్వరలో కొత్తగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని పనులు చేసుకుంటున్నా. ఈలోగా సిమెంట్ ధరలు పెరిగిపోవడంతో నిర్మాణం చేపట్టాలంటే భయమేస్తోంది. ఇంటి నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయింది. ఇంతటితో ఆగకుండా ఇంకా ధర పెరిగితే అదనపు భారం భరించలేం. అందుకే ఇంటి నిర్మాణం ఆలోచన మానుకుంటున్నా. – పొనగంటి సుధాకర్, నిర్మాణదారుడు గిరాకీ తగ్గింది పెంచిన సిమెంట్ బస్తాల ధరతో ఒక్కసారిగా సిమెంట్‌కు ధరలు పెరిగాయి. దీంతో గృహ నిర్మాణదారులు సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో రోజురోజూకి గిరాకీ తగ్గుతుం ది. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడంతో కొనేందుకు వచ్చి నిరాశతో వెళుతున్నారు. – బొడ్ల కుమార్, సిమెంట్ షాపు యాజమాని పని దొరుకుతలేదు పెరిగిన సిమెంట్ ధరలతో గృహ నిర్మాణదారులు ఇళ్లను నిర్మించుకోవాలంటే జంకుతున్నారు. పెరిగిన సిమెంట్ ధరల కారణంగా ఇంటి నిర్మాణాలు జరగకపోవడంతో కూలీ దొరకడం లేదు. పెంచిన సిమెంట్ ధరలను తగ్గించాలని కోరుతున్నా. – రావుల నాగరాజు, తాపీ మేస్త్రీ -
పరిహారంతో పునరావాసమా
పశ్చిమగోదావరి, పోలవరం : పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణ విషయం పీటముడిగా మారింది. ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే సొమ్ము సరిపోకపోతే నిర్వాసితులకు ఇచ్చే పునరావాసం నుంచి ఖర్చు చేసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించడంపై నిర్వాసితులు భగ్గుమంటున్నారు. పరిహారం సొమ్మును ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తే తాము పునరావాస కేంద్రాల్లో ఎలా జీవించాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆమోదం పొందేందుకు పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాల్లో అధికారులు నిర్వహించిన గ్రామ సభలను అన్నిచోట్లా నిర్వాసితులు బహిష్కరించారు. పరిహారం సొమ్ముతో సంబంధం లేకుండా నిర్వాసితుల ఆమోదంతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది నిర్వాసితుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఇళ్ల నిర్మాణ విషయం గ్రామసభల ఆమోదం పొందకపోవటంతో ఇప్పట్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించే పరిస్థితి లేదు. ఇళ్ల నిర్మాణం పూర్తయితే గ్రామాలు ఖాళీ చేస్తామని నిర్వాసితులు స్పష్టంగా చెబుతున్నారు. దీంతో పునరావాసం అమలులో మరింత జాప్యం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కో ఇంటికి రూ.2.84 లక్షలు కేటాయింపు ఇదిలా ఉంటే జిల్లాలోని పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో ఇంటికి ప్రభుత్వం కేవలం రూ.2.84 లక్షలు కేటాయించింది. ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇంకా పెద్ద ఇల్లు కావాలనుకుంటే రూ.4 లక్షలతో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.8 లక్షల ఖర్చుతో 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చే రూ.2.84 లక్షలు పోనూ మిగిలిన మొత్తాన్ని నిర్వాసితులే పరిహారం సొమ్ము నుంచి భరించాలని షరతుపెట్టింది. దీంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 13,885 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. దీనికోసం పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.ఇళ్ల నిర్మాణానికి రూ.1,030.15 కోట్లు మంజూరు చేసింది. అయితే నిర్వాసితులు అంగీకరించటంతో పాటు, ముంపు గ్రామాల్లో గ్రామసభల ఆమోదం పొందితే తప్ప ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. నిర్వాసితుల అంగీకారం తీసుకోవటం ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఇళ్ల నిర్మాణంపై నిర్వాసితుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె.మోహన్‌కుమార్ చెబుతున్నారు. పునరావాస కేంద్రంలో ఎలా బతకాలి ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు కోండ్ల కన్నపరెడ్డి. పోలవరం మండలంలోని పల్లపూరు గ్రామం ఇతనిది. కొండరెడ్డి తెగ గిరిజనుడు. ఇతనికి భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం కూలి పనులపై ఆధారపడి జీవిస్తోంది. బుట్టాయగూడెం మండలంలోని రెడ్డి గణపవరంలో ఇంటి స్థలం ఇచ్చారు. అధికారులు ఇంటి ఫొటో కూడా చూపించారని, అగ్గిపెట్టెలా ఉన్న ఇంటిలో ఎలా ఉండాలని కన్నపరెడ్డి ప్రశ్నిస్తున్నాడు. సరిపడా ఇల్లు కట్టుకుందామంటే మిగిలిన సొమ్ము పరిహారం నుంచి పెట్టుకోమంటున్నారు. పరిహారం ఇచ్చేది రూ.6.86 లక్షలు. ఈ సొమ్ము ఇంటికి ఖర్చుపెడితే పునరావాస కేంద్రంలో ఎలా జీవించాలంటూ ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వమే మంచి ఇల్లు కట్టివ్వాలని కోరుతున్నాడు. -
ఇటుకల్లేని ఇళ్లు షురూ
మహానగరానికి తక్కువ ఖర్చుతో.. తక్కువ వ్యవధిలో ఇల్లు కట్టుకునే టెక్నాలజీ వచ్చేసింది. దీనిని జీహెచ్ఎంసీ ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల నిర్మాణానికి వినియోగిస్తోంది. ఇందులో ఇటుకలతో పనిలేకుండా టన్నెల్ ఫామ్ టెక్నాలజీని వినియోగించి షియర్ వాల్స్‌తో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. గ్రేటర్లో ఏడాది వ్యవధిలో లక్ష ఇళ్లను నిర్మించాలి. త్వరగా ఈ పనులు పూర్తి చేయాలంటే ఈ టెక్నాలజీని వినియోగిస్తామన్న కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించడంతో షియర్‌వాల్ పనులు మొదలయ్యాయి. కీసర మండలం రాంపల్లిలో 6,264 ఇళ్లను ఇలా ఇటుకల్లేకుండా నిర్మించే పనులు వడివడిగా సాగుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: తక్కువ వ్యవధితో ఎక్కువ ఇళ్లను నిర్మించేందుకుగాను జీహెచ్ఎంసీ టన్నెల్‌ఫామ్ టెక్నాలజీని వినియోగిస్తోంది. షియర్వాల్స్తో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటికే కీసర మండలం రాంపల్లిలో 6,264 ఇళ్లను ఇలా ఇటుకల్లేకుండా నిర్మిచే పనులు వడివడిగా సాగుతున్నాయి. ఈ విధానంలో గోడలను కట్టేందుకు ఇటుకలు పేర్చకుండా శ్లాబ్ నిర్మాణం తరహాలో కాంక్రీటుతోనే గోడల్ని నిర్మిస్తారు. ఇందుకు గోడల కోసం అవసరమైన సైజులో ప్రత్యేక స్టీల్‌ప్లేట్లను వినియోగిస్తారు. రెండు స్టీల్ ప్లేట్ల మధ్య కాంక్రీటు నింపి గట్టిపడ్డాక స్టీల్ ప్లేట్లు తొలగిస్తారు. దీంతో కాంక్రీటు గోడ రెడీ అవుతుంది. గోడలు, శ్లాబ్ ఏకకాలంలో నిర్మించవచ్చు. ఈ పద్ధతి వల్ల 48 గంటల్లోనే ఒక అంతస్తును నిర్మించవచ్చని రాంపల్లిలో ఇళ్ల పనులు పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ ఈఈ వెంకటదాస్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ విధానం వల్ల ఇటుకల అవసరం లేకపోవడంతో పాటు కూలీలు కూడా తక్కువ మంది సరిపోతారు. నిర్మాణ వివరాలు ఇవీ.. రాంపల్లిలో 41 ఎకరాల్లో 6,264 ఇళ్లు మంజూరయ్యాయి. స్టిల్ట్ + 10 అంతస్తులుగా వీటిని నిర్మిస్తున్నారు. మొత్తం బ్లాకులు: 52 ఒక్కో బ్లాక్‌లో ఇళ్లు: 120 ఒక్కో ఇంటి వ్యయం: రూ.8.65 లక్షలు (రూ.75 వేలు మౌలిక సదుపాయాలకు) మొత్తం ప్రాజెక్ట్ వ్యయం: రూ. 541.83 కోట్లు ప్రస్తుతం 15 బ్లాకుల్లో పనులు నడుస్తున్నాయి. కొల్లూరులో నిర్మించనున్న 15,660 ఇళ్లలోనూ దాదాపు సగం ఇళ్లు షియర్వాల్స్తోనే చేపట్టారు. అక్కడ కనీస మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్, కమ్యూనిటీ సెంటర్లు, పార్కులు, ప్లేగ్రౌండ్, భూగర్భ డ్రైనేజీ, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు వివిధ మతాల ప్రార్థన కేంద్రాలను కూడా నిర్మించనుండడంతో అది టౌన్‌షిప్‌గా మారనుంది. కొల్లూరుతో పాటు అహ్మద్‌గూడలో 4,428 ఇళ్లు, మునగనూరులో 2,700, ఫిర్జాదిగూడలో 2,200, భోజగుట్టలో 1,824, జియాగూడలో 840 ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ కన్న సురేష్‌కుమార్ తెలిపారు. -
ఇంటి దొంగలు !
అనంతపురం న్యూసిటీ: పాలకులు నిబంధనలకు తూట్లు పొడిచినా ఒప్పే. అదే ప్రజలు చేస్తే మాత్రం తప్పే. భవనాలను కూల్చేయాలి. భవిష్యత్తులో కాలువ, రోడ్ల నిర్మాణానికి ఇబ్బంది అవుతుందంటూ అధికార పార్టీ నేతలు, అధికారులు హంగామా చేసేస్తారు. మరి హంగామారాయుళ్ల సొంత విషయానికొస్తే మాత్రం ఇలాంటివేవీ కనిపించవు. చాపకింద నీరులా ఈ సంస్కృతి నగరంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. అధికార పార్టీ నేతలకు చెందిన నిర్మాణాలపై ఎవరూ ప్రశ్నించకూడదనే వైఖరితో టీడీపీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. చూసీ చూడనట్లు అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకునే అధికారులకు చేదు అనుభవాలే మిగులుతున్నాయి. అందిన సమాచారం మేరకు అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులు వెళితే.. వెంటనే అక్కడకు ప్రజాప్రతినిధులు వాలిపోతుంటారు. తమవాళ్లేనంటూ వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతారు. నిబంధనల గురించి అధికారులు మాట్లాడితే.. ఇక తమదైన శైలిలో నోటి దురుసుతో విరుచుకుపడుతుంటారు. దీంతో అధికారులు వెనుదిరుగుతున్నారు. రాంనగర్, మారుతీనగర్, సాయినగర్, కమలానగర్, ఆదిమూర్తినగర్, హౌసింగ్‌బోర్డు, ఆదర్శనగర్, అరవిందనగర్, ఇలా వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చర్యలు తీసుకుంటాం కమలానగర్లో సెల్లార్ తవ్వి నిర్మా ణాలు చేపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – ఇషాక్ అహ్మద్, ఏసీపీ నిత్యం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వెళ్లే సాయినగర్ 8వ క్రాస్ సమీపంలో ఓ నిర్మాణం వెలుస్తోంది. బయటి దుకాణాలను అలాగే ఉంచి, వెనుక వైపు నిర్మాణం చేపడుతున్నారు. ఎలాంటి సురక్షిత ప్రమాణాలు పాటించడం లేదు. దీని వెనుక ఓ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ ప్రమేయమున్నట్లు పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం అక్రమ నిర్మాణంపై ప్రశ్నిస్తే మావాళ్లే వదిలేయండంటూ సదరు కార్పొరేటర్ వకాల్తా పుచ్చుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. సాయినగర్ రెండో క్రాస్‌లో ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాడు. నగరపాలక సంస్థ అధికారులు అక్కడి వెళ్లి నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ రావడంతో అధికారులు నోరు మెదపకుండా వెనుదిరిగారు. సాధారణంగా కమలానగర్లో ఎక్కడ అక్రమ నిర్మాణం జరుగుతున్నా.. వెంటనే అక్కడకు 15 డివిజన్ టీడీసీ కార్పొరేటర్ శ్రీనివాసులు వాలిపోయి హంగామా చేసేస్తుంటారు. అంతటితో ఆగకుండా అధికారులకు ఫిర్యాదు చేసి నిర్మాణాలను ఆపించేస్తుంటారు. ఇదంతా చూసి ఆయన నిజాయితీపరుడని అనుకుంటే పొరబాటు పడినట్లే! ఎందుకంటారా? ఈ చిత్రంలో మీరు చూస్తున్నది కమలానగర్లో సెల్లార్ ఏర్పాటుతో పాటు స్కావెంజర్ లేన్‌ను ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఇదే ఫొటోలో పనులు పర్యవేక్షిస్తూ కూర్చొన్న వ్యక్తి కార్పొరేటర్ శ్రీనివాసులు!! ఫొటో తీస్తుండగా ఈ భవనం తనదేనని, తానే నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. -
ఆరు నెలల్లో ఎమ్మెల్యేల ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాజధానిలో ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సముదాయాల కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు అప్పగించింది. ఈ విషయాన్ని బుధవారం సచివాలయంలో నిర్వహించిన సీఆర్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆరు నెలల్లోగా ఈ గృహ సముదాయ నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గృహ సముదాయాల నిర్మాణానికి గతంలో రూ.1991 కోట్లు మంజూరు చేయగా, ఇపుడు ఆ మొత్తాన్ని రూ.2652 కోట్లకు పెంచడానికి ఆమోదం తెలిపారు. ఎమ్మెల్యేలకు, అఖిల భారత సర్వీసు అధికారులకు ఒక్కో ప్లాటు 3500 చదరపు అడుగుల చొప్పున 18 టవర్లను నిర్మిస్తారు. నాన్ గెజిటెడ్ అధికారులకు ఒక్కోప్లాటు 1200 చదరపు అడుగుల చొప్పున 22 టవర్లు, ఒకటవ రకం గెజిటెడ్ ఆఫీసర్లకు 1800 చదరపు అడుగుల చొప్పున ఎనిమిది టవర్లు, రెండో రకం గెజిటెడ్ అధికారులకు 1500 చదరపు అడుగుల చొప్పున ఏడు టవర్లు, నాలుగవ తరగతి ఉద్యోగులకు 900 చదరపు అడుగుల చొప్పున ఆరు టవర్లను నిర్మించనున్నారు. ముఖ్య నిర్ణయాలు ఇవే.. - గోల్ఫ్ కోర్సుకు రాజధానిలో 70 ఎకరాలు కేటాయింపు హా అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఎనిమిది జాతీయ, అంతర్జాతీయ స్కూళ్లకు 32 ఎకరాలు.. - రైతులను సింగపూర్ తీసుకువెళ్లేందుకు లాటరీ ద్వారా 100 మందిని సీఆర్డీఏ ఎంపిక చేసింది. మరో 23 మంది రైతులు మిగిలిపోయారు. ఆ రైతులను సింగపూర్ తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. కాగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాల డిజైన్లు ఖరారు చేయడానికి తాను లండన్ వెళ్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన పర్యటన అనంతరం సీఎం కూడా వెళ్తారని వెల్లడించారు. -
పల్స్ సర్వేపై లెక్క తేల్చండి!
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి ఐదు లక్షల జనాభా లెక్కలు తేలడం లేదు. ఒక్క ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్æ ప్రాంతంలోనే 94 వేల మంది లెక్కతేలాల్సి ఉంది. వీరంతా ఎక్కడ తప్పిపోయారో గుర్తించండి. ఈనెల 15వ తేదీలోపు స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయాలి’ అని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నియోజకవర్గ సమన్వయ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు,మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం మాత్రమే స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిందని అసంతృ ప్తి వ్యక్తం చేశారు. సీఎస్‌పురం, దోర్నాలతో కలుపుకొని మొత్తం 20 మండలాల్లో 60 నుంచి 70శాతం వెనుకబడి ఉన్నాయన్నా రు. కొన్ని ఇళ్లు పూర్తి స్థాయిలో సర్వే చేయలేదని, కొంతమంది సభ్యులనే సర్వే చేసినట్లు తెలుస్తోందన్నారు. సర్వేలో వెనుకబడిన 20 మండలాలకు చెందిన అధికారులు, నియోజకవర్గ సమన్వయ అధికారులకు ఈనెల 4వ తేదీ ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలు లోతుగా విశ్లేషించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్‌కు సూచించారు. సమన్వయంతో సమస్య పరిష్కరించండి.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభా కంటే సర్వే తక్కువ చేయడానికి వీలులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొన్ని ఇళ్లు మూతవేయడం వల్ల సర్వే చేయలేకపోయి ఉండవచ్చని, అంతా కలిసి సమన్వయంతో లెక్కల తేడాను పరిష్కరించాలని ఆదేశించారు. 2011 తరువాత జన్మించిన పిల్లల వివరాలు కూడా సర్వే ద్వారా నమోదు చేయాల్సి ఉందన్నారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రా లు, వసతి గృహాల్లోని పిల్లల వివరాలు సర్వేలో నమోదు కావాలని ఆదేశించారు. 2011తరువాత కొత్తగా ఏర్పాటైన మురికివాడలు, కాలనీలకు వెళ్లి సర్వే నమోదు చేయాలన్నారు. ప్రతిరోజూ సర్వేపై సమీక్షించాలని, ఈనెల 6,10,13తేదీల్లో ప్రత్యేకంగా సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతి సమీక్షించనున్నట్లు స్పష్టం చేశారు. గృహ నిర్మాణం వేగవంతం చేయాలి.. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద నియోజకవర్గానికి 1250 గృహాలు మంజూరు చేయాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు 6,372 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్‌ను పాటిస్తూ మిగిలిన ప్రతిపాదనలను జన్మభూమి కమిటీల ద్వారా గ్రామసభలు నిర్వహించి పంపాలని సూచించారు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం నియోజకవర్గం, డివిజన్ల వారీగా సమగ్ర డేటా సేకరించాలన్నారు. జిల్లాలో 5వేల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉండగా, ఇప్పటివరకు 1207 ఎకరాల్లో గుంతలు తవ్వి 527 ఎకరాల్లో నాటడం జరిగిందన్నారు. ఈనెల 15వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గుంతలు తవ్విన వాటికి వెంటనే బిల్లులు చెల్లించాలని, ఎలాంటి జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో వేటపాలెం, బల్లికురవ మండలాలు చాలా వెనుకబడి ఉన్నాయని, ప్రత్యేక శ్రద్ధ వహించి పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈనెల 10వ తేదీ మరలా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, ఆలోపు మంచి ప్రగతి కనబరచాలన్నారు. జిల్లాలో బోరు బావుల్లో రీ చార్జింVŠ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జాయింట్ కలెక్టర్–2 ఐ ప్రకాష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ భాగస్వామ్యంతో గృహ నిర్మాణాలు
- ఏప్రిల్ 8న ఇంటింటా ఉగాది-ఇంటికి పునాది’ - గృహ నిర్మాణ శాఖ అధికారుల సమీక్షలో సీఎం సాక్షి, హైదరాబాద్ః ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణంలో అవసరమైతే ప్రైవేట్ నిర్మాణదారులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి గృహ నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లు ఎలా ఉండాలనే అంశంపై మంత్రుల బృందంతో చర్చించి వెంటనే ఒక స్పష్టతకు రావాలని ఆధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆర్కిటెక్టులు, బిల్డర్లు, విశ్వవిద్యాలయాల్లో నిర్మాణరంగ విద్యనభ్యసించే విద్యార్థుల భాగస్వామ్యంతో టౌన్‌షిప్పుల నిర్మాణాలు జరగాలన్నారు. రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇతర మౌళిక సదుపాయాలతో కూడిన గృహ నిర్మాణానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టబోయే గృహ నిర్మాణాలు రానున్న కాలంలో అక్కడ ఆర్థిక కార్యకలాపాలను పెంచే రీతిలో ఉండాలన్నారు. పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణాలే కాకుండా ఇండస్ట్రియల్ టౌన్‌షిప్స్ కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకం కింద రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించే అవకాశం ఉందో అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాల్లో పారదర్శకత అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ఎక్కడా అవకతవకలు జరగకుండా ప్రతి దశలోనూ సాంకేతిక పద్ధతుల్ని అనుసరించాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేయడమే కాకుండా నిర్మాణంలోని ప్రతి దశను త్రీడీ పద్ధతిలో సంబంధిత వీడియో చిత్రీకరించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఏప్రిల్ 8న ఇంటింటా ఉగాది-ఇంటికి పునాది కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షా సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, గృహనిర్మాణ సంస్థ అధ్యక్షుడు వర్ల రామయ్య, ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి రాజమౌళి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
దేశానికే ‘మోడల్’..
- ఐడీహెచ్ కాలనీలో సకల వసతులతో పేదింటి కలల సౌధం - పూర్తవుతున్న పనులు.. దసరా రోజున ప్రారంభించనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: ఐడీహెచ్ కాలనీ..! ఇప్పటిదాకా స్థానికులకు మాత్రమే తెలిసిన పేరిది! కానీ ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పేదల గృహనిర్మాణానికి ‘మోడల్’గా నిలిచిన కాలనీ. పేదల కోసం నిర్మించే గృహ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకంగా పరిగణనలోకి తీసుకుంటున్న కాలనీ. గవర్నర్‌తోపాటు కేంద్రం, నేతలు, ఐఏఎస్‌లు ప్రశంసలు కుమ్మరిస్తున్న కాలనీ! సాధారణంగా పేదల గృహ నిర్మాణమంటే ఇరుకు గదులు, నామ్కేవాస్తే టాయ్‌లెట్, అరకొర సౌకర్యాలు అన్న భావనను పూర్తిగా తుడిచిపడేస్తూ ఐడీహెచ్‌లో ఇళ్లు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. గతేడాది దసరా రోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కాలనీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈనెల 22న దసరా రోజున ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇదీ ఐడీహెచ్ కాలనీ: మొత్తం ఇళ్లు 396 ఒక్కో ఇంటికి నిర్మాణ వ్యయం: రూ. 7.90 లక్షలు మౌలిక సదుపాయాలకు రూ. 5.26 కోట్లు నిర్మాణ సంస్థ: ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. బ్లాకులు 33 (జీ ప్లస్ 2 చొప్పున) మొత్తం ఇళ్ల నిర్మాణ వ్యయం రూ. 31.28 కోట్లు మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 36.54 కోట్లు కాంట్రాక్టర్లకు స్థలం ఇచ్చింది: 2014, డిసెంబర్ 18 ఇళ్ల నిర్మాణం, వసతులు ఇలా.. - ఐడీహెచ్ కాలనీ కోసం ప్రత్యేకంగా ‘ఎర్త్‌క్వేక్’ డిజైన్ రూపొందించారు. భూకంపాలు వంటివి సంభవించినా తట్టుకునేలా అదనపు స్టీలు, ఫ్లైయాష్ వంటివి వినియోగించారు. - గతంలో వాంబే పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్ల తలుపులు, కిటికీల ఫ్రేమ్లకు సిమెంటునే వాడగా.. ఈ కాలనీలో ఎంతకాలమైనా తుప్పు పట్టకుండా ఉండే ప్రత్యేక మెటీరియల్‌ను వినియోగించారు. - గతంలో నిర్మించిన ఇళ్ల గోడలు వర్షానికి తడిసిపోయేవి. ప్రస్తుతం అలాంటి లీకేజీలుండవు. కిటికీలకు జెడ్ యాంగిల్ తలుపులు వాడుతున్నారు. - సామాన్లు పెట్టుకునేందుకు సజ్జలు(అటకలు), వంట గదిలో షెల్ఫ్‌లు, కిచెన్‌లో ప్లాట్ఫారం వంటి సదుపాయాలున్నాయి - నేలకు సిమెంట్ ఫ్లోరింగ్ కాకుండా టైల్స్ వాడారు - ఇంటిలో రెండు టాయిలెట్స్ ఉన్నాయి. ఒకటి యూరోపియన్ తరహాలో, మరొకటి దేశవాళీ పద్ధతిలో నిర్మించారు - గతంలో నిర్మించిన ఇళ్ల నీటి సరఫరాకు ఒకే వ్యవస్థ ఉండేది. ప్రస్తుతం తాగునీటికి ఒక పైప్‌లైన్, ఇతర అవసరాలకు మరో లైన్ ఏర్పాటు చేస్తున్నారు - కాలనీలో సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. మురుగునీరు, వర్షపు నీరు వెళ్లే లైన్లు, వీధి దీపాల ఏర్పాటు పనులు సాగుతున్నాయి - 30 అడుగుల రహదారితోపాటు దానికి సెంట్రల్ మీడియన్, ఇరువైపులా మొక్కల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నడకదారులకు సదుపాయం కల్పిస్తున్నారు - అంగన్వాడీతో కూడిన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు. 11 దుకాణాలతో స్థానికుల అవసరాల కోసం షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు - డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో లివింగ్హాల్, ప్యాసేజ్, మాస్టర్ బెడ్రూమ్, మరో బెడ్రూమ్, కిచెన్, యుటిలిటీ, బాత్/టాయ్‌లెట్, కారిడార్లున్నాయి. ఢిల్లీలో ఐఏఎస్ క్వార్టర్లకు దీటుగా.. ఢిల్లీలో ఐఏఎస్‌ల క్వార్టర్లకు దీటుగా ఈ కాలనీ ఉంది. ఇంతమంచి కాలనీని చక్కగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులపై ఉంది. కాలనీలోని స్థానికులతోనే కమిటీగా ఏర్పడి నిర్వహణ బాధ్యత చూడాలి. - ఇటీవల ఐడీహెచ్ కాలనీకి వచ్చినప్పుడు గవర్నర్ నరసింహన్ వాంబే పథకంలో నిర్మించిన ఇళ్లకు, ఐడీహెచ్ కాలనీ ఇళ్లకు తేడా ఇదీ వాంబే ఐడీహెచ్ మోడల్ కాలనీ ఫ్లాట్ విస్తీర్ణం 267 చదరపు అడుగులు ఫ్లాట్ విస్తీర్ణం 580 చదరపు అడుగులు నిర్మాణ వ్యయం రూ.1.30 లక్షలు (అప్పటి ధరల మేరకు) రూ. 7.90 లక్షలు ప్రభుత్వ సబ్సిడీలు పోను లబ్ధిదారు రూ.30 వేలు చెల్లించాలి పూర్తిగా ఉచితం -
ఇందిరమ్మకు విభజన ఎఫెక్ట్
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు నిలిచి పోయాయి. రెండు నెలల క్రితమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి నేటికీ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు తోడు రాష్ట్ర విభజన కసరత్తు చేస్తుండడంతో రాష్ట్ర విభజనలో భాగంగా సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు అప్పులు, ఆస్తుల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను నిలుపుదల చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాకు వివిధ దశల కింద 4,50,631 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి దాకా 3,03,328 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 85,769 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 60 వేల ఇళ్ల నిర్మాణాలు మొదలే కాలేదు. కాగా లబ్ధిదారులు గడచిన రెండు నెలల్లో 500 ఇళ్లకు పైకప్పులు వేసుకున్నారు. అయితే బిల్లులు మాత్రం మంజూరు కాలేదు. రాష్ట్ర కార్యాలయం నుంచే ఆగిన బిల్లులు : గతంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు జిల్లా స్థాయిలోనే జరిగేవి. అయితే ఆరు నెలల క్రితం నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యాలయం నుంచి బిల్లులు మం జూరు చేసేలా నూతన విధానాన్ని ప్రవేశ పెట్టారు. అయినప్పటికీ సకాలంలో బిల్లులు అందేవి. రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో నెల రోజులుగా బిల్లులు నిలిచి పోయాయని, ఈ విషయంలో తామేమీ చేయలేమంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రూ. 1.50 కోట్ల దాకా పేరుకు పోయిన బిల్లులు: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వివిధ దశలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు రూ. 2 కోట్ల దాకా బిల్లులు పేరుకు పోయాయి. గోడల మొదలు పైకప్పు వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారు 500 మంది దాకా ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున రూఫ్ కాస్ట్ కింద దాదాపు రూ. 1.50 కోట్లు అందాలి. మరో 15 రోజుల వరకూ కూడా బిల్లుల చెల్లింపులు కొలిక్కి వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్ అందుబాటులోకి రాక పోవడంతో, ఆ శాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి వివరణ ఇస్తూ బిల్లులు ఆగిన పోయిన విషయం వాస్తమేనని, ఆ బిల్లులు ఎప్పుడు అందుతాయో స్పష్టంగా చెప్పలేమని అన్నారు.